ఓ వెన్నెలమ్మా... ఓ వెన్నెలమ్మా వెన్నెల రాత్రులు, ఏ రోజైనా, ఎన్ని కాలాలు మారినా, యుగాలు గడిచినా, వన్నె తరగని కాంతి నిచ్చే వెన్నెలను, నిండు చందమామకు వన్నె తెచ్చే వెలుగును, తారలు మిల మిల మెరిపించే తళుకులను, గగనాన్ని చూసి మురిసిపోయే సమయాలను, జగాన వెలుగుల విరజిమ్మే వేళలను, ప్రేమికుల మనసులు మెరిసిపోయే అందమైన క్షణాలను, కవుల మనసుల్లో భావాన్ని పుట్టించే రేయివిగా, జాబిలమ్మను అందించే వెలుగులు రాతిరిగా, పూలకొమ్మలకు, వెన్నెలమ్మను ఆభరణంగా అలంకరించే నడిరేయిగా, సర్వజగత్తుకు వెలుగును పంచే అద్భుతమైన రాత్రివి, అందమైన మనసుల్లగా, చల్లని వెలుగుల వెన్నెలమ్మను అందించే జామురాతిరివి. తొలిరేయి అనుభవాన్ని, వెన్నల రాత్రి అరుదైన అనుభూతిని, ఎన్ని మనసులైనా ఆస్వాదించేలా చేసే మైమరపు సమయాలను నింపుకున్నావు. ఆలుమగలు వలపులతో అల్లుకుపోతున్న వేళలను, రాతిరిని రేయిగా మలిచే వెన్నెలను నింపుతున్నావు. నింపుకున్నావు. వెన్నెలరాత్రివి నువ్వు. వర్ణనకు అద్భుతమైన ఆలోచనలు పంచే అధ్బుతానివి నీవు.... -బి. రాధిక