archana aksharalipi

అర్చన

అర్చన రెక్కలు తెగిన ఆశ కూలిపోతుంటే మనసు చేష్టలుడిగి కూలబడింది వర్తమానం వేగుచుక్కని వేలమేసింది నిరాశ కలలన్నీ నిస్సహాయంగా చూసే కథలయ్యాయి కల్పతరువనుకున్న కాలం కాలు దువ్వుతోంది కాలు కదలదు..నోరు మెదపదు జీవితం మదుపులో ఉన్నట్టుంది రిక్త హస్తంలా మస్తిష్కం శూన్య దేవతగ మారింది చుట్టూ బంధనాల్లాంటి కందకాలు విరిసే బాట విధ్వంసమయింది వీరుల ప్రమాణాలన్నీ వీథిన పడ్డాయి వెడలిపోయిన వసంతంలా వడలిపోయిన ఆలోచనలు కల్లోల్లాన్ని కానుక చేస్తుంటే మనసు కుదుర్లను బిగించి శూన్యాన్ని ఆత్మవిశ్వాసంతో అర్చిస్తేకానీ అస్థిరతల పొగమంచును దాటేలాలేను - సి. యస్. రాంబాబు
Read More

సంస్కారం

సంస్కారం చదువుకోవడం వల్ల సంస్కారం అబ్బుతుందని మన తల్లిదండ్రులు మనల్ని చదివిస్తారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి వాళ్ళు తిన్నా, తినకపోయినా తాము చదువుకోలేదని తమ పిల్లలైనా చదువుకోవాలని ఆశపడి కష్టపడుతూ రెక్కలు ముక్కలు చేసుకొని చదివిస్తారు. ఉద్యోగం చేస్తాడని, తమను ఉద్ధరిస్తాడని కాకుండా తన బ్రతుకు తాను బ్రతుకుతాడని సంస్కారవంతంగా అందరితో మెలుగుతాడని భావించి చదివిస్తారు. అయితే చదివిన అందరూ సంస్కారవంతులు కాకపోవచ్చు. చదువు లేని వారంతా సంస్కారులు అవ్వచ్చు. ఇక్కడ చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం అనేది జన్మతా రావాలి లేదా పరిస్థితులను బట్టి తమ కుటుంబ సభ్యులను బట్టి రావాలి అయితే కుటుంబమైన వ్యవస్థ అయిన కొందరి మనుషుల మీద విపరీత ప్రభావం చూపిస్తుంది. అయితే చదువుకున్నా కూడా సంస్కారహీనులుగా ప్రవర్తించే కొందరి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ మధ్య సోషల్ మీడియా అనేది చాలా మంది కి చాలా కామన్ అయిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉంటే…
Read More

నా డైరీ చిత్రం

నా డైరీ చిత్రం చాలా రోజుల తర్వాత పుట్టింటికి వచ్చిన నాకు ఊరంతా మారినట్టు అనిపించింది. అదంతా మామూలే కదా అనుకుంటూ ఇంటి వైపు నడుస్తున్నాను. మధ్యలో తెలిసిన వాళ్ళు నవ్వుతూ పలకరిస్తున్రునా. కొందరు అయితే గుర్తు పట్టనే లేదు నేనే వారిని పలకరించడంతో చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అలా అందర్నీ పలకరిస్తూ ఇంటికి వెళ్ళాను. అమ్మ ఎదరై ఎమ్మా ఇదేనా రావడం పిల్లలు, అల్లుడు బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలయ్యాక లోపలికి తీసుకుని వెళ్లి, ఎప్పుడు తిన్నావో ఏమిటో అంటూ తల్లి మనసుతో అన్నం వడ్డించింది. అన్నం తింటున్న నాతో ఏంటమ్మా సంగతులు ఇలా హఠాత్తుగా వచ్చావు అంటూ అరాలు తీసింది. ఏమైనా గొడవ పడి వచ్చాను అనుకుందేమో...! దానికి నేను నవ్వుతూ లేదమ్మా ఊరికే మిమల్ని చూసి పోదామని వచ్చాను అంటూ చెప్పి తినడం ముగించాను. సరే అలసి పోయి ఉంటావు కాసేపు పడుకో అంది అమ్మ.…
Read More

అభిలాష

అభిలాష నేను పదో తరగతి పాస్ అయ్యాక ఏ కాలేజీలో చేరాలి అనే సమస్య మొదలైంది. దగ్గరలో ఏ కాలేజీ లేదు. కాలేజికి వెళ్ళాలంటే పక్క ఊరికి వెళ్లాలి. అందువల్ల నాన్న గారు పక్క ఊర్లో ఏదైనా మంచి కాలేజీ ఉందేమో అని వెతకడానికి వెళ్ళారు ఒక రోజు. అయితే అక్కడ రెండు కాలేజికి ఉన్నాయి. అందులో నాన్నగారికి తెలిసిన ఒకరి కాలేజీ బాగా అనిపించింది. దాంతో అప్లికేషన్ ఫామ్ తెచ్చారు. తెల్లారి అది నింపేసి నన్ను తీసుకుని అక్కడికి వెళ్ళాం ఇద్దరం. అప్పటి వరకూ పక్క ఊరికి ఎప్పుడు వేళ్ళని నేను అదే మొదటి సారి వెళ్ళడం కావటం చేత అన్ని వింతగా చూస్తూ ఉన్నాను. అది కొంచం పెద్ద ఊరు కాబట్టి అన్ని కార్యాలయాలు అక్కడే ఉన్నాయి. ఇక నన్ను నాన్న గారు ప్రిన్సిపల్ కి చూపించి మా అమ్మాయి బాగా చదువుతుంది అంటూ చెప్పారు. ఫీజు కూడా…
Read More

ఆత్మా రాముడు

ఆత్మా రాముడు ఆహా ఏమి నా అదృష్టము ఇన్నేళ్ల తర్వాత పెళ్ళి భోజనం చెయ్యడానికి వెళ్తున్నా అంటే అది అదృష్టం కాదా మరి. ఇదేం విడ్డూరం పెళ్లికి వెళ్ళడం కూడా గొప్పెనా అంటారా గొప్పే మరి.... ఎందుకంటారా రెండేళ్లుగా ఇంట్లో పంజరంలో చిలుకలా బంధించి ఉంచిన నన్ను ఈ కరోనా పుణ్యమా అంటూ ఏవి తినివ్వకుండ తగానివ్వకుండ కషాయాల పేరిట ఏవేవో తాగించి నాలుకకి ఏ రుచి లేకుండా చేశారు. నాలుక మరీ మొద్దు బారిపాయింది. ఈ లాక్ డౌన్ తిసేశక ఇదోగో ఇదే నేను మొట్ట మొదటి సారిగా బయట అడుగు పెట్టబోతున్నాను. ఇదంతా వెళ్ళేది పెళ్లి వారి మీదున్న అభిమానంతో కాదని వాళ్ళు పెట్టే భోజనం గురించి అని ఎవరికీ తెలియదు నాకు తప్ప. క్యాబ్ మాట్లాడుకుని అందరం కలిసి వెళ్ళాం. ఫంక్షన్ హాల్ బయటకు వంటల ఘుమఘుమలు గాల్లో తేలుతూ వస్తున్నాయి. వాసన తోనే కడుపు నిండేలా…
Read More

ఆదర్శం

ఆదర్శం అక్షరాలన్నీ మాలలుగా జేసీ ఆప్యాయతలన్ని మూట గట్టి అందమైన వాక్యాలుగా మార్చి ప్రేమలన్ని భావలై విరాజిల్లగా వేదనంతా ఆవేదనగా మార్చినా మనసులోని భావాలని కత్తులుగా జేసినా అక్షర మనే ఆయుధం తో గుండెల్లో గుచ్చెలా ప్రశ్నిoచినా అదొక కలానికే సాధ్యం, మనతరం కాలగర్భంలో కలిసిపోయినా రాసినా రాతలన్ని ముందు తరానికి కావాలి ఆదర్శం... ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు... - అర్చన
Read More

సామాజిక మాధ్యమాల్లో మహిళల ప్రగతి

సామాజిక మాధ్యమాల్లో మహిళల ప్రగతి   సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియాలో మహిళలు ఎంతో ప్రగతిని సాధించారు. అయితే మహిళలు ప్రాచీన కాలం నుండి ఎన్నో వివక్షలు ఎదుర్కొంటున్నారు. పూర్వకాలం లో మహిళలకు చదువు చాలా తక్కువ, ఎక్కడో ఒక చోట రామాయణ, మహా భారతాలు చదివే వాళ్ళు. ఆ తర్వాత కాలంలో యుధ్ధ విద్యలతో పాటు సంస్కృతం నేర్చుకున్నారు. ఆ సమయం లో కూడా మహిళలకు చదువు అవసరం లేదని, చదువుకుంటే ఉన్న మతి పోతుంది అని మహిళల పట్ల ఎన్నో అడ్డంకులు తెచ్చారు ఛాందస వాదులు. ఈ ఛాందస వాదుల నుండి తప్పించుకున్న మహిళలు అంతో ఇంతో చదవడం మొదలు పెట్టారు. కానీ అవి కూడా భక్తి కి సంభందించిన వాటిని మాత్రమే చదివించారు. భక్తిరస పుస్తకాలు రాసిన వారిలో మొల్ల రామాయణము ముఖ్యమైనది. ఇంకా చాలా రచయితలు వచ్చినప్పటికీ మన తెలుగు లో మొల్ల, కృప…
Read More

చెలి

చెలి విరిసిన సుమాల మాలవో అరివిరిదిన రంగుల హరవిల్లువో మణి కాంతులు  ఎగజిమ్మే తారవో వసంతాల మందారమాలవో పూరి విప్పిన నెమలి పింఛం అంచువో కల హంసల నడకల వయ్యారి భామవో కమ్మని కావ్యంపు పాటవో కదిలే మది ఊహావో మెరిసే మెరుపుల మురిసే నవ్వుల అందానివో నా ఊహల సామ్రాజ్య రాణివో నా హృదయ నెచ్చెలివో .. నా బిగి కౌగిలిలో ఒదిగిపోయే మనసైన నా చెలివో.... - అర్చన
Read More

అమ్మ నవ్వింది

అమ్మ నవ్వింది అమ్మ అనే కమ్మనైన పిలుపు కన్నా తియ్యని పిలుపు ఏది లేదీ లోకం లో, అమ్మ అనే పదానికి ఎంతో శక్తి ఉంది. అమ్మ అనే పదానికి ఎంతో ప్రేమ, మమకారం, ఆప్యాయత అనురాగం కలగలిపిన ప్రతి రూపం అమ్మ. కన్న తల్లిని ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరు. ఒక వేళ మర్చిపోయారు అంటే వాళ్ళ కంటే నికృష్టులు ఎవరూ ఉండరు. అమ్మను కష్టపెట్టే వాడు అసలు మనిషే కాదు. కొందరు తల్లిని అనాధ శరణాలయం లో వదిలేస్తారు. నవమాసాలు మోసి, కని, మల ముత్రాలు తీసేసిన తల్లిని కాదనుకుంటారు. కానీ ఆ తల్లి మాత్రం తన పిల్లలు బాగుండాలి అని కోరుకుంటుంది. అలాంటి వాళ్ళు నా దృష్టిలో నికృష్ట హీనులు. కుక్క కంటే కూడా హీనమైన వారు. అంత నికృష్టులు అయినా ఆ తల్లి మాత్రం నా పిల్లలు బంగారం అనే అంటుంది తప్ప వాళ్ళు వెధవలు అని…
Read More