c s rambabu

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి లోకబాంధవుడవుగా వినవయ్య మా మొరను పెదవేదో పలికింది మనవేదో చేసింది చరణం కలియుగ దైవమని నిను కొలిచేమయా పిలుపే వినమని నిను తలిచేమయా చరణం నీడగ నీవుంటే తోడుగ వెంటుంటే పండగ ప్రతిరోజూ పాటగ ప్రతిక్షణము చరణం కమ్మని నీ నవ్వు వెచ్చగ నీచూపు మముతాకితే చాలు ముత్యాలు రాలునుగ చరణం మాటలు రావంట మమతే నీవంట లేదంట ఏతంటా పండునిక బతుకంటా - సి. యస్ రాంబాబు
Read More

సాయిచరితము

సాయిచరితము పల్లవి నీ చూపు మేము వెతికేము సాయి మాలోన మలినాలను తీసేయి సాయి నడిపించు గురువు నీవేను సాయి నిను తలచుతూ మేము సాగేము సాయి చరణం నీ పేరు తోడై మా వెంటరాగా మనసెంత మురిసేను మదికెంత సంతసము అది మా సంతకము దీనజనబాంధవుడు సాయినాధుడొకడే అది మరువక మనము సాటిమనిషి మేలును ఆశిస్తూ కదిలెదము చరణం పదిమంది మేలు కోరేను సాయి కోరికలను తీర్చి సన్మార్గము చూపే సాయినాధుడుంటే మనకేల భయము తన నీడే మన మేడా తన బోధలతోటి బాధలన్ని తీరు అది తెలిసిన నాడు చింతన్నది లేదు దారంతా వెలుగే.. దిగులన్నది లేదు చరణం తలచితమా తనను మదిలోన వెలసి ధైర్యమే ఒసగును మనిషన్నవాడు సాయమే చేసి ముక్తిబాట సాగేందుకు కదలాలని చెప్పెను అది మరువక మనము తనబాటన నడిచెదము తన నామము పలికెదము శాంతి సౌఖ్యాలు మనవెంటనె వచ్చునుగావచ్చుని..వచ్చునిక - సి. యస్.…
Read More

వాలకం

వాలకం నిరర్థక ఆస్తుల్లా అర్థం లేని జీవితం చికాకుల కడలిలో చిక్కుకుపోయింది చిటుక్కుమనే చీమ టప్పుమనే వానచుక్క లగెత్తే గేదె జీవితకాశంలో తారలు గిరిగీసుకుంటూ జీవితాన్ని ఆడిపోసుకుంటున్నాడొకడు లోపలికి పోయిన డొక్కలు చుట్టు వీడని చిక్కులు లోకమే అంత లోలకమై ఊగిసలాడమంటుంది వాలకం చూస్తే వాతాపి జీర్ణం అంటున్నట్టుంది - సి. యస్ రాంబాబు
Read More

బేరం

బేరం వలసవాదం లోని ఇబ్బందులు తెలుసేమో అవి వలస పక్షులు కాలేదు ఉన్నచోటులోనే శిఖరం చేరడాన్ని సాధన చేశాయి వలస కులాసానివ్వదు కుదురూ ఇవ్వదు నెనరూ నేర్పదు అభద్రత పల్లవి నేర్పుతుంది వలస లేనిదే నాగరికతేలేదని ఆవేశపడకండి ఆప్తులు,నేస్తులుండగా కుదురైన జీవితాన్ని పెళ్లగించి వలస వాకిట్లో బేరం పెట్టాలా? - సి. యస్ రాంబాబు
Read More

కలలు.. కాంతులు..

కలలు.. కాంతులు.. కలలు తాగని రాత్రులన్నీ కలత నిండిన వనాలేగా వెతలు పండిన పొలాలన్నీ మేటవేసిన మనుషులేగా దారితప్పిన మనసులన్నీ ధ్వంస రచనకు వ్యూహమల్లగ చీకటే మిగిలింది జగతిన చిన్నబోయెను జ్ఞానమార్గము నీరుగారెను ఆశలన్నియు మోడువారెను ప్రేమవృక్షము ఖేదమేమో కెలకసాగెను మోదమేమో మసకబారెను దుఃఖపడకోయ్ సోదరా కాలమెన్నడు జడము కాదు మార్పు తెచ్చే రోజు ఉంటది నిన్ను వెతికే తీరుతుందది బొమ్మ బొరుసు రెండు ఉంటయి బతుకు పోరులో వెంట ఉంటయి బాధపెట్టే రోజు వెంటే అభయమిచ్చే ఆశ ఉంటది - సి. యస్. రాంబాబు
Read More

సవరింపు

సవరింపు పూల పరిమళం ముక్కుపుటాలకు సోకినట్టు అల్లుకున్న జ్ఞాపకాలన్నీ పెనవేస్తుంటాయి తెలిమంచు స్పర్శ తాకుతుండగా వెచ్చని కిరణం నిను పలకరిస్తుంది! లక్ష్యాలు,గమ్యాల కూడికలు,తీసివేతల నిట్టూర్పుల సెగలు చుట్టుముడతాయి.. నవ్వుకుంటూ సాగిపోమని మనసు సముదాయిస్తుంటుంది! బాధలు, భయాలు ఓటమి, గెలుపుల పందేరాల తో సంశయాల కూడలిలో కూలబడుతుంటే కాలం కుదుళ్లు నిను కుదిపేస్తుంటే కుదురుగా ఉండనివ్వదని జీవితంపై అలుగుతుంటావు పోగేసుకునే క్షణాల ఆశల పల్లకి ఆమని పిలుపులా నీ గుండె తలుపు తడుతుంటే మనసులో ఓ చిన్న వెలుగు విస్తరిస్తూ నీ చూపును సవరిస్తూ ఉంటుంది! - సి. యస్ రాంబాబు
Read More

వెలుగు గీతం

వెలుగు గీతం నారింజ రంగు ఆకాశం నారాయణ మంత్రం జపిస్తున్నట్టుంది చీకటి స్వప్నాలను తరిమేద్దామని వెలుగు గీతాన్ని లిఖించేందుకు ఆకాశం శూన్యం అనంతమని పేర్లు తగిలిస్తాం ఆకాశం వేర్లు మాత్రం మనిషి మనసులో దాగుంటాయేమో ఉదయాస్తమయాలలో రంగులద్దుకుని హంగులను తగిలించుకున్నా తన తీరని ఆరాటం తెలియని తీరం వెతుకుతుంటుందేమో కుతకుతలాడే జనజీవనం విలవిలలాడే నిసర్గసంపద విషాదమోహనాన్నద్దుతుంటే బావురుమంటున్న భూమిని జాలిగా చూసే ఆకాశం మాత్రం 'జాలీ' గా ఉంటుందెప్పుడు - సి. యస్. రాంబాబు
Read More

నీ నవ్వు వెలుగవ్వు

నీ నవ్వు వెలుగవ్వు జ్ఞాపకాల శిశిరానికి చోటివ్వు వసంతాల చెలిమికి మాటివ్వు మాటవినని లోకం బాధవ్వు పంచదా ఆనందం నీ నవ్వు అలుపులేని సంతోషపు బాటవ్వు వేడుకల జీవితము వీలవ్వు తనూలతకు ఓదార్పుల పలుకవ్వు మురిపాల కోటకే వెలుగివ్వు సంబరమై మనసంతా దారివ్వు రివ్వుమంటూ ఎగరదా చిరునవ్వు ముస్తాబైన ముచ్చట్ల పలుకవ్వు అనుభూతులిక తలదువ్వు కలల కాంతుల కేకవ్వు కోటిరాగాల కోనవ్వు వెలుగు పూల తోటవ్వు పరవశాల నీ నవ్వు పాటవ్వు - సి.యస్.రాంబాబు
Read More

ఆశల బాణం

ఆశల బాణం ఉదయమో ఆశల పల్లకి ఉదయమో వేణుగాన పల్లవి కష్టాల చిత్తడిలో కూరుకుంటే చేయిచాస్తూ కిరణం చిరునవ్వవుతుంది చిత్తభ్రమలు చాపల్యాలు వైఫల్యాలు విషాదాల పెనంపై నిను తిరగేస్తుంటే తిరగబడని మౌనం చిన్నబుచ్చుకుని చీకటితెరలలో బందీ కాగా శ్వాసందించేకు వస్తాడు భానుడు ఊరుకోని సమాజం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది కరుకు మనుషులతో బతుకు దారంతా గతుకులే కాగా దిక్కుతోచనివేళ కాస్తన్నా ఊరటనిచ్చే ఉదయపు వెలుగుతో సాగావనుకో మనోవీధిలో దీపాలు వెలగొచ్చు మనుషులున్నచోట మాటలున్నట్టే మాటలున్నచోట భేదాలు విభేదాలుంటాయి మొలిచే గోడలతో ఒంటరి ద్వీపమవుతుంటే ఉదయాన్ని ఆసరాచేసుకో వెలుగుకిరణాల నిచ్చెనపై ముందు గోడలు దాటొచ్చు క్రమేణా కూల్చొచ్చు ఎవరేమన్నా వినకుండా అర్థించే జీవితాన్ని ఉదయంతో ప్రార్థించు పరవశం ప్రవహించొచ్చు పాట ప్రాణం పోసుకోవచ్చు ఏతావాతా ఉదయంలో నీ ఉనికి స్వప్నాలను నేలకు దింపి ఆకాశంలోకి ఆశల బాణమేసినట్టు - సి.యస్.రాంబాబు
Read More

జీవన్ముక్తుడు – కథానిక

జీవన్ముక్తుడు - కథానిక ఆదివారం కావటం వలన మియాపూర్ మెట్రో స్టేషన్ కిటకిటలాడుతోంది. సీనియర్ సిటిజన్లందరూ ఒకచోట నిలబడ్డారు సీనియర్ సిటిజన్ సీటు కోసం. సీతారాముడు ఎప్పటిలానే హడావిడిగా వచ్చాడు. సెక్యూరిటీ స్టాఫ్ విజిల్ వేస్తున్నారు వెనక్కి జరగండంటూ.... శీతకాలం బద్ధకాన్ని బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాడులా ఉన్నాడు సూరీడు. పరధ్యానంగా ఉన్న ఆకాశంలో వెలుగు రేఖలు మసకేశాయి. సీతారాముడు సీనియర్ సిటిజన్ సీట్లో సెటిలయ్యాడు. పక్కనే నిజమైన సీనియర్ సిటిజన్లు ఇద్దరు కూచోనున్నారు. రమారమి డెబ్బైఐదుంటాయేమో వాళ్ళిద్దరికీ  అనుకున్నాడు. పక్కవాడితో మాట్లాడేవాళ్ళకన్నా ఫోన్లో మాటాడేవాళ్లే ఎక్కువ. అదీ తారాస్థాయిలో మాట్లాడుతున్నారు. కొంతమంది వీడియోలు చూస్తున్నారు, కొంతమంది యాత్ గేమ్స్ లో మునిగి తేలుతున్నారు. సీతారాముడు పక్కనున్న ఇద్దరూ మాత్రం నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. కుతూహలంగా చూశాడు వారివంక అనుకోకుండా సీతారాముడి చెవిలో వారి మాటలు వినిపించసాగాయి. "శంకర్ ఇద్దరం ఎనభై దగ్గరకు వస్తున్నాము. ముందు నువ్వో, నేనే వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి." "ఎవరు…
Read More