Trending Now

ఒక చీకటి రాత్రి పార్ట్ 6

ఒక చీకటి రాత్రి పార్ట్ 6 అనుకున్నట్టుగానే తెల్లారి బాలయ్య అతని భార్య లక్ష్మి బావమరిది వెంకటేశంతో కలిసి అమరేంద్ర తల్లిదండ్రులు కలవడానికి ఇంటికి వెళ్ళాడు. అయితే అనుకున్నట్టుగా అమరేంద్ర తల్లిదండ్రులు వాళ్లని ఆహ్వానించలేదు. అమరేంద్ర ఇంటికి వెళ్లి తలుపు తట్టారు ముగ్గురు. తలుపు తీసిన అమరేంద్ర తండ్రి చలపతి ఎవరు మీరు అని ప్రశ్నార్ధకంగా అడిగాడు. అయ్యా నా పేరు బాలయ్య ఈ ఊర్లో కిరాణాకొట్టు నడుపుతున్నాను. ఊర్లో అతిపెద్ద కొట్టు మాదే. మీతో కొంచెం మాట్లాడాలి అని వచ్చాను అంటూ అడిగాడు. కిరాణా కొట్టు వాడికి మాతో ఏం పని ఎందుకు మమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నావు అన్నాడు గంభీరంగా చలపతి. మీతో కొంచం మాట్లాడాలి అందుకే కలవాలని అనుకుంటున్నాను అన్నాడు బాలయ్య. నాతో మీకేం పని అని అడిగాడు చలపతి. అతని మాటలు బాలయ్యకు అంతగా నచ్చలేదు. అయినా కూతురు కోరుకుంది కాబట్టి మాట్లాడక తప్పదు అనుకుంటూ.…
Read More

ఒక చీకటి రాత్రి పార్ట్ 5

ఒక చీకటి రాత్రి పార్ట్ 5 అమ్మ నాన్న నేను మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను అని అంది అప్పుడే కాలేజి నుంచి వచ్చిన కిరణ్మయి. ఏంటమ్మా ఏంటి విషయం అంటూ అడిగాడు తండ్రి బాలయ్య. ఏంటి ఆ విషయం తొందరగా చెప్పు అంది తల్లి లక్ష్మి. అబ్బా అమ్మ ముందు చెప్పేది వినండి అంటూ నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతను చాలా మంచివాడు అతన్ని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. మీరు కాదనరు అనే నమ్మకంతో మీకు చెప్తున్నాను నా నమ్మకాన్ని వమ్ము చేయకండి. అయితే అతనికి డబ్బు లేదు కానీ గుణం సంస్కారం మాత్రం ఉంది. చాలా మంచివాడు అభివృద్ధిలోకి వచ్చేవాడు. అతనితో నా జీవితం చాలా బాగుంటుంది అని నేను నమ్ముతున్నాను అందుకే అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇప్పుడు ఒప్పుకోకపోయినా నేను వెళ్లి అతన్ని పెళ్లి చేసుకుంటాను. కాబట్టి…
Read More

కుక్క బతుకు పార్ట్ 2

కుక్క బతుకు పార్ట్ 2 అయ్యో అమ్మో ఈ బాధ భరించలేను, నాకే ఇది రావాలా? అయ్యో రామా నాకే ఎందుకు ఇలా జరగాలి, దేవుడా నన్ను బ్రతకనివ్వు, బతికే దారి చూపు, అమ్మో అయ్యో అదేంటి నా పైకే వస్తుంది. అయ్యో నా కళ్ళు కూడా కనిపించడం లేదే, అమ్మో ఎంత ప్రమాదం తప్పింది కస్తయితే లారి నన్ను తినేసేది, దేవుడా నువ్వు ఉన్నావయ్య నన్ను ప్రాణాలతో నిలబెట్టావు. అదే చేత్తో ఇంకా కాస్త దయ చూపయ్యా, ఈ ప్రాణాలు నిలుపుకోవాలి అంటే కాసిన్ని మెతుకులు దొరికేలా చెయ్యి... ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలా ఇప్పుడు బాధ పడుతున్నా, అయ్యో ఉన్నప్పుడు తినలేక పోయాను. పెట్టిన చేతిని విదిలించి ఉంటాను . అందుకే నాకిప్పుడు ఇలా అవుతుంది. హే భగవాన్ నన్ను కాపాడు. అయ్యో ఎవరూ లేరెంటి... రోడ్ల పై ఎప్పుడూ గుంపులు గుంపులుగా ఉండే జనాలు…
Read More

ఈరోజు వరకు ఎవరూ కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేదు?

ఈరోజు వరకు ఎవరూ కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేదు? హిందూ మతంలో కైలాస పర్వతం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది, ఎందుకంటే ఇది శివుని నివాసంగా పరిగణించబడుతుంది. అయితే దీని గురించి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ప్రపంచంలోని ఎత్తైన శిఖరం అయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటివరకు 7000 మందికి పైగా ప్రజలు అధిరోహించారు, ఇది 8848 మీటర్ల ఎత్తులో ఉంది. కానీ, ఈరోజు వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేదు, దాని ఎత్తు దాదాపు ఎవరెస్ట్ కంటే 2000 మీటర్లు తక్కువ అంటే 6638 మీటర్లు. ఇది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. మీడియా నివేదికల ప్రకారం, ఒక పర్వతారోహకుడు తన పుస్తకంలో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడని వ్రాశాడు, కాని ఈ పర్వతం మీద ఉండడం అసాధ్యం, ఎందుకంటే అక్కడ శరీర జుట్టు మరియు గోర్లు వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి. ఇది కాకుండా, కైలాస పర్వతం కూడా చాలా రేడియోధార్మికత…
Read More

స్నేహం

స్నేహం ఎక్కడో  పుట్టాము ఇక్కడ కలిసాము, స్నేహం అన్నావు  కలిసి ఉందాం అన్నావు , కలగానే మిగిలావు, కమ్మని ఉసులూ చెప్పావు , కబుర్లతో కాలాన్ని మరిపించావు, కవితలెన్నో అల్లావు,   కళ్ళలో నిలిచావు , హట్టాత్తుగా , అర్దాంతరంగా  కనుమరుగు అయ్యావు, ఏమయ్యిందని అడిగితే  సమయం లేదన్నావు  కాలం కలిసి రాలేదన్నావు  కబుర్లు లేవన్నావు,  కవితలు మరిచావు , ఆప్పుడర్ధమయ్యింది , కలిసి రానిది కాలం కాదని  కలవాలంటే కలిమితో  లేని నేనని , నిజమే  పేదవాడి స్నేహం లాభం కాదని నీ మాటల వల్లె  తెలిసింది, ఈ రోజుల్లో స్వచ్చమైన స్నేహం  ఎడారి ఒయాసిస్సు  అని  తెలుసుకోలేక పోవడం ముమ్మాటికి  నా తప్పే అందుకే తప్పుకుంటున్నాను  మిత్రమా స్నేహం అంటే లాభాల బేరీజు కాదని  అదొక తీయని అనుభూతని నీవు  తెలుసుకున్న  రోజే మన స్నేహానికి ఒక అర్ధం పరమార్ధం ....  నువ్వెక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకునే నీ …
Read More

వెన్నెలతో నా అనుభవాలు

వెన్నెలతో నా అనుభవాలు   వెన్నెల్లో హాయి హాయ్ , మల్లెల్లో హాయ్ హాయ్ అనే పిలుపులు. వెన్నెలవే, వెన్నెలవే మిన్నే దాటి వస్తావా ..అంటూ తీయని పలుకులు, వెన్నెలా ..వెన్నెలా మెల్లగా రావే అని జోల పాటలు , వెన్నెలైనా చీకటైనా, చెరువైనా దూరమైనా అంటూ ప్రేమ ముద్దు మాటలు. వెన్నెల్లో గోదారి అందం అంటూ గంభిరమైన మాటలు. ఇలా వెన్నెల పాటలు వింటూ వెన్నెలను చూడాలని అనిపిస్తుంది. కాని అదేo చిత్రమో ఎప్పుడూ వెన్నెల్లో కూర్చునే అలా ఫిల్ అయ్యే అవకాశం నాకు ఇంత వరకు రాలేదు. కనీసం ఆ అనుభూతి ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఎందుకు అంతగా మీరేం చేస్తారు జీవితం లో ఒక్కసారి అయినా అలాంటి  అనుభూతిని పొందాలి అంటారా, హ ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ చల్లని చందమామను చూసినా జ్గ్యాపకం , ఇప్పుడు మాత్రం ఎన్నేళ్ళు అయ్యిందో…
Read More

ఏమని చెప్పను

ఏమని చెప్పను ఏమని చెప్పను నీ గురించి ప్రేమకి కరిగిపోయే అద్భుతానీవి అని చెప్పనా అమాయకపు చూపూలతో నా మనసు దోచావు అని చెప్పనా ప్రేమించడం లేదు అని నా గురించి నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నన్నే తలచుకుంటున్నవ్ అని చెప్పనా రెండు సార్లు తిట్టి విడిపోయినా ఒక్క మాటతో నన్ను చేరదీశావు అని చెప్పనా ఏమని చెప్పను నీ గురించి మనిషి ని నీకు దూరంగా ఉన్న నీ మనసు నాకు అంకితం ఇచ్చావు అని చెప్పనా పసి పాపలా నా మీద అలిగినపుడు నీ ప్రేమలో నిజాయితి గూఱంచి చెప్పనా ఏమని చెప్పను నీ గురించి నువ్వు నా అదృష్టా నివి అని చెప్పనా మనిషి దూరంగా ఉన్న మనసుతో మాట్లాడుతున్న ని గూఱంచి ఏమని చెప్పను . అందమైన నీ కళ్ళలో నాపై కనిపించే అంతు లేని ప్రేమ గురించి చెప్పనా, మెరుస్తున్న నీ అధరాల…
Read More

ప్రేమ + బాధ్యత = సైనికుడు

ప్రేమ + బాధ్యత = సైనికుడు ఒక ఆదివారం మా నాన్న గారి దగ్గరకు బాల్ సింగ్ అనే అతను వచ్చాడు. మా నాన్నగారు ఉద్యోగ రీత్యా మెదక్ జిల్లా లోని ఒక మండలం లో ప్రభుత్వ ఉపాధ్యాయులు గా పని చేస్తున్నారు. ఆ మండలంలో గిరిజనులు ఎక్కువగా ఉండేవారు. అయితే నాన్న గారు వారికి ఎలాగైనా సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో కొందరికి ఆర్మీ లో ఉద్యోగాలు పడినప్పుడు చెప్పారు. పదవ తరగతి అర్హతతో వాళ్ళు ఆ ఉద్యోగాలను సంపాదించారు. ఆ విషయం విని బల్ సింగ్ నాన్నగారి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. వారి సంభాషణ ఈ విధంగా సాగింది. సార్ నేను ఆర్మీ లో జాయిన్ అవ్వలని అనుకుంటున్నాను సార్ అన్నాడు బాల్ సింగ్. అక్కడికి ఎందుకురా, అసలే తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకువి వాళ్ళను వదిలేసి ఆర్మిలోకి వెళ్లడం ఎందుకురా అన్నారు నాన్న. ఏం ఒక్క కొడుకును సార్ ఒక్క…
Read More

దుష్కర్మఫలితం

దుష్కర్మఫలితం *మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ - ఎలా తుడుచుపెట్టుకు పోతాయో ఒకసారి పరిశీలి ద్దాం…!* *ఈరోజు చాలామందిమి, పూజలు చేస్తాము, వ్రతాలు నోస్తాము, దానాలు చేస్తాము, ధర్మాలు ఆచరించాము, అని విర్ర వీగుతుంటాము, కానీ అవి ఎంతవరకు మనలను - భగ్వద్ సన్నిధికి చేర్చుతాయని ఆలోచించము కదూ. అలాంటి ఒక సంఘటన మహాభారతం లో చోటు చేసుకుంది. అదేమిటో ఒకసారి పరిశీలిద్దామా?* *కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.* *కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విల పిస్తాడు. చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు.* *ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు.* *”అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండి పోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు…
Read More