Month: July 2022

కాంక్రీటు మనిషి

కాంక్రీటు మనిషి జారే చినుకులు మట్టి మదిలో... ఎన్నో ప్రశ్నలకు జీవం పోస్తుంటే... ఆలోచనల ఎరువులను అతను చల్లి.... పెంచి పోషిస్తున్నాడు... వేళ్లూనుకునేలా... అర్థంపర్థం లేని అనుమానాలు పిల్లకాలువలై... అతని మనసు మైదానంలో.. నెర్రెలు బారిన నేల గుండా ప్రవహిస్తున్నాయి ఆగధాన్ని ...గొయ్యిలా మారుద్ధమని కాబోలు దోసిల్లలోని ఆఘ్రాణిత గగన కుసుమలను... హృదయపు ముత్యపు చిప్పలో దాచుకోనక మేఘాలతో జతకట్టి వచ్చవాని... చీదరించి వీధి పాలు చేశాడతను..వెర్రితో... ఫలితం తన ముందు... విశాల నది తీరమై ఆమె నిలిచి... ఎందరినో ఆదుకుంటూ... సాగిపోతుంది... నిశ్చల జీవనవహినిలా... మనో అంతరాలను ప్రక్షాళన చేస్తూ.... చివరికి అతడు ఒంటరిలా మిగిలాడు... అవును అతనెవరో?...తెలుసునా స్వచ్ఛమైన నీటి చినుకును ఆస్వాదించలేని.. సిమెంటుతో ఒళ్ళంతా చుట్టుకున్న నాగరికత నేర్చిన ఓ మనిషి.... - కవనవల్లి (సాయిప్రియ బట్టు)
Read More

పగలే వెన్నల

పగలే వెన్నల నాఊహలకే కన్నులుంటే చూస్తూ మాట్లాడుతుంటే నామనస్సు కనిపించింది "పగలే వెన్నలని". వెన్నెలో చెలితో ఉంటే ఎంత హాయి అని...... తన వాలుచూపుల తమకంలో ఏం మత్తు ఉందో.... నా గుండెల్లో అలా కదలాడుతుంది.... తన చిరునవ్వుల గలగలలో ఏ పరిమళం దాగుందో..... తొలకరి చినుకల్లే నను నిలువెల్లా తడుపుతుంది.... ఎదో మత్తులో నింపుతుంది.... తన చిలకపలుకులలో ఏం మంత్రం ఉందో..... తన నల్లటి కురులు నామోమును తాకి మత్తెక్కించినట్లని పింస్తూంది.... తన మెడ మలుపులు నను నిలువనీయనన్నవి... తన యదపొంగులు నాకళ్ళార్పనీయలేదు.... తన దరిచేరి చుంబించమన్నవి.... తన జతచేరి నా మది ఆదమరచి ఆమె వడిలో నిదుర పోతానంటుంది.... ఆమ సొగసైన హొయలు, వంపు సొంపులు.... వరాల వెండిపూల వానలో నను అభిషేకిస్తుంటే తన కాటుక కనుల వాకిలిలో ముగ్గులేసుకొనే నా ఊహలు.... అందమైన సుందర తీరాలలో నన్ను తిప్పుతుంటే.... ఇంకా ఏం వెతుకుతుందో నా మనసు తనతో…
Read More

సింధూరపు వెలుగు

సింధూరపు వెలుగు నీ నయనాలలో నేనైతే, నా ఊపిరి నువ్వైతే, నీ అధరాల మెరుపు నేనైతే, నా సింధూరపు వెలుగు నువ్వైతే, ఇద్దరి మధ్యా దూరం తరిగిపోతే, కరగని కలగా మిగిలిపోవాలని కోరుకునే నీ నేను... - భవ్య చారు
Read More

Life Quotes by Yashwanthi

Life Quotes by Yashwanthi DOWNLOAD IMAGE   DOWNLOAD IMAGE   DOWNLOAD IMAGE DOWNLOAD IMAGE DOWNLOAD IMAGE DOWNLOAD IMAGE DOWNLOAD IMAGE DOWNLOAD IMAGE DOWNLOAD IMAGE DOWNLOAD IMAGE DOWNLOAD IMAGE DOWNLOAD IMAGE DOWNLOAD IMAGE DOWNLOAD IMAGE DOWNLOAD IMAGE DOWNLOAD IMAGE DOWNLOAD IMAGE DOWNLOAD IMAGE DOWNLOAD IMAGE
Read More

ప్రశ్న

ప్రశ్న రోడ్లు క్రిక్కిరిసి పోయాయి సరే మనసో ద్వేషపు గేట్ వే ని చేశానని ఆలోచించావా దేశం ఉన్నతంగా సరే మనిషిగా ఉన్నతుడవెప్పుడవుతావని అడుగుతున్న అంతరాత్మకు సమాధానం చెప్పావా ఎపుడైనా - సి. యస్. రాంబాబు
Read More

అరణ్య రోదన

అరణ్య రోదన అరుగు కాళ్ళిచ్చె నాకు పిసరంత ఆనందం........! అడవులందు వినవచ్చె వెదికిన అరణ్య రోదన. నదీమ తల్లి ఆవిరై ఎండంగ రాలు కన్నీరు ఇంకె వరదలై.........! మూగ జీవలు మౌనం వీడి ఆర్తనాదాల నాదస్వరం తో లోక కళ్యాణం చేయుచుండె. జంతు కోటలని కొల్లగొట్టి మానవ మృగాలు సంచరించుచుండె. అరుగు కాళ్లిచ్చె నాకు పిసరంత ఆనందం........... విశ్రాంతి కోరి నా శరీరము కాస్త విశ్రమించె .......! వినవొచ్చె నాకు పసికందు కేరింతలు...! దొరికెనానందము ఇక విశ్రమించ..................! ఆనందం భాష్పాలు రంకెలేయ...........! విశ్వమంతయు మారుమ్రోగె...........! ఇట్లుందును, ఇట్లుందును ఇకపై దొరికె నాకు అనంద సామ్రాజ్యము.....! - వాసు
Read More

పరమానందం

పరమానందం ఆనందం అను మూడు అక్షరాలు వింటే మనసుకి ఆనందం కలుగుతుంది. ఒక అద్భుతమైన మనో భావానికి అక్షర రూప కల్పన చేసి, ఒక భాషని సృష్టించి ఒక అందమైన మాటగ కూర్చి ఆ శబ్దమును వీనువిందుగ వినిపించిన మహాను భావులకి వందనాలు. జగద్గురు ఆదిశంకరచార్యులు జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్గ్రంధం "సౌందర్యలహరి"లో నలుబదిశ్లోకములు "ఆనందలహరి "యని ఏబది తొమ్మిది శ్లోకములు సౌందర్య లహరి అని చెప్పబడినది. ఆవలింతకు అన్నయ్య వున్నాడు, కాని తుమ్ముకు తుమ్ముడు లేడని ఒక సామెత. కాని సుఖ దుఃఖాలులు బద్ధ విరోధులు.కాని ఒకరిపక్క ఒకరు చెట్టపట్టాలే సుకొని తిరుగుతుంటారు.వెలుగు చీకట్లలాగా. సుఖం పక్క దుఃఖం.దుఃఖం పక్క సుఖం. ఇవన్నీ మానసిక అనుభవాలె. జీవితంలో ఇవన్నీ సహజమే అనుకొని మనం ఆనందంగా ఉండగలిగితే ఆనంద బాష్పాలు, కన్నీళ్లు ఏకమై ద్వివేణి సంగమై దానికి భక్తి రసం జోడిస్తే త్రి వేణి సంగమంగా మారి మనసు పరవళ్లు తొక్కుతూ,మానసిక…
Read More

మానసిక ఆనందం

మానసిక ఆనందం యత్ భావం తత్ భవతి అనేది మనలోని భావన మాత్రమే మనిషిని సంస్క రిస్తుంది. మన భావాస్వాధన వుంటే పీల్చే గాలి కూడా ఆనందం చూసే కంటి కి తెలుసు ఏమి అనుభూతి చెందుతావో అదే మహదానందం వినే చెవులకు తెలుసు ఎలాంటి మాటలు నీకు ఆనందానికిసరిపోతాయో మాట్లాడే భాష నిన్ను ఎలా ఆనందంలో ముంచుతుందో చేసే పనిలో దైవత్వం వెతికితే మనసుకు తృప్తి ఇస్తుందో ఇతరులకు ఇబ్బంది కలుగకుండా నడుచుకుంటే అదే గొప్ప అత్యానందo ఆట పాటల్లో మునిగితే అదోరకం మనోనందం అవసరానికి సాయపడితే అధికమైన ఆనందం మనకు మనంగా మై మరచి జీవిస్తే బ్రహ్మానందం అది ఎప్పుడూ మనతో వుండే మానసిక ఆరోగ్యం ఆనందం......? - జి జయ
Read More

వేకప్ కాల్ 

వేకప్ కాల్  పున్నమి వెన్నెల సావాసం చేసినట్టు పురివిప్పింది వేకువ నిద్ర కన్నుల నీకూ నాకూ లోకువేమో కానీ లోకానికది మెళకువ కువకువలాడే పిట్టలకది పనిగంట మోగినట్టు వర్షం మంగళస్నానంతో పరవశించే పచ్చదనం వికసించిన పూలను అలంకరణ చేసి హాయిగా నవ్వుకుంటుంది చదును చేసినట్లు రాత్రి జ్ఞాపకాలన్నీ తనలోకి ఇంకిపోతుంటే మనిషి దురాశను మోయడానికి మళ్లీ సిద్దపడే నేలను జాలిగా చూస్తున్న భానుమూర్తి గంట మోగినట్టు చుర్రుమంటూ చిరుబురులాడుతూ ఎగబాకుతున్నాడు స్వార్థం గుర్రాన్నెక్కి ప్రపంచాన్ని స్వారీచేయాలని కలల కనే కార్పొరేట్ ప్రపంచమింకా నిద్ర కళ్ళు తెరవలేదు తన్నేం చేస్తారో అని భానుడు కూడా అప్పుడప్పుడు మాయమవుతుంటే నిద్ర కన్నుల నువ్వు, నేనూ మధ్య తరగతి మందహాసమై ఉలిక్కిపడి సిగ్గుపడుతుంటాం చూడు అదే wake-up call - సి. యస్. రాంబాబు
Read More

ముఖారవిందము

ముఖారవిందము సమాజము అద్దమై మెరవంగ, నిన్ను నీవు సరిదిద్దుకునే కాలము కాటి దిక్కు పోతుండె!. నీ ముఖారవిందము బృఖుటితమైన, ఇచ్చునా సమాజము నీకు చిరుమందహాసము! నీ ఊల గోలకి ఊలలే చేరును కదా.....! నీ వెక్కిరింతలకి పులకరించి, పలుకరించునే తిరిగి వెక్కిరింతలు. నీకు తెలియరానిదా.......! నీలో ని ఈ మార్పు. ప్రేమనిచ్చిన ప్రేమనే పొందుదువు కదరా................! నీ చిరునవ్వు సిరులౌట చిత్రమౌన? - వాసు
Read More