టీ
టీ మన రోజువారీ జీవితంలో "టీ" యొక్క ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దినచర్యలో భాగంగా టీ తాగడం అలవాటుగా మారిపోయింది. పేదవాడి నుండి గొప్పవారి వరకు టీతో అద్భుతమైన హాయిని పొందుతారు ఎన్నో రకాల పనులు పని ఒత్తిడులు వున్నా వాటినుండి చిటికెలో ఉపశమనం పొందుతాము ఇంకా అలసటగా వున్నా టీ సేవించి నపుడు తాజా గా శక్తిని పొంది ఉత్సాహంగా ను ఉల్లాసంగా ను మనసు తేలిక పడుతుంది. ఇంకొక గొప్పవిషయంఏమిటి అంటే స్నేహ సంబంధాలను మెరుగు పరుస్తాయి. టీ తాగే టైంలో ఎదుటివారితో వారి భావాలను పంచుకుంటారు కాబట్టి సంభాషణకు కూడా ముందు గౌరవ ప్రదంగా టీ ఇస్తుంటారు. ఎదుటి వారితో రోజు వారి పలకరింపు లకు టీ తాగారు కదాఅనిమొదలుపెడతాము . పరిచయాల వేదికలు పామరుడి నుండి పండితులవరకు కార్మికుల నుండి కార్యాలయాల వరకు ఇంటికి వచ్చిన అతిథుల నుండి ప్రభుత్వాల వరకు మర్యాదల ఇచ్చిపుచ్చుకునే…