Month: August 2022

డిజిటల్ ధర్మం – కథానిక

డిజిటల్ ధర్మం - కథానిక "సర్, బిల్లు నూటఏభై రూపాయలయింది కార్డా, క్యాషిస్తారా" కౌంటర్ కుర్రాడడిగాడు. "ఫోన్ పే చెయ్యొచ్చా" అడిగాను. మాట్లాడకుండా స్కానర్ ముందుకు తోశాడు. స్కాన్ తిరుగుతోంది. రెండు నిముషాలు దాటిపోయింది. మనీ డిడక్ట్ అవలేదు. "సార్, నేను రిజెక్ట్ ఆప్షన్ పెట్టాను. ఇక ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్. మీరు క్యాష్ పే చేయండి" నా ఫోన్ నంబర్ ను బిల్ తో జతచేసి చేతిలో పెట్టాడు. "ఒకవేళ తరవాత మనీ డిడక్టయితేనో" నా అనుమానాన్ని వ్యక్తపరచాను. "అవ్వదు సార్" తడుముకోని సమాధానం మొహాన్ని తాకింది. అనుమానంగానే ఐదొందలు చేతిలో పెట్టాను. చిల్లరతోపాటు మందుల కవర్ ముందుకు తోశాడు. ఈ మియాపూర్ లో అంతా మాయే అనుకున్నాను. ఆ మెడికల్ షాప్ ఒక బ్రాండెడ్ చెయిన్ ది. అందుకేనేమో జనం కూడా గొడవ చేయకుండా క్యూలో నిలబడ్డారు. నేనెక్కువ సేపు టైం తీసుకోవటంతో నెమ్మదిగా రుసరుసలు మొదలయ్యాయి. అక్కడనుండి…
Read More

నేటి నా కల

నేటి నా కల భారతదేశపుకలలపుత్రికలు సాధించి తీరుతామని పయనమై పసిడి పథకాలు పండించి మహిళా శక్తిని మరొక్క సారి నిరూపించారు! కామన్వెల్త్ క్రీడల వేదికలో సాహసమే శ్వాసగా సంకల్పమే సారధిగా ఆశలే అడుగులై ఉత్సహామే ఊపిరిగా పి .వి సింధు, నిఖత్ జరీనా తెలుగు తేజాలు మువ్వన్నెల పతాకానికే వన్నె తెచ్చిన ముద్దు బిడ్డలు! విభిన్న శైలిలో అరుదైన పోరులో సాహసాల పోటీలో రికార్డుల వేటలో శ్రమయే ధ్యేయంగా విజయమే లక్ష్యంగా స్వర్ణపతకాలవిజేతలు వీరు! అనుభూతుల జడిలో ఆనందాల హాయితో అద్భుతాల ఆవిష్కరణకు ప్రపంచపు వేదికలపై ప్రతిస్టించిన నేటి మేటి మహిళామణులు ! మాతృభూమి ఋణం తీర్చుకునే అవకాశం తెలుగు తేజాలకు కలిగిన అదృష్టం అదే వారి నేటి మురిపించే కలల సాకారం! అందుకోండి అందరి అభినందనలు మరి ..? - జి జయ
Read More

మధ్యతరగతి జీవి

మధ్యతరగతి జీవి మబ్బులు మనసులు విహారాన్ని ఆపనంటాయి మౌనం ఆలోచనను ఎగరేస్తే మాట నిష్టూరాన్ని వదుల్చుకోలేకపోతుంది పాట పరవశాన్ని చుట్టుకుంటే అక్షరం సృజనలో ఇమిడిపోతుంది ఆకలి అవమానాన్ని దిగమింగితే అసమానత పోరాటాన్ని దించుతుంది వైరుధ్యాలన్నీ లాగటం మనిషికి కొత్తేమీ కాదు కానీ సాగక కొన్ని,మనసాగక మరికొన్ని మోహమాటపెడుతుంటాయి ఉన్నవాడు ఉన్నది చాలక లేనివాడు దారే తోచక కలలకు పాలిష్ చేస్తుంటే మొహందాచుకోలేని మధ్య తరగతి జీవి మాత్రం జీవితం నుంచి పారిపోతుంటాడు - సి. యస్. రాంబాబు
Read More

మువ్వన్నెల జెండా

మువ్వన్నెల జెండా స్వాతంత్ర్య భారతావని లో నాటి కలలు.... నేటి కడలి అలలలా ... ఉవ్వెత్తున ఎగిడిపడుతూనే ఉన్నాయి... నేటికి తీరం చేరలేని ఉత్తుంగ శృంగాలై.... అభివృద్ధికి ఆమడ దూరంగా నిలిచి... అరచేతిలో వైకుంఠం చూపి ఉదరగొడుతున్నారు ఉపన్యాసాలు.... రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా... సాక్షిగా .... ఏ కల.. నిరుద్యోగ నిదుర స్వప్నాలలో కడతెరిపోయిందో... ఎవరికెరుక...? పాల బుగ్గల మీద నీటి చారికలు ఎవరు చూశారు బాల కార్మిక వ్యవస్థ ఎన్ని కలలను మింగేసిందో... ? కలలన్ని కల్లలై... కన్నీటి సుడిగుండాలై... ఎన్ని బతుకల ఆశలను చిదిమేసిందో...! అయిన ఆగని కలల సంద్రం మరెన్నో స్వప్నాలను సృష్టిస్తునే ఉంది...... చేరుకోవాలనే సంకల్పంతో.... - కవనవల్లి
Read More

స్నేహపరిమళం

స్నేహపరిమళం ప్రయత్నిస్తే దొరకదు ప్రతిఘటిస్తే ఉండదు ప్రతిధ్వనించే స్వరమై పలకరించాలంటే హృదయం పులకించాలంటుంది జీవితాన్ని తడిమి వేదనలను తరిమి వాదనలను పొదిగి త్యాగాన్ని నిలిపే స్నేహం నిత్యమై నిలిచేటి సత్యం దాపరికాలొద్దని రాచరికాలొద్దని పరాచికమై పరవశమై సురభిళ పరిమళమై వ్యాపించేదే స్నేహం మిత్రులకు మైత్రీదినోత్సవ శుభాకాంక్షలతో - సి. యస్. రాంబాబు
Read More

స్నేహమేరా…. జీవితం….

స్నేహమేరా... జీవితం... భావనే నీవైతే భావం నేను భుజం మీద నే వాలి పూల వానలా రాలి నీవుంటే వేరే కనులెందుకు లేకుంటే వేరే బ్రతుకేందుకు మురిపించే మురళి గానం లా బాపు రమణ, కుచేల కృష్ణ లా స్నేహం ఒక భావుకత అయితే నీ లో నేను నా లో నీవు చేయీ చేయీ కలిపి ఓల్గా నది ఇసుక తిన్నల్లో కిన్నరసాని పరువళ్లు లలో పెన్నా నది ఒడ్డున గండి కోట గుండెల్లో ఓ ప్రియ మిత్రమా అని పలకరిస్తే మళ్ళీ మళ్ళీ ఎన్ని సార్లో పులకరించే, పలకరించే స్నేహమా.... అందుకే నీవుంటే వేరే కనులెందుకు అనిపించే దేర్యమా.... స్నేహం రుచి చూపడానికి భువి కి దిగిన భగవంతుని రూపమా.... ఇదే వందనాలు విశ్వం లో వెదజల్లి నా వెన్నెల వందనాలు. స్నేహితుల దినోత్సవం సందర్బంగా అందరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. - అల్లాఉద్దీన్
Read More

‘మనీ’ షి

'మనీ' షి మానవత్వం ఏదో బూజు పట్టిన సిలకొయ్యకు వేలాడుతుంది దయనీయ స్థితిలో.... ఎవరు ఎవరు ఎవరక్కడా....? నన్నిలా...అనవసర ముసలికంపు పట్టించి... అక్కరలేని సామానుల గదిలో తోశారేం...? తెరలులేని గదిలో లయకార శబ్దవాణి... తెలియజేస్తుంది... మనిషి కానీ 'మనీ'షి అస్తిత్వం ఇంకా కొనసాగుతుందని.... ఆహా ఓహో... పాడే కట్టిన పాత నోటైన పెళపెళమను కొంగొత్త నోటైన.... చివరికి మనిషిని చేర్చేది స్వార్ధమను సమాధిలోకే - కవనవల్లి
Read More

విహారం

విహారం వంటరి ఆకాశాన్ని ఈదే విహంగం ఆశను మోసే సారంగం విను వీధుల విహారియై ఊపిరి పోసుకుంటుంది రేపటి ధ్యాస లేదు నిన్నటి చింతా లేదు నేటి పలుకై రాగాలు పోతుంది భవిష్యత్తు బెంగున్న మనదేమో దిగులు విహారం - సి. యస్. రాంబాబు
Read More

త్రివర్ణం

త్రివర్ణం దివినుండి భువికి దిగివచ్చిన ధ్రువతారలో నిరంతరం ప్రకాశించే సూర్యచంద్రులో ఏ కఠోర శ్రమలో ఈ మట్టిలో వెలసిన పరిమళాలో దేవుడు పంపిన ఆయుధాలో ఉద్యమ వీరులో ఉదయ కిరణాలో భారత మాత ముద్దు బిడ్డలో భారత మాత ఉక్కు పిడికిళ్లో మహనీయులో త్యాగమూర్తులో సామాన్యులో అనితర సాధ్యులో పోరాట వీరులో గెలుపు బాటలో దేశం కోసం దేశ స్వాతంత్య్రం కోసం స్వతంత్ర పోరాటంలో పోరాడి రక్తం చిందించి అశువులు బాసి తెల్ల దొరల నుండి విముక్తి కల్పించి దేశానికి స్వాత్రంత్ర్యాన్ని అందించారు దేశ నడిబొడ్డున ఎర్రకోట పై త్రివర్ణ పతాకమై ఎగిరారు భూగోళమంతా చరిత వినిపించేలా ధ్వనింపచేశారు విశ్వమంతా విజయాన్ని ఎలుగెత్తి చాటారు ప్రాణాలను పనంగాపెట్టి రక్తాన్ని ధారపోసి హింసను పాతిపెట్టి అహింసను బయటకు తీసి స్వతంత్రాన్ని సాధించారు త్రివర్ణ జెండాను ఎగరవేశారు ప్రతి భారతీయుని గుండెలో కొలువై ఉన్నారు ఏడుపదులు దాటిన పండుగ దేశమంతా వేడుకై మెరువగా నేల…
Read More

అంతరాత్మ

అంతరాత్మ విసుగనిపించిన ప్రతిసారి లోలోపల సంచరిస్తుంటాను జీవితం పొరలన్నీ చిక్కుముళ్ళయ్యాయేమోనని అనుమానంతో చూస్తుంటాను కారణంలేని అశాంతి పాములా చుట్టుకునుంటుంది కాలం అలిగి ఆగిపోయినట్టుంటుంది జడలువిప్పుకున్న మర్రిమానులా వంటరితనం వికటాట్టహాసం చేస్తుంటుంది తప్పెక్కడుందో తెలీదు కాల్చేద్దామంటే నిప్పెక్కడుందో తెలీదు వ్యాధి, మనోవ్యాధి ఏకకాలంలో ఏలికలై పీడిస్తుంటాయి చికాకులను సానబెట్టి అందరికీ దూరమవుతావు జీవితాన్ని అలా నానబెట్టి లోలోపల తనిఖీ అధికారిలా సంచరించినా సంయమనం లేని నువ్వు ఏ ముళ్ళను తీయలేవు చిక్కుముళ్ళను విప్పలేవు అంతరాత్మ కోడై కూస్తుంటుంది - సి.యస్.రాంబాబు
Read More