Month: February 2022

కూతలరాయుడు పుస్తక సమీక్ష

కూతలరాయుడు పుస్తక సమీక్ష నవతరం కూత ఇది బోర్ కొట్టించే రచయితలున్నట్టే కొంతమంది బోర్న్ రచయితలుంటారు. అలాంటివారి వెలుగు మనలను వెతుక్కుంటూ వస్తుంది. ఇదిగో ఆ వెలుగు పుంజమే కూతలరాయుడు aka సాయి కౌలూరి. బాగా రాయాలంటే బాగా చదవలన్న కాన్సెప్ట్ కు ఇలాంటి కూతలరాయుళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుతూ నాకసలు చదివే అలవాటే లేదండీ అని నమ్మకంగా చెబుతారు. మరెలా సాధ్యం.. నీ అసాధ్యం కూలా అని మనమనుకోవాలి.. సరే ఆ విషయాలను పక్కన పెట్టేస్తే చాలారోజుల తరవాత ఎత్తిన గ్లాసు దించనట్టు చేతిలోకి తీసిన పుస్తకాన్ని దించకుండా చదివే అవకాశం సాయి కౌలూరి మనకు కల్పించాడు.. *అ* నుంచి *ఋ* అక్షరక్రమంలో కథలను గల్పికలు, నవలికలతో మనలను చుట్టేస్తాడు. అదీ తన ప్రత్యేకత. వాక్యాల వర్షమా అది.. వెన్నెల వర్షం.. అమ్మా, నాన్నల అనుబంధంతో మొదలైన కథాపర్వం అపురూపంగా సాగుతుంది. ఆంగ్ల భాషా పదాలను వద్దని అందరూ అంటారు గానీ.. ఒడుపుగా వాడటం…
Read More

సగటు జీవి

సగటు జీవి కొనడానికి చెప్పులు లేక , ఎండలో తిరుగుతూ , ఇంటింటికి వెళ్లి , వారి , తలుపును తడుతూ , కొందరు మొఖం మీద , ఇంకొందరు నోటి మీద , మరి కొందరు బండ బూతులు తిడుతుంటే , వాటన్నింటినీ చిరు నవ్వుతో భరిస్తూ , పెరిగిన బస్ ఛార్జీ లను తట్టుకుంటూ , చిల్లర ఇవ్వని కండక్టర్ ని తిట్టుకుంటూ , ఎక్కిన బస్ ఎక్కుతూ , దిగిన బస్ దిగుతూ , ఎక్కిన గడప, దిగే గడప , ఎక్కుతూ, దిగుతూ , పెరిగిన ధరలతో , బతకడం చేతకాని , మధ్య తరగతి , సగటు జీవి , మార్కెటింగ్ లో ఎదురు దెబ్బలు తింటూ , తినడానికి సమయం కూడా లేక, అవసరాలు తీరక , అప్పు చేసే ధైర్యం లేక , ఉన్నతంగా బతక లేక , మధ్యతరగతి బతుకు…
Read More

వేదన

వేదన వేదనెందుకు నీకు ? వల్లె వేయుటకు అది వేదము కాదు! నీవు జీవివి. నిర్జీవివి ఆనుకుంటే రాబందులు నీ చుట్టుముట్టు ! చీకటి మయము కాదు నీ జీవితం ఒక రోజులో అర్ధభాగం అంధకారము కాదా ? చీకటిలో వెలిగించు చిరు దివ్వెను కాంతిని గాంచు. నీ కన్నుల నిండుగా ! - వాసు
Read More

నీ వ్యక్తిత్వం

నీ వ్యక్తిత్వం ఒకరి దృష్టిలో నువ్వు ఉన్నతంగా నిలవడం, అది వారి వ్యక్తిత్వం. ఒకరు, నీదృష్టిలో ఉన్నతంగా నిలవడం, నీ వ్యక్తిత్వం. -బి.రాధిక
Read More

ఓ సరస్వతమ్మా

ఓ సరస్వతమ్మా భీక్షున్నైన, భక్షున్నైన వరించునది నీవేనమ్మా! నీవు సర్వస్థితులకు కారణమమ్మా ఓ సరస్వతమ్మా....! నేను శిఖరము చేరినా అధమన ఉన్న నా స్థైర్యం నీవేనమ్మా...! ధనము బలహీనతమ్మా మమ్ము నశించు కృశించు నమ్మా చెలమ యందు ఊటా తధ్యమమ్మా మా దాహంతీర అది చాలునమ్మా నీవు అబ్బిన చాలును పంచభూతలలో చేరును ఆరవది అది మేమేనమ్మా నీ బిడ్డలమమ్మ, ఓ సరస్వతమ్మా! - వాసు
Read More

మార్పు

మార్పు మారుతుంది కాలమా లేక మనుషులా.. మార్పు రావాల్సింది మనుషుల్లోనా లేక వాళ్ల ఆలోచనలలోనా.. హృదయానికి తగిలిన ప్రతీ గాయాన్ని ఒక పాఠం గా మార్చుకుంటే అదే మార్పు నాలో మార్పు మొదలైంది.. నేను మారాను.. మారుతున్నాను.. నాతో పాటు కాలం కూడా మారుతుంది.... - మల్లి ఎస్ చౌదరి 
Read More

నీ విజయం

నీ విజయం నువ్వు చేరాలనుకున్నదే, నీ గమ్యం. నువ్వు సాధించినదే, నీ విజయం. నీ వెనకున్నదే, నీ సైన్యం. -బి.రాధిక
Read More

కోపం

కోపం కోపం వచ్చినప్పుడు ముందు...కోపంగా మాట్లాడతా... తర్వాత తీరిగ్గా బాధపడతా.... అలా మట్లాడినందుకు సిగ్గు పడతా... మళ్ళీ ఇలా మాట్లాడకూడదు అని గుర్తు పెడతా.. ఏంటో ఇలా ఉంది లైఫ్ అని అలోచనలో పడతా... కానీ మళ్ళీ కోపం వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తు రావూ... మళ్ళీ కొప్పడతా. - మల్లి ఎస్ చౌదరి
Read More