Month: February 2022

మాటల మంటలు

మాటల మంటలు మౌనాలు మలుపులు  మనసుకు తాళాలు చిక్కుముడులు పీటముడులు  బంధాలు అనుబంధాలు  ఆట ముగుస్తుందని  కన్నార్పలేము  కనుల నీటిచెమ్మ ఆశకు నీటి చెలమ  కలతలు కష్టాలు  యుగళగీతాలు పలకరింపుల వానే ఎడారికోయిల  ఎదమీటే రాగాలు  ఎదపంచే మోహాలు ఎడబాటు ఆవేశాలు  మనసుకు ఆదేశాలు కలలను మోసేవాడు కలతలు తీర్చుతాడు  కాలం చెట్టుకు  పాదులు తీయగలిగేవాడెవ్వడు - సి.యస్.రాంబాబు
Read More

వేదన

వేదన ఆడపిల్ల మనసు సముద్రమంత లోతు మగవాడి మనసు సముద్రమంత విశాలం ఇద్దరూ పడే వేదన మాత్రం సముద్రఘోషలాగా ఉంటుంది మనసు పడే ఆ వేదన వర్ణించడానికి వీలుకాదు వివరించేందుకు మాటలు లేవు ఈ ఆవేదనే అనురక్తిగా అత్యంత శక్తిగా మారి ఒక కొత్త పునాదికి నాంది కావాలి - హిమ
Read More

వేదన

వేదన వేదన.. నన్ను కలిచివేస్తున్న ఆలోచనల సమూహం.. దహించివేస్తున్న లేమి నైరాశ్యపు ఎడారి దాహం ప్రేమ విత్తులు కొన్ని నాటి ఆశల వాన కొంత కురిపించు ఇది నీ బాధల తాలూకు అంతర్మధనంతో నీ మనసు చేసే విన్నపాల నివేదన - సుస్మిత
Read More

వేదన

వేదన ఆశల తలపులు అనునిత్యం.. మదిలో చప్పుడు ప్రతినిత్యం.. వేదికగా నిలచిన జీవితసత్యం.. నివ్వెరపోకోయ్ నిరతము కాదు కదా..! వేదన పొందినా.. వేదం కదా ఆ సంఘర్షణ శాస్త్రం..!! - భాను శ్రీమేఘన
Read More

గత జీవితం

గత జీవితం కొందరికి గత జీవితం మిగిల్చిన గరళం. ఇంకొందరికి రేపటికై గుండెల్లో మండే జ్వలనం. మరికొందరికి పగతో రగిలే వెచ్చని రుధిరం. మనిషికి చిరునవ్వుని దూరం చేసే తిమిరం. మనసుకి ఆశ నిరాశల మధ్య సమరం. - శివ.KKR
Read More

వేదన

వేదన అత్యంత ఆత్మీయులు, అమూల్యమైన వస్తువులు, అతి ముఖ్యమైన పనుల వల్లే వేదన,అవేదనలకు లోనవ్వుతారు. వేదన చాలాసార్లు ఎక్కువ  ఆశించినప్పుడు,మన అనేది కోల్పోయినప్పుడు కలుగుతుంది. వేదన ఒక విధంగా అత్యంత ఎక్కువ ప్రేమ వల్ల కూడా చోటు చేసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో,కొన్ని పరిస్థితుల్లో వేదన , బాధ నుంచి ఆలోచనలకు మారే అవకాశం వుంటుంది. రాయి రాయి రాపిడి వల్ల నిప్పు వచ్చినట్టు, వేదనలో ఆలోచనల రాపిడి వల్ల ఆలోచనలు వస్తాయి.అలాంటి వేదన అవసరం, ఒక చేదు అనుభవం గొప్ప పాఠం నేర్పిస్తుంది.  అది నేర్చుకోవాలంటే, మనసు వేదనకులోనవ్వాలి. ఆలోచనలతో బయటపడాలి. అప్పుడే జీవితానికి అర్థం. వేదనలో ఆనందం వేతుకుంటూ వుంటే,జీవితం వ్యర్థం అవుతుంది. ఎలా అంటే, కొవ్వొత్తు వెలుగును చూస్తూ, కొవ్వొత్తు కరిగిపోయినట్టు. - బి రాధిక
Read More

గతం

గతం గతమే గతిని నిర్దేశించేది. జ్ఞాపకంలా గుర్తుండిపోయేది. అనుభవాల సారమిది. అనుభూతులు మిగిల్చేది. వర్తమానానికి దిక్సూచిది. భవిష్యత్తుకు నిఘంటువిది. గతమనేది జీవిత కాలపు గుర్తు. గతమే లేని జీవితం లేదు. గతంలోనే జీవనం సాగిస్తే, వర్తమానానికి జీవం వుండదు. భవిష్యత్తు జీవితం వుండదు. -బి రాధిక
Read More

గతం

గతం జీవన తరంగాల సంతకం. కాలం మిగిల్చిన జ్ఞాపకం ప్రాయం పంచిన అనుభవం. నీ నేటిని నడిపే ఇంధనం. భవితను మలచే సాధనం. - శివ.KKR
Read More

పంచాంగము 05.02.2022

పంచాంగము 05.02.2022   విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: శుక్ల-శుద్ద తిథి: చవితి ఉ.7:27 వరకు తదుపరి పంచమి వారం: శనివారం-మందవాసరే నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.07:47 వరకు తదుపరి రేవతి యోగం: సిధ్ధ రా.07:49 వరకు తదుపరి సద్య కరణం: భధ్ర ఉ‌.07:27 వరకు తదుపరి బవ రా.07:26 వరకు తదుపరి బాలవ వర్జ్యం: ఉ.పూ.05:10 - 06:47 వరకు దుర్ముహూర్తం: ఉ.06:46 - 08:14 రాహు కాలం: ఉ.09:38 - 11:04 గుళిక కాలం: ఉ.06:46 - 08:13 యమ గండం: ప‌.01:55 - 03:21 అభిజిత్: 12:08 - 12:52 సూర్యోదయం: 06:46 సూర్యాస్తమయం: 06:13 చంద్రోదయం: ఉ.09:49 చంద్రాస్తమయం: రా.10:12 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: మీనం దిశ శూల: తూర్పు చంద్ర నివాసం: ఉత్తరం 🚩…
Read More

నీ మనసు

నీ మనసు నీ మనసు బంగారం.. అది విరిగినా.. ముక్కలు అయినా కాల్చినా దాని విలువ, స్థాయి, స్థానం ఎప్పటికి తరగదు.. మన ఆలోచన విధానం మారింది అంతే... - మల్లి ఎస్ చౌదరి
Read More