Month: October 2022

నీ తోడుగా నేనుంటా.!

నీ తోడుగా నేనుంటా.! నీ స్పర్శలో ఏదో తెలియని మాయ ఉంది నీవు తాకిన ప్రతిసారీ నాకు తెలుస్తోంది నీ పలుకులో ఏదో మత్తు ఉంది నీ కౌగిలిలో తెలియని అమితమైన ఆప్యాయత ఉంది నీ గుండెలను హత్తుకుంటే ఎంతో హాయిగా ఉంది నీ అదర చుంబనంలో‌ నాపై ఉన్న ప్రేమ ఉంది నిత్యం నను వదలక నీవు చూపే బాధ్యతలో.. నీవు నను పిలిచే పిలుపులో వాత్సల్యం ఉంది నీ ఒడిలో ఎంతసేపైనా నాకు సమయం తెలీదు నీవు లేకుంటే నాకు రోజులో క్షణం కూడా తోచదు నీ చెక్కిలిపై ముద్దాడే వేళ నీ బుగ్గల్లో కనిపించే సిగ్గు నా చెవిలో నీవు చెప్పిన ఊసులు‌.. నీ ముంగురుల సవ్వడులను నేను మరవను ఈ జన్మలో.. తనువులు దూరమైనా.. కలవని దిక్కులో మనమున్నా.. నాకోసమే నువ్ పుట్టావని కలగంటూనే ఉంటా.. జీవితాంతం 'నీ తోడు' గా నేనుంటా.! - ది…
Read More

నీ తోడు కోసం

నీ తోడు కోసం నీ మాట వినిపించని క్షణానా నీ నవ్వు కనిపించని క్షణనా నీ రూపాన్ని మదిలో దాచుకుని నీ మాటలన్నీ ప్రోగు చేసుకుంటూ నీ పలుకులన్ని మననం చేస్తూ నీలో నన్ను చూసుకుంటూ నాలో ఉన్న నిన్ను, నీలో ఉన్న నా కోసం నీ మాటల కోసం నీ తలపుల నావ నాలోనా ప్రవశింపగా నే వేచి చూస్తున్నా నీ కోసం నీ తోడు కోసం... - అర్చన 
Read More

ప్రేమ సదనం

ప్రేమ సదనం హిమజ చాలా కాలం తరువాత సంతోషంగా నవ్వుతూ ఉంది. ఆ నవ్వులో సంతృప్తి ఉంది. చాలా కాలంగా నెరవేరని‌ కల నెరవేరిందన్న ప్రశాంతవదనం స్పష్టంగా తెలుస్తుంది. అది చూసిన భర్త విఘ్నేష్ ఏమిటి ఈ ప్రశాంతత. ఎందుకింత సంతోషం‌ మేము కూడా తెలుసుకోవచ్చా అంటాడు. అంతలో పిల్లలు భారతి, శాంతిలు డాడీ మీకు ఇంకా తెలీదా అమ్మ సంతోషానికి కారణం. మాకు తెలుసుగా...కానీ మీకు మాత్రం‌ చెప్పం‌ అంటూ ఆటపట్టిస్తారు. అదంతా చూస్తూ మురిసిపోతున్న హిమజ విఘ్నేష్ చేతులు పట్టుకుని చాలా థాంక్స్ విఘ్నేష్. నెరవేరదనుకున్న నా కల‌ నెరవేరింది అంటుంది. హే... హిమజ ఊరుకోవోయ్ అంతా నేనే చేసినట్లు మాట్లాడకు.‌ ఏ స్వార్ధం లేకుండా కన్న కల ఇది. నెరవేరదని‌ ఎలా అనుకుంటావ్. ఒకప్పుడు మనకంటూ ఎవరూ లేరు. ఇద్దరం అనాధలుగా పెరిగినవాళ్ళం. పెళ్ళయ్యాక ఒకరికొకరమనుకుని తోడునీడయినవాళ్ళం. ఇదే సంతోషం ఆనందం మరికొందరికి అందివ్వడమో లేక మనకంటూ…
Read More

కలలతీరం

కలలతీరం కలలతీరాల చేరికకై ఆశలనావలో ప్రయాణమై మౌనం చుక్కానితో సంఘసాగరాన్ని తరించే మగువగుండెలోయ లోతులెవరికి తెలుసు? అగ్గికొండలన్నీ అంబుధి అడుగునే అడుగంటి పోతుంటే.. నిప్పులుకక్కే లావా ఉప్పునీట కలసిపోతుంటే... స్త్రీ "వివక్ష"ను సులువుగా చెప్పడం ఏ ఎఱ్ఱనకైనా... ఏ శ్రీనాథునికైనా సాధ్యమా! రాత్రి కనే కలలన్నీ ఉదయరాగపు నిట్టూర్పులై గాలిలో కలిసిపోవాల్సిందే.. ఆర్ధిక స్వాతంత్ర్యంలో స్త్రీ పెనం మీద నుంచి పొయ్యిలో పడి కలలు కనే సమయాన్నే కోల్పోయింది.. కలలన్నీ కల్లలే అని తెలిసినా, కనుకనుమలలో కలల సౌధం నీలి నీటి పరదాలు పరుస్తూ మళ్లీ మళ్లీ ఆహ్వానిస్తూనే ఉన్నాయి... - సలాది భాగ్యలక్ష్మి
Read More

కూలిపోతున్న కలల సౌధం

కూలిపోతున్న కలల సౌధం చుట్టూ చీకటి అలుముకున్న నా దేశం‌ కులాల చిచ్చులో.. మతాల ఉచ్చులో నిత్యం రగులుతోంది.. నేను ఎరిగిన.. నేను కలలుగన్న నా భరతావని‌ సుందర సౌధం కూలిపోతోంది. ఆడబిడ్డలకు రక్షణ లేక.. దౌర్జన్యాలకు అంతం రాక.. విసిగివేసారిన కన్నీటి బతుకులకు దిక్కేది.. వీధికొక్కడై వికటాట్టహాసం చేస్తున్న మానవ మృగాల చేతిలో సమిధలవుతున్న ప్రాణాలకు దిక్కేది. అన్నదాత ఆత్మహత్యలే అభివృద్ధి అనుకోవాలా.. నిరుద్యోగమే ఆస్తిగా భావించాలా.. ఆకలిదప్పుల‌ జీవితంలో నిత్య సమరాన్నే గెలుపుగా చూడాలా. పెరుగుతున్న ధరలకు.. ఉప్పు, ‌పప్పులకే చాలని జీతాలతో.. రేయింబవళ్ళు చెమటోడ్చినా ఇల్లే గడవని రోజులతో.. ఎవరిని నిందించాలి.. ఏమని ప్రశ్నించాలి. కష్టాలకు ఓర్చుకుని.. కన్నీళ్లను దిగమింగుకుని.. ఆలుబిడ్డలతో బతుకు బండిని‌ ఈడ్చుకుంటూ భారమైన జీవితాన్ని గడిపేస్తున్నాం‌ ఇలా మనం. ఇదేనా లోకం మెచ్చిన మన పుణ్యభూమి.. ఇదేనా వేదం పుట్టిన మన ఖర్మభూమి.. మోడు వారిన మన జీవితాల్లో మరలా ఆశలు చిగురించేనా..…
Read More

హృదయాకాశపు వెలుగు

హృదయాకాశపు వెలుగు అతనో అగ్ని గోళం అతనిదో సందడి వేషం అతనో నిరంతర యాత్రికుడు నిలకడలేేని మానవ జీవన నావికుడు కాలానికి మిత్రుడీ రోదసీ చక్రవర్తి ఈనిత్య సంచారి నీడలో రోదించే చరితను ఓపికపట్టమంటాడు విజయాలు ఓటమిల బాటలో అలసిన జీవితాలకు ఓపిక నేర్పుతుంటాడు దేవుడున్నాడో లేదో అతను మాత్రం కనిపించే దైవం కని పెంచిన అమ్మంత సత్యం నిత్యగీతమై మనలో పలుకుతుంటాడు ఉదయాన్నే వెలుగై సాయంత్రానికి సంబరమవుతాడు కనిపించని సాయమై కలలను పంచే న్యాయమై వెంటే ఉంటాడు అగాధాల రాత్రులలో జీవితం జారిపోతుంటే ఉదయమై చేయందిస్తాడు మధ్యాహ్న మార్తాండుడై మాడ్చేసినా కలతలను ఊడ్చేసే హృదయాకాశపు వెలుగతను - సి.యస్.రాంబాబు
Read More

బతుకు దివిటీలు

బతుకు దివిటీలు ఓ... మావ..! నిన్నే.. ఇంతన్నావా.. ఐనా నా గోల నాదే గానీ నా గోడు నువ్వెప్పుడు ఇన్నావు గనకా.. ఓసోస్.. ఏటే..నీ బాధ.! పొద్దుపొద్దున్నే.. ఇప్పుడేటయ్యిందని.. సెబితే ఇంతా కదేటి.! ఏటి సెప్పమంటావయ్యా మగడా.. కాపురానికొచ్చినకాడినుంచీ సెబుతూనే ఉన్నా.. నువ్ ఇంతానే ఉన్నావ్. ఐనా నువ్వేం మారావ్.. మనిల్లేం మారింది. దసరా ఎళ్లిపోనాది.. దీపాలి వచ్చేసినాది.. ఆ ఉత్సవం.. ఈ సంబరం అంటూ ఊరంతా సందడే. మనింట్లో తప్ప.. మనకేదయ్యా ఆ ఏడుక.. ఇంకెప్పుడయ్యా వచ్చేది ఆ వెలుగు.. మన కట్టాలు తీరవా.. మన బతుకులు మారవా.! ఏం సెప్పాలనుకుంటున్నావో కాసింత అర్ధమయ్యేలా సెప్పే లచ్చిమి.. ఏటేటో అనేసి ఓ సతాయించమాక.! నీకేటీ అర్థం కాదు.. నా ఖర్మ.! నీకు గుర్తుందా మామ.. మన మనువయ్యేనాటికి నీకాడ రెండు కాడెద్దులుండేవి, మూడెకరాల నేలుండేది. వత్తా వాత్తా నేను కాసింత బంగారం మెళ్లో ఏసుకొత్తిని. ఆ యాల ఇయన్నీ సూసుకుని…
Read More

నే గెలిచి ఓడా

నే గెలిచి ఓడా కళాశాల.. అది ఓ అందమైన రంగుల ప్రపంచం.. ఎన్నో కొత్త పరిచయాలకు.. మరెన్నో అనుబంధాలకు నిలయం.. అలాంటి కాలేజీలో అడుగుపెట్టిన మొదటిరోజు నుంచే మొదలైంది మన తగవు. గిల్లికజ్జాలతో ప్రతిక్షణం కొట్టుకుంటున్న‌ క్రమంలో నాకే తెలియకుండా ప్రేమ చిగురించి, నా మనసును నీ ముందు పరిస్తే.. ఇష్టమంటూనే నువ్వు తిరస్కరించిన క్షణం‌ నా ప్రేమ పరీక్షలో మొదటిసారి ఫెయిలయ్యాను. ఎన్నో పరీక్షలకు ఎదురొడ్డి నిన్ను దక్కించుకున్న రోజు లోకాన్నే గెలిచినంత సంతోషం నా మదిని ఆకాశంలో ఎగిరేసింది. తరగతి గదిలో ప్రతి బెంచీ, కాలేజీ గుమాస్తా దగ్గర్నుంచి ప్రిన్సిపల్ వరకూ ప్రేమకు సాక్ష్యమయ్యారు. ఒకే ప్రాణంగా విహరిస్తున్న మనల్ని చూసి ఆ విధి కుళ్లుకుందేమో.. ఒక్కసారిగా నిన్ను నానుంచి దూరం చేసి ప్రేమలో మళ్లీ ఓడించింది. నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయిన నీకోసం‌ ఎన్నో ఏళ్లు ఎదురుచూశాను. నీ ఆచూకీ సైతం తెలియక పిచ్చివాడినై నీ రాక…
Read More

రాధా మాధవం

రాధా మాధవం రాధ మనసు కన్నయ్య వ్యక్తిత్వం తెలుసుకుంటే రాధామాధవుల ప్రేమ తత్త్వం కొంతన్నా అవగతం అవుతుంది.. అందుకే వారి ఇరువురి నడుమ ప్రేమ తరతరాలకే కాదు, యుగ యుగాలకి అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపిస్తుంది. ప్రేమలో ఔన్నత్యం తెలియాలంటే రాధ సమర్పణా భావం, ఆర్తి తెలియాలి... అంతటి ప్రేమకు ఆ కన్నయ్య మాత్రమే అర్హుడు. అవ్యక్తమైన అనురాగం అవ్యాజమైన ప్రేమ వర్ణనాతీతమైన వాత్సల్యం చిలిపి అల్లర్ల చిన్మయానందం రమ్య మనోహర రాసలీల క్రీడావినోదం అసలైన ప్రేమకు అపురూప నిర్వచనం... అలాంటి ప్రేమ జీవితంలో ప్రతీ మనసున్న మనిషి పరితపించేలా రాధామాధవ తత్వం తెలియజేస్తుంది... - భాగ్యలక్ష్మి
Read More

దురాశ

దురాశ కష్టపడకుండానే కలిమి చేతికందాలని పక్క వాని పనులు చూసి ముక్కున వేలేసుకుంటి అనుమతులు లేని సరుకు లెందరికో అమ్మినాడు గుట్టు రట్టు గాకుండా కోట్లు కూడబెట్టనాడు ఎన్ని పనులు చేసినా ఎవ్వరికీ దొరకడాయె అవే పనులు నేను చేసి ఎదగాలని అనుకున్నా తప్పు పనులు చేసి దొరికి చిప్ప కూడు తింటున్నా కూలినాలి జేసి కొంత డబ్బు కూడబెట్టుకుంటి ఉన్న డబ్బు వడ్డికిచ్చి అసలు రాక ఆరిపోతి కష్టపడకుండానే కలిమి చేతికందాలని కల్తిపాల వ్యాపారం కలిసి వచ్చుననుకుంటి కల్తిపాలు తాగినోడు డబ్బులన్ని ఎగగొట్టె పైసమీద ఆశతోటి ఉన్నది పోగొట్టుకుంటి కల్తీసరుకమ్మగా కానిస్టేబులు పట్టే నకిలీ నోట్ల దంద ఆదాయమనుకుంటి గంజాయి పండిస్తే గుంజీలు తీయించె నాటు సారా పెడితే డ్రమ్ములన్ని పగులగొట్టె కాని పనులు చేశానని కారాగారానబెట్టె ఎండామావుల్లో ఏరున్న దనుకుంటి కుండలోని నీళ్ళన్నీ ఒలుకబోసుకుంటినీ అన్యాయపు పనులు చేస్తెఇలాఆరిపోతానని కష్టపడ్డ సొమ్మే మనకడుపు నింపునని ఆలస్యంగా తెలుసు కుంటి…
Read More