kota

మాతృ దినోత్సవము

మాతృ దినోత్సవము 1) చిన్న నాట అమ్మ చీదరించుకొనక      కడిగి.ముత్యము వలె కాటుకెట్టి      దిష్టి తగలకుండ దిష్టి చుక్కను బెట్టి      ఊయలందు వేసి ఊపుచుండు 2) అమ్మ చెంతనున్న ఆటాడుకుందును      అమ్మ ఒడిన నున్న అంత హాయి      అమ్మ పెట్టు బువ్వ కమ్మగా ఉండును      అమ్మ కన్న నాకు అధికులెవరు 3) అమ్మ గోరుముద్ద అమృత సమముండు      అమ్మ ముద్దులన్ని కమ్మగుండు      అమ్మ హత్తుకొనిన బొమ్మ లక్కరలేదు      అమ్మ దేవతగద అవనియందు 4) అలసటెరుగకుండ అన్ని పనులు చేయు      విశ్రమించనట్టి విమల మనసు      అమ్మ సేవలందు అణువంత చేయము      అమ్మ ఋణము దీర్చ నలవిగాదు 5) స్వార్థ మెరుగనట్టి సేవలు చేసెడి      తల్లి ఋణము…
Read More

నీటి బొట్టు

నీటి బొట్టు ఆటవెలది: మొయిలు దాచె నంట మదిలోన మృదువుగా ధరణి పైన పంట దరికి పిలిచె పరుగు పరుగు నొచ్చె పొలముకై చిరువాన నేల తడిపె నటులె నీటి బొట్టు తేటగీతి: కలువ పైనున్న నినుచూడ కనుల పంట విలువ నీకన్న అధికము కలుగరెవరు చెలియ కన్నులో నీవుంటె చెడ్డ భయమె మునిగు ఆల్చిప్ప యదలోకి ముత్యమునుగు - కోట
Read More

నీటిబొట్టు

నీటిబొట్టు ఆటవెలదులు 1) పట్టు నీటి బొట్టు ప్రాణాలు నిలబెట్టు     ఇంకుగుంట ఉంటె జంకులేదు     ఊరికొక్క చెరువు ఊరంతకందము     నీరు లేక ఎవరు నీల్గవలదు 2) నాగరికతలన్ని నగరాలలో వెలిగె      నాటి వైభవమ్ము నేడు కరువు      వేల యేళ్ళనుండి వెలిగిన నరుడిలా      నీరు లేక నేడు నీల్గుచుండె 3) వాననీరు మిగుల వరదలై పోకుండ      ఇంకుగుంటయందు యిమడ జేయి      పుచ్చకాయ రీతి పుడమిలో జలమున్న      నీల్గు ప్రాణి జీవి నిలుచు నిజము 4) పుడమి గర్భమందు బుడగ నీరుండిన      హరితదనము అవని నావహించు      నింగి నేల వాలి నీరంత మడుగులై      పాడి. పంట తోడ పల్లవించు 5) వేదకాలమందు విలసిల్లు జలముల      పరిమితముగ వాడి…
Read More

కుటుంబం

కుటుంబం (ఆటవెలదులు) 1) జనులు ఎక్కువున్న ఝంఝాటముండును     కళకళమనుచుండు కాంతితోడ     అన్నదమ్ములంత ఆప్యాయతలతోడ     కలిసి మెలిసి యుంద్రు కనులముందు 2) పెద్దవారి మాట పెడచెవి బెట్టరు      అణిగిమణిగి యుండు ఆదరముగ      బంధు మిత్రులంత బంధాల పిలుపులు      ఐకమత్యమెపుడు అనుసరించు 3)  సంఘమందుపేరు సాటివారియందు       కలిసి మెలిసి యున్న కలదు సుఖము       పాలు పంచుకొనును పరుల కష్టాలను       పనులు తేలికౌను పలువిధముల 4) పెద్దవారి జాడ పెరుగుతూ ఉందురు       అవసరమ్ము వస్తె అడుగు చుంద్రు       తప్పటడుగు లేక తడబాటు రాకుండ       లక్ష్య మెంచి సాగు లక్షణంబు 5) పిన్నవారి పనుల పర్యవేక్షణముండు      తగినపనులు జెప్పు తగవులేక  …
Read More

అన్నా- చెల్లి

అన్నా- చెల్లి తేటగీతి కలిసి ఆడుకొనుచు తీపి కలలు కంటు క్షణము కవ్వించు తక్షణం క్షేమమరచు కంటిపాపగా చెల్లిని కాచుచుండు చెదరి పోనట్టి బంధము సోదరులది తేటగీతి కళ్ళ గంతలు గట్టించు కేక పెట్టు పట్టు తప్పక చెల్లిని పట్టుకొనగ అలసి పోయిన దొరుకును అతనికతడె అన్న చెల్లెళ్ళ బంధము కంతులేదు ఆటవెలది జంట కవులలాగ జట్టుగా వుందురు అరమరికలులేక ఆడుచుంద్రు అమ్మ వంట పనుల కాటంక పడకుండ ఊయలందు వేసి ఊపుచుండు - కోట
Read More

పిడుగు

పిడుగు 1) ఉక్కపోత పోసి ఉరుములు మెరుపులు     పిక్కటిల్లి పగలు పిడుగు రాలె     పిడుగు పాటు వల్ల పిల్లజెల్లా జచ్చె     చెలకలోన ఎడ్లు చేష్ట లుడిగె 2) ఆక్సిడెంట్ వల్ల అయిన వారూ పోతె     హాస్పిటలున చేర్చిరపరిచితులు     ఫోను చేసి చెప్పె పోయిన వార్తను     పిడుగు వార్తను విని పీనుగయ్యె 3) పంచభూతములను బాధించు మనిషిని      పట్టు బట్టి పిడుగు మట్టుబెట్టె      పిడుగు వార్త విన్న పిల్లలు పెద్దలు      గుండెపోటు వచ్చి గుటుకు మనిరి - కోట
Read More

వనశోభ

వనశోభ ఆ.వె. కనుల విందు చేయు కమనీయ వనజాక్షి సూర్య రశ్మి సోకి సొగసు లంది పచ్చ చీరగట్టి పైట కొంగును వేసి చూచు వారి మనసు చూరగొనెను - కోట
Read More

విరులు

విరులు మగువలు ధరియించి మన్మథుని పిలుచు కుసుమ చామరములు కోర్కె పెంచు పరిసరముల కంత పరిమళం అందించు సృష్టి కార్యములకు సిద్ధ పరచు - కోట
Read More

విరులు

విరులు పుడమిపైన పూలవనము ప్రకృతికే అందము తరులన్ని విరబూసిన నయనాలకు అందము పూల ద్వారతోరణాలు ప్రతి ఇంటికి అందము వనమంతా గుబాళించు విరులెంతో అందము మగువల కురులందు మురిసిన విరులందము ఇంద్ర ధనుస్సును బోలిన విరుల తరులు అందము హరి హరుల శిరములపై వాలిన విరులందము జనహృదయం దోచుకున్న సుమ సుగంధ పరిమళం అమరవీరుల పాదాలచెంత పడినపూలు ధన్యము బాలాజిని అభిషేకించు విరులతతులు ధన్యము త్యాగధనుల మెడను వాలుపూలదండ ధన్యము విరుల పంట పండించే రైతు జన్మ ధన్యము కుసుమాల పోషకుడు వనమాలి ధన్యుడు విరులనేరు పూబోనుల కరములు ధన్యము మగవారిని మరులు గొలుపు విరిదండకు వందనం ప్రతిఫల మాసించని కుసుమాలకు వందనం విరుల త్యాగగుణమున్న మనుషులకు వందనం - కోట
Read More

మనుషులు

మనుషులు ఆ.వె 1) పంచభూతములను పట్టి ఆడించుచూ     మనిషికున్న గొప్ప మహిమ చాటె     జీవరాశి యందు చిన్న దేహము వాడు     మేథయందు జగతి మేలుకొలుపు ఆ.వె. 2) మనిషి తిరుగుతు గనె మహిలోన వింతలు      మనిషి మేథ తోటి మహిమ జేసి      అవని వింతలు మార్చి ఆనందపడుచుండె      ముప్పు ఎరుగడాయె ముందు ముందు ఆ.వె. 3) నాటి మనుషులంత సాటి మనిషి తోటి     ఐకమత్యముండి ఆదరించె     నేటి మనుషులంత సాటి వాన్నేదోచి      ఏమి ఎరగనట్లు ఏడ్చుచుండె ఆ.వె. 4) ముందు మాట వినపసందుగా ఉండును      వెనుక గోతి తీసి వెన్ను పొడుచు      బంధువులనువారు బద్ధశత్రువులాయె      ఎవరు మంచివారొ ఎరుగ లేము - కోట
Read More