Daily Quotes

అమూల్యమైన భావన

అమూల్యమైన భావన అశతోకాదు, శ్వాసగా భావిస్తే, అమూల్యమైన భావన, నీ సొంతం అవుతుంది. సంతోషం నీలో నిలుస్తుంది. సంతృప్తి నీకు వస్తుంది. -బి. రాధిక
Read More

ప్రేమ

ప్రేమ నా హృదయంతరాలలో నీ పేరు చెక్కుకున్న నేను నీ మదిలో చోటు కోసం వేచి ఉన్న ప్రతి క్షణం నీ తలపుల లో బ్రతికే నేను నీకు ఎదురవ్వాలని పరితపిస్తున్నా నా కళ్లలో నిన్ను నింపుకున్న నేను నీ నవ్వు లో నేను ప్రతి క్షణం ఉండాలని కోరుకుంటున్నా నీ ప్రేమ దాసుడిగా మారాలని తపించి పోతున్నా నీ హృదయం లో చోటు కోసం ఎదురు చూస్తున్నా నీ జీవితం లో సగమవ్వాలని వేచి ఉన్నా నా ఈ చిన్ని కోరికను మన్నిస్తావా ప్రియతమా ... -భవ్య చారు
Read More

రేపటి విజయం

రేపటి విజయం నేటి, నీ ప్రయాణంలో ఎన్నో తిరస్కారాలు,‌‌‌‌‌‌‌‌‌ ఛీత్కారాలే, రేపటి నీ విజయానికి సత్కారాలు. - బి రాధిక
Read More

మధురం

మధురం నీ ప్రేమ మధురం నీ అధరం మధురం నీ పిలుపు మధురం నీ స్నేహం మధురం నీ కోపం మధురం నీ అలక మధురం నీ తో జీవితం మధురం నీ శ్వాస మధురం నీ ఆశ మధురం నీ లక్ష్యం మధురం నీ విరహం మధురం మధురమైన నీ ఊహా ఇంకెంతో మధురం... -భవ్య చారు
Read More

స్నేహం

స్నేహం పది కాలాలు పదిలంగా నిలిచేది,స్నేహం. నవమాసాలు అమ్మ కడుపును పంచుకోకపాయినా, నూరేళ్ళు పంచుకునేది, స్నేహం. అష్టకష్టాలు వచ్చినప్పుడు, అండగా నిలిచేది, ఆదరించేది,స్నేహం. సప్తసముద్రాలు దాటి వెళ్ళినా, తెంచుకోలేనిది ,స్నేహం. ఆరడగుల గోతిలో  చేరేవరకు నిలిచేది,స్నేహం. పంచభక్ష్య పరమాన్నాలు వున్నా,లేకున్నా! కలుపుకుపోయేది,స్నేహం. నలుగురిలో తోడుందేది,స్నేహం. ముక్కంటికి మరో రూపం, స్నేహం రెండు వేరు వేరు వర్ణనాలను, వర్గాలను మనసులతో జత చేసేది ,స్నేహం. అభిప్రాయాలు,ఆలోచనలు వేరైనా, ఒక్కటిగా జీవించమనేది, జీవించేది, స్నేహం. -బి రాధిక
Read More