ఘోష ఆకలి చావుల ప్రపంచంలో ఇప్పుడు మరో మరణమృదంగం తాండవమాడుతోంది మనిషికి మతం ఉన్మాదమిస్తే దేశాలది విస్తరణ కాంక్ష శకలాలు శకలాలుగా రాలిపోతూ భవనాలు, కుటుంబాలు ! ప్రపంచం కుగ్రామమయిందంటాం కానీ ప్రపంచం మళ్ళీ కుంగిపోతోంది ఉత్తర దక్షిణ ధ్రువాలుగా ! విశ్వ రహస్యాలను ఛేదించే మనిషి విస్తరణ కాంక్ష అనే అయస్కాంతానికి దేశాలతుక్కుపోతుంటే నివారించలేని అచేతనుడయ్యాడు ! రణం మొదలవటానికి కారణమక్కర్లేదు సాకు మాత్రమే చాలని చరిత్ర చెబుతూనే ఉంటుంది ! కాలం కరుకైనదంటాం కాదు దేశాలమధ్య రగిలే కాంక్షలు కరాళనృత్యమై ఉషోదయాల ఉసురుతీసి అనిశ్చితి ఊబిలో నెట్టేస్తాయి ! నిట్టూర్చే గొంతులనూ నొక్కేసే నెగళ్ళు రాజుకుంటుంటే రెక్కలు తెగిన శాంతికపోతాల రుథిరం నిస్సహాయతకు సంకేతమై జాలిగా ఘోషిస్తుంటుంది ! - సి.యస్.రాంబాబు
జీవిత కాలం వీరెవరికీ, తెలియని, వినపడని, కనపడని ఎవరో వ్రాసిన కథలోని పాత్రలు వీరు ఎవరో ఆడుతున్న చదరంగంలో పావులు వీరు! తెలియని తెలుసుకోలేడు జీవితకాలంలో మనిషి ఆ కధ రాసింది ఎవరు ఆ ఆడించేదేవరు ఎవరిదీ మాయ ఏమిటి ఈ మాయలోకం చేదించటానికి సరిపోదు మనిషి జీవితకాలం -రాం బంటు
జన్మ అమ్మ బిక్ష ఈ జన్మ అమ్మ త్యాగం ఫలం ఈ జీవితం అమ్మ ఆశీర్వాదం ఈ ప్రగతి ప్రస్థానం అమ్మ రెండక్షరాల పదం అమ్మ నిస్వార్థ ప్రేమకు నిర్వచనం అమ్మ పసిగుడ్డుగా గర్భంలో బాధించినా ఎదిగాక అజ్ఞానంతో ఎదిరించినా చిరునవ్వుతో ఓర్చుకునే సహనశీలి అమ్మ కన్న బిడ్డ పుస్తకాలు కోసం స్ట్రీకి ప్రాణప్రదం అయిన పుస్తెలు అమ్మడానికి సైతం సిద్ధం అమ్మ ప్రేమని మించింది అవని పై లేదు అమ్మ అనురాగం నిరుపమానం అమ్మ త్యాగం అనితర సాధ్యం రామకోటి కంటే అమ్మ కోటి వ్రాయడం గుడిలో విగ్రహం కంటే ఇంట్లో అమ్మను పూజించడం శ్రేష్టం అలా చేయడం అమ్మ ఇచ్చిన జన్మకు కొంతైనా సార్ధకత ప్రాప్తిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం! - రాం బంటు
ఎడారి జీవితంలో వంద దార్లుంటాయి వెయ్యి గల్లిలుంటాయి లక్ష సందులుంటాయి శతకోటి పిల్ల దారులుంటాయి కాని నాకు మాత్రం ఒకటే దారి....... కవితల దారి..... నువ్వు కాదంటే నా జీవితం ఎడారి....... - రాం బంటు