Month: April 2022

మౌనం

మౌనం ఆ మధ్య కాలంలో ఏదో మాటపై మాట వచ్చి నేను మా అమ్మ గారి తో కాస్త గొడవ పడ్డాను. చిన్న మాట నే కానీ నా ఆవేశం వల్ల నేను తొందరపడ్డాను. కానీ నాకు కోపం చాలా వచ్చింది. దాంతో నేను మా అమ్మతో మాట మానేశాను. అది కూడా కరోనా సమయంలోనే, ఈ కారణం అనేది చాలామందిని చాలా ప్రస్టేషన్ కి గురిచేసింది. అందరూ ఇంట్లోనే ఉండడం వల్లనో ఏమో చేసే పని ఎక్కువ అయింది పని ఎంత చేసినా తరగదు. ఇంట్లో ఉన్న సమయంలో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుభవమయ్యే ఉంటుంది. అయితే ఆ ప్రస్టేషన్ లో నేను మా అమ్మ కాస్త గొడవ పడిన మాట నిజం. పాపం మా అమ్మకి మోకాళ్ళ నొప్పులు నిలబడి వంట చేయలేదు. ఇది తెలిసినా కూడా నేను రోజూ చేయడం విసుగొచ్చి నువ్వు ఒకసారి…
Read More

అభిలాష

అభిలాష నేను పదో తరగతి పాస్ అయ్యాక ఏ కాలేజీలో చేరాలి అనే సమస్య మొదలైంది. దగ్గరలో ఏ కాలేజీ లేదు. కాలేజికి వెళ్ళాలంటే పక్క ఊరికి వెళ్లాలి. అందువల్ల నాన్న గారు పక్క ఊర్లో ఏదైనా మంచి కాలేజీ ఉందేమో అని వెతకడానికి వెళ్ళారు ఒక రోజు. అయితే అక్కడ రెండు కాలేజికి ఉన్నాయి. అందులో నాన్నగారికి తెలిసిన ఒకరి కాలేజీ బాగా అనిపించింది. దాంతో అప్లికేషన్ ఫామ్ తెచ్చారు. తెల్లారి అది నింపేసి నన్ను తీసుకుని అక్కడికి వెళ్ళాం ఇద్దరం. అప్పటి వరకూ పక్క ఊరికి ఎప్పుడు వేళ్ళని నేను అదే మొదటి సారి వెళ్ళడం కావటం చేత అన్ని వింతగా చూస్తూ ఉన్నాను. అది కొంచం పెద్ద ఊరు కాబట్టి అన్ని కార్యాలయాలు అక్కడే ఉన్నాయి. ఇక నన్ను నాన్న గారు ప్రిన్సిపల్ కి చూపించి మా అమ్మాయి బాగా చదువుతుంది అంటూ చెప్పారు. ఫీజు కూడా…
Read More

కరుగునా మైనం??

కరుగునా మైనం?? మైన మైనా కరుగునా, మౌనమైన ఈ మోము కి? నా గానం నిన్ను చేరదు పదం బరువెక్కిను బాధ దాన్ని తడిపి వేసెను. మైన మైనా కరుగునా, మౌనమైన ఈ మోము కి? వర్ష ధారల వయ్యారి ఊపులు భావం తెలియని నా బాధ కి అపశృతులు పలికెను. మైన మైనా కరుగునా మౌనమైన ఈ మోము కి. నిను చేర నది తల్లడిల్లెను నా గొంతు న అది బంధీ అయ్యెను. మైన మైన కరుగునా మౌనమైన ఈ మోము కి? నీ మనసుకు లేవు కర్ణాలు నీ మనో దృష్టికి అంధత్వం.. నా పాట నీకు గిట్టని ది. నా బాట నీకు అగుపించని ది. మైన మైనా కరుగునా మౌనమైన ఈ మోము కి? తప్పు నీది కాదు నిన్ను చూసిన నా హృదయ నేత్రాల ది. నిన్ను విన్న నా మనో కర్ణాలది.…
Read More

నో రామా రావణ్స్ ఓన్లీ

నో రామా రావణ్స్ ఓన్లీ ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద స్టార్స్ నటించిన సినిమాలతో పోటీగా చిన్న సినిమాలు నిలుస్తున్నాయి. అలాగే కొంతమంది స్టార్స్ మంచి కథ ఉంటే చాలు వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలా మంచి కథతో వచ్చిన సినిమానే నో రామా రావణ్స్ ఓన్లీ అనే సినిమా. ఈ సినిమా నుండి ఉగాది సందర్భంగా ఈరోజు డిటెక్టివ్ ఎఫ్ అనే పాటను డైరెక్టర్స్ కట్ సినిమా అనే యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేయబోతున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ స్టోరీ గురించి షార్ట్ గా చెప్పుకుంటే, "పసివయస్సులో గుండెలపై అయ్యే గాయాలు జీవితాంతం ఎలా వేధిస్తాయి" అనే ఎమోషనల్ పాయింట్ తో సైకలాజికల్ థ్రిల్లర్ గా వస్తుంది. కథకి ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రం లో అనూష శర్మా, అంకిత్ నాయుడు, శ్రీజ, శ్రీనివాస్, రమణ, తిరుపతి,అనిత, కార్తిక్ దేవల్రాజు, నందిని, బలరాం…
Read More

మౌనం

మౌనం మనసు పలికే మౌన గీతం మౌనం అర్ద అంగీకారం అంటారు పెద్దలు. మౌనం ఒక మూగ భాష మౌనం ఒక ధర్మ సందేహం మౌనం ఒక ఆవేదన మౌనం ఒక ఆరాధన మౌనం ఒక ఆవేదన మౌనం ఒక సంఘర్షణ మౌనం ఒక నొప్పించే బాధ మౌనం ఒక కొట్టని దెబ్బ మౌనం ఒక వ్యధ మౌనం ఒక హెచ్చరిక మౌనం ఒక సన్నద్ధత మౌనం ఒక తెలుపని యుద్దం మౌనం ఒక తెలిపే నిరసన మౌనం ఒక చప్పుడు లేని అడుగులు మౌనం ఒకఎదుటివారికి శిక్ష మౌనం ఒక ఆపిన వేగం మౌనం ఒక పరిణామం మౌనం ఒక సందేశం మౌనం ఒక ప్రతిస్పందన మౌనం ఒక ఆలోచనల సుడిగుండం మౌనం ఒక దీక్ష మౌనం ఒక ప్రార్థన మౌనం ఒక సన్నద్ధత మౌనం ఒక సత్య శోధన మౌనం ఒక తెలుపని భావాల రూపం . మౌనం…
Read More