g jaya

మాటల మంత్రం

మాటల మంత్రం మాటలే మంత్రాలు చూపులే సూత్రాలు అంటారు పెద్దలు మాటల శక్తి చెప్పలేనిది అద్భుతాలను సృష్టిస్థాయి భావాలనుతెలుపుతాయి మనిషి గౌరవాన్ని పెంచుతాయి సంస్కారాన్ని తెలియజేస్తాయి హాస్యాన్ని పండిస్తాయి చమత్కారాన్నికలిగిస్తాయి మాధుర్యాన్ని వలకబోస్తాయి ప్రేమను కురిపిస్తాయి కన్నీళ్లు తెప్పిస్తాయి సమస్యలను సంధిస్తాయి సలహాలుగా మారుతాయి చిరునవ్వు ని చిందిస్తాయి అసూయలను పెంచుతాయి ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి ధైర్యాన్ని పెంచుతాయి బాధల్ని మరిపింపజేస్తాయి సంతృప్తిని కలిగిస్తాయి అనుభవాలను తీసుకొస్తాయి నమ్మకాలు కుదురుతాయి మాటలయుద్ధాలు జరుగుతాయి స్నేహాన్ని పెంచుతాయి అనుభవాన్ని తీసుకొస్తాయి ఆదర్శాలకు మూలమవుతాయి అవకాశాలను అందు కొస్తాయి ఆలోచనలో పడేస్తాయి సంతృప్తి కలగజేస్తాయి ఆశీస్సులు గా మారుతాయి అపార్ధాలకు ఆరంభమవుతాయి విమర్శలుగా మిగులుతాయి మాటల విన్నపమే జీవిత పరిష్కారం అవుతాయి మాటలుమాయచేసి జీవితానికి వన్నెలద్దుతాయి పాఠాలు గుణపాఠాలు నేర్పుతాయి మంచిమాటలు మహా శక్తివంతంగా మారవచ్చు ఎంతైనా మాటలు జాగ్రత్తగా పలకడమే మేలు... - జి జయ
Read More

స్నేహం

స్నేహం స్నేహం చెరగనిబంధం విశ్వాసానికి నాంది సంతోషాల సారం స్వార్థానికి తావులేనిది కష్టాలను కడతేర్చేది కన్నీటిని తుడిచి పెట్టేది ఆలోచనలు పంచుకునేది అంతరంగానికి అర్థమయ్యేది అనుమానానికి తావులేనిది దాపరికానికి దారిలేనిది కులమతాలకతీతమైనది ఆపదలో నిలబడేది మనసువిప్పి మాట్లాడుకునేది ఆటంకాలను అధికమించేది అవసరాలను గుర్తించేది ఇష్టాలను తెలుసుకునేది జ్ఞాపకాలను దాచుకునేది ఫలితాన్ని ఆశించనిది నిజాయితీని రుజువుచేసేది అందరిని ఆకర్షించేది ఆనందాలను అందించేది మోసానికి చోటు లేనిది బలహీనతలను భద్రపరిచేది బలాన్ని నిరూపించేది సహాయానికి వెనకాడనిది అంతరంగాన్ని అర్థం చేసుకునేది ఇష్టాలను తెలుసుకునేది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేది చిరునవ్వుకు చిరునామాగా నిలిచి నిన్ను నిన్నుగా గుర్తించేది స్నేహమే చెరిగిపోని బంధానికి మధురమైన అనుభూతి....... - జి జయ
Read More

ఇల్లాలు

ఇల్లాలు ఇల్లాలు సంతోషంగా ఉంటే ఇల్లంతా వెలుగులే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు చక్కదిద్దే నైపుణ్యం బంధాలకు బలం అందరి అవసరాల అవగతం అందంగా తీర్చిదిద్దే నైపుణ్యం కష్టసుఖాలు కలిమిలేములు సరితూచే ధైర్యం ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపే నేర్పు సంస్కృతి సంప్రదాయాలకు నెలవు త్యాగానికి మరో పేరు అభిమానమే ఆభరణములుగా ఆదాయ వ్యయాల రూపకర్తగా వెలకట్టని సేవా భావం కుటుంబంమే ప్రపంచం అనుకుని సంసార బాధ్యతల్ని చక్కదిద్ది ప్రతినిత్యం జ్యోతిలా వెలుగుతూ వెలుగులు ప్రసరించే తల్లే ఇల్లాలు అది ఈతరం అయినా ఏతరం అయినా ఇంటికి దీపం ఇల్లాలే కదా....... - జి జయ
Read More

ఆడవాళ్ళు మీకు జోహార్లు

ఆడవాళ్ళు మీకు జోహార్లు ఆడవాళ్లు ఆదిశక్తి స్వరూపాలు అమ్మానాన్నల అనురాగ దేవతలు మమతలు పంచే మహాలక్ష్మిలు సౌందర్యాల భరిణలు బరువు బాధ్యతల మోస్తున్న భామలు ఆలనా పాలన చూసే అతివలు పాఠాల గుణపాఠాల భారముమోసే భూమాతలు ధైర్యాన్ని నూరి పోసే నారీమణులు వలచిన ప్రియునికి ఇష్టసఖి అత్తింటి పుట్టింటి గౌరవాల రెండు కళ్ళ కంజాక్షి అనురాగం నిండిన స్త్రీ మూర్తులు అమ్మలగన్న అమృతవల్లులు బాధలనుభరించే శక్తి శాలులు ఒత్తిళ్ళ ఒడిలో ఊగినా చిరునవ్వులు మరుగైనా రాజీ పడని కుటుంబ సామ్రాజ్యానికి రాణులై మౌన పోరాటాల మగువలై ఆశలే హరివిల్లుగా మలచుకుంటూ సాగిపోయే సాహసవంతులు ఆడవాళ్లు మీకు జోహార్లు అడుగు ముందుకే ఎల్లప్పుడు....... - జి జయ
Read More

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగం నిత్య స్ఫూర్తితో వెలగాలని రూపొందించుకున్నాము ప్రజలదే పాత్ర అని ప్రభుత్వం ముఖ్యమని ఓటు హక్కులని సమానత్వం సత్యమని ప్రజాస్వామ్యమే దేశమని సమగ్రతనే శాసనమని జాతీయతనే జెండా అని అవకాశాలు అందరికని న్యాయం సమానమని పౌరులే ప్రధమమని పాలకులే నాయకులని ఆశయాలే ఆచరణని భద్రతే భరోసా అని బానిసత్వంతో సమరమని బాధ్యతే పరమావధని ప్రయోజనమే ప్రాతిపదికని విశ్వసనీయతే విజేత అని ప్రలోభాలకు తావేలేదని ఎన్నికలే మూలమని ఓటుహక్కు ఆయుధమని చైతన్యమే సాధనమని అభివృద్ధి ప్రణాళికలని దేశరక్షనే కర్తవ్యమని ప్రజలే సారధులని బంధనాలను విముక్తి చేసుకుని రాజ్యాంగాన్ని అమలుపరచుకున్నా భారతదేశ ఖ్యాతి కోసం సత్యమేవ జయతే అనే నినాదం అసత్యం కాకుండా అందరికీ రాజ్యాంగం సమానమేనని రాజ్యాంగ బద్ధులై పరిపాలన జరిగిన రోజు సామాన్యునికి అవలోకనమైన రోజు జనభారతావనికి అదృష్టం అందివచ్చినట్లే..... - జి జయ
Read More

ఆడపిల్ల

ఆడపిల్ల ఆడపిల్ల అంటే అడవిలో మాను కాదు ఆడపిల్ల అంటే అద్వితీయమైన శక్తి అన్నారు ఆడపిల్ల అంటే అపురూపం ఆడపిల్ల ఉంటే అదృష్టం ఆడపిల్ల అంటే అందం ఆడపిల్ల ఇంటి మహాలక్ష్మి ఆడపిల్ల ఉంటే ప్రేమాభిమానాలపెన్నిధి మమతల నిండిన మనసు ఇవన్నీ ఇంటి వరకు సహజమే కానీ....? మారుతున్న సంస్కృతి సంప్రదాయాలు సమాజంలో చిట్టి తల్లులకు చిన్నచూపే ఆంక్షలు అంతరాలు సమానత్వం లేని స్వేచ్ఛ ఎన్నో ఎదురు సవాళ్లు అవరోధాల మార్గం కరువైన రక్షణ అర్థం లేని అపోహలు అన్నీ కలిపి ప్రశ్నార్ధకమవుతున్న ఆడపిల్లల జీవితం నేటి సమాజపు మార్పునకనుగుణంగా ఆడపిల్లలను తీర్చిదిద్దాలి అది అందరి బాధ్యత అసమానతలకు తావు లేకుండా బాలికలకు భరోసానిచ్చి సమానత్వపు సౌధాన్ని ఎక్కించాలి బేటి బచావో బేటి పడావో అనే నినాదం సమిష్టికృషితో సాధ్యం మరి.... - జి జయ
Read More

భారతదేశ గొప్పతనం

భారతదేశ గొప్పతనం భారతదేశం మనభారతదేశం వేదాలు వెలసిన వేదభూమి కర్మ సిద్ధాంతం నమ్మిన కర్మభూమి సంస్కృతి సమ్మేళనాల సహజత్వం భారతదేశం సందేశాల శాంతి నిలయం అహింసా ధర్మాన్ని చాటిన ఆదర్శ దేశం మహాత్ముల జన్మస్థలం ప్రజాస్వామ్య రాజ్యాంగం కుల మతాల కుగ్రామం విజ్ఞానపు ఘనులు వినోదాల ప్రపంచం సస్యశ్యామల సౌభాగ్యం వైజ్ఞానిక శక్తి పదం విశిష్ట కట్టడాల అద్భుతం జీవనదుల పుణ్య నదుల ప్రవాహం ధీర మహిళలే గర్వకారణం దానధర్మాల అమృతకలశం భాష యాసల భావమాధుర్యం యోధుల యోగుల జన్మస్థలం వజ్రవైఢూర్యాల వైభోగం అన్నదాతల పవిత్ర స్థలం ప్రగతి పదానికి అతిరధులు విజయ రహస్యాల సోపానం భారతదేశం విశ్వశాంతి గీతాన్ని శాంతి సామరస్యాలకోసమై ఉపదేశించిన ఘనచరిత్ర భరతావనిది భరతమాత ముద్దుబిడ్డలుగా జన్మించిన మన అందరిదీ గొప్పతనం... - జి జయ
Read More

ప్రకృతి అందాలు

ప్రకృతి అందాలు ప్రకృతి అందానికి పరవశించని వారు ఉండరు ప్రకృతిని పలకరిస్తే వర్ణాలు వలకబోస్తుంది మనసుని ఆహ్లాద పరుస్తుంది హాయిగా వీచే చిరుగాలులు అల్లంత దూరంలో ఆకాశపు వినువీదులు ఆసక్తిని పెంచే కొండాకోనలు స్వచ్ఛతకే మారుపేరు గా సెలయేళ్ల ధారలు ప్రశాంతతను నింపే పచ్చిక బయళ్ళు వినసొంపైన పక్షుల కిలకిలా రావాలు కనువిందు చేసే పూల తోటలు పచ్చని పాడి పంటలు నోరూరించే ఫలాలు అమూల్యమైన జీవరాశుల సంపద సరికొత్త అనుభూతులను పంచే ప్రకృతమ్మ వరం మనసును కట్టిపడేసి మదిని మురిపించి మరిపింప చేస్తాయి ప్రకృతి అందాలు సుడిగాలులు జడివానలు ఉప్పెనలు ఉత్పాతాలు అన్నీ ఉన్నా ప్రకృతిలో జీవరాశి మనుగడ కోసం ఇప్పుడు మన ముందున్న ప్రయత్నం ప్రకృతిని కాపాడుకోవడం ప్రకృతిలోని అందాలను ఆస్వాదిస్తూనే చేటు చేసే పరిణామాలను కూడా అడ్డగించాలి అప్పుడే అనునిత్యం ప్రకృతి ప్రసాదించిన అందాలుపరిరవిల్లుతాయి ధరణిలో..... - జి జయ
Read More

అన్నదమ్ములు

అన్నదమ్ములు అన్నదమ్ముల అనుబంధం అత్యున్నత అనుబంధం జీవితకాల అనురాగానికి విలువైన బంధం ఒకే తల్లి చనుబాలు త్రాగి ఒకే తల్లిదండ్రులు కలిగిన అపూర్వ అనుబంధం రక్తసంబంధం పుట్టకముందే వచ్చిన ముడి పడినబంధం కలిసిమెలిసి పెరిగిన బాల్యం తల్లిదండ్రుల కనుసన్నల్లో పెరిగిన ప్రేమ బంధం కష్టసుఖాల్లో తోడుగా నిలిచే ఆత్మీయ బంధం అడ్డుగోడల ప్రపంచంలో మాట తోనే కానీ నోటుతోనే కానీ అన్నదమ్ముల అనుబంధాన్ని విభజించుకోవద్దు ప్రేమాభిమానాలతో జీవితాంతం భగవంతుడు ప్రసాదించిన వరమవ్వాలి అన్నదమ్ముల అనుబంధం ఎంత ఉన్నత శిఖరాలకు ఎదిగినా కుటుంబ విలువలను కాపాడుతూ రుణ బంధమైన అన్నదమ్ముల అనుబంధాన్ని ప్రేమకు ప్రతీకలై నిలవాలి మోసానికి అందరూ అర్హులే అన్నట్టుగా అనుబంధాల చిత్రాలు కూడా మారిపోయే కాలం రోజులు ఏవైనా గాని అన్నదమ్ముల అనుబంధం ఆనంద గీతికలే కావాలి ఎప్పటికీ అని కోరుకుందాం మనం అనుబంధాలు ఉన్న అందరం..... - జి జయ
Read More

తల్లి తండ్రుల గొప్పతనం

తల్లి తండ్రుల గొప్పతనం తల్లితండ్రులు కనిపించే దైవాలు అంటారు కదా ప్రేమనే పంచే పెన్నిధులు నీతిని చెప్పే నిష్ణాతులు మమతను పెంచే మాణిక్యాలు స్వార్థం లేని సారథులు సంస్కారం నేర్పే గురువులు భరోసానిచ్చే భాగ్యులు మన్నించే మహాత్ములు కాపాడే కర్తవ్యులు మాట్లాడే ప్రియ భాషకులు సాన్నిహిత్యానికి స్నేహితులు సంతోషం కోరే శ్రేయోభిలాషులు అపకారం తెలియని అజ్ఞానులు కాపాడే కరుణామూర్తులు గెలిపించే శక్తిశాలులు మార్గం చూపే మార్గదర్శకులు సంస్కారం నేర్పే సాంప్రదాయకులు మమకారపు మాధుర్యాలు సహకరించే సన్నద్ధులు నడవడికల జ్ఞానమూర్తులు అర్థం చేసుకునే త్యాగమూర్తులు సరిదిద్దే సలహాదారులు అన్నింటిని ఇచ్చే అభయ హస్తాలు గెలిపించే ఆరాటకులు అనునిత్యం మన సంతోషం కోసం పరితపించే నిత్య శ్రామికులు వారే లోకంలో కనిపించే ఆరాధ్యదైవాలు తల్లితండ్రులు మరి... - జి జయ
Read More