Month: May 2022

అల్పాయిష్షు

అల్పాయిష్షు విది ఆడిన వింతనాటకంలో అందరూ పాత్రధారులే కానీ కొంతమందిని అల్పాయుష్షులుగా విది వక్రీకరించి జీవనరేఖను సమాప్త పరుస్తోంది. అందులో భాగంగానే సమాజంలో పుట్టుకతోనే వచ్చే వ్యాధులు కారణమవుతున్నాయిఇంకా చెప్పాలంటే జన్యు సంబంధవ్యాధుల్నిబాలల కు శాపమైనది. ఎంతో శాస్త్ర విజ్ఞానము అభివృద్ది చెందిన అంతులేని చేదించలేని ఎన్నోసమస్యలు మానవునిసాదిస్తూనేవున్నా కొన్ని ఖర్మలకు బాధ్యత ఎవ్వరిది కాక అల్పాయుష్షు లుగా చాలిస్తున్నారు వైద్యము అందక కొందరు వైద్యము అందుకోలేకకొందరు ప్రాణాలుపోగొట్టుకుంటున్నారు ఇటీవలి కాలంలో HIV CANCER ,HEART, ఇలా ఎన్నో ప్రాణాంతక వ్యాధులు చిన్నారుల పాలిట మృత్యు పాశాలవుతున్నాయి ప్రయాణించే మార్గాల్లో మానవ తప్పిదాల వల్ల ప్రమాదాల్లో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి సరి అయిన సమయానికి వైద్యం అందక ఇలా అదృశ్య చరిత్రలో మార్కండేయు లు ఎంత మంది ఉన్నారో - జి జయ
Read More

నీతి కథలు-1

నీతి కథలు-1 అరుణ కవిత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. స్కూల్ నుంచి కాలేజీ వరకు ఇద్దరూ మంచిగా చదువుకొని ఇద్దరికీ వేరే వేరే చోట జాబులు దొరికాయి. అరుణ విజయవాడ, కవిత కాకినాడ వెళ్లిపోయారు ఇద్దరి మధ్యలో ఫోన్ల ద్వారా మంచి చెడులు తెలుసుకునేవారు కొద్ది రోజులు గడిచాయి. అయితే అరుణకి ఆడపిల్ల పుట్టింది అని తెలుసుకున్న కవిత తనకు మగ పిల్లాడు పుట్టాడు అని అరుణకు చెప్పింది కవిత ఫోన్ లో. వాళ్లిద్దరి మధ్యలో ఎలాంటి రహస్యాలు లేవు అరుణ భర్త గురించి కవితకు అన్ని విషయాలు చెప్పేది కవిత తన భర్త గురించి అరుణ కు అన్ని విషయాలు చెప్పేది. నిజానికి వాళ్ళిద్దరికీ మంచి భర్తలే దొరికారు. అరుణ కవిత భర్తతో అన్నయ్య అంటూ మంచిగా మాట్లాడేది. కవిత కూడా అన్నయ్య అంటే అన్ని విషయాలు మాట్లాడేది. అరుణ భర్తతో వారి భర్తలు ఒరేయ్ బావ అంటే ఒరేయ్…
Read More

ఆయువుల పేటిక!!

ఆయువుల పేటిక!! జీవనదులను చేయుచుంటువి, నిర్జీవము.......! నీ, తీరని దప్పిక, శాపమాయె వాటికి. మూగజీవాల మరణ రోదన, రక్తాశ్రువులను చిందించగ, నీ ఆయుష్షు పెరగ, నీ పాటికి, నీవు వాటిని పీక్కు తింటివి.......! వాటి మానాన అవి గుబురుగ పెరిగె...! గుబులు నిన్ను గుచ్చుతుండగ, అడవి తల్లి గుండెన గునపాలు గుచ్చి, నీ గూడును గగనానికి లేపితివి .....! గగనానికి చేరనింత ఆత్రుత యేల.................? కుళ్ళు, కుశ్చితాల చెత్తబుట్ట నీ బుర్ర. అంటువ్యాధులను పెంచి, ఆయుష్షులను తీసి, పేటిక లందు భద్రపరిచెదవు....! ఇక, నీకు రాదు బుద్ధి చచ్చినా ........! - వాసు
Read More

వెన్నెల మాయ

వెన్నెల మాయ చంద్రుడి నయనంతో చీకటిలో పయనించామా నీరసమింక పలాయనం వెన్నెల రసఝరిలో ఎన్ని వన్నెల లాహిరిలో ఏకాంతాన్ని వెంటేసుకుని జ్ఞాపకాల మంటేసుకున్న మనసంతా అలజడి కలల నావలో జీవితానికావలి తీరాన్ని వెతకాలని బయల్దేరాను నిండునదిలా వైశాఖ పున్నమి కొత్త ఊపిరితో స్వరాలు కడుతుంటే కొన ఊపిరి ప్రాణానికి సంజీవిని అద్దినట్టు ప్రయాణం పాటయింది..లోనంతా రహస్యవాన నిధిదొరికిన అన్వేషి గాలివాన బతుకును గాటలో పెట్టినట్టు..వెన్నెల మాయే అంత రాత్రిని మధువుని చేసిన నవవధువులా ముసిముసిగా నవ్వుతుంది - సి.యస్.రాంబాబు
Read More

పంచాంగము 17.05.2022

పంచాంగము 17.05.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - వసంత ఋతువు* *వైశాఖ మాసం - బహుళ పక్షం* తిధి : *పాడ్యమి* ఉ8.01 తదుపరి విదియ వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే) నక్షత్రం: *అనూరాధ* మ12.43 తదుపరి జ్యేష్ఠ యోగం: *శివం* రా1.15 తదుపరి సిద్ధం కరణం: *కౌలువ* ఉ8.01 వరకు తదుపరి *తైతుల* సా6.52 వరకు వర్జ్యం: *సా5.58 - 7.27* దుర్ముహూర్తం : *ఉ8.05 - 8.56* & *రా10.48 - 11.33* అమృతకాలం: *రా2.57 - 4.26* రాహుకాలం : *మ3.00 - 4.30* యమగండ/కేతుకాలం: *ఉ9.00 - 10.30* సూర్యరాశి: *వృషభం* చంద్రరాశి: *వృశ్చికం* సూర్యోదయం: *5.31* సూర్యాస్తమయం: *6.21* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

బానిసత్వం

బానిసత్వం బానిసత్వం అంటే స్వేచ్ఛా స్వాధీనంలో పనిచేయడం అన్ని తెలిసినామాట్లాడలేని స్వతంత్ర లేని స్థానం అది అన్నింటికంటే మనిషికి బరువైన పదం బానిసత్వం సంకెళ్లు వేసిన శ్రమకు తగ్గ ఫలితం రాని వారు వేల సంవత్సరాలుగాగాప్రపంచంలో జరుగుతున్న నిత్యసత్యం హక్కులు అని పోరాటాలు చేసినా పేర్లు మార్పు కాని ప్రయోజనం తక్కువే అని చెప్పాలి "వెలుగునిచ్చే "దీపానికి వత్తిలా కరుగూతూనే వున్నారు భయంతో పనిచేసినా ఆశించిన వేతనం లేదు అభివృద్ధి ముసుగులో డబ్బు అవసరాల నేపధ్యంలో ప్రశ్నే వేయక పనిచేసి నిరక్షరాస్యత అయినా ధనిక పేద తేడాలు మనిషి అవసరాల అవస్థలకోసం జైలుజీవితం లా సాగిపోతోంది బానిస బతుకుల జీవనం ఆధిపత్య కోరల్లో అలమటించే ఆశక్తులు ఆశక్తులే కదా వాదాలు ఏవైనా వాస్తవాలు ఎరుగక దీరత్వమే వున్నా రక్తమేమరిగినా ఆత్మగౌరవాన్ని అడ్డుపెట్టినా బానిసత్వం నుండి బయటపడే మార్గం కోసం ఎదురుచూస్తూ సామాన్యుని చైతన్యం బాధను మరచి పోవడానికి మద్యానికి బానిసలు గా…
Read More

కన్నీరు

ఏ దేశం ఎగిన ఏమున్నది గర్వకారణం... నరజాతి సమస్తం పరపీడన పరయనతత్వం.... ఆకలికి తాళలేక అలిసిపోయి, నలిగిపోయి, ప్రాణాలిడిచిన జీవులు... ఉన్నదొకటే జీవితం, కానీ బ్రతకడానికి ఓ పోరాటం... రోజూ ఆకలి కోసం, ఎడతెరిపిలేని ఆరాటం... ఒకవైపు ఆకలికోసం ఏర్పడిన వర్గాలు.. మరోవైపు ధనికులకు మాత్రం స్వర్గాలు... ఏనాడు మారునో ఈ తీరు నిషీధి సైతం ఈ స్థితిని చూసి కార్చేను కన్నీరు... నింగికి నేలకి నిచ్చెనలు వేసిన ఈ అభివృద్ది ... తిండిలేక పోయిన ప్రాణాలకు కట్టాం సమాధులు.... అందరిది ఒకటే బ్రతుకు ఒకప్రక్క స్వార్దం కలిగిన జీవులు మాత్రం సంపదలకై ప్రాకులాట.. ఇంకోప్రక్క తిండిలేక ఆకలికై ప్రాణాలు విడుచుట... ఎక్కడ చూసినా వొంగిన నడుంతో కారే కన్నీటితో చెదిరిన జుట్టుతో జారిన పైటలతో ఈ సమాధులచుట్టూ వెతుక్కుంటూ తిరుగుతారు... పారేను కన్నీటి జరి ఎటు తెలపను నా వైఖరి... - కుమార్ రాజా
Read More

ఆకలిరాజ్యం

ఆకలిరాజ్యం అన్నమో రామచంద్ర అంటూ అరిచే ప్రాణాలెన్నో. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ చాటే వేదాలెన్నో.. ఆకలి విలువ ఆకలి అవసరత, ఆకలి పరిస్థితి ల వివరం వర్ణణాతీతం.. ఆకలి పై విజయం ఒకరిది.. ఆకలి పై చిన్న చూపు మరొకరిది.. అంతటి దీనస్థితి కి కారణమెవ్వరిది.. కాలం మారింది.. కారణం కుడా మారింది.. అంతా స్వార్ధం ఆవరించింది.. మనసు మానవ సేవ ను మరచింది. అది కేవలం ధనాపేక్ష ను వరించింది.. మాయల ముసుగులో తరించింది.. అంతట ఇలా ఆకలి రాజ్యం అవతరించింది.. కారణం ఏదైనా.. కారకులు ఎవరైనా.. మారాలి సమాజం.. సమసిపోవాలి ఆకలి రాజ్యం.. - కిరీటి పుత్ర రామకూరి
Read More

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి ఏడుకొండల వెంకటేశుడా కోరికలన్నీ తీర్చెడివాడా ఆపదమొక్కుల శ్రీనివాసుడా ఆదుకునేందుకు వేగమేరావా చరణం పూజలు ఆచారములే తెలియవు తెలిసినదొకటే నీ నాముముగా నీ తలపులతోనే మదినిండెనుగా తరలివచ్చేటి స్వామివి నీవని భక్తితోడనే నిను కొలిచేము చరణం నీ నామస్మరణయె మము కాపాడును నీ పాదస్పర్శయే పొందిన చాలును గోవిందాయని పలికెదమయ్యా ఏడుకొండలను దర్శించినచో మరుజన్మన్నది లేనేలేదుగ మా చిత్తములోన నిన్నే నిలిపి నిరతము నిన్నే కొలిచెదమయ్యా చరణం మాపై నీ కరుణను చూపి మము రక్షించగ రావయదేవా ఆకలి బాధలు అన్నీ మరచి నీ సేవన మేము తరియించెదము - సి.యస్.రాంబాబు
Read More

ఆకలి రాజ్యం

ఆకలి రాజ్యం దేశాలలోని ప్రజలు ఆహార కొరతతో క్షుధ్బాదని అనుభవిస్తూ అలమటించే ఆకలి రాజ్యాలు ఎన్నో కారణం ఏదైనా కరువు కాటకాలతో ప్రకృతి విలయాలతో సంక్షోభాల వూబిలో ప్రజలకు శాపాలై అందరికీ ఆహారం అనే అందుబాటులో లేకుండాపోయింది. గతి తప్పిన ఋతువులు గాడి తప్పిన పర్యావరణం పనిగట్టుకుని ప్రకృతి విధ్వంసాలు మహమ్మారిల విజృంభణ కొత్త కోణాలలో మనిషి బ్రతుకు అయోమయం చేస్తూ రెండు పూటలా తినడానికి కష్టమవుతోంది రాజ్యాధికార సూత్రాలు అంచనాల తలక్రిందులు దారిద్ర్య రేఖలు దాటలెని తీరులో అండలేని దారులు ఆకలితీరడాని ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు యుద్ధాల నీతులు శరణార్థుల కేకలు అన్నార్తుల సాహసం పుడమితల్లి వేదన ఆకలితో చచ్చే అభాగ్యులు శ్రీలంక లాంటి దేశాలు చీకటిలో కొట్టుమిట్టాడుతున్నాయి సంపన్న దేశాలైన ఆకలి బాధతో సుస్తీ లేకుండా సాగిపోవాలి జనజీవనం తిండికోసం కలవరపడ కుండా ......? - జి జయ
Read More