Month: January 2023

డిటెక్టివ్ ఎపిసోడ్ 5

డిటెక్టివ్ ఎపిసోడ్ 5 వాళ్ళ మధ్య టేబుల్ మీద కాఫీ పొగలు కక్కుతూ వుంది. "మై డియర్ యంగ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫీసర్ ఇప్పుడు చెప్పండి.. నన్నెండుకు అరెస్ట్ చేసారో? సుగాత్రి వంక చూసి అన్నాడు "చిన్న కరెక్షన్ మిస్టర్ జీనియస్ డిటెక్టివ్ సిద్దార్థగారు.. మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు.. వాక్యం బావుందని 'యు అర్ అండర్ అరెస్ట్" అన్నంత మాత్రాన అరెస్ట్ కావడానికి డిటెక్టివ్ సిద్దార్థ అమాయకుడు కాదు... మా ఫ్రెండ్ మీలాంటి వాళ్లకు ఓ మంచిపేరు పెట్టింది... మాయకులు..." నవ్వుతూ అంది సుగాత్రి. కాఫీ కప్పును సిద్దార్థ చేతికి ఇస్తూ... "నేనా... ఆల్చిప్పల్లాంటి కళ్ళు ఉన్న వాళ్లకు ట్రైలర్ మేడ్ తెలివితేటలుంటాయని ఎక్కడో విన్నాను" అంటూ కాఫీ కప్పు అందుకుని కాఫీ స్మెల్ చూస్తూ 'ఫిల్టర్ కాఫీ అయితే బావుండేది” అన్నాడు. "మీకోసం నేర్చుకుంటాను" అనాలనుకుంది.. కానీ అప్పటికే కేబిన్ బయట మిగితా ఆఫీసర్స్ వున్నారు. "మనం ఇప్పుడు నిజాలు…
Read More

చలిమంట

చలిమంట చలిమంటలా జ్ఞాపకాలు జ్వలిస్తుంటే ఆవలిస్తున్న మనసుకు కీ ఇచ్చి రివైండ్ మోడ్ లో ఉంచాను కుప్పపోసినట్టు పాతవాళ్ళందరు ఒక్కచోట చేరిన అనుభూతి! కాలం పుప్పొడిలా కంటతడి కానుకై గుండె నిమురుతోంది కట్టె కాలిపోయాక బూడిదైపోయిన ఈ 'నేను' ఎవరిని చూసి మాట్టాడుతుంది బతుకు పరిమళాన్ని పారబోయటం మానేసి బంధాలను నేయటం చివరిలోన్నా నేర్చుకుందాం తప్పొప్పుల చిట్టాను చలిమంట చేద్దాం - సి. యస్ .రాంబాబు
Read More

రైతు

రైతు విత్తుట మొదలు కోయుట వరకు... సమయానికి వర్షం పడక నేల దున్నక అయినా విత్తనం కొని వేచిచూసేనుగా.... నకిలీ విత్తనాల దళారుల మోసాల ప్రభుత్వ రాయితీల స్వార్థ ప్రభుత్వాలతో అడుగడుగునా ఇబ్బందులతో..... ఇల్లంతా పంటపై ఆధారపడుతు అకాల వర్షాలకు విపరీత కరువుకు దగ్గరి చుట్టమై పంట కోతతో మార్కెట్ ధరతో అప్పుల బిగువుతో బందాల కొలిమిలో పిదితుడై... హృదయమంతా బండగా కాయమంతా కటువుగా జీవితమే వృధాగా రగతమంతా ఇంకి కన్నీరే మిగిలేనుగా.. - హనుమంత
Read More

నీరు కారిన రైతుగుండె

నీరు కారిన రైతుగుండె రైతే రాజు రైతే దేశానికి వెన్నముక అనేవి పదాలుగానే మిగిలాయా ! ఆకలి తీర్చే అన్నదాతకు అన్నమో రామచంద్ర అనే పరిస్థితులు ? నేల తల్లినే నమ్మి రైతుకు ఎంత కష్టం ఎంత కష్టం ఆరుకాలపు పంటకు అన్ని అడ్డంకులే కదా? అదిక దిగుబడి అని విత్తనాల కల్తీ? భూమి సారంకోసం అంటే ఎరువుల కరువు ? నీరు నిండుగ ఉంటదంటే కరెంటు కష్టాలు? లబ్ది కోసం ఆశ లేక చేసిన పెట్టుబడి కష్టం ? పంట ఏపుగా చూద్దామంటే పురుగు మందుల కష్టం? నీరు నిండుగ పోస్తనంటే వరుణ దేవుడి కరుణ కష్టం? వారసత్వం వదులుకోక పుడమి పోరాటం అంటే? పంటచేతికి వచ్చేనంటే ప్రకృతమ్మ చేసె చేటు? సమస్యలు ఎన్ని ఉన్నా సర్దుకుంటే పంట కొనుట గగనమాయే? అన్నికలిపి కుప్పబోస్తే దళారులమోసమాయే? బక్కచిక్కి బతుకు భారమాయే వ్యయంతో? కొత్త పంటలు వస్తున్నా గానీ రైతు గుండె…
Read More

జై కిసాన్

జై కిసాన్ పంట వేసే రైతుకు ఎంత కష్టం ఎంత కష్టం నకిలీ విత్తనాలు ఇచ్చి ఒకరు పురుగుల మందులు నకిలీవి ఇచ్చి మరొకరు పంటకు తగిన ధర ఇవ్వక దళారుల మధ్య నలిగిపోతున్న రైతుకు ఎంత నష్టం ఎంత నష్టం ఈ నష్టంలో ఆ వానదేవుడు కూడా రైతుకు అన్యాయం చేస్తున్నాడు. తన వంతు బాధ్యత తాను తీర్చుకుంటూ ఆన్యాయమే చేస్తున్నాడు. మంచి పంట ఎప్పుడు వచ్చిననా ఆ సమయంలో వాన పడి రైతు ఇల్లు గుల్ల అవుతుంది. ఓవైపు ఎదిగి వచ్చిన పిల్లలు మరోవైపు చేతికి అందాల్సిన పంట మరోవైపు షావుకారు దగ్గర తెచ్చిన అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియక నెత్తికి చేతులు పెడుతూ దిగాలుగా ఉన్న రైతుకు దినమంతా కన్నీరే... రైతును దేవుడు ఇలా చూడాల్సిన ప్రజలే వారికి అన్యాయం చేస్తూ నాయకులు బ్రోకర్లు మధ్యవర్తుల మధ్య కమిషన్లకు కూడా అంటూ నలిగిపోతూ నాశనం అయ్యేది ఒక్క…
Read More

నీరు కారిన రైతు గుండె

నీరు కారిన రైతు గుండె వేసవి కాలం పూర్తి అయింది.. ఇగ వర్షాకాలం మొదలయింది.. పొలం దుక్కి దున్ని... పంటకు కావలసినవి అన్నీ సిద్ధం చేసుకున్నాను... పంట వేశాము విత్తనాలు వేసాము... కొన్ని రోజులకు మొలక వచ్చాయి.. మందులు చల్లాము.. పంట పచ్చదనం తో పలకరిస్తుంది.. ఎంతో సంతోషం తో ఉల్లాసంగా... ఇంకా పెట్టుబడి పెట్టాలి... పోయి ఏడు పంట నష్టం బాగా వచ్చింది... ఆదుకుంటాం అన్నవారు హామీ ఇచ్చిన వారు కంటికి కూడా కనపడలేదు ప్రభుత్వాధికారులు... ఎం చేస్తాం నమ్ముకున్న పంట చేతికి రాలేదు.. అమ్మలా చూసుకున్న భూదేవి కరునించలేదు.. అలాంటిది.. ఈ అధికారులు ఎం చేస్తారు అని అప్పు ఇచ్చే వారిని నమ్ముకుని నా భార్య బిడ్డలకు కడుపు నింపడం కోసం అప్పులు ఎన్నో చేశాను.. రైతే రాజు అని గొప్పలకు నినాదాలు పలికే వారే కానీ ఆ రాజు నీ కనీసం మనిషిలా కూడా చూడడం లేదు ఎవరు..…
Read More

అన్నదాత

అన్నదాత రైతు తను ఎన్ని మాటలు చెప్పినా వినకుండా పంట నష్టం వస్తే తనే బాధ పడి ఆత్మహత్య చేసుకున్నాడు కానీ ఎవరిని నిందించాడు.. పంట పండించి దేశానికే అన్నం పెట్టుతున్నారు... రైతు, రైతుకుటుంబం బాగుంటే మనము బాగుంటాము.. వేరే వాళ్ళ భూమిని అద్దెకు తీసుకుని పంట పండించేవాళ్లు కూడా ఉన్నారు... పంట నష్టం వస్తే వాళ్లకి సంజాయిషీ చెప్పవలసిన అవసరం ఉంటుంది.. అలాంటి రైతుని నీరు కారిన రైతు గుండెగా మారుస్తున్నారు.. రైతు బాగుండాలనే కోరుకోవాలి.. అన్నదాత సుఖీభవ.. ⁠- మాధవి కాళ్ల
Read More

కన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు మా నాన్నమ్మ గారు హఠాత్తు మరణం వల్ల మాలో కలిగిన బాధ ఎప్పటికీ మర్చిపోలేనిది... మేము అశ్రువులతో నీరాజనం సమర్పించాము.. నాన్నమ్మ తో గడిపిన రోజులు గుర్తు చేసుకొని నాలో బాధ ఎక్కువ అయింది... మా నాన్న కళ్ళలో ఎప్పుడు చూడని కన్నీళ్లు నేను మొదటి సారి చూశాను... నాన్నమ్మ మా మధ్య లేదు అనే విషయం గుర్తుకు వచ్చి కన్నీళ్లు ఆగడం లేదు... మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాను... కన్నీటితో వీడ్కోలు సమర్పించాము.. ⁠- మాధవి కాళ్ల
Read More

న్యాయం

న్యాయం న్యాయదేవతకి కళ్ళకి గంతలు కట్టి ఏది న్యాయము ఏది అన్యాయము తెలియకుండాపోతుంది... న్యాయం కోసం ఎదురు చూస్తే వారికి న్యాయం జరగపోతే న్యాయమా నీవెక్కడ అని వాళ్ల గుండెలు పగిలేలా అరుస్తున్నారు... న్యాయ దేవతకి కళ్ళు ముసినంత మాత్రాన అందరికి అబద్ధాన్ని నిజం అని తేల్చి చెప్పుతున్నారు... న్యాయం కోసం పోరాటం చేస్తున్నంత కాలం నిజం అనేది అందరికి చెప్పడానికి ఆధారాలు, సాక్షాలు కావాలి... వాటిని సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు, సాహసాలు చేయాలి... హంతకులకు దొరికితే ప్రాణం పోయే ప్రమాదం ఉంది.. జాగ్రత్తగా ఆధారాలు, సాక్షాలు సంపాదించి దోషులను శిక్ష పడేలా చేశాను.. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అనే నమ్మకం ఉంది... న్యాయం కావాలి అన్న వాళ్లకి న్యాయం జరిగింది... ⁠- మాధవి కాళ్ల
Read More

ఒకరికి ఒకరుగా

ఒకరికి ఒకరుగా ఒకరికి ఒకరు నచ్చితే పెద్దవాళ్ళు పెళ్లి చేశారు.. ఒకరి మనసు మరొకరు తెలుసుకొని ఒకరి ప్రేమని మరొకరికి పంచుకోవడం ఒకరు తప్పు చేసిన మరొకరు ఏ పరిస్థితిలో చేశారో తెలుసుకొని మందలించాలి... వాళ్ళు మధ్య గొడవ జరగకుండా ఒకరికి మరొకరు నెమ్మదిగా సర్ది చెప్పుకోవాలి... ప్రతిదానికి గొడవే పరిష్కారం కాదు అని తెలుసుకోవాలి... ఒకరు గురించి మరొకరు పూర్తి తెలుసుకొని వాళ్ళతో మెలగాలి.. ఒకరికి ఒకరు ప్రాణంగా బ్రతుకుతారు.. ప్రతి భార్య భర్తలు అర్థనారీశ్వరతత్వంతో ఉండాలి.. అలాగయితే ఏ ఇంట్లోనూ గొడవలు జరగావు.. ⁠- మాధవి కాళ్ల
Read More