Family Stories

మధ్యతరగతి మనిషి

మధ్యతరగతి మనిషి మధ్యతరగతి మనిషికి అది ఒక మైలురాయి. అది దాటడానికి శతవిధాల ప్రయత్నిస్తూనే వుంటాడు. కానీ సమాజంలో మధ్యతరగతి మనిషికి వున్న కష్టాలు అన్ని ఇన్నీ కావు అటు తేలలేక మునిగినట్టు వుంటుంది. ఏదో సాధించాలని ఏదో చేస్తూ ఉయ్యాల లూగే ఒక ఉయ్యాల లాంటిది. మధ్యతరగతి మనిషి సామాజిక పరిస్థితులు సంసార జీవనం రెండింటిని భుజాల మీద మోస్తూ బతుకు బండిని లాగుతూ వుండే వాడు. కోరికలను చంపుకోలేక బాధ్యతలను విస్మరించలేడు. విధి లేని వింత జీవి మథ్యతగతి మనిషి. వుట్టిని పట్టలేనివాడు స్వర్గానికి నిచ్చెను వేసినట్టు ఊహించుకుంటూ సారూప్యత లేని ఆదాయాలతో సతమతమయ్యే ఆలోచనలతో తోకలేని పిట్ట వలె పరువూ మర్యాదలు, లాభ నష్టాలు, బాదరా బందీలు, కష్ట సుఖాలతో రైలు పట్టాలపై నడుస్తున్న రైలు ప్రయాణం లాంటిది మధ్యతరగతి మనిషి జీవితం ఆశతో ముగుస్తుంది. - జి. జయ
Read More

కాలం నేర్పే పాఠాలు

కాలం నేర్పే పాఠాలు ఆకాశాన్నంటే ఆశలు, భూమిని దాటని బ్రతుకులు. చాలీ చాలని జీతాలు, అటూ ఇటూ కాని జీవితాలు.   అడుగడుగునా సమస్యలు, బయట పడని భావోద్వేగాలు. కట్టిపడేసే బాధ్యతలు, వదిలిపోని ఆత్మాభిమానాలు.   నెల నెలా వేసే చిట్టీలు, నెల చివర్లో అప్పులు   దడపుట్టించే ధరాఘాతాలు, సర్దుకుపోయే మనస్తత్వాలు. తన వారికోసం త్యాగాలు, దొరికిన దాంట్లో సర్దుబాట్లు. తాను చేరలేని గమ్యాలు, తన పిల్లలు చేరాలని ఆరాటాలు.   ఆప్యాయతలు, అనుబంధాలు, మరపుకు రాని మనోగతాలు.  రేపటి గురించి భయాలు, మనుగడ కోసం పోరాటాలు.  కాలం నేర్పే పాఠాలు, అంతే లేని ఆలోచనలు. ఎడారిలో ఎండమావులు,  ఇవే  మధ్యతరగతి మనిషి లక్షణాలు. - రవి పీసపాటి
Read More

మార్పు తెలుసుకో

 మార్పు తెలుసుకో తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండలేని అమ్మాయి సౌమ్య. పేరులాగానే చాలా సౌమ్యంగా, నెమ్మదస్తురాలు. సౌమ్య చాలా ముందు చూపున్న అమ్మాయి. తను చదువుకోసం పక్క ఊరిలో ఉన్న కాలేజికి పంపించాలని, అక్కడ హాస్టల్ లో వుంచి, చదివించాలని తన తల్లిదండ్రుల నిర్ణయం. తను ససేమిరా వెళ్ళను, ఇంటి దగ్గర నుంచి, అదీ ఊర్లో వున్న ప్రభుత్వ కాలేజీకి వెళ్తానని చెప్పేసింది. ఇంక చేసేది లేక, ప్రభుత్వ కాలేజీకి పంపించారు. మూడు సంవత్సరాలు చదువు పూర్తి చేసుకుంది. ఇంకా చదువమని ప్రోత్సహించారు. ఎందుకంటే, సౌమ్యకు, చదువు ఆరో ప్రాణం. కానీ, తల్లిదండ్రులంటే పంచప్రాణాలు. అమ్మానాన్నకు దూరంగా వెళ్ళి చదువుకోవడం సౌమ్యకు అసలు ఇష్టం లేదు. తన చదువుకు తగ్గ ఉద్యోగం చేస్తూ, అమ్మానాన్నతో కలిసి సంతోషంగా ఉంది. ఉద్యోగం చేసుకుంటూ ఎంతకాలం ఒంటరిగా ఉంటుందని సౌమ్యకు పెళ్ళి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి చదువుకోకూడదు అనుకున్న సౌమ్య,…
Read More

నాన్న డైరీ లో చివరి పేజీ

నాన్న డైరీ లో చివరి పేజీ మొదటిసారి నేను నాన్న గురించి రాస్తున్నప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఎందుకో మరి... కాళ్ళతో తన్నావు అని ఆ రోజు కొప్పడ్డాను. కాటికి నాన్న చేరిన రోజున ఆ కాళ్ళ దగ్గరే పడి నన్ను కొట్టడానికి రమ్మని కన్నీళ్లు ఇంకేలా ఏడ్చాను.. మీతో ఒక్క సారి మనసారా మాట్లాడాలి అని ఉంది నాన్న... ఇప్పటికీ గుర్తు నాకు నాన్న డైరీ లో చివరి పేజీ అప్పుడే మద్రాసు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి మంచం మీద పడుకో బెట్టారు. తెలిసి తెలియని వయసు నాది. పట్టుమని 10 సంవత్సరాలు కూడా లేవు అనుకుంటా, అందరూ వచ్చి నాన్నను చూసి వెళ్తున్నారు. నేను ఆయన మంచం పక్కనే ఉన్నాను. అందరూ వెళ్లి పోయాక అతికష్టం మీద నాన్న నన్ను దగ్గర కి తీసుకొని ఒక్క సారిగా జలపాతం లా కన్నీటి ధారలు... బహుశా ఆ కన్నీటికి…
Read More

దీపావళి – చీకటి రాత్రి

దీపావళి - చీకటి రాత్రి అమ్మను హాస్పిటల్ లో జాయిన్ చేశారు త్వరగా కావలి కి రా నువ్వు అని ఇంటి దగ్గర నుంచి ఫోన్…అంతే కళ్లలో సుడిగుండాలు, ఏమి అయ్యిందా అని… నన్ను నేను కంట్రోల్ చేసుకుని హాస్పిటల్ కు బయలుదేరాను.. కావలి లో బొల్లినేని డయాగ్నొస్టిక్ సెంటర్ లో స్కానింగ్ చేశారు... గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉన్నాయి.. సైజ్ కొంచెం పెద్దగా ఉన్నాయి అర్జెంటుగా ఆపరేషన్ అవసరం అయ్యేలా ఉంది అన్నారు. డాక్టర్ పరమేశ్వర్ గారితో మాట్లాడితే టెంపరరీ రిలీఫ్ కోసం టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్లు వేశాము.. కానీ త్వరగా మంచి డాక్టర్ ను కన్సల్ట్ అవ్వండి అన్నారు. అమ్మ కళ్లుమూసుకుని ఉంది కళ్ల చివర మాత్రం కన్నీటి చారలు. అలా బెడ్ పైన తనని చూసేసరికి ఆపుకోలేక కళ్లు కన్నీటి వర్షం కురిపించాయి. నాకున్న ఒకే ఒక ధైర్యం అమ్మ తనే దూరమైతే భరించుకోలేను ఎలాగైనా…
Read More

కుటుంబం

కుటుంబం ఒక తోటలో పార్క్ లో ఇద్దరు ముసలి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒకరు, రాముడు- “నాకు ఒక మనవరాలు, పెళ్ళికి సిద్ధంగా ఉంది. ఇంజనీరింగు చదివింది. ఉద్యోగం చేస్తున్నది. ఎత్తు 5.2. అందంగానే ఉంటుంది. ఎవరైనా తగిన పిల్లవాడు ఉంటే చెప్పండి.” మరొకరు, రంగడు- “మీ మనవరాలికి ఎటువంటి సంబంధం కావాలి?” రాముడు- “పెద్దగా ఏమీ వద్దు. అబ్బాయి M.E., లేదా M.Tech; చేసి ఉండాలి. సొంత కారు, సొంత ఇల్లుండాలి. మంచి ఎత్తు ఉండాలి. ఇల్లంటే కాస్త తోట, చెట్లు చేమలుండాలి. మంచి ఉద్యోగం, మంచి జీతం అంటే కాస్త ఓ లక్షో, రెండు లక్షలో ఉండాలి..!” రంగడు- “ఇంకేమైనా కావాలా?” అప్పుడు రాముడు- “అన్నింటి కన్నా ముఖ్యంగా, ఆ పిల్లవాడు ఒంటరి వాడై ఉండాలి. అతనికి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎవ్వరూ ఉండకూడదు. ఎందుకంటే, వారుంటే పెళ్ళి తరువాత పోట్లాటలు కావచ్చు కదా..” రెండవ వృద్ధుని(రంగడు)రెండు కన్నులు నిండి వచ్చాయి.…
Read More

స్నేహం లో

స్నేహం లో నాకు స్నేహితులకన్నా ఎక్కువ ఏ భాద వచ్చినా, ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది మా అమ్మ, అమ్మ కంటే స్నేహితులు ఎక్కువ కాదు, స్నేహితులు ఉన్నా కూడా, మన చిన్నప్పటి నుండి ప్రతి చిన్న విషయాన్ని మా అమ్మతో పంచుకుంటాము.... కొంచం వయసు రాగానే స్నేహితులు దొరుకుతారు. కానీ మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్నేహితులు దూరం అవుతారు. అప్పుడు తెలుస్తుంది మనకి ఎవరు మంచి స్నేహితులో, దాంతో మనం మన తల్లికి మన సమస్య ని చెప్పుకుంటాం... చిన్నప్పటి నుండి మనకి ఏమి కావాలన్న మన అమ్మతోనే చెప్పుకుంటాం, అమ్మ నాన్నకి చెప్పి, మనకి కావాల్సినవి అందేలా చేస్తుంది. నాన్నతో అంతగా ఫ్రీగా ఉండలేని మనం అమ్మా చాటుగా స్నేహితులతో షికార్లు చేయడానికో, సినిమాకు వెళ్తే నాన్న మనల్ని తిడితే మనన్ని తిట్టకుండా, వాడు/అది చదువుకోవడానికి వెళ్ళింది అని అబద్ధం చెప్పి, మరీ మనల్ని…
Read More

పెళ్లి 2022

పెళ్లి 2022 1986 వ సంవత్సరం అభివృద్ధి చెందుతున్న చిన్న గ్రామం. ఆ గ్రామం లో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న రాజారామ్ కొడుకు శేఖరంకి డిగ్రీ అయిపోగానే మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది రెవిన్యూ డిపార్ట్మెంట్ లో .. కొడుక్కి ఉద్యోగం దొరకడం తో శేఖరం తండ్రి రాజారామ్, శేఖరం తల్లి రామలక్ష్మి కొడుక్కి పెళ్లి సంభందాలు చూడటం మొదలెట్టారు. శేఖరం తండ్రి ఉపాద్యాయుడు అవడం వల్ల శేఖరాన్ని మంచి క్రమశిక్షణతో పెంచాడు. శేఖరం ఎప్పుడు వాళ్ళ తల్లి తండ్రులని ఎదిరించింది లేదు. తనకు BSC కెమిస్ట్రీ చదవాలని ఉన్నాప్పటికీ తండ్రి ఆదేశించడం తో బీఎస్సీ బోటనీ తీసుకున్నాడు. శేఖరం కోసం రాజారామ్ సంభందాలు చూస్తున్నాడు అని తెలుసుకున్న ఆ ఊరి పెళ్లిళ్ల పేరయ్య రాజారామ్ ని తాను పని చేస్తున్న పాఠశాల దగ్గరకు వెళ్లి కలిసాడు మధ్యాహ్నం భోజనాల సమయం లో... ************ నమస్తే రాజారామ్…
Read More

వసుధ

వసుధ అభివృద్ధికి, నాగరిక సమాజానికి దూరంగా ఉన్న ఆ గ్రామంలో పెళ్లయి సంవత్సరం లోపు సంతానం కలగని ఆడపిల్లని ఆ ఊరి లో ఉండే పెద్ద జమీందారుకు సేవకురాలిగా పంపుతారు. అలా వెళ్లిన అమ్మాయి ఆ జమీందారు కుటుంబానికి అన్ని రకాల సేవలు చేస్తూ ఉండాలి సేవలు అనడం కన్నా బానిస అనడం ఎంతో అర్థవంతం. సంవత్సర కాలం బానిసగా ఉంటూ ఆ ఆడపిల్ల తన భర్తతో సంతానం పొందే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పటికీ సంవత్సరం బానిసత్వం చేసిన కాలంలో కూడా ఆ ఆడపిల్లకి సంతానం కలగకపోతే ఆ అమ్మాయిని జమీందారు కుటుంబం లోని మగవాళ్ళకి తాళి కట్టకుండానే భార్యగా చేసేస్తారు. అలా పెళ్లయి సంవత్సర కాలం అవుతున్నప్పటికీ సంతానం కలగని వసుధని ఆ ఊరి జమీందారు కుటుంబానికి సేవ చెయ్యడానికి పంపించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకి కాకుండా మరో కుటుంబానికి చెందిన మగవాళ్ల మధ్యలో రాత్రియంబవళ్ళు ఉంటూ…
Read More