mamidala shailaja

గర్భసహచరులు

గర్భసహచరులు మానవీయ విలువలను ఏమాత్రం పట్టించుకోని సమాజంలో మనం జీవిస్తున్నాము. అత్యున్నతమైన నాగరికత వైపు అడుగులు వేస్తూ సైన్స్ లో ఎంతో ప్రగతి సాధించాం గొప్పలు చెప్పుకుంటున్న మనిషి మనిషిగా ఉండడం మాత్రం మరిచిపోతున్నాడు. సమాజం అభివృద్ధి చెందాలంటే నైతిక, నాగరికత, మానవీయ విలువలు అత్యంత ముఖ్యం. శాస్త్ర సాంకేతిక వైద్య, న్యాయ తదితర రంగాలలోని వృత్తి నిపుణుల్లో సైతం మానవీయ, సృజనాత్మక కోణాలు కనుమరుగవ్వడంతో మన సమాజం అనుకున్నంతగా అభివృద్ధి చెందడం లేదనేది ఒప్పుకోక తప్పని వాస్తవం. ఒక శాస్త్రవేత్త, వైద్య నిపుణుడు, ఇంజనీరు తమ విజ్ఞానాన్ని మానవీయ కోణాలలో సమ్మిళితం చేసి ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతనంగా సృష్టించే ఆవిష్కరణలకు ప్రాణం పోయాలి అప్పుడే సమాజం సజీవంగా ఉంటుంది. జీవకళ తొణికిసలాడుతుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ చెప్పినట్లు చాలావరకు ఈ ఆర్థిక అంశాలే చాలా కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నాయి. యుక్త…
Read More

దోసిట నింపిన వరాలు

దోసిట నింపిన వరాలు డిసెంబర్ నెల చివరి వారం.. ఊరు ఊరంతా చలికి తట్టుకోలేక సాయంకాలానికే పనులన్నీ ముగించుకొని ఇళ్లల్లో చేరి తమకు ఉన్నంతలో వేడివేడిగా వండుకొని తిని ముసుగుతన్ని పడుకునే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి సమయంలో తాటాకు గుడిసె ముందు ఎముకలు కొరికే చలికి గజగజ వణికిపోతూ మునగ తీసుకొని కూర్చొని ఉన్నాడు రాజు. అతని కళ్ళు మాటిమాటికీ గుడిసె తలుపుల వైపు ఆశగా చూస్తున్నాయి. అవ్వ, అయ్యలు కరుణించకపోతారా తనను లోపలికి పిలవకపోతారా అని. నిద్రాహారాలు మాని రెండు రోజుల నుంచి ఎదురు చూసి చూసి కాయలు కాచిన కళ్ళు కన్నీటిని వర్షిస్తుండగా కన్నీటితో చారికలు కట్టి కందిపోయిన పాలుగారు బుగ్గలను తుడుచుకున్నాడు. పదిహేడేళ్ళ వాడి పసిప్రాయం వాడికి జీవితానికి సరిపడా గుణపాఠాలను నేర్పింది. బాల్యం నుండి యవ్వన ప్రారంభదశలోకి అడిగిడే క్రమంలో లోకమంతా రంగులమయంగా కనిపిస్తూ అదుపెరగని ఆనందాలన్నింటినీ ఆస్వాదించడానికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది. అలాంటి పరిస్థితులలో…
Read More

ఆశల తిమిరాలు..

ఆశల తిమిరాలు.. రవిచంద్రులకే నిలకడలేని... అశాశ్వతమైన అవనిలో... పగటి వెలుగుల ఉజ్వల కాంతులు శాశ్వతం అనే భ్రమలో.. క్షణిక ఆనందాల పందేరంలో.. నిలకడ లేకుండా.. నిదురను మరిచి.. ఆశల తిమిరాల వెంట.. ఆత్రుతగా పరుగులు తీశాను.. కానీ ఇప్పుడు రాత్రి పొద్దు పోయాక... చిరు చీకట్లు అలుముకుంటున్న.. ఈ సవ్వడి లేని సాయంకాలాన... నెమ్మదిగా ఎరుకలోకి వస్తోంది.. నా చిరు ఉనికిని చిరస్మరణీయంగా మలుచుకోవడమే మరిచానని.. ఇప్పుడు వగచి ఏం ప్రయోజనం..? ఈ సార్వజనీన సత్యం అవగతమయ్యేసరికి.. సర్వశక్తులు ఉడిగిపోయి.. శాశ్వతత్వానికి చేరువలో ఉన్నాను.. - మామిడాల శైలజ అసిస్టెంట్ ప్రొఫెసర్
Read More

విజ్ఞానం -వివేకం

విజ్ఞానం -వివేకం "ఏ పుస్తకం నీ జీవితంలో ఏ సమయంలో నీ ప్రపంచాన్ని కుదిపివేసి నువ్వు అంతకుముందెన్నడూ ఊహించని మార్గాలలో నువ్వు అభివృద్ధి అయ్యేందుకు ఉత్తేజపరుస్తుందో నీకు ఎన్నటికీ తెలియదు.."అన్నారు వర్క్ హెడ్జెస్. పుస్తకం యొక్క గొప్పతనం చెప్పాలంటే మనము చదివిన అందులోని ఒకే ఒక వాక్యం మన జీవితాన్ని మార్చగలదు. అక్షరానికి ఉన్న శక్తి అవధులు లేనిది. అనంతమైనది. అది ఒక్కోసారి మనల్ని మన మార్గంలో ఆగేలా చేసి మన జీవిత ప్రయాణ దిశను పూర్తిగా మార్చివేయవచ్చు. మనం వెళుతున్న దారి సరైనది కాదు అని చెప్పవచ్చు. మనల్ని జీవిత పర్యంతం వేధిస్తున్న సమస్యలకు ఒక్క వాక్యం ద్వారా పరిష్కారం చూపించవచ్చు. మన రంగంలో మనం ఇంకా ఉన్నతంగా ఎదగడానికి సోపానాలను నిర్మించవచ్చు. మనమున్న రంగంలో చేయబోయే పొరపాట్లు మన కంటే ముందే ఆ మార్గంలో నడిచినవారు చేసేసి వుంటారు. అందుకే మనం పుస్తకాలు చదవడం ద్వారా మనం ఎదుర్కొంటున్న…
Read More

శిధిల జ్ఞాపకాలు

శిధిల జ్ఞాపకాలు కనికరంలేని కాలం... కానుకగా ఇచ్చిన... విధి వంచితమైన చిధ్రిత బ్రతుకు చిత్రంలో వివర్ణమైపోయిన నా కోటి ఆశల కుసుమాల శిధిల జ్ఞాపకాలు.. చిత్రవధ చేస్తూ అనుక్షణం వేధిస్తూ.. మది మందిరాన్ని.. ముళ్ళ పొదళ్ళా చుట్టుకొని.. ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. చిరకాలపు వేదనలకు చరమగీతం పాడాలని ఉన్నా.. నిరతం నీ ధ్యాసలో... నీ రాక కోసం వేచి చూస్తూ.. నిను చేరే క్షణం కోసం... పరితపిస్తూ... మోడులా జీవితాన్ని.. నడిపిస్తూనే ఉన్నా.. ఎందుకంటే... అనివార్యమైన ... ఈ బతుకు నాటకాన్ని... చివరికంటా.. అభినయించి వెల్లాలని... చిద్రితము: నలిగిపోయిన వివర్ణము : రంగులు వెలిసిపోయిన - మామిడాల శైలజ
Read More

నీరాజనం

నీరాజనం సుదీర్ఘకాల అన్వేషణ అనంతరం.... నీ జాడ లభించిందన్న ఆనందంతో... మదిలో సందడి చేస్తున్న మన గతకాలపు స్నేహ పరిమళాల గుబాళింపును ఆస్వాదిస్తూ... చిరకాల నేస్తాన్ని దర్శించబోతున్నానన్న... ఉత్సుకతతో హృదయం పల్లవిస్తుండగా.. మనో వాల్మీకంలో పదిలంగా ఉన్న నీ సజీవ జ్ఞాపకాలను.. పునర్దర్శించుకుంటూ... పట్టరాని ఆనందంతో.. పరుగుపరుగున నేనొస్తే.... పుష్పమాలాలంకృతమైన... నీ నిర్జీవ పార్థివదేహం నివ్వెరపరుస్తూ నన్ను స్వాగతించింది..! కళ్ళల్లో చిప్పిల్లుతున్న... ఆనంద భాష్పాలు ... అశ్రుపుష్పాలుగా రూపాంతరం చెంది.. నన్ను నిలువెల్లా తడిపేస్తుంటే... నా ఉనికే ప్రశ్నార్థకం అయిన దుస్థితిలో.. నిశ్చేష్టనై నిలుచుండిపోయాను.! నీకు అంత మరుపేల నేస్తం...? మన దారులు వేరైనా... తీరులు వేరైనా... మన మిత్రుత్వం శాశ్వతం అన్నావు..! కడవరకు కలిసి ప్రయాణిద్దాం అన్నావు..! మరి ఇలా ఎలా అర్ధాంతరంగా .. నా చెయ్యి వదిలేసి.. ఒంటరి ప్రస్థానం సాగించావు..? నీ నిష్క్రమణం మిగిల్చిన వేదన... నన్ను దావానలంలా దహించివేస్తోంటే.. నేను మాత్రం ఏం చేయగలను నేస్తమా?…
Read More

చిద్రిత హృదయం

చిద్రిత హృదయం మాటిమాటికి దారి తప్పిపోతున్నా... అంతు పట్టని ఈ నిర్జన ఎడారిలో.. వెళ్లే దారిలో ఎన్నెన్నో కంటకాలు.. ఎద ఎదకూ ఎన్నెన్ని వ్యధలను పంచాయో.. ఎన్ని గుండెలు గాయాలపాలయ్యాయో... ఎన్ని సుకుమార హృదయ సుమాలు... నలిగిపోయి నలిబిలి అయ్యాయో... నాకు తెలియని మార్గాలు అనేకం అని... ఇప్పుడిప్పుడే ఎరుకలోకి వచ్చి ఏడిపిస్తున్నాయి.. నాకు సర్వం తేటతెల్లమే అన్న భావన... భ్రమే అని వెక్కిరిస్తూ వేధిస్తోంది.. నాకు సర్వం అవగతమే అన్న అభిజాత్యం... అహంభావమే అని తేటతెల్లమై.... ఆశనిపాతంలా మారి.. అంకుశంలా గుచ్చుతోంది... మది మదిని కలచివేసే... మహోత్పతాల గాయాల తాకిడికి.. ముక్కలవని మనసు లేదు.. చిధ్రమవని చిత్తము లేదు.. సమస్తమూ సమిధలై పోతున్న.. ఈ విధి విలాసంలో.. నేనెంత? నా హృదయం ఎంత? - మామిడాల శైలజ
Read More

అమ్మాయి మనసు

అమ్మాయి మనసు మధు మాసం "... నిండు చందమామ ఆహ్లాదకరమైన వెన్నెలను విరజిమ్ముతోంది. రకరకాల పూల మొక్కలతో కూడిన ఆ అందమైన తోటలో ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్న ఊయలలో శ్వేత వర్ణంలో ఉన్న సుతిమెత్తని దిండుకి చేరగిలపడి చేతిలోని కప్పులోంచి ఫిల్టర్ కాఫీని ఒక్కొక్క సిప్ ఆస్వాదిస్తూ తాగుతూ ఒక రకమైన పారవశ్యంలో మునిగితేలుతోంది అనుపమ. పిండారబోసినట్లుగా ఉన్నా ఆహ్లాదకరమైన వెన్నెల వెలుగులో ఏకాంతంగా ఆలోచనాతరంగాలలో తేలిపోతూ గడపడం అంటే అనుపమకి చాలా ఇష్టం.  అందుకనే తనకు జాబ్ రాగానే మంచి లొకేషన్లో చిన్న ఇల్లు నిర్మించుకుని, తన అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకుంది. ఇంటి చుట్టూ చక్కని గార్డెన్ ను ఏర్పాటు చేసుకుంది. అనుపమ మంచి చదువరే కాకుండా మంచి రచయిత్రి కూడా. సాయంత్రం ఇంటికి రాగానే పనులన్నీ ముగించుకొని పుస్తకము, పేపర్లు, కలమూ తీసుకుని గార్డెన్ లోకి చేరిపోతుంది. అనుపమ కలం నుండి వెలువడిన ప్రతి రచనకు ఆ పండువెన్నెల్లోనే,…
Read More

పునర్జన్మ

పునర్జన్మ దివారాత్రాలు విరామమెరుగక.. నన్ను వెంటాడి వేధిస్తున్న... విచ్చుకత్తుల్లాంటి ఆలోచనలు.. నా మది మందిరాన్ని... విచ్చిన్నం చేస్తూనే ఉన్నాయి.. ఇక అలుపొచ్చి .. ఆగిపోయాయేమో అనుకున్నా.. వేదనతో మరణించిన... అంతరంగ భావనలు.. ఉత్తుంగ తరంగాల్లా ఎగసిపడే.. అక్షరాలుగా పునర్జన్మ పొందాయి.. - మామిడాల శైలజ
Read More

పరువు లే(ఖ)క

పరువు లే(ఖ)క మానవత్వపు విలువలను మృగ్యం చేస్తున్న మనువాద సిద్దాంత భావజాలాన్ని చెక్కుచెదరకుండా చేతులొడ్డి కాపాడుతున్న సనాతన సాంప్రదాయ సమాజానికి నా ఈ పరువు లే(క)ఖ... ఒకప్పుడు పూర్వపు ఉమ్మడి కుటుంబాలలోని సభ్యులు కుటుంబ యజమాని యొక్క ఆంక్షలకు లోబడి కుటుంబ పరువు ప్రతిష్టలు, గౌరవానికి భంగం కలగకుండా అతని ఆదేశానుసారం అణకువగా ప్రవర్తించేవారు. రాను రాను ఉమ్మడి కుటుంబాల స్థానంలో వ్యక్తిగత కుటుంబాలు ఏర్పడి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు లభించాయి. నా కుటుంబం, నేను అనే భావన సంకుచితమైపోయింది. ఒకప్పుడు ఇంట్లో మూల స్తంభాలుగా ఉన్న పెద్దవాళ్ల ఆజ్ఞలకు, వాళ్ళ కోరికలకు విలువ ఇవ్వడం తగ్గిపోయింది. ఒకప్పుడు పెద్ద వాళ్ల నిర్ణయాలకు తలోగ్గి వాళ్లు నిర్ణయించిన జీవిత భాగస్వామితో వివాహబంధంలో అడుగు పెట్టేవారు. మారుతున్న పరిస్థితులలో వ్యక్తి స్వేచ్ఛావాదం పెరిగింది. తమ జీవిత భాగస్వామిని నిర్ణయించుకోవడంలో పిల్లలు స్వేచ్ఛ తీసుకుంటున్నారు. సరిగ్గా ఇక్కడే ఏర్పడింది అసలు సమస్య. కులాలు, మతాలు, ఆర్థిక…
Read More