Month: February 2022

కరోనా జాగ్రత్తలు ఆటవెలదులు

కరోనా జాగ్రత్తలు ఆటవెలదులు   బయటకెళ్ళునపుడు బాధ్యత మరువకు మాస్కును ధరియించు మంచిదౌను దూరముండ వలెను దుష్ట కరోనకు టీక వేయువరకు తిరుగ రాదు. బాలవాక్కులన్ని బ్రహ్మ వాక్కు లంటు భేదమనకచెప్పె వేదవాక్కు భావిపౌరులైన పసివారి పనిపట్ట కసికరోన ముందుకరుగు చుండె. మానవత్వ మంత మంటగలుపుచుండె మనసు కరుగదీ కరోన కేమి బతికి యున్ననాటి బంగారు బంధాలు మానవ మనుగడకు మచ్చ తెచ్చె. తల్లి దండ్రి లేక తల్లడిల్లెడివారు అమ్మ పాలు దాగ అరచువారు ఆదరించుఅమ్మ ఆనవాలు గనక దీనులై వెదికిరి దిక్కు లేక. ఒకరు వదిలిన గాలి నొకరు పీల్చిన వచ్చు మాయదీకరోన మరువ వద్దు రక్త నాళములకు శక్తి మార్గము మూయు ప్రాణ వాయువింక పారిపోవు. మాదీ కరోన మాయమయ్యేదాక మనము యింటియందె మసలవలయు దూరబంధువంటు దర్శించ వచ్చినా ఆత్మ బంధువంటు హత్తుకోకు. ఆకలి కడుపులకు అలసటతోడాయె కాళ్ళు నడవలేక కూలబడెను కళ్ళుతిరుగుడాయె కడుపులో మంటలు మానవత్వమంత మూగబోయె.…
Read More

ఎవరే నువ్వు

ఎవరే నువ్వు మరు మల్లెల చాటున దాచిన అందమా మధు వనం లో పూసిన పరువమా.. పెదవంచున దాచిన ప్రణయమా.. నా కలం నుండి జాలువారిన కావ్యమా.. ఎవరే నువ్వు.. ఎవరే నువ్వు .. - మల్లి ఎస్ చౌదరి 
Read More

ఆ క్షణం

ఆ క్షణం తల్లి అయినా ఆ క్షణం ఎంతో గర్వం గా అనిపించింది కొత్త జీవి రాక కోసం వెయ్యి కన్నులతో ఎదిరి చూపులు చూస్తూ సాగుతున్న కాలాన్ని ఇంకెందుకు సాగుతున్నాయని తిట్టుకుంటూ ఆ కొత్త జీవి ఎప్పుడు కళ్ళముందు కు వస్తుందన్న ఆత్రం తో క్షణాలు యుగాలుగా యుగాలు క్షణాలు గా గడుపుతూ చూస్తున్నా క్షణాన ఇదిగో నేనోస్తున్నా అంటూ కడుపు చీల్చుకుని బయటకు వచ్చిన క్షణం ఆ మధుర క్షణాలను మరచిపోగలనా అప్పటి వరకు పసి తనపు ఛాయలు పోని నేను అమ్మగా బహుమతి అందుకున్నప్పుడు ఆచిన్ని పాదాలను, చిన్ని కళ్ళను చూస్తూ మైమరచి పోతూ, ఇది కన్నది నేనేనా అనే సంశయం లో అద్భుతాన్ని ఆవిష్కరించిన ఆ పసి గుడ్డును చేతుల్లోకి తీసుకుని ఆ చిన్ని నుదుటి పైన తొలిముద్దు ను ముద్రించిన ఆ అపురమైన దృశ్యాన్ని వర్ణించగలమా, అనుభవిస్తే కానీ తెలియని అమోఘమైన ఆనందం మన…
Read More

తొలి ముద్దు అంటే

తొలి ముద్దు అంటే తొలి ముద్దు అంటే ఒకరు మనకి ప్రేమగా తొలిసారి పెట్టిన ముద్దు మాత్రమే కాదు, ఒకరికి మనం ప్రేమగా పెట్టిన తొలిముద్దు అని మాత్రమే కాదు, రెండు మనసులు ఇష్టపడిన క్షణంలో పెదవులతో పలకరించుకుని, మనసులలో ఆస్వాదించే భావన తొలిముద్దు. ఆ ముద్దు అనుభవం, అనుభూతి చివర శ్వాస వరకు ఊపిరి పోస్తుంది. ఎన్నిసార్లు ఆస్వాదించినా తొలిసారి అనుభవాన్ని ప్రతిసారీ రుచి చూపిస్తుంది. - బి.రాధిక
Read More

తొలి ముద్దు

తొలి ముద్దు తొలిముద్దు అంటే అది ప్రేమకు ఒక నజరానా అందం అనురాగమనేది ఊరించిన ఊహలలో చిగురించిన ఒక ఆశే తొలిముద్దు రెక్కలు విప్పిన కోరికలు వలపు పిలుపుల కవ్వింత నిరీక్షించిన కన్నులకు నిజమై తెలిసినదే తొలిముద్దు సిగ్గు లోలికే నెరజానకు ప్రణయ పారవశ్యం తొలి ముద్దు చెలిమి గుండెల్లో చేరుకున్న సరిహద్దులు దాటిన ప్రేమకు చిహ్నమే తొలి ముద్దు అదే అతి పెద్ద బహుమతి కావాలి జీవితంలో... - జి జయ
Read More

పంచాంగము 23.02.2022

పంచాంగము 23.02.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *మాఘ మాసం - బహళ పక్షం* తిధి : *సప్తమి* సా4.03 వరకు వారం : *బుధవారం* (సౌమ్యవాసరే) నక్షత్రం: *విశాఖ* మ2.05 వరకు యోగం: *ధృవం* ఉ8.11వరకు కరణం: *బవ* సా4.03 వరకు & *బాలువ* మ2.56 వర్జ్యం: *సా5.50 - 7.20* దుర్ముహూర్తం : *ఉ11.50 - 12.36* అమృతకాలం: *ఉ7.16 - 8.29* & *రా2.51 - 4.21* రాహుకాలం : *మ12.00 - 1.30* యమగండ/కేతుకాలం: *ఉ7.30 - 9.00* సూర్యరాశి: *కుంభం* చంద్రరాశి: *తుల* సూర్యోదయం: *6.28* సూర్యాస్తమయం: *6.00* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

మాతృభాష

మాతృభాష   తల్లిలాంటి లాలింపు... తండ్రిలాంటి రక్షణ... వ్యక్తి మనుగడకు సాధనం... వ్యక్తి పురోగాభివృద్ధికీ కాగడ... భావాలపరంపర అన్వయం... భావోద్వేగాల మేళవింపు... మృదుమధురం... అతిసుందరం... పరభాషను గౌరవిస్తూ... మాతృభాష గౌరవాన్ని పెంచుదాం... మాతృభాషను ప్రేమిద్దాం... మాతృభాష పరిరక్షణకై మనవంతు కృషి చేద్దాం... - గోగుల నారాయణ  
Read More

కరోనా ఆటవెలదులు

కరోనా ఆటవెలదులు 1) లాకుడౌను వల్ల లాసైన దేశము రెండవ అలవల్ల రెంటజెడెను గుర్తు పట్టనంత గుట్టుగా వ్యాపించి కాటికంపు చుండెగా కరోన 2) చాపకింద నీటిచందాన దరిజేరి ఆనవాలు లేక అంటుకొనును సబ్బుతో కరములను శుభ్రంగ కడగాలి కాదు కూడదంటె కలుగు ముప్పు 3) చేతులెత్తి మొక్కు షేకుహాండివ్వకు దరికిబోయి దాన్ని తగులుకోకు మరల తిరిగి వచ్చె మాయదారి కరోన మాస్కు బెట్టి దాన్ని మట్టుబెట్టు 4) భౌతికముగ ఎడము పాటించి తీరాలి ఒరుసుకుంటు తిరుగ ఒంటికంటు ఎడము ఉండవలెను ఏ జనమెదురైన లెక్క జేయకుంటె ప్రక్క జేరు - కోట పెంటయ్య
Read More

ప్రేమ లోకం అంటే?

ప్రేమ లోకం అంటే? లోకం లో ప్రేమ అనేది ఎక్కడా లేదు. స్వార్థం తప్ప, ఎక్కడ చూసినా స్వార్థమైన ప్రేమ తప్ప మంచి మనసున్న ప్రేమ ఎక్కడా లేదు. రకరకాల ప్రేమలు రంగు పులుముకున్నాయి. ఒకవేళ నిజంగా ప్రేమ లోకం అంటే ఎలా ఉంటుందో అనే ఊహా తో రాస్తున్న.... ప్రేమ లోకం లో ఒకరిని ఒకరు దూషిoచుకోరు. ప్రేమ లోకం లో ఒకరి పై మరొకరికి అంతులేని ప్రేమ ఉంటుంది. ఆ లోకం లో ఎలాంటి భేషజాలు  ఉండవు. ఎలాంటి కక్షలు, కార్పణ్యాలు ఉండవు. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఆప్యాయత, అనురాగాలు కలగలిపి ఉంటుంది. డబ్బు కోసం ఒకర్ని ఒకరు చంపుకోవడం ఉండదు. సాటి మనిషిని ప్రేమ తో చూస్తారు. మనిషి మనుగడ కోసం ఎవర్నీ అణచి వేయడానికి చూడరు. అందంగా ఉంటుంది ఆ లోకం. సప్త వర్ణాల  కలయికగా, ఏడేడు లోకాలకు ఆదర్శంగా నిలుస్తుంది. అంతటి…
Read More

ప్రేమలోకం

ప్రేమ లోకం  నా ప్రేమ లోకం లో నువ్వొక అక్షరానివి నా ప్రేమ లోకం లో నిలువెత్తు నిదర్శనం నువ్వు నా ప్రేమ లోకం లో నువ్వొక ఊహావు నా ప్రేమ లోకం లో నువ్వొక కలికి తురాయివి నా ప్రేమ లోకం నువ్వొక ఆశవి నా ప్రేమ లోకం లో నా భవిష్యత్తువి నా ప్రేమ లోకం లో నువ్వొక అద్రుష్టానివి  నా ప్రేమ లోకం లో నువ్వొక తారవి నా ప్రేమ లోకం లో నువ్వొక ఆశా కిరణానివి నా ప్రేమ లోకం లో ఉదయించే కిరణం నువ్వు నా ప్రేమ లోకం లో ఊపిరి నువ్వు నా ప్రేమ లోకం లో శ్వాస నువ్వు నా ప్రేమ లోకం లో నువ్వొక మహరాజువు నీ ప్రేమ లోకంలోకి నీ రాణిలా నన్ను ఆహ్వానిస్తావా  ప్రియా..... - భవ్య చారు  
Read More