womens day poems

విశ్రాంతి ఎప్పుడు?

విశ్రాంతి ఎప్పుడు? పొద్దున్నే లేస్తావు బొంగరం లా తిరుగుతావు నిరంతర యంత్రంలా పనిచేస్తావు నీవొక మనిషన్న సంగతి మరుస్తావు  మాటలెన్నో మాట్లాడుతూ మంచికి ప్రయత్నిస్తావు మగువా మగువా నీకెక్కడిదే మనుగడ లేని జీవితం గడుపుతావు మాటలెన్నో పడతావు అవమానిస్తాడు. అనుమానిస్తాడు అయినా నీ పెదవి పై చిరునవ్వు కదలనీవు మగువా మగువా మానసిక ఒత్తిడిని తట్టుకుంటూ ఎంతో శ్రమ కొరుస్తావు  అందరి ఆరోగ్యం చూస్తూ నీ ఆరోగ్యం చూసుకోవూ నవమాసాలు మోసి నరకం చూస్తూ ఆనందాన్ని పొందుతావు మగువా మగువా నీ మనుగడ కోసం ఎప్పుడు అలోచిస్తావు నీకు నువ్వు విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటావు? - భవ్యచారు
Read More

మహిళ

మహిళ 'ళ ' లోని కళ తో, అట్లే మెలికలు తిరిగే పయనం తో, సరళ భాష ఆభరణిఐ పరిమళాలు పంచుతూ, గుప్తతని పాతాళంలో ఉంచి , భాగస్తుని కి తాళం వేస్తూ, రూపాయి బిళ్ళ ని తాళ్లతో బంధించి, అడిగినదే తడవుగా విరాళం ఇచ్చి, లోగిళ్లలో పళ్ళు కాయించి,, కళ్ళు మసక బారిన పెద్ద కి కళ్ళజోడు గా మారి, సంసారం పాళం తప్పిన, గృహ సంకెళ్లను ఛేదించి, నిలుచును గోళమందు కాళిఐ !!! - వాసు 
Read More

మహిళ

మహిళ మహిళా ఓ మహిళా బ్రహ్మ కైనా  అమ్మవి నీవే అమృతపు వాక్కునీవే ఆత్మీయత అనురాగం నీవే అన్నపూర్ణ వి నీవే ఆదిశక్తి వి నీవే ఓర్పు నీవే నేర్పు నీవే నవరసాల నాట్యము నీవే పరిమళించే పూవు నీవే ప్రతి ఇంటా మార్గం నీవే అవనిలోనూ అంతరిక్షం లోనూ అరుదైన పాత్ర నీవే ధీర వనిత వి నీవే వీర మాతవూ నీవే వుప్పోంగే కెరటం నీవే ఉలిక్కి పడే గాథ నీదే మారుతున్న కాలంలో కావాలి నువ్వొక మహాశక్తి మహిళా ఓ మహిళా నీ మనుగడే  మానవాళి అద్భుత శక్తి అదే నీలో వున్న దివ్యశక్తి మహిళా ఓ మహిళా  - జి.జయ
Read More