g jaya aksharalipi

తీపి

తీపి ఒక కబురు తీపి ఒక జ్ఞాపకం తీపి ఒక గుర్తు తీపి ఒకరి ప్రేమ తీపి ఒక ఊహ తీపి ఒక రుచి తీపి ఒక కల తీపి ఒక భావం తీపి ఒక ఇష్టం తీపి ఒక అనుభూతి తీపి ఒక భాష తీపి ఒక మృదువైన మాట తీపి ఒక వెళ్ళిన కాలం తీపి ఒక భవిష్యత్తు తీపి ఒక ఆశ తీపి ఒక అనుభవం తీపి ప్రతి దినం తీపి గుర్తులు. - జి జయ
Read More

ఎదురుచూపు

ఎదురుచూపు ఎదురు వచ్చిన అదృష్టానికి కాలం కలిసి వ స్తే మనసు భారమంతా మాయం కాదా కాయలు కాసిన కన్నులకు తెలియని భావం తెర తీస్తే ఆరాట పు హృదయ స్పందన ఎదురుచూపు పసిబిడ్డ ల జాలిచూపు అమ్మ కోసం ఎదురుచూపు బడి గంటల మోత కోసం విద్యార్థుల ఎదురుచూపు కుశల ప్రశ్నలు అడిగే స్నేహితుడి కోసం ఎదురుచూపు స్వాతి చినుకుల ఆశ కోసం సంద్రం ఎదురుచూపు నవ యవ్వన ప్రియురాలి కోసం ప్రియుడి ఎదురుచూపు మనసు విప్పి న మాట కోసం భార్య ఎదురుచూపు పెరిగే వయస్సు పెను పెనుభారమైతే పిల్లల కోసం ఎదురుచూపు సమాజపు చైతన్యంకోసం మేధావుల ఎదురుచూపు భరతమాత తన ముద్దు బిడ్డల కోసం ఎప్పుడూ ఎదురు చూపే కదా ! - జి జయ
Read More

అజ్ఞాతం

అజ్ఞాతం పేరు లేని సంతకం అజ్ఞాతం అజ్ఞానం వీడితే అజ్ఞాతం అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. అజ్ఞాతం సరికొత్త జీవిత కోణం. అజ్ఞాతంలో రాత్రి ఎండలు పగలు చీకటిగా ఉంటుంది కాల నిర్ణయం లో తలుపు తెరిచిన ఘటన చేదునిజంలాంటి అజ్ఞాతం కారణాల కలతలు నిన్నటి అనుభవాల రేపటి అజ్ఞాత పాఠాలు అజ్ఞాన తిమిర సంహారాలు సావధానపు సమీకరణం అలల తాకిడికి అలజడి చేసిన సంద్రం ఏశాస్త్రము భోదించని గ్రంధం అజ్ఞాతం సత్య సాధనలో అజ్ఞాతం కనివిని ఎరుగని తెలియని పునర్జన్మ - జి జయ
Read More

పలుకే బంగారమాయె

పలుకే బంగారమాయె చర వాణి కాసేపు నువు మూగవోతే నేనెట్లా ఉండగలను చెప్పవే అరచేతి ప్రపంచానివి నీవు అందరికీ నేస్తమైన నీవు నా ఆత్రుత ఆలకించవే బంగారపు పలుకు పలుకవే ఏం చేసినా నా చూపు నీ వైపే ఏం చోద్యమో గానీ అరచేతి అందమా మరి ఆ క్షణికపు ఆవేదన మరి ప్రత్యక్ష నిదర్శనం అది పరోక్ష అంతరార్థం అది కమ్మని పాటవై కనిపించని స్నేహ మై పసిపాపల లాలివై వినోదపు సొంపువై తెరతేసిన చైతన్యమే లోకాల లోగిళ్లలో వరమిచ్చి న నీవే బంగారపు పలుకైతే ఉలికించి పలికించనా చరవాణి పలకవే ఆదరిస్తున్న నా కోసం అందుకే మరి నిన్నూ ..... - జి జయ
Read More

మా ఊరి పండగ

మా ఊరి పండగ అందమైన మా ఊరి లో వసంతం లో హోలి అంటూ కల్మ షాలు లేని అందరోక్కటిగా ఆడు కునే రంగుల పండగ ఉట్టి మీద పెరుగు తిని ఊరంతా తిరిగి తిరిగి ఊరి బయట మోదుగు చెట్టు బడిడారిన వెదురు బొంగు సమకూరిన పరికరం సంతసించిన మది కొసుకొచ్చిన పువ్వులు కోరిచేసిన రంగులు పన్నీటి జల్లులు కాదు మరిగించిన కాషాయ నీళ్ళు లోటల్లో నింపుకుని ఉరికి ఉరికి చల్లుకొని బావిలోని నీళ్ళు లేదంటే పేడ ముద్దలు అమ్మ ఆజ్ఞ వరకే ఆడిన రోజులూ మధురమైన భక్ష్యా లు మా కోక్కటి అనుకుంటూ మరునాడు బడికెళ్లి న రంగు ముఖం అదే ఆనందపు అనుభూతి ... - జి జయ
Read More

చివరికి మిగిలేది

చివరికి మిగిలేది మనిషి రంగుల ప్రపంచంలో చివరికి మిగిలేది ఏమంటే చివరికి మిగిలేది పాపం - పుణ్యం చివరికి మిగిలేది కోరికలు - ఆశలు చివరికి మిగిలేది తృప్తి - సంతృప్తి చివరికి మిగిలేది కాలం - గమనం చివరికి మిగిలేది విలువలు- వింతలు చివరికి మిగిలేది అనుభవం - అంతర్మథనం చివరికి మిగిలేది అర్దం - పరమార్థం చివరికి మిగిలేది మార్గం - సన్మార్గం చివరికి మిగిలేది కనుల లోని కలలు చివరికి మిగిలేది తరిమిన చీకటి చివరికి మిగిలేది నిత్యం - సత్యం చివరికి మిగిలేది సూక్ష్మం లో మోక్షం అదే బ్రహ్మానందం పరమానందం దివ్యత్వమే - జి.జయ
Read More

జత

జత జత కలిసింది అంటే జరిగిన వింత కథ మరి నింగి నేల కలిపితే అది ఒక భూ మండలం ప్రకృతి వికృతి కలిస్తే అది ఒక చూసే ప్రపంచం సూర్య చంద్రులు కలిస్తే అది ఒక కాంతుల దేదీప్య మే శరీరం మనస్సు కలిస్తే అది ఒక విలువైన ప్రాణం నిజం అబద్దం అనేవి అంత రంగాల అనుభవాలు కష్టం సుఖం కలిస్తే అది ఒక జీవన సమాహారం తప్పు ఒప్పు కలిస్తే అది ఒక అనుభవాల తంత్రం తోడు నీడ బంధం అది దైవం ప్రసా దిస్తే అత్యున్నత అభయ హస్తం - జి.జయ
Read More

శ్వాస

శ్వాస నీ శ్వాస నీ ఊపరిలో నిండి ఉన్నది వుచ్వాస నిచ్వాసాల సారమే పుట్టుక రహస్యం శ్వాసే ప్రాణం యానం శ్వాసే శక్తి చేవ శ్వాస నే నీ స్పందన శ్వాస నే అడుగు గడువు శ్వాస నే ఉలుకు పలుకు శ్వాస నే నిలువు నీడ శ్వాస నే రూపం రుణం శ్వాస నే నువ్వు నేను శ్వాస నే ఆరోగ్యం ఆనందం శ్వాస నే సంఘర్షణ అలుపెరగని హృదయానికి మరణం ఒక శరణ్యం అదే సృష్టి నీ. కిచ్చిన అద్భుత యోగం ... - జి జయ
Read More

అంతిమయాత్ర

అంతిమయాత్ర ఊరు దూరం కాటి దగ్గర అంటారు కదా మరి జనన మరణాల ఆత్మ డోలాయ మాన మార్గం ఆయుష్షు తీరి ఎవరి కోసం ఎదురుచూడని దారి అది విగత జీవికి మనం ఇచ్చే చివరి నీరాజనం సృష్టిలో జీవిత సమరం ముగిసి కనుమరుగు కు ప్రయాణం అది వొంటరిగా వచ్చి వొంటరిగా వెళ్ళే పాదయాత్ర నీ వాళ్ళు అనుకునే వారికి హృదయ ఘోష అది చేతనత్వాన్ని వదిలి పంచభూతాల సన్నిధికి చేరే అనంత లోకాల అంతిమయాత్ర అది.... -జి. జయ
Read More

నీ కోసం

నీ కోసం మనసు లోని అన్వేషణ నీ కోసం వేచి వున్న పరిచయాల భావన నీ కోసం మదినిందిన ఊహలు నీ కోసం కోటి ఆశల అంతరంగం నీ కోసం కోరికల మూటలైనవి నీ కోసం ప్రేమే సాక్షాత్కరించింది నీ కోసం ఎందరినో వదులుకున్న బంధం నీ కోసం వేచియున్న వేదికైనది నీ కోసం అనురాగాల ఆరగింపులు నీ కోసం ఆరాటాల ఈ పయనం నీ కోసం నమ్మకమే నడిచింది నీ కోసం మనసిచ్చిన నాడే మురిసింది నీ కోసం నీతో నడుస్తున్న ఈ జీవిత పయన మే నిజమని తెలుసుకున్న ఈ భావాన్ని అక్షర సుమాలుగా నీ కోసం నీ కోసం -జి.జయ
Read More