Month: March 2022

సంకల్ప బలం

సంకల్ప బలం తడబడుతు తలబడుతు సాగిపో శిఖరం ఏదైన అధిరోహించు నీ బలంతో సంకల్ప బలంతో భారం ఎంతైన బాధ్యత నీదేగా ఎత్తు పైకెత్తు ఆకాశాన్నే ఢీకొట్టు నీ బలంతో సంకల్ప బలంతో భయమే నిన్ను వెనుకకు నెట్టినా బాణంలా దూసుకుపోరా నీ బలంతో సంకల్ప బలంతో అటుగా ఇటుగా ఎటువైపైన ముందరికాళ్ళ బంధాన్ని అనుబంధంగా మార్చేయరా నీ బలంతో సంకల్ప బలంతో వేసే అడుగు చేసే పని చెప్పే నోట వినే మాట నీ గమ్యానికి చేరవేయరా నీ బలంతో సంకల్ప బలంతో - సతీష్ కొయ్యల
Read More

జంట శ్వాస

జంట శ్వాస హరి, సుజలది గొప్ప జీవితం. వీరిది ఆదర్శ జంట. మేనరిక వివాహం అవ్వడంతో ఇరుపక్షాల లోని ఉన్నత గుణాలని అచ్చు పోస్తే తయారైన అందమైన విగ్రహాలు ఈ రెండు. వీరిద్దరూ పెద్ద కుటుంబాల్లో జన్మించినప్పటికీ జీవిత ప్రవాహంలో ఈదుకుంటూ అందరికీ దూరంగా వేరే ఒడ్డుకు చేరుకుని స్థిర పడాల్సి వచ్చింది. సుజది ఇతరులకు చేతనైనంత సహాయం చేసే గుణం. ఇంటికి వచ్చిన అతిథులను సాదరంగా ఆహ్వానించి, మంచి భోజనం పెట్టేది. ఇక ఆవిడ భర్త హరి గారి గురించి చెప్పక్కర్లేదు. భార్య నోట్లోంచి మాట వచ్చినది తడవుగా ఓ సంచీ చేతపట్టుకుని భార్య చెప్పినట్లు బంధువులకు ఇష్టమైన కూరగాయలను మార్కెట్ నుంచి తెచ్చేవారు. వీరికి ముగ్గురు పిల్లలు. వీరు తల్లిదండ్రులుగా ప్రత్యేకించి పిల్లలకు జీవితం నైపుణ్యాలను ఏమి నేర్పలేదు. వీరు కూడా, ' యథా రాజా: తథా ప్రజా ' అన్న చందంగా అచ్చుపోసిన విగ్రహాలే. నిరాడంబరతకు నిలువుటద్దం…
Read More

శ్వాస

శ్వాస నీ శ్వాస నీ ఊపరిలో నిండి ఉన్నది వుచ్వాస నిచ్వాసాల సారమే పుట్టుక రహస్యం శ్వాసే ప్రాణం యానం శ్వాసే శక్తి చేవ శ్వాస నే నీ స్పందన శ్వాస నే అడుగు గడువు శ్వాస నే ఉలుకు పలుకు శ్వాస నే నిలువు నీడ శ్వాస నే రూపం రుణం శ్వాస నే నువ్వు నేను శ్వాస నే ఆరోగ్యం ఆనందం శ్వాస నే సంఘర్షణ అలుపెరగని హృదయానికి మరణం ఒక శరణ్యం అదే సృష్టి నీ. కిచ్చిన అద్భుత యోగం ... - జి జయ
Read More

పంచాంగం

పంచాంగం *ఆదివారం, మార్చి 13, 2022* *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం* తిధి : *దశమి* ఉ8.46వరకు తదుపరి ఏకాదశి వారం : *ఆదివారం* (భానువాసరే) నక్షత్రం: *పునర్వసు* సా6.45వరకు తదుపరి పుష్యమి యోగం: *శోభన* తె3.13 వరకు కరణం: *గరజి* ఉ8.46 వరకు తదుపరి *వణిజ* రా9.38 వరకు వర్జ్యం: *ఉ.శే.వ7.18 వరకు* & *తె3.27 - 5.12* దుర్ముహూర్తం : *సా4.30 - 5.17* అమృతకాలం: *సా4.06 - 7.51* రాహుకాలం : *సా4.30 - 6.00* యమగండ/కేతుకాలం: *మ12.00 - 1.30* సూర్యరాశి: *కుంభం* చంద్రరాశి: *మిథునం* సూర్యోదయం: *6.14* సూర్యాస్తమయం: *6.05* సర్వేజనా సుఖినో భవంతు - 
Read More

ఆత్మాభిమానం

ఆత్మాభిమానం *మన దగ్గర ఉన్న వాటితో సరిపెట్టుకుంటే ప్రతి చోటూ స్వర్గమే.* *లేనిదాని కోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగూ నరకమే.* *ఒక్కోసారి మన నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవీ మనల్ని గెలిపించలేన్నప్పుడు... ఓర్పు, సహనం మాత్రమే మనల్ని గెలిపించగలవు.* *మనం చేసిన మంచి పనిని అందరూ స్వీకరించకపోయినా, అవసరము, అర్హత ఉన్నవాళ్లు స్వీకరిస్తారు.* *మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మరచిపోయేలా చేస్తుంది.* *మన ఆత్మాభిమానం మనకు ముఖ్యం. అది ఎపుడూ అంత ఎత్తులో ఉండాలి. ఒకరు చులకన చేసారు అని ఎప్పుడు అనుకోకూడదు. ఎవరి స్థాయి వారిదే.*...... - రాంబంటు
Read More

సప్త వర్ణాలు

సప్త వర్ణాలు సీతాకోక చిలుక వలె తెలుగు రుచి సప్త వర్ణాల శోభితం . ఒక తెల్లని రంగే ఏడు వర్ణాల హరివిల్లు ఆకాశానికి అచ్చేరువేస్తే సప్తవర్ణాలు సందడి చేస్తాయి కవిభావం ఉప్పొంగితే కలం సప్త వర్ణాలు గిరి గీస్తుంది కళాకారుడి మనసు అద్దమైతే సప్త వర్ణాల చిత్రమవుతుంది కళాకారుడు గొంతు విప్పితే సప్తస్వరాలు సరిగమ లవుతాయి పోగు పోగునా రంగు లద్దితే వన్నె లొలికే వస్త్ర మవుతుంది మగువ మమకారంతో ఇల్లు ఆనంద హోలీ అవుతుంది .... - జి జయ
Read More

ఓ చిన్న తప్పు పార్ట్ 2

ఓ చిన్న తప్పు పార్ట్ 2 భార్య తల దగ్గర దీపం చూసి కుప్ప కూలి పోతాడు రంగనాథ్. "మొన్న విసుక్కోకుండా ఉన్నా బావుండేది, పాపాత్ముని నేను", అంటూ విలపిస్తాడు. ఏం లాభం...........? రంగనాథ్ గారు మైక్ చేతిలోకి తీసుకుంటాడు. అప్పటికే రెండు సార్లు ధారగా కారుతున్న కన్నీటిని దస్తీ తోటి తుడుచుకుంటాడు. కానీ ఆ కన్నీటి ధార మాత్రం ఆగలేదు. "ఆహుతులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు". అంటూ మళ్ళీ కన్నీళ్లు తుడుచుకుంటాడు. ఉద్వేగభరితంగా ఉన్న ఆయన శరీరం వణుకుతున్నట్టు తెలుస్తోంది. అలానే వణుకుతున్న చెయ్యి ని జేబులో పెట్టి, ఒక మడిచి ఉన్న ఉత్తరాన్ని తీశాడు రంగనాథ్ గారు. అందరికీ నమస్కారము! ఈరోజు నా భార్య లక్ష్మి జన్మదినము. మిమ్మల్ని ఇలా ఆహ్వానించినందుకు మన్నించండి. నాలో బడబాగ్ని తో మండిపోతున్న నా తప్పు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయించింది. ముందుగా నా తప్పు సరిదిద్దుకోవాలి అంటే నా…
Read More

పంచాంగం 12.03.2022

పంచాంగం 12.03.2022  *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*  *ఉత్తరాయణం - శిశిరఋతువు* *ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం* తిధి : *నవమి* ఉ6.47వరకు తదుపరి దశమి వారం : *శనివారం* (స్థిరవాసరే) నక్షత్రం: *ఆర్ధ్ర* సా4.21వరకు తదుపరి పునర్వసు యోగం: *సౌభాగ్యం* రా2.55 వరకు కరణం: *కౌలువ* ఉ6.47 వరకు తదుపరి *తైతుల* రా7.46వరకు వర్జ్యం: *తె5.32నుండి* దుర్ముహూర్తం : *ఉ6.15 - 7.49* అమృతకాలం: *ఉ7.02 వరకు* రాహుకాలం : *ఉ9.00 -10.30* యమగండ/కేతుకాలం: *మ1.30 - 3.00* సూర్యరాశి: *కుంభం* చంద్రరాశి: *మిథునం* సూర్యోదయం: *6.15* సూర్యాస్తమయం: *6.05* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు
Read More

ఊపిరి

ఊపిరి నీ శ్వాసే నా ఊపిరి.... నీ నవ్వే నా ఊపిరి.... నీ స్వరమాధుర్యమే నా ఊపిరి.... నీ శ్రేయస్సే నా ఊపిరి.... నీ ఆలోచనే నా ఊపిరి - నారాయణ
Read More

మౌఖిక పరీక్ష

మౌఖిక పరీక్ష (ఒక ప్రముఖ ప్రజాదరణ పొందిన దిన పత్రిక విలేఖరి జానకమ్మ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అతడు ఏమి అడిగాడు? ఆమె ఎలా స్పందించింది) విలేఖరి:- నమస్కారం, జానకమ్మ గారు. మీ ఈ 65 ఏళ్ళ జీవితం ఎలా సాగింది అనుకుంటున్నారు? మీకు తృప్తి కరంగానే అనిపిస్తోందా? జానకమ్మ:- నమస్కారం, బాబు. తృప్తికరంగా ఎవరి జీవితాలు సాగవు. ఒడిదుడుకులు అందరమూ ఎదురుకోవాల్సిందే ....! నాకూ, అవి తప్ప లేదు. విలేఖరి:- బాగా చెప్పారు. మీ ముఖంపై ఆ చిరునవ్వు చూస్తుంటే ముచ్చటగా ఉంది, అమ్మ. మీరు అందరిలా కష్టాలు పడినట్టు అనిపించట్లేదు. జానకమ్మ:- బహుశా నువ్వు నన్ను క్రితం లో ఎప్పుడూ చూడలేదు. కానీ, ఇప్పుడు మాత్రం నేను తృప్తిగా నవ్వుతున్నాను. ఇకపై కూడా ఈ మందహాసము ఇలానే చెరిగిపోకుండా ఉంటుంది. విలేఖరి:- చాలా సంతోషం, అమ్మ. అంటే మీరు గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఏం అంటారు మీరు?…
Read More