Aksharalipi Poems

ఒంటరితనం ఒక శిక్ష

ఒంటరితనం ఒక శిక్ష జీవితం మన కోరుకోలేదు. కానీ అనుభవిస్తున్నాము. నాలుగు గోడల మధ్య బ్రతకడం అంటే ఇష్టం ఉన్న లేకపోయినా బ్రతకాలి అదే జీవితం. ఈ లైఫ్ నీ మంచి కోసం ప్రాణాలు కోల్పోయినా ఏం బాధలేదు. కొన్నిటికి అతిగా విలువ ఇస్తున్నాము అది అర్దం కావడంలేదు కొందరికి.. అసూయ ద్వేషాలు అందరిలో ఉంటాయి.. అందరూ చూపించలేరు.. మనల్ని సంతోషంగా చూడలేరు.. ఇలాంటి వాళ్ల మధ్య బ్రతకడం అంటే కష్టం.. వాళ్లు చూసే చూపు ఒకరుతో మంచిగా మాట్లాడితే చాలు ఏవేవో ఊహించుకుంటారు... అలాంటి వారికి ఎప్పుడు ఒకరు మీద చెప్పుడు మాటలు చెపుతుంటారు.. అలాంటి వాళ్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకొండి... - మాధవి కాళ్ల
Read More

ఈరోజు అంశం:- కొత్త జీవితం

ఈరోజు అంశం:- కొత్త జీవితం రాబోయేది నూతన సంవత్సరం మన జీవితంలో పాత సంవత్సరంలో ఎన్నో అనుభూతులు అనుభవాలు ఉంటాయి. పాత అనుభవాలను మరిచిపోయి, కొత్త సంవత్సరంలో కొత్తగా జీవితాన్ని అందంగా మలుచుకోవడం కోసం మనం పాత విషయాలను అన్నిటినీ మర్చిపోయి కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి. అందమైన జీవితం లో మధురమైన వాటిని గుర్తు పెట్టుకుని, చేదు అనుభవాలు మరచి పోయి, చేసిన పొరపాట్లను మళ్లీ చేయకుండా, గతం ఒక జ్ఞ్యాపకంగా కాకుండా ఒక పాఠంగా గుర్తు పెట్టుకుని అవి మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. మరి కొత్త జీవితానికి మీరు పాటించాలి అని అనుకుంటున్న పది సూత్రాల గురించి వ్రాయండి. 
Read More

ఈరోజు అంశం:- పేద కుటుంబం

ఈరోజు అంశం:- పేద కుటుంబం పేద కుటుంబం అనగానే కటిక దరిద్రంతో ఉన్న వాళ్ళు గుర్తుకు వస్తారు చాలా మందికి. కానీ కటిక దరిద్రంతో ఉన్నా కలిసి మెలిసి ఉంటూ, కలతలు లేకుండా, ఉన్న రోజు తింటూ, లేని రోజు పస్తులు ఉంటూ అందులోనే ఆనందం వెతుకుతూ, ఉన్నన్ని రోజులూ నవ్వుతూ బతుకుతూ కష్టపడి పని చేసుకుంటూ, ఎలాంటి స్వార్థం లేకుండా, ఒకరి కోసం ఒకరు బతుకుతూ, డబ్బంటే వ్యామోహం లేకుండా, పొద్దంతా కష్టం చేసి, రాత్రి కాగానే నాలుగు మెతుకులు తిని, ఆద మరచి, ఎలాంటి చికూ చింత లేకుండా కంటి నిండా నిదుర పోయే వాళ్ళు ఎంతో ధనవంతులు... ఎంత డబ్బు సంపాదించినా ఇంకా ఇంకా కావాలని ఆత్ర పడుతూ, స్వార్ధ చింతనతో, ఒకే ఇంట్లో ఉన్నా ఒకరి పై ఒకరు కుట్రలు చేస్తూ, ఒకరిని మోసం చేస్తూ, పది మందిలో గొప్ప అనిపించుకోవాలి అని డబ్బులు ఖర్చు…
Read More

ఈరోజు అంశం:- అమ్మ చేతి ముద్ద

ఈరోజు అంశం:- అమ్మ చేతి ముద్ద చిన్నప్పుడు అమ్మ చేతి ముద్దను తినేవాళ్ళం. ఆ తర్వాత కూడా బడికో కాలేజీకి ఆలస్యంగా వెళ్తున్నప్పుడు అమ్మ మన హడావుడి చూసి అన్నం కలిపి ముద్దలుగా తినిపించేది. అమ్మ ఏం చేసినా ఎంతో బాగుండేది. అమ్మ చేతిలో ఏదో మాయ ఉండేది. అమ్మ అలా ఎంత పెట్టినా కూడా తింటూనే ఉండేవాళ్ళం. అది అమ్మ చేతి ముద్ద గొప్పతనం. అమ్మ అన్నం పెడుతూ ఎన్నెన్నో కథలు, కబుర్లు చెప్పేది. బూచాడు వస్తాడని భయపెట్టినా, ఇంకెన్ని కథలు చెప్పినా అదంతా కేవలం బిడ్డ కడుపు నింపడం కోసమే చేసేది. బొజ్జ నిండిన తర్వాత చివరి ముద్దను మన చుట్టూ తిప్పి బయట పారేసేది. దిష్టి కొట్టకుండా.. ఎవరన్నా మీ బాబు, పాప ముద్దుగా ఉన్నారని అంటే వాళ్ళు వెళ్ళాక బాగా తిట్టుకునేది.. అమ్మ చేతి ముద్ద అమృతం. అమ్మ చిరునవ్వు ఒక శక్తిని ఇస్తుంది. ఎంతో…
Read More

ఈరోజు అంశం:- సోషల్ మీడియాలో లేకపోతే?

ఈరోజు అంశం:- సోషల్ మీడియాలో లేకపోతే?   సోషల్ మీడియాలో లేకపోతే జనావాసాలకు దూరంగా ఉన్నట్టా లేనట్టా? నా అభిప్రాయం. అవును చాలా మంది సోషల్ మీడియానే తమ లోకంగా బతుకుతూ లైక్ ల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం వాటన్నిటికీ దూరంగా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు అలాంటి వారిని చూస్తూ మిగిలిన వాళ్ళు మీరు లోకానికి దూరంగా ఉంటున్నారని ఎద్దేవా చేయడం ఎంత వరకు సమంజసం చెప్పండి? లోకం లో సోషల్ మీడియా కన్న చాలా విషయాలు తెలుసుకో దగినవి చాలా ఉన్నాయి అని మిగిలిన వారు తెలుసుకోలేకపోతున్నారు. లైక్ షేర్ ల కోసం కాకుండా ప్రశాంతమైన జీవితం గడపాలి అంటే ఇవ్వన్నీ వాడకుండా ఉండటమే ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి.     
Read More

నేను పేదవాడిని

నేను పేదవాడిని అరిగిన చెప్పు చేదిరిన బొచ్చు మాసిన గడ్డం మురికి దేహం ఎండిన డొక్క  చినిగిన గుడ్డ వాడిన మొఖం ఆకలి స్వరము పస్థుల భారం కన్నీటి శోకం గతుకుల అతుకుల మెతుకుల బతుకుల బాటసారిని ఆ..నేను  పేదవాడిని....! -దినుడిని హినుడిని రోగినిని లోకం దయ లేని అభాగ్యుని మంచి వాడిని కంపువాడిని లోకం నిందించే వెర్రివాడిని ఆరాటాన్ని పోరాటాన్ని అర్భాటాని ఆశత్వాన్ని అల్పసంతోషాన్ని మురికివాడలో కంపురోతలో కరుకుమనుషుల్లో ఇంపుగా.., బ్రతికే పేదవాడిని చెల్లని రూపాయి నోటుని వాడి పడేసే ఆకుని - విస్తరి ఆకుని నలిగి మాసిన గుడ్డని దరిద్రపుగొట్టు ఎదవని లోకం రీతి తెలియని వాడని భూస్వాములకు పెత్తందారులకు బల్సిన నా కొడుకులకు నేనో గులాంగిరిని -నేనో చెంషాగిరిని రాజకీయ రాచకీయ నాయకులకి నేను ఓటుని ఉచిత పథక హామీని బడా సాబ్  కి వ్యాపారస్తుడుకి నేనో కూలీని నేనో కూలీని భారత జనాభా లెక్కల్లో నేనో…
Read More

గాయం

గాయం అయ్యో అప్పుడే వెళ్లి పోయావా ఏమంత తొందర వచ్చిందని వెళ్ళావు మీతో ఎన్నో మాట్లాడాలని అనుకున్నానే మీతో ఎన్నో పనులు చేయించాలని అనుకున్నా నే ఎన్నో కబుర్లు చెప్పాలని అనుకున్నాం ఆ కబుర్ల లో నుండి అక్షర పదాలను కలుపుతూ మీలోని ఆవేశాన్ని బయటకు ఇంకా ఇంకా తేవాలని అనుకున్నా నే కదులుతున్న కాలం తీరు లను నిగ్గు తేల్చేందుకు , సిగ్గు లేని సమాజాన్ని మార్చేందుకు మీ మా అక్షరాల నీరాజనం జనాలకు అందించాలని అనుకున్నానే మీ తరాలన్ని ముందు తరాలకు ఆదర్శం కావటానికి మీతో కలిసి పని చేయాలని అనుకున్న నా ఆశలన్నీ ఆవిరి అయ్యేలా కాలం ఒక్క క్షణకాలం స్తంభించెలా చేసావే అవ్వన్నీ అవ్వక ముందే ... అందరికన్నా ముందే ఏమంత తొందర పడ్డావు , అవును లే మమల్ని మీరు ఒక్కసారి అయినా చూస్తే కదా తెలిసేది మేమనుకున్నవన్ని మీరు వింటే కదా మా…
Read More