jaya writes

తొలిచూపు

తొలిచూపు  మాటలు లేని మంత్రము  భాష లేని భావము తొలిచూపు  కళ్ళలోన కదలాడుతూనే  హృదయ వీణ రాగము తొలి చూపు  ఆలోచనలు ఆగిపోయి  ప్రేమ పదాల ఉత్తరం తొలి చూపు  అందానికి బందమై  వింత  అనుభవాల  గంధమై పరిచయానికి  తెరతీసి పరిధులు దాటి  ప్రణయమై   ప్రేమ పుస్తకంగా పయనం అయితే  తొలి చూపు అవుతుంది  మలి బంధమై  కానిచో  అది అవుతుంది జీవితంలో  ఏప్రిల్ ఫూల్.... - జి.జయ
Read More

విచ్చుకున్న ఊహలు

విచ్చుకున్న ఊహలు ఊహల్లో మనమే మరో లోకాన్ని సృష్టించి వుంటే వ్యయ ప్రయాలతో పనిలేకుండా అమ్మ పెట్టే వెన్న అయినా అద్భుతమైన అందాలైన చెడి పోని స్నేహం అయినా వెన్నెల రాత్రులు అయినా విరితోటలో పువులైన శిల్పి చెక్కిన శిల్పం అయినా విహరించే విహాంగాలైన దేదీప్య కాంతులైన నక్షత్రాల నవ్వులైనా అందని ఆకాశం అయినా వూహించని వుప్పెన అయినా నడిసంద్రపు బాటలు అయినా విధి కి అందని వింతలైన పులకరించే సరిగమలైన పుడమి తల్లి రోదన అయినా నిన్ను వరించే అదృష్టమైన అన్నీ విరబూసిన తీయనైన ఊహా లోకమే. - జి.జయ
Read More

మంచితనము 

మంచితనము  మంచితనము కంటే మించిన సంపద లేదు అంటారు పెద్దలు  అమ్మే ఆస్తి కాదు కొనే వస్తువు కాదు నిష్కల్మషమైన మనసులొ  నుండి వస్తుంది  మంచితనము అర్దం  మారిపోయింది ఈ రోజుల్లో మసకబారిన మంచితనము తడబడుతున్న మానవత్వం పరిహాసాల పందేరంలో అబద్ధపు అంచుల్లో సమాజపు సరిహద్దులో  మంచితనాన్ని పరికిస్తే మానవత్వం కనులు  తెరుస్తుంది మనలో వుండే భావమే మంచితనంగా రూపుమారి  మనకు చూపిస్తుంది తీరు--- తెన్నూ... - జి.జయ
Read More

తల్లి

తల్లి కన్నతల్లిని వున్న ఊరిని మరచినవాడు మరుజన్మలో రాక్షసుడిగా పుడతారు అని పెద్దల మాట. బ్రతుకును ఇచ్చేది కన్నతల్లి. సుందర రూపం అని భావించేది కన్నతల్లి. తొలిపలుకు పలికించేది, తొలి అడుగు నడిపించేది కరుణ నిండుగ నింపేది కమ్మని మాటల మూటలు చెప్పేది. అంతరంగాల అక్షరాలు నీతిని క్యాతిని తెలిపేది కన్నతల్లి. తరగని ఆస్తులైన వదలని భారమైన సమతూకంలో తూచేది కన్నతల్లి. కాలం మారినా కారణం ఏదైనా నీ కోసమై దిగివచ్చిన దేవత కన్నతల్లి. - జి.జయ
Read More