aksharalipi poem

పర్యావరణ విలువ

పర్యావరణ విలువ పక్షుల కిలకిల లు మామిడాకుల గగలగలలు కూ అనే కోయిల మధురిమలు కావు కావంటూ చట్టాలను పిలిచే నేస్తాలు అంబా అంటూ అమ్మ కోసం ఎదురుచూసే గోమాతకు ఎద్దులబండికి ఉన్న అందెల మృదుమధుర సవ్వడులు, కొలనులోని హంసల సరిగమలు పంచె వన్నెల రామచిలుక రాగాలు మే అంటూ నేస్తలని పిలిచే మేకల గుంపులు, నింగి మొత్తం నాడేనంటు డేగ రెక్కల శబ్దాలు, గుక్ ఘుక్ అంటూ పొద్దున్నే నిద్ర లేపే పావురాయి కువకువలు... ఇవ్వన్నీ ఒకప్పటి పల్లె చిత్రాలు.. మరిప్పుడు ఆకాశాన్ని తాకే మేడల నడుమ గుళ్లకు చోటెక్కడ, కరెంటు తీగలు, గాలి పటాల దారాల మధ్య నలిగి గిలగిలా కొట్టుకుంటూ, తినడానికి గింజలు కరువై, ప్లాస్టిక్ కవర్లు తింటూ అవి అరగక వాటిలో ఉన్న విషం తమని నిలువెల్లా చంపేస్తుంటే ఇంకా వాటి ఉనికి ఎక్కడ? మిడతల నుండి కాపాడుకోవడానికి పావురాలను అరువు తెచ్చుకుని ప్రారబ్ధం దాపురించింది.…
Read More

బంధం

బంధం   చెట్టుకు పూసిన పూలతో అనుబంధం పూటని తెలిసినా, పరిమళం వెదజల్లుతూ నవ్వుతూ ఉన్న పూలను చిగురుల చేతులతో తడిమి, కొమ్మల ఊయలూపి, మొగ్గల బుగ్గలుగీటి, తేనె ఉగ్గులు పోసి, ఎండిన ఆకులతో దిష్టి తీసి మురిసే చెట్టుకే తెలుసు జన్మల బంధం అంటే ఏమిటో.... తీరచెలిని చూచుటకు చెంగు చెంగున ఎగురుతూ, ఉత్సాహంగా ఉవ్వెత్తున ఎగసి ఉరకలు వేస్తూ, కెరటాల కౌగిలిలో కరిగించే సంద్రానికి తెలుసు అనుబంధం అంటే ఏమిటో.... గూటిలో గులాబీ రంగు వర్ణంలో నోరు తెరిచి ఎదురుచూసే పక్షి పిల్ల నోటిలో రోజంతా తిరిగి సేకరించిన ధాన్యపు పాలను పోసి రెక్కలతో పొదువుకునే పక్షికి తెలుసు జన్మల బంధం అంటే ఏమిటో... సూర్య,చంద్రుల కళ్ళతో పగలు, రాత్రి కంటికి రెప్పలా కాస్తూ, వలపు వాన చినుకులతో చుంబించి పుడమిని పులకింపచేసి సంబరపడే అంబరానికే తెలుసు బంధం అంటే ఏమిటో.... తాను ఎంత స్వేచ్ఛగా ఎగిరినా, తనని…
Read More

వృద్ధుని కష్టాలు

వృద్ధుని కష్టాలు 1 తే.గీ.   చేవ లేనట్టి కాళ్ళకు చేవ కర్ర (చేతి కర్ర)   నడవ లేనట్టి వృద్ధున్ని నడవజేసె   బాధ్యతెంతైన మోయును భారమనక  పొట్ట కూటికి ప్రతిజీవి పోరు సలుపు 2 ఆ.వె.   కన్నసంతులేని కడుబీద ముసలయ్య   బడలికైన నడిచి బరువు మోసె   పొట్ట కూటి కొరకు పోరాట బాటలో   చీపురులు తనకిపు డూపిరాయె - కోట
Read More

పగటి వెన్నెల

పగటి వెన్నెల వెన్నెల ఎంతో చల్లన అది చంద్రుడు తెచ్చు మెల్లన పౌర్ణిమిరోజు పూర్తిగ వచ్చు పునఃదర్శనం పక్షం పట్టు అందాకా నే వేచె దెట్లు ఓ!నా ప్రియ సరసు నీవు నా సరసనె వుంటె పగలే కాయద పండు వెన్నెల. - రమణ బొమ్మకంటి
Read More

విశ్రాంతి ఎప్పుడు?

విశ్రాంతి ఎప్పుడు? పొద్దున్నే లేస్తావు బొంగరం లా తిరుగుతావు నిరంతర యంత్రంలా పనిచేస్తావు నీవొక మనిషన్న సంగతి మరుస్తావు  మాటలెన్నో మాట్లాడుతూ మంచికి ప్రయత్నిస్తావు మగువా మగువా నీకెక్కడిదే మనుగడ లేని జీవితం గడుపుతావు మాటలెన్నో పడతావు అవమానిస్తాడు. అనుమానిస్తాడు అయినా నీ పెదవి పై చిరునవ్వు కదలనీవు మగువా మగువా మానసిక ఒత్తిడిని తట్టుకుంటూ ఎంతో శ్రమ కొరుస్తావు  అందరి ఆరోగ్యం చూస్తూ నీ ఆరోగ్యం చూసుకోవూ నవమాసాలు మోసి నరకం చూస్తూ ఆనందాన్ని పొందుతావు మగువా మగువా నీ మనుగడ కోసం ఎప్పుడు అలోచిస్తావు నీకు నువ్వు విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటావు? - భవ్యచారు
Read More

చివరి చూపు

చివరి చూపు అలజడి చేసిన ఆతృత నింపిన క్షణం ఆ క్షణం కనుమరుగు అయితే మిగలదు మనిషి చివరి యాతన చెరగని ముద్ర వేసిన చేదు నిజం అది మాలిన్యం లేని మామకారపు చూపు అది మరపురాని అనుభవం మది నిండిన భాధ అది చెదరిన కలల స్వేదం మరు జన్మకు మార్గమది సృష్టించిన చలనము జీవాత్మ కు శరణమూ చివరిచూపు అది అవుతుంది మదిలోన గునపము విది విధించిన గడువు మంత్రము అదియే చివరి చూపు. - జి.జయ
Read More

‘అ’ నుబంధం లో ‘ఆ’ నందం

'అ' నుబంధం లో 'ఆ' నందం అక్షరం అంటే అమ్మ! ఆడపిల్ల అంటే ఆదిశక్తి! అండ అంటే అన్న! ఆదర్శం అంటే నాన్న! అహం అంటే శత్రువు! ఆధారం అంటే మిత్రుడు! అభివృద్ధి అంటే వెలుగు! ఆగిపోవటం అంటే చీకటి! అన్నిటినీ, అందరినీ సమానం అనుకుంటే! సంయవనంతో, సహృదయంతో స్వీకరిస్తే, అందమైన భవిష్యత్తు. ఆది, అంత్యం, అన్ని కాలాలను ఒకేలాగా ఆస్వాదిస్తే, అదే సంతృప్తికరమైన జీవితం. - బి రాధిక
Read More