Month: November 2022

ఉషోదయo

ఉషోదయo కొక్కోరోక్కో అని కోడి కూసే వేళ... బామ్మ నిదురలేచి పొయ్యి అలికె వేళ..... అమ్మ లేచి ముంగిళ్లో ముగ్గు పెట్టు వేళ... నాన్న లేచి నట్టింట్లో నడిచిన వేళ.... ఉషస్సు వొలికె ఉషోదయ కిరణాల ఉలుకులు.... పట్టణ ప్రపంచ బంధం కన్నా.... హడావిడి లేని వేకువజాము రేయికి నిద్రలేచి.... బిక్కు బిక్కుమని సమయాన్ని వృద్ధ చేయకుండా తమ పనులకై సిద్ధం అయి... పాపయ్య పొలంకి వెళ్లి... నర్సమ్మ నీళ్ల రేవుకు వెళ్లి.... కోటమ్మ కోళ్లను వదలాలా వద్దా... అని అయోమయం ఆలోచనల్లో... ఉషోదయ కిరణాలను దాటి..... ఉదయ కాంతి కోసం వేచి చూసే.... తూర్పున ఉదయించే సూర్యకాంతి కిరణాలు గుమ్మంలోకి తెచ్చే కొత్త వెలుగు.... చీకటిని అదిమి జీవరాశి మనుగడును మొదలు పెట్టే ఈ ఉదయ కాంతులు.... - తోగరాపు దేవి
Read More

ఉదయం

ఉదయం పువ్వులు వికసించే నవ్వులు విరబూసే చెలి మోమును చూడగ ఈ ఉదయకాంతిలో... పూలను కిరణం తాకగా నా చెలి బుగ్గను నిమరగా పక్షులు కిల కిల నవ్వేను ఈ ఉదయ కాంతిలో.... ఎర్రగ పండేను తూర్పు దూడలు చేరెను పొదుగున జీవన చక్రం మొదలగున ఈ ఉదయకాంతి తో.... అలసిన మనసు చెదిరిన సొగసు వాడిన పువ్వ కోరెను ఉదయకాంతిని. - హనుమంత
Read More

సార్ధకత చేకూరిన క్షణం

సార్ధకత చేకూరిన క్షణం నిత్యం చేసే జీవనయానంలో తారసపడే అమానవీయ ఘటనలెన్నెన్నో రోజూ చదివే దినపత్రికలు మోసుకొచ్చే అఘాయిత్యాల అకృత్యాలెన్నో ఇంటి నుండి బయటకి రాగానే తారసపడే ఆకలికై అలమటిస్తూన్న అభాగ్యులెందరో కారణాలేవైనా నడిరోడ్డున పడ్డ మధ్యతరగతి జీవితాల చేదు అనుభవాల సంఘటనలెన్నెన్నో కులమనీ మతమనీ ప్రాంతమనీ వేర్పాటువాదుల విధ్వంస చిత్రణలెన్నో చుట్టూ సభ్యసమాజంలో కనులముందే జరిగినా నాకెందుకనుకునే మనుషుల నడుమ అనాధల ఆర్తనాధాలని మనసుతో వింటూ చేయూతనిచ్చు స్థోమత లేకున్నా సాయం చేస్తూ ఉన్నంతలో పక్కమనిషికి సాయమందించిన క్షణంలో మనసున కలిగే ఆనందం అనుభవైకవేధ్యమే అపుడు ఆ క్షణాన మనిషి జన్మకు సార్ధకత లభించినట్లే... నీ జన్మకు పరమార్ధం చేకూరినట్లే... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

జ్ఞాన సముద్రుడు – కథానిక

జ్ఞాన సముద్రుడు - కథానిక జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్నట్టు సీతారాముడికి హైదరాబాద్ మహానగరంలో ఆటో డ్రైవర్ లను విచారించటం ఇష్టం. విచారించటమంటే పోలీసు విచారణ కాదు. క్షేమసమాచారాలు కనుక్కోవడం. అనంతరం తన జ్ఞానాన్ని పంచడం అతని అలవాటు.. పొదుపు చేయటం నుంచి గుట్కా మానివేయటం వరకు చిట్కాలు చిటికెలో చెబుతుంటాడు. ఆ విధంగా ఆతని జ్ఞాన సముద్రం అంతులేనిది. ఇది తెలిసిన వాళ్లెవ్వరూ ఈదే ప్రయత్నం చెయ్యరు. ఇవాళ సీతారాముడు కవాడిగూడాలో ఆటో ఎక్కాడు, సికింద్రాబాద్ లోని సోదరుడింటికి వెళదామని. యథాప్రకారం చిత్రగుప్తుడిలా తన జ్ఞానచిట్టా తీశాడు. ఆలోపలే ఆ డ్రైవర్ అందుకున్నాడు. "సార్..గూగుల్ పే చేయండి సర్ క్యాష్ తీసుకోను.." సీతారాముడు కంగు తిన్నాడు. "ఎందుకని " "ఏం లేదు సార్, చిల్లరుండదు" "గూగుల్ పే అయితే అకౌంట్ లో పడిపోతుంది" "ఇంతకీ అకౌంట్ ఎవరిది" "ఇద్దరి పేరునున్నది సార్. జాయింట్ అకౌంట్ అన్నట్లు." సీతారాముడు ఆత్మ…
Read More

మావూరి పాఠశాల

మావూరి పాఠశాల పిలిచింది పిలిచింది మన పాఠశాల మన పాఠశాల మనందరినీ మరొక్కసారి మనసారా కలుసుకోమని అద్భుత అవకాశం ఇది మన ఆత్మీయ సమ్మేళనం అక్షరాల అనుబంధమై మరువలేని మధుర జ్ఞాపకాలు జన్మనిచ్చిన ఊరిలో జ్ఞాన మిచ్చిన బడిలో విలువలు నేర్పిన గురువులు దారిచూపిన అక్షర జ్యోతి చెరిగి పోని స్నేహ బంధం అనుభూతుల అంతరంగం చదువులమ్మసంస్కారము గతమైనా భవితైనా అండ దండలై నిలిచేది మనబడిలో నేర్చిన అడుగులు పరవశించే హృదయంలో పరితపించే మమకారం తీపి గుర్తుల ఉత్సాహం వెల్లివిరిసెను సంతోషం చీకటి వెలుగుల జీవితాన చిన్ని ఆశల ఆనందం పిలిచింది పిలిచింది మన పాఠశాల మన పాఠశాల మనందరినీ మరొక్కసారి మనసారా కలుసుకోమని ...? - జి జయ
Read More

మళ్ళీ జన్మిస్తా …

మళ్ళీ జన్మిస్తా ... వెచ్చని కిరణాల తాకిడితో ఒళ్లు విరుచుకుంటూ సిగ్గుల మోగ్గయి పోతూ, అతన్ని చూసి మొగ్గలా ముడుచుకు పోతూ అతన్ని కను చివరల నుండి ఓరగా చూస్తూ రేయంతా చల్లని రెక్కల చాటున దాగినా ఇప్పుడతని చూపుల తాకిడి అంతకంతకూ ఎక్కువవుతుంటే, ముడుచుకున్న మొగ్గయిన తాను విస్తరిస్తూ, రెక్కలు విచ్చుకున్న పక్షిలా అతని చూపంతా తన శరీరం అంతా ప్రసరించాలనే ఆశతో అతన్ని తన వైపుకు తిప్పుకోవాలనే తపనతో తన వొళ్ళంతా కళ్ళతో అతన్నే చూస్తూ, అతని చూపంతా మరొకరి వైపు తాకకుండా తను చేసే ప్రయత్నమంతా చేజారి పోయి చివరికి అతని చూపులు విశ్వమంతా వ్యాపించి తనకు దక్కకుండా మరో చోటికి కదలడం తో అతన్నాపలేక, మౌనంగా కన్నీరు కారుస్తూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక మధన పడుతూ అతను దూరమవడం తో మరలి రా ప్రియా అంటూ మౌన భాషలో పిలుస్తున్నా పలక, నిర్ధయగా వదిలి పోతున్న…
Read More

అగ్నిపూలు

అగ్నిపూలు నిదుర తెరలు కప్పుకుందామని నానా అగచాట్లు పడుతూ నేనుంటే నీవేమో ఇలకు దిగిన వెండి చందమామలా మారి సిగ్గుపూల మొక్కల నడుమ దాగి అందీఅందక ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటావు ఎడారి గుండెలోన కలలే ఫలించి నా చెంత చేరిన నిన్ను చూస్తూ ఎన్ని కాలాలు... ఏ సవ్వడి ఆగమన సూచనలు ఇవ్వకుండా ఎలా గడిచిపోయాయో లెక్కేసుకుంటున్నాను. సప్తవర్ణాల హరివిల్లుకు ఊహల ఊయలలే గట్టిగా కట్టి మూడేసుకున్నానేమో మరి చిగుర్చిన చెట్టునై నీ రాక కొరకు వేచిచూస్తున్నా కోరివచ్చె కొమ్మ దరిచేరి ఏలుకోమ్మ శిశిరాలు ఎన్ని ఏకమై నా ఆశలు నిట్టనిలువుగా రాల్చిన గ్రీష్మంలో నీ కోసం వికసించే అగ్నిపువ్వునై ఎర్రని సూర్యుని సాక్షిగా నా జతగా నీవుంటే.... ఆరు ఋతువులేకమైన ఆమని మనదే సుమా - సాయిప్రియ బట్టు
Read More

ప్రేమ

ప్రేమ నీళ్ళ బావి కాడ నాకోసం ఉండావు బస్టాండు కాడ నాకోసం ఉండావు ఆరోజు గుడికాడ ప్రసాదం కూడా ఇచ్చినావు మొన్న కొట్లాటలో నా సెయ్యి పట్టుకున్నావు పిల్లలతో ఆడుకుంటుంటే నన్ను సూసి నవ్వినావు గడ్డివాము కాడ గడ్డిమోపు ఎత్తనీకి పిల్చినావు రెడ్డిగారి పొలంలో నాకు బువ్వ లేకుంటే నువ్వేగా పెట్టింది సంతకు పోయినపుడు పెద్ద వానవొస్తే నువ్వేగాగొడుగు పెట్టింది మా అమ్మకు ఒంట్లో బాలేదు అంటే నువ్వే సాయం సేసింది ఏమో అవన్నీ నాకు తెలీదు నువ్వు కావాలంతే ఇదిగో ఇప్పుడు కూడా అటు తిరిగి నవ్వుతాండావు ఈరోజు పిల్లని సూడనికి మీ ఇంటికి వచ్చినారంట సారాయి దాసప్ప సెప్పినాడులే ఒరే నీ ఎదవ నన్ను సూసుకొనేకి కాదురా మాయక్కను సూడనికి - హనుమంత
Read More

ఆమని మనదే సుమా!

ఆమని మనదే సుమా! నిత్యం కనుల కుహరాన నెలవై ఉంటావు అడుగడుగునా నాకై తపిస్తుంటావు ఎంత వెదికినా అందాలకి కొదవ రానంటావు ఇలకు దిగిన వెండి‌చందమామ నంటావు నెచ్చెలీ! ఏనాటి పుణ్యమో నీ సఖుడనైతినిగా... అనుక్షణం తపించే నా తపనను కానరావా నీకై పరితపించే నీ సఖుని‌ బాధ మాన్పగ రావా ఎడారి గుండెలోన కలలే ఫలించి అలమటించే నా హృది వేదన తీర్చగ రావా ప్రాణ సఖీ! నీ నాధుడ నేనంటిని‌విగా.... సఖా.! నే నీ నెచ్చెలినే వేచియుంటి గత స్మృతుల తలపులే ప్రాణముగా నిను చేరి సుఖించు క్షణాలు లెక్కిస్తూ కోరివచ్చె కొమ్మ దరిచేరి ఏలుకోమ్మ నీ ముంగిట చేరి మైమరచిపోయెద సఖా! ఎడబాటులెరుగని కాలాలు మనవవగా కలతలెరుగని అనుబంధమవగా తరలి వచ్చిన నీ హృదయేశ్వరిని ఏలుకొని సుఖమయ జీవనమున తరియించెదము చెలికాడా ఆరు ఋతువులేకమైన ఆమని మనదే సుమా - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

నల్లతోలు

నల్లతోలు ఎండలో ఆడుతుంటే.... నలుపెక్కి పోతావని కొట్టింది అమ్మ చిన్నవాడిన చితకవాడిన అందుకే పెట్టాను బుంగమూతమ్మ...... అలక మీదకెక్కి అన్నాను ఇక మాటడానమ్మ అరెరే ఏమైంది...? హరీ పిడుగా అల్లరి బుడుగా అంది వంగిన నడుమును వంచి బామ్మ.... మలేమో బామ్మ....ఎండలో తిరిగి నలుపెక్కితే... సిగనాతో పెళ్లి చేయానని...చెప్పింది అమ్మ తెల్లగా ఉంటేనే అందమన్నది.... నలుపు అందవిహీనమన్నదమ్మా ఆ రాధమ్మా.... అట్లగాయితే రాములోరి గుళ్లో నువ్వు చెప్పిన హనుమంతుడు సముద్రాలు దాటినా తెల్లగా ఉన్నాడేమీ? అని నా చిట్టి బుర్ర ఆలోచనమ్మా వాడి ప్రశ్న విని ముక్కునా వేలేసి.... బుడుగా హరీ పిడుగా... నలుపు నారాయణుడు మెచ్చురా...రాములోరు కృష్ణులోరు నలుపెనన్నది నలుపే అందమన్నది బోసి నవ్వుల బామ్మ.... అనక మొట్టికాయలు వేసింది.... నాకు కాదోయమ్మా...అవి తిన్నది మాయమ్మా రాధమ్మా.... అందుకే కొన్నాను నల్లనల్లని కాటుకమ్మ.... ఇచ్చాను సిగనాకు... అద్దంలో దిద్దుకుని వచ్చిందమ్మా.... చూద్దును కదా అందం సంగతి దేవుడెరుగు... కాటుక కళ్ళతో…
Read More