suryaksharalu

ఉపవాస దీక్ష

ఉపవాస దీక్ష వ్యక్తి కి, మానసిక వ్యక్తిత్వానికి మార్పు తీసుకువచ్చే క్రియ, ప్రక్రియ ఈ ఉపవాస దీక్ష.. మనం చాలామంది చాల రకాల ఉపవాస దీక్ష చేస్తుంటారు.... సంకల్పంతో మనోవాంఛ తీరటానికి చేసే విధానం ఈ ఉపవాస దీక్ష... ఎన్ని రకాలుగా చేసినా తిండి తినకుండా నిద్ర లేకుండా చేస్తే దీక్ష చేయటం కన్నా ఒక స్థితికి వచ్చేసరికి మన వల్ల మరొకరిని ఇబ్బంది, బాధ పెట్టే పరిస్థితి వస్తుంది. మన మనోస్థితిలో మార్పు మంచికి వస్తే పరవాలేదు కానీ మార్పు బంధాలు, బంధుత్వాలు దూరం చేసేట్లు వస్తే దీక్ష యొక్క ఫలితం లేదా మన మనోవాంఛ తీరదు, తరగదు. వ్యక్తి గా మన బలం, మనోవ్యక్తిత్వం చేజారిపోకుండా ఎలాంటి ఎటువంటి దీక్ష చేసినా తప్పు లేదు. - సూర్యక్షరాలు
Read More

స్నేహం

స్నేహం నిన్ను మెప్పించేలా మాట్లాడితే స్నేహం చేయటం, వారు నమ్మింది మాట్లాడితే స్నేహం చేయకపోవటం రెండు నీకే చేటు. స్నేహం కి నమ్మకం ముఖ్యం అది లేనిచోట స్నేహం ఉండదు. - సూర్యాక్షరాలు
Read More

ఒక ఆడపిల్ల

ఒక ఆడపిల్ల ఆనందాల హరివిల్లు ఆడపిల్ల అక్కున చేర్చుకోండి అక్కసు చూపించి అశ్రువులు రానీయకండి ఆకలి తీర్చేది అమ్మ అభయం ఇచ్చేది అక్క / చెల్లి అక్కున చేర్చుకొనేది అలీ ప్రాణం పోసేది ఒక ఆడపిల్ల నీ ప్రాణం కి విలువ ఆడపిల్ల అలాంటి ఆడపిల్ల కి నువ్వు విలువ ఇవ్వకపోతే ప్రాణం లేని దేహం నీది నీకు విలువ లేదు గౌరవించు, అభిమానించు, ప్రేమించు, అర్దించు, కాపాడు నీ జీవితానికి అర్ధం ఆడపిల్ల అని గుర్తించు ఆడవారు మీకు జోహార్లు  - సూర్యక్షరాలు
Read More

నారాయణా…

నారాయణా... నీ కన్నుల కమనీయ తీక్షణ పవనములు నీ స్పర్శ సాయించు సమ్మోహన సిరులు నీ దర్శనంబు దరిచేర్చు దివ్యదేశముల్ నీ చిద్విలాస చిరునవ్వు చిందించ చరితార్థమవున్ - సూర్యక్షరాలు
Read More

స్వేచ్ఛ స్వాతంత్ర్యం

స్వేచ్ఛ స్వాతంత్ర్యం స్వేచ్ఛని మనమే స్వయంకృతం గా వదులుకున్నాము... మానవ సృష్టి జరిగినప్పుడు లేని నిబంధన... స్వాలోచన, స్వార్ధం, అత్యాశ... ఇలాంటివి మానవులలో పెరిగి స్వేచ్ఛని నిర్బంధించి బానిసలం అయినాము... అది దేశం, రాష్ట్రము, జిల్లా, పట్టణం, గ్రామం, ఇల్లు మాత్రమే కాక మనిషి తనలో వున్న మనస్సుని కూడా మలినం చేసుకొని జీవిస్తున్న కాలం ఇది... స్వాతంత్ర్యం వున్నా దాని కోసం పోరాడాల్సిన దుస్థితి మనం లేదా ప్రపంచం కలిపించుకుంది.. వచ్చింది. సద్వినియోగం కన్నా దుర్వినియోగం చేయటం కి అలవాటు పడిన మానవులం అందరం.... స్వేచ్ఛ అనేది పరిమితం కాదు ఒకప్పుడు అది మంచి జరిగే విధానంలో ఉంటే కానీ చెడు కోసం ఉపయోగించే స్వేచ్ఛనే మనం భరించాము.... మంచి కోసం వచ్చిన స్వేచ్ఛ ని మన ఇంట్లో (దేశం, ఇల్లు)లో చెడు, స్వార్ధ ఆలోచనల కోసం ఉపయోగిస్తూ దేశం లో ఇంట్లో స్వేచ్ఛ లేదు స్వాతంత్ర్యం లేదు అని…
Read More

మాతృమూర్తులు

మాతృమూర్తులు భగవంతుడు ఎన్నో శక్తులతో మనిషిని చేయగా అ మనిషి నుంచే మరో ప్రాణం కి ఆయువు పోసిన పుణ్యమూర్తి అ భగవంతుని కన్నా మిన్న.  నీకు సుఖము అందించి నీ రెండు చుక్కల కారణం గా నవ మాసాలు తనకు మించిన బరువుని ప్రాణం పెట్టి కాపాడుతూ ప్రాణం వదిలి అయినా మరో ప్రాణంకి జీవం పొసే అద్భుత అవని. చులకనగా చూడక మనస్సు పెట్టి గౌరవించు, మనస్పూర్తి గా ప్రేమించు, మలినం లేకుండా అభిమానించు. నీ ఆకలి తీర్చే అమృతమూర్తి నీ కోపాన్ని కరిగించే కరుణామూర్తి నీ బాధ తీర్చే మాతృమూర్తి భువికి మించిన సహనం కలిగిన మాతృమూర్తులు అందరికి మీకు పాదాభివందనములు   - సూర్యక్షరాలు
Read More

తల్లి-తండ్రులు

తల్లి-తండ్రులు కన్నతల్లి అనే పదాన్ని వర్ణించటం ఈ భూమి మీద మానవమాత్రులకి, అ భగవంతుడికే సాధ్యం కాదు. నవమాసాలు మోసే ఆడపిల్ల తన జీవితం చివరి వరకు పడే కష్టం మొత్తం అప్పుడే అనుభవించి ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక జీవికి జన్మనిస్తుంది. పుట్టే పిల్లలు ఎలాంటి వారు అయినా మానవమృగాల సమాజం నుంచి తన పిల్లల్ని కాపాడుకుంటూ జీవితం అంతా ధారపోసే తల్లి అనే పదానికి వర్ణణ ఇవ్వలేము. మనల్ని పుట్టించి పెద్దవాళ్ళని మంచి వాళ్ళని చేయటానికి శ్రమిస్తున్న నిత్య కార్మికురాలు తల్లి. అ తల్లికి శోకం తెప్పిస్తే నీ జన్మ కి అర్ధం లేదు. అ తల్లి(ఆడపిల్ల) ని చెరపట్టే మానవమృగాల జీవితం ముగించేందుకు మరణశాసనం రాయండి మానవత్వం కలిగిన మానవుల్లారా..... ప్రేమ అనే పదానికి ప్రతిరూపం నాన్న నా పుట్టుక కి కారణం నాన్న నా ఊపిరి కి కారణం నాన్న ప్రతి నిత్యం నన్ను కాపాడే…
Read More

ఆడపిల్ల

ఆడపిల్ల ఆనందాల హరివిల్లు ఆడపిల్ల అక్కున చేర్చుకోండి అక్కసు చూపించి అశ్రువులు రానీయకండి ఆకలి తీర్చేది అమ్మ అభయం ఇచ్చేది అక్క / చెల్లి అక్కున చేర్చుకొనేది అలీ ప్రాణం పోసేది ఒక ఆడపిల్ల నీ ప్రాణం కి విలువ ఆడపిల్ల అలాంటి ఆడపిల్ల కి నువ్వు విలువ ఇవ్వకపోతే ప్రాణం లేని దేహం నీది నీకు విలువ లేదు గౌరవించు, అభిమానించు, ప్రేమించు, అర్దించు, కాపాడు నీ జీవితానికి అర్ధం ఆడపిల్ల అని గుర్తించు - సూర్యాక్షరాలు  
Read More

ఆడపిల్ల

ఆడపిల్ల నీ ఒడిలో చేరే ఆడపిల్ల నీ చూపుల చెరలో చిక్కే చంటిపిల్ల నీ చర్య కి చలించిపోయి చిన్నపిల్ల నీ అఘాయిత్యాలకు అక్రందనతో విలవిలలాడే ఆడపిల్ల నీ మరణం కోసం మరణశాసనం రాసే ప్రతి మహిళ.. - సూర్యక్షరాలు
Read More

పరువు లేఖ

పరువు లేఖ నీ దారి ఏదో నువ్వే ఎంచుకున్నావు నీ దారి రాజమార్గం చేయాలి అనుకున్నాను నీ దారి తెలియక తొందరపడ్డావు నా పరువు కోసం నీ దారి పూలదారి చేసేలోపు గోదారి చేసుకున్నావు పరువు పోగొట్టుకొని ప్రాణం పోయేలా చేసిన నీ దారి నాకు ఎడారి చేశావు. ఇప్పుడు పరువు ముఖ్యమై ప్రాణం తీసుకున్న ఒక తండ్రి పరువు లేఖ - సూర్యక్షరాలు
Read More