మౌనం ఆ మధ్య కాలంలో ఏదో మాటపై మాట వచ్చి నేను మా అమ్మ గారి తో కాస్త గొడవ పడ్డాను. చిన్న మాట నే కానీ నా ఆవేశం వల్ల నేను తొందరపడ్డాను. కానీ నాకు కోపం చాలా వచ్చింది. దాంతో నేను మా అమ్మతో మాట మానేశాను. అది కూడా కరోనా సమయంలోనే, ఈ కారణం అనేది చాలామందిని చాలా ప్రస్టేషన్ కి గురిచేసింది. అందరూ ఇంట్లోనే ఉండడం వల్లనో ఏమో చేసే పని ఎక్కువ అయింది పని ఎంత చేసినా తరగదు. ఇంట్లో ఉన్న సమయంలో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుభవమయ్యే ఉంటుంది. అయితే ఆ ప్రస్టేషన్ లో నేను మా అమ్మ కాస్త గొడవ పడిన మాట నిజం. పాపం మా అమ్మకి మోకాళ్ళ నొప్పులు నిలబడి వంట చేయలేదు. ఇది తెలిసినా కూడా నేను రోజూ చేయడం విసుగొచ్చి నువ్వు ఒకసారి…