Month: January 2023

అర్థనారీశ్వర తత్వం

అర్థనారీశ్వర తత్వం పెళ్లి మండపం లో పంచభూతాల సాక్షిగా, వేదమంత్రాల మధ్య ఇరు కుటుంబాలు... ఒక్కటిగా కూడి... ఇరు మనసులని ఒక్కటి చేసి... ఒకరి వెంట ఒకరు ఏడడుగులు వేసి.. నీకు నేనున్నా అనే ధైర్యమిస్తూ  భర్త.. నీ అడుగుజాడల్లో నేను నడుస్తాను అని భార్య... ఒకరి వేలు మరొకరు పట్టుకుని జంటగా అగ్ని దేవుడు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ... నా జీవితంలో అడుగు పెట్టే ఓ చెలీ... నీకు మంచి, చెడు, సుఖః, దుఖాఃలలో తొడుంటా... కష్టాలలో నీవెంట ఉంటా.. కన్నీరు రానివ్వను... నీ జీవితంలో సంతోషాన్ని నింపుతూ నీకు తోడు నీడనై నీ వెన్నంటే నిన్ను కాచుకుని నీకు తోడుగా ఉంటా అని ప్రమాణం చేస్తూ.. తన జీవితం లోకి ఆహ్వానిస్తూ.... నాలో నువు సగం... అని చెప్పి ఇద్దరు ఒక్కటి అవ్వడం.... తప్పులు ఒకరికొకరు సరిదిద్దుకోవటం... కలిసి మెలిసి సంసారం ఇద్దరు ఒక్కటిగా చేయడం... - వనీత…
Read More

న్యాయమా నీవెక్కడ

న్యాయమా నీవెక్కడ న్యాయవాదుల నల్లకోటుల్లోనా? బడాబాబుల బంధీఖానాల్లోనా? బరితెగించిన అధికారంలోనా ? భూ బకాసురుల హస్తాల్లోనా? కార్పోరేట్ కబంధాల్లోనా? రాజనీతి కుతంత్రాల్లోనా మాఫియా సామ్రాజ్యంలోనా? అవినీతి అధికారుల జేబుల్లోనా? నీతిలేని వ్యాపారుల కనుసన్నల్లోనా? చట్టాల చట్రాల ఇరుసుల్లోనా? అందరాని విద్య అంచుల్లోనా? దురాచారాల దౌర్భాగ్యంలోనా ? దుస్సాహసుల ద్వంద నీతిలోనా? కవిరాయని కల్పితపు రాతల్లోనా? పెట్టుబడిదారుల పెత్తనం లోనా? అహంకారపు అంచుల్లోనా? ఆది పత్యపు పోరులోనా? మానవ మృగాల పైశాచికత్వం లోనా? సత్యమెరుగని సమాజం లోనా? అర్హులనే వారు ఎవరైనా ఉంటారా న్యాయానికి? నమ్ముకుని కూచుంటే దొరుకుతుందా న్యాయం అని సందేహమే? అంగట్లో కొనే సరికాదు అందరికీ న్యాయం అంటే? ఖరీదు కట్టే న్యాయమే వద్దు ఎప్పటికీ సామాన్యుని ఆగ్రహావేశాలు చవి చూడకుండా న్యాయమా కదలిరా ఇప్పటికైనా.... - జి జయ
Read More

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి లోకబాంధవుడవుగా వినవయ్య మా మొరను పెదవేదో పలికింది మనవేదో చేసింది చరణం కలియుగ దైవమని నిను కొలిచేమయా పిలుపే వినమని నిను తలిచేమయా చరణం నీడగ నీవుంటే తోడుగ వెంటుంటే పండగ ప్రతిరోజూ పాటగ ప్రతిక్షణము చరణం కమ్మని నీ నవ్వు వెచ్చగ నీచూపు మముతాకితే చాలు ముత్యాలు రాలునుగ చరణం మాటలు రావంట మమతే నీవంట లేదంట ఏతంటా పండునిక బతుకంటా - సి. యస్ రాంబాబు
Read More

చిన్నారి పెళ్లి కూతురు

చిన్నారి పెళ్లి కూతురు అందంగా ముస్తాబు అయి కూసుంది లిల్లీ పెళ్లి వారి కంటే ముందే వెలిసింది జాజిమల్లి.. అందరూ తోరణాలు అల్లుతుంటే... జడకి పూలు అల్లుతుంది మల్లి. కుదురుగా ఉంటూ కలలను ముందుకు నెడుతూ కూసింది పీటల మీద తన మీద పడేది తాళి అని భావించింది కానీ ఎగతాళి అని మాత్రం కాదు.. బాధ్యతలు తెలియని పసితనం, కష్టాలు అలవాటు కానీ ఉన్నత కుటుంబం మరి.. అయినా కానీ తనకి ఎదో ఆత్మవిశ్వాసం.. భరించింది అన్నింటినీ.. - మల్లికార్జున్ గుండా
Read More

అర్ధ నారీశ్వర తత్వం

అర్ధ నారీశ్వర తత్వం చీకటి వెలుగుల సమతూల్య సంగమమే జీవన సూత్రం. స్త్రీ పురుషుల ఇద్దరిలో చీకటి వెలుగులు ఉంటాయి. ఒకరి వెలుగు లో ఇంకొకరు నిండిపోవడం మరియు ఒకరి చీకట్లో ఇంకొకరు సేద తీరటమే జీవిత రహస్యం. దీన్నే అర్ధ నారీశ్వరం గా వర్ణించవచ్చు. - వంశీ
Read More

న్యాయమా నీవెక్కడ

న్యాయమా నీవెక్కడ న్యాయమా నీవెక్కడ...?? చట్టానికి చుట్టమా... రాజకీయానికి బానిసవా..? ఎక్కడా.. నీవెక్కడ కనపడవే.. పేదింటి గడప నీ కంటికి కనపడదా.. పేదోడి కన్నీరు నీకు పట్టదా... పేదోడి గుండె ఘోష... నీకు వినపడదా... న్యాయమా నీవెక్కడ... ఎవరి కోసం ఉన్నావు... అన్యాయం తో అల్లాడుతున్న పేదోడి ఆవేదన కనపడదా.. ఆకలితో చేయి చాచడానికి వస్తే కాలికింద తొక్కేసే వారి గర్వం నీకు కనపడదా... న్యాయమా నీవెక్కడ.. తప్పులు చేసి దర్జాగా తిరిగే వారి అహంకారం నీకు కనపడదా... చట్టాన్ని చుట్టంలా వారి పిడికిలితో బంధించే వారి పొగరు నీకు కనపడదా... ఎక్కడున్నావ్ నువు న్యాయం అని నీ దగ్గర గోడు వెల్ల బోసుకునే వారిని కానక అధికారం తో గర్వంతో, పొగరుతో, అహంకారంతో డబ్బు వ్యామోహంతో ఏదైనా చెయ్యొచ్చు అని తలపోగరుతో తల ఎగరేసే వాడి తల నరకగా రావే... ఏ ఎందుకు..? అన్యాయం ముందు.. నీవు చేతులు ముడుచుకుంటూ…
Read More

వీరసింహారెడ్డి మూవీ రివ్యూ

వీరసింహారెడ్డి మూవీ రివ్యూ అఖండ అద్భుతమైన విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన వీరసింహారెడ్డి సినిమా వచ్చేసింది... మరి ఈ సినిమా కూడా సక్సెస్ అయిందో లేదో ఇప్పుడు చూద్దాం... కథ: జై మరియు అతని తల్లి (మీనాక్షి) టర్కీలో నివసిస్తున్నారు. మీనాక్షి ఒక రెస్టారెంట్‌ను నడుపుతుండగా, జై కార్ డీలర్‌షిప్‌ను నడుపుతున్నాడు. ఇస్తాంబుల్‌లో నివసించే సంధ్య (శృతి హాసన్) తో ప్రేమలో పడతాడు జై. పెళ్లి పూర్తి చేయడానికి సంధ్య జై తల్లిదండ్రులను కలవాలని పట్టుబట్టడంతో, జై తన తండ్రిని మొదటిసారి కలిసినప్పుడు వీరసింహారెడ్డి (జై తండ్రి) టర్కీకి వస్తాడు. వీరసింహా రెడ్డి టర్కీకి వచ్చినప్పుడు విషయాలు తీవ్ర మలుపు తిరుగుతాయి, అక్కడ అతని గతం అతన్ని వెంటాడుతుంది. ఈ గతం ఏమిటి అలాగే తర్వాత ఏమి జరుగుతుంది అనేది మిగిలిన కథ. విశ్లేషణ: మలినేని గోపీచంద్‌కి లభించిన సువర్ణావకాశాన్ని మిస్ చేసుకున్నాడనే చెప్పాలి. అఖండ…
Read More

డిటెక్టివ్ ఎపిసోడ్ 2

డిటెక్టివ్ ఎపిసోడ్ 2 బేవకూఫ్.. నీకళ్ళకు మేమెలా కనిపిస్తున్నాం? కోపంగా అన్నాడా వ్యక్తి "బేవకూఫ్స్ లానే కనిపిస్తున్నారా" అనాలనుకుని అంటే మళ్ళీ చెంప చెళ్లుమనిపిస్తారని డౌటొచ్చి ఆ ప్రయత్నమే విరమించుకుని "చెంప రుద్దుకుంటూ" పానీపూరి గురించి అతడడిగితే నన్నెందుకు కొడతారు? వెళ్లి ఆయన్ని కొట్టండీ..." ఉక్రోషంగా అన్నాడు. "నిన్ను కొట్టిందికి అందుక్కాదు" ఆ నలుగురు ఒకేసారి అన్నారు. "మరి టైం పాస్ కోసం కొట్టారా? కోపంగా అడిగాడు జేమ్స్ "నేను చెబుతాను భయ్యా" అని వినిపించింది. ఆ నలుగురితో పాటు జేమ్స్ కూడా ఆ మాటలు వినిపించిన వైపు చూసారు. ఒక్కసారిగా ఎవరో ఆ గోడౌన్ షట్టర్ పైకెత్తినట్టు బయట నుంచి వెలుతురు లోనికి వచ్చింది.. ఆ వెలుతురులో ఓ మనిషి నీడ కనిపిస్తుంది. తర్వాత షట్టర్ వేసిన చప్పుడు. "ఎవరూ.... కౌన్ హై ? ఆ నలుగురు అగంతకుల్లో ఒకడడిగాడు 'తెలుగులో చెప్పాలా? హిందీలో చెప్పాలా?" అంటూ ఆ వెలుతురులో…
Read More

విజయంపై పట్టు

విజయంపై పట్టు ఆరంభం అదిరింది ప్రత్యర్ధుల కల చెదిరింది పది వసంతాల తీరు మారింది కప్పు పై మాకు ఆశ పెరిగింది హ్యాంగింగ్ గార్డెన్ పేరు మార్మొగింది అంతిమ విజయం మీ ముందుంది. అద్భుతం మీ విజయం కొంతమందికి అది మాయని గాయం చూసిన వారందరికీ కమనీయం బహుశా ఇపుడక్కడ అంతా మీ నామస్మరణీయం. మీ గెలుపు నిజం కడవరకు ఆడటం మీ ఇజం ఆపై గెలుపోటములు సహజం ఇదే మీరు పాటిస్తున్న సహజ సూత్రం.. మరెన్నో విజయాలు మీరు సాధించాలని, వాటికి మేము సాక్షులుగా ఉండాలని మనసా వాచా కర్మేణా కోరుకుంటూ మరోసారి విజయోత్సవ శుభాకాంక్షలు. - కిరీటి పుత్ర రామకూరి
Read More

అర్ధనారీశ్వర తత్వం అంటే

అర్ధనారీశ్వర తత్వం అంటే అర్ధనారీశ్వర తత్వం అంటే మనుషులు రెండుగా శరీరాలు రెండుగా మనసులుచేసే ఆలోచన ఒకటిగా నడవడం! అన్యోన్యతనే ఆది మంత్రమై ప్రాణమైన ప్రాణ సఖి అయినా శక్తి అయినా యుక్తి అయినా సౌభాగ్యమైనా సంపద అయినా రుణబంధమైనా ఆనందమైనా అలవాటైనా పొరపాటైనా బరువైనా బాధ్యతైనా బుద్ధి అయినా శుద్ధి అయినా కీర్తి అయినా అపకీర్తి అయినా రక్షణ అయినా శిక్షణ అయినా స్వీయమైనా హేయమైనా కర్మమైనా ఫలితమైనా బలమైనా బలహీనత అయినా అవకాశం అయినా ఆధిపత్యమైనా ఊహైనా నమ్మకమైనా సఫలమైనా విఫలమైనా మతమైనా మార్గమైనా ప్రయోజనమైనా పంతమైనాపరమార్థం ఏదైనా సూక్ష్మమైనా మోక్షం అయినా శుభాశుభాలు ఏవైనా గెలుపైనా ఓటమైనా జీవనమైనాజీవితమైనా అవరోహనైనా ఆరోహనైనా ఆత్మ పరమాత్మల రూపమై లోకంలో అన్యోన్య దాంపత్యానికి అందమైన అర్ధనారీశ్వర రూపమే అందుకు మన ముందున్న సాక్షాత్కారం కాదా మరి ......? - జి జయ
Read More