poem

కవిత

కవిత నిను ఈ క్షణం చూడాలనిపిస్తుంది, మరీ ఎలా,? అనంత తీరంలో చకోరపక్షిలా ఒక్కడినే ఎన్నాళ్ళు ఎదురుచూడను? ఇప్పటికే నామనస్సు చక్కలుమ్రుక్కలై చెల్లాచెదరై పోయింది అద్దం పగుల్లవలే, భవిష్యత్ అందాకారమై, నీవు కనిపిస్తావనే చిన్న ఆశ , అడుగంటిన నా ఆశలకు ఊపిరులూదుతుంది, క్షణమొకయుగంలా గడుస్తూవుంటే, దారంతెగిన గాలిపటంవలె మనస్సు ఊగిసలాడుతూ ఉంటే, చీద్రమైన నా ఉహాలపల్లకి ఊగిసలాటలో పయనిస్తూ ఉంటే, ఎక్కడో ఓ వెలుగురేఖ కనిపించిన ఆక్షణాన, అది నీవేనని, నానయనాలు జలాశయాలై వర్శిస్తూవుంటే, అది నీవుకావని తెలిసిన ఆమరుక్షణానా, ఇంకా మరణం రాలేదేమని? గొంతుచించి అరవాలని వున్న గొంతు పెగలని నిస్సాహయత ఎందుకో చెప్పవూ. - పోరండ్ల సుధాకర్
Read More

తనువు

తనువు   ఒకర్ని ఇష్టపడితే జీవితాంతం వారి తోనే కలిసి నడవాలి. మంచి ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది నీ అంతరాత్మను అడుగు నువ్వు తప్పు చేయలేదు అని అదెప్పుడు అబద్దం చెప్పదు, తనువులు కలిసే చోట మనసు కూడా కలవాలి లేదంటే తేడాలు వస్తూ ఉంటాయి, తనువుల వేడి చల్లార్చు కోవడానికి వేరే దారులు వెతికినా అది నిన్నెప్పుడు కాల్చేస్తూ ఉంటుంది.   - ఐశ్వర్య
Read More

గుణం

గుణం మంచి బట్టలతో మంచి మేకప్ తో మనిషి రూపం మారవచ్చు కానీ మనిషి గుణం మారుతుందనే నమ్మకం లేదు బట్టలు మాసినా, అందం గా లేకపోయినా ఆ మనిషికి మంచి గుణం ఉండవచ్చు....   - భవ్య చారు
Read More