Month: December 2022

చెరగని చిరునవ్వు సాక్షిగా

చెరగని చిరునవ్వు సాక్షిగా చిద్విలాసపు నిండగా చిరునవ్వు సాక్షిగా రోజు గడుచును సాఫీగా విరుల పరిమళాల నింపగా నీకు తోడై నిలిచేది నిజంగా ఎల్లప్పుడూ అదీ వేడుకగా అందానికే అందమై నిలుపుగా ముఖారవిందము ఒంపుగా మధురం చేయును హాయిగా పలికే పలుకులను ముందుగా విలువను పెంచును మెండుగా ఎదుటివారికి కన్నులపండుగగా అది పని చేయును ఔషదంగా పని కొచ్చును అపార ధనం గా అపుడే వుండును ఉల్లాసంగా నడిపించును సరికొత్త శక్తిగా నీకు నింపును ఎల్లప్పుడూ శక్తిగా అందుకోవాలి అందరు చెరగని చిరునవ్వుతో దేవుడిచ్చిన వరంగా .......? - జి జయ
Read More

అంతరంగ మథనం

అంతరంగ మథనం మనిషి నడవడికకు ఆయువుపట్టు అంతరంగ ఆత్మ పరిశీలన మంత్రం! ఆశపడే మనసుకి ఆకర్షణలే ఆవహించిన పలికే భావాల మాటలు నిరంతర పర్యవేక్షణలో మూగ భాషల అంతరంగ మథనం నిక్షిప్త సందేశాల యాతనలో తప్పు ఒప్పుల తర్కంలో వెలితి మర్మాల వేదనలో గతి తప్పిన మనసుకు గాడి లోకి తెచ్చేది అంతరంగ మథనం హితమే తెలియని సమరంలో చేజారిన చేష్టలకు నిలువెత్తు సాక్షిగా నిన్ను చూపును నిదర్శనంగా అదే అంతరంగ మథనం రాత్రి పగలు వలె మంచి - చెడుల హృదయాంతరాల పరీక్షలు మనిషికి అవే అవకాశ మిచ్చును పురోగతికి ఆవిష్కరణ వంటివి అంతరంగ మథనం అద్భుత ఫలితాలనిచ్చును మనకు క్షీరసాగర మథనం వలె .......? - జి జయ
Read More

నిస్సహాయత

నిస్సహాయత మధ్యతరగతి చిక్కుల్లో నిరాశ, నిస్సహాయతలో అలల్లా ఎగసే ఆలోచనలలో అణుగారిన బతుకుల్లో మిగిలే అంతరంగ మథనం వృద్దాప్యంలో ఆదరించని పుత్రుని ఆదయవ్యయాలను ఆకలింపుచేసే మనసులో మిగిలే అంతరంగ మథనం కని, పెంచి పోషించి స్కూల్ కి పంపడానికి వెనుకాడే ఆడపిల్లని మెట్టినింటికి వెళ్ళినప్పుడు కలిగే అంతరంగ మథనం బాధ్యతలు ఎరుగని తండ్రి బిడ్డ రోడ్డున పడ్డపుడు చుట్టాలు చీదరించినపుడు కలిగే అంతరంగ మథనం చదువుకునే రోజుల్లో శ్రద్దలేక పనిచేసే వయస్సులో బాధ్యతలేక ఇబ్బంది కలిగినపుడు అమ్మనాన గుర్తొస్తే కలిగే అంతరంగ మథనం - హనుమంత
Read More

చెరగని చిరునవ్వు సాక్షిగా

చెరగని చిరునవ్వు సాక్షిగా ఓ మానవా..! పసిపాప వయస్సు చూడని మానవమృగమా... కామవాంఛ నెత్తికెక్కిన కామమృగమా... వావివరుసలెరుగని క్రూరమృగమా... అవనివంటి అతివ ఆగ్రహపు చెరగని చిరునవ్వు సాక్షిగా మృగాళ్ల మరణశాసనం రాయును తస్మాత్ జాగ్రత్త....!! - సూర్యాక్షరాలు
Read More

అంతరంగ ఆలోచనలు

అంతరంగ ఆలోచనలు అలుపెరుగని ఆలోచన వీచికలకి జీవిత సంద్రపు కన్నీటి అలలకి అంతర్గత యుద్ధ కల్మషాలకి చిరునవ్వు వెనుక దాగివున్న కర్కశానికి నిజాయతి ముసుగులో అవినీతి వాగ్దాన వాక్కులకి మదించిన మానవమృగాళ్ల వికృత చర్యలకి జీవితసత్యమెరుగని పుస్తకమే లోకమాయె పసిమనస్సులకి అంతరంగ ఆలోచనలు మధించే నా హృదయాన్ని... ఆత్మ ఘోషించునేమో పరమాత్మ లో కలియుసమయంలో - సూర్యాక్షరాలు
Read More

అంతరంగ మథనం

అంతరంగ మథనం మనసు కడలిలో ఎగిసి పడే నా మౌన భావాల కెరటాలు నిశిలో హటాత్తుగా కమ్ముకున్న వలయాలు. అర్ధరాత్రి కన్నీళ్లను తుడిచే వీలులేని స్నేహితులు! నేనున్నానంటూ తడిమి చూసే నా కళ్ళ నీళ్లు.. నా భావోద్వేగాలను కట్టడి చేసే జలతారు పుష్పాలు.. నా అంతరంగం.. కొన్ని వేల పాలపుంతల సమూహం! నాలో ఈ అంతర్మధనం కనిపించదు మీకు ఇది నిజం! నా అంతరంగం నా ఆత్మ సంభాషణం నా భావోద్వేగం నా మనసుకు సమాధానం! - గాయత్రీభాస్కర్ 
Read More

ఇది కాదా అంతరంగ మథనం

ఇది కాదా అంతరంగ మథనం స్వప్నాల సూత్రాలతో మనసును పెనవేసుకున్న తరుణం అంతరంగ మథనమంతా మొదలాయే ఆ క్షణం ఆశ పడిన జాబిలమ్మను అందుకోలేనని మదిలో భావాలను అక్షరనక్షత్రాలుగా జాబిలి చుట్టు పక్కల పేర్చిన అమావాస్య జాబిలై అదృశ్య మైపోయింది ఇది కాదా అంతరంగ మథనం నిరాశ నిస్పృహతో సాగర తీరం వెంట అసుర సంధ్య ఆశ్రయం లో ఒంటరి నావలా నడుస్తున్న పున్నమి వెన్నెలై పలకరించింది ఉత్సాహం ఉద్వేగం కెరటాలతో పోటీ పడ్డ అలలతో చాలక అలసిపోయా ఆశపడిన జాబిలమ్మ అందరాదని ఇది కాదా అంతరంగ మథనం అలసిన తనువును నేలతల్లి అక్కున చేర్చ అంతరంగ మథనం తో ఆకాశ జాబిలిని చేరుకున్న ఇది కాదా అంతరంగ మథనం నా వ్యధను చదివిన వారికి కలుగదా అంతరంగ మథనం పరివేదన విరచిత కథనం ఇది నా పవిత్ర ఆత్మకు సొంతం - అభినవ శ్రీ శ్రీ 
Read More

అంగీకరించలేని నిజం

అంగీకరించలేని నిజం నీ పుట్టుక కొందరికి శాపం నీ పుట్టుక కొందరికి వరం ఇక్కడ నీ పుట్టుక కంటే నీ మరణాన్ని కోరేవారు ఎందరో తల్లి గర్భంలో నువ్వు ఉన్నావని తెలిసినప్పటి నుంచి నీలాంటి మరో ఆడపిల్లకు జన్మనిస్తున్నావని తెలిసే వరకు కూడా నీ మరణాన్ని కోరేవారు ఎందరో.... ఆడపిల్లకు జన్మనిస్తున్నావని భార్యలను వదిలేసి భర్తలు ఎందరో కానీ ఆడపిల్ల పుట్టుకకు తటస్థంగా లేని భర్త X,Y క్రోమోజోములు కారణమని అంగీకరించేది ఎప్పుడో.. ఆడపిల్లకు పుట్టుకకు కారణమైన భర్తలను వదిలేసే భార్యలు లేరు కదా ఈ ప్రపంచంలో చదువుకున్న వ్యక్తి అయినా చదువు రాని వ్యక్తి అయిన భార్యని శిక్షిస్తారు... మహిళలను గౌరవిద్దాం... మహిళలకు చేయూతనిద్దాం...  - జగదీష్ బాయికాడి
Read More

అసూయ

అసూయ మానవ పుట్టక లో లేని భావన ఊహ తెలిసి ఆలోచన తారాస్థాయి కి చేరినప్పుడు కలిగే భావనలు బంధాలు విడతీయు వింతలు కరిగిపోవు ప్రేమానురాగాలు దూరం చేయు స్నేహబంధాలు ప్రతీకగా నిలుచు అసూయ ద్వేషాలు  - సూర్యాక్షరాలు
Read More

అసూయ ద్వేషం

అసూయ ద్వేషం అవినీతి సమాజంలో నిండిపోయే అసూయా ద్వేషం! పగలు, పంతం! అన్యాయం అకృత్యం! అక్కరకు రాని బంధాలకోసం దేవులాడే మనిషి మనుగడ కోసం! కళ్లకు సంకెళ్లు వేసి కళ్ళున్నా గుడ్డివాళ్ళయ్యెను నేటి సమాజం! ఈ సమాజంలో మనలో ఒకరు మంచి చేస్తే చూడలేని తనం! ఒకరు బాగుపడితే కుళ్ళకునే మనస్తత్వం! ఒకరు గెలిస్తే తట్టుకోలేని ఆవేశం! కోపం! ఎందుకీ అసూయా ద్వేషాలు? ఎందుకీ పగలు పంతాలు? మంచితనానికి మానవత్వానికి, సహాయానికి రోజులు చెల్లినట్లేనా?? మకిలి పట్టిన సమాజానికి చెక్ పెట్టలేమా?? మహోన్నతమైన భారత జాతిని కాపాడలేమా? - గాయత్రీభాస్కర్ 
Read More