Month: August 2022

నా దేశం

నా దేశం జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి.... ఆకాశం నిండా మన భారతీయ జెండా రెప రెప లాడాలి ఎల్లపుడు మన మనసు నిండా ప్రేమ సాగరం.... నా దేశం విశ్వ కుటుంబం... నా దేశం పది వేల సంవత్సరాల సంస్కృతి... నా దేశం శాంతి నిలయం..... నా దేశం చల్లని చక్కని కాల ప్రవాహం..... నా దేశం కోటాను కోట్ల త్యాగ మూర్తుల పోరాట ఫలితం స్వేచ్చ.... స్వాతంత్రాల దేశం.... నా దేశం భారత మాత ఒడి లో స్వేచ్చా శ్వాసలు వెచ్చ వెచ్చగా... పీలుస్తూ..... వజ్ర ఉత్సవాల స్వాతంత్ర సంబరాలు చేసుకుందాం.... ఇంకా ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటూ అనుకుంటూ.... ఆరోగ్యంగా.... ఆనందంగా .... కలిసి పోదాం... ముందు తరాలకు ఆదర్శంగా.....మార్గదర్శులం.... అవుదాం ఆనందంగా...... ప్రియమైన పూజ్యులు,మిత్రులు, అందరికి, నా హృదయ పూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. - అల్లావుద్దీన్
Read More

మన మువ్వన్నెల జెండా

మన మువ్వన్నెల జెండా మూడు రంగుల జెండా మనం మురిసే మువ్వన్నెల జెండా ! కీర్తి పతాకాల కిరీటం ప్రగతి సోపానాల పారవశ్యం మన మువ్వన్నెల జెండా! త్యాగధనుల చరిత్ర దేశభక్తికి చిహ్నం మన మువ్వన్నెల జెండా! మహామహుల త్యాగఫలం సాధించిన ధీరులకల మన మువ్వన్నెల జెండా! ధర్మం దాగిన అర్ధము శాంతిని బోధించే స్ఫూర్తి మన మువ్వన్నెల జెండా! జాతీయతనునింపేసంబరం ఐకమత్యపువెలుగుజిలుగు మన మువ్వన్నెలజెండా! ఔన్నత్యపు శిఖరాలు విశ్వశాంతి సంకేతం మన మువ్వన్నెల జెండా! విభిన్నసంస్కృతుల మేళవింపు భారతావని గొప్పతనం మన మువ్వన్నెల జెండా! సౌభాగ్యానికి ప్రతీక సామరస్యానికి గుర్తు మన మువ్వన్నెల జెండా! భారతజాతి గౌరవం వివరించే విధేయత మన మువ్వన్నెల జెండా! దేశభక్తి చైతన్యం పవిత్ర భారత తేజం మన మువ్వన్నెల జెండా! అంబరంలో త్రివర్ణ పతాకం మాతృభూమికి వందనం జయహో- భారత్ మహాన్ జయహో- భారత్ మహాన్ జయ- జయహో ! - జి జయ
Read More

జయకేతనం

జయకేతనం గగనాన వెల్లివిరిసెను ఇంటింటా స్వేచ్ఛా విహంగమై త్రివిధ దళాల అండదండలతో త్రివర్ణ పతాక రెపరెపలను చూడు ప్రాణమిచ్చిన త్యాగధనులు ఎందరెందరి వీరమరణం మరెందరి ఆశయాల త్యాగఫలం నేటి మన పింగళి జయకేతనం వినువీధిన రెపరెపలతో త్యాగమును,కష్టమును, సంపదను తనలో దాచుకుని మనసంతా భక్తిని‌ నింపి జయహో భారతమా అంటూ భరతమాత కంటి వెలుగుగా గగనాన్నంటేలా ఎగురుతుంది చూడు సమస్యలెన్నున్నా ఐక్యతారాగాలాపనతో విభేధాలెన్నున్నా వెన్నుచూపని వీరత్వంతో భిన్నత్వాన ఏకత్వం చాటుతూ అలరారుతూ తిరంగా రెపరెపల రాజసం చూడు డెబ్బది ఐదు వసంతాలు పూర్తితో అమృతమహోత్సవ సంరంభమున ప్రతి భారతీయుని మది మదిని నిండి గర్వాతిశయాలతో ఎగురుతున్నది మన త్రివర్ణ పతాకం భారత మాతకీ జై అంటూ త్యాగధనులకి‌నివాళులిడుతూ స్వాతంత్ర్య భారతవని పండుగలో భవిష్యత్తరాలకి దేశభక్తి నేర్పుతూ సగర్వంగా చేయుదమా తిరంగాకు సెల్యూట్ల జేజేలను. - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

అహా…. ఏమి ఈరోజు భారతిలో..

అహా.... ఏమి ఈరోజు భారతిలో.. మన జెండా పండుగ.. ఆనందంతో యద నిండగ.. నాటి వీరుల త్యాగం ఫలింపంగ.. నేటి స్వేచ్ఛా జీవితం మనకు లభించంగ.. భావి యువతరం ఉర్రూతలూగంగ.. అసమానతలనేడివి రూపుమాపంగ.. జయహో భారతి అంటూ నినదించంగ.. ఇలకు చేరదా ఆ సమైక్యతపు గంగ.. జీవితం ధన్యమై జీవించంగ.. మరణించినను మనిషి గా బ్రతకంగ.. అందుకై అందరం ప్రమాణం చేయంగ.. అందుకే ఇది మనందరి పండుగ..... ఇది తలవని గుండె.. ఉన్నా దండగ... - కిరీటి పుత్ర రామకూరి
Read More

420

420 తనింకా యూత్ అని ఫీలయిపోతూ చిన్న వాళ్ళతో కలిసి పోతుంటాడు సీతారాముడు. యంగ్ జనరేషన్ తో ఎక్కువ కాలం గడపాలని ఆతని కోరిక. సాయంత్రం పూట కాఫీ తాగడానికి తన బ్యాంకు పక్కనే ఉన్న తాజ్ మహల్ హోటల్ కి రోజూ వస్తూ ఉంటాడు. ఆ సాయంత్రమూ అలానే వచ్చాడు. "హలో అంకుల్ " పక్కింటి పున్నారావు కొడుకు వినాశ్ పిలుస్తూ కనిపించాడు. ఆ యంగ్ తరంగం పిలుపుకు ఫిదా అయిపోయి అటెళ్ళాడు సీతారాముడు "ఏం చేస్తున్నావమ్మా" "బ్యాంకు ఎగ్జామ్స్ ప్రిపేరవుతున్నా అంకుల్" "నైస్" వీళ్లు మాటల్లో ఉండగానే టీ తెచ్చాడు బేరర్. "ఓహో నువు చెప్పేశావా. బేరర్ నాకో కాఫీ" తన ఆర్డర్ చెప్పేశాడు. "ఏమిటోయ్ విశేషాలు క్రికెట్ చూస్తుంటావా విరాట్ ను టీంలో ఉంచాలంటావా! పంత్ ఓపెనర్ కరెక్టేనా! సీతారామం చూశావా భలే తీశాడయ్యా.." ఇలా క్రికెట్ నుంచి సినిమాల వరకు తన పరిజ్ఞానాన్ని ప్రకటిస్తూ బేరర్…
Read More

ఏది నిజం

ఏది నిజం ఇంకో యాభై ఇవ్వండంటున్న ఆటో డ్రైవర్ వంక చురచుర చూసి ఓ ఇరవై చేతిలో పెట్టి లక్డీకాపూల్ స్టేషను మెట్లెక్కసాగాను. మెట్రో స్టేషను కు ఒకవైపు మెట్లు ఒకవైపు ఎస్కలేటర్, లిఫ్ట్ఇంకోవైపు ఉండటం వలన కొంత లాభం. నడిచే దూరం తగ్గుతుందనుకుంటే కొంత నష్టం. మెట్లెక్కాలి. తప్పదు. అలా మెట్లెక్కుతుంటే ఓ పెద్దాయన రైలింగ్ పట్టుకొని ఆగి ఆగి ఎక్కుతున్నాడు. అయ్యయ్యో అనుకుంటూ చేయి పట్టుకొని నడిపించాను. చూస్తే కొంచెం అయోమయంగా కనిపించాడు. ఆయనెందుకో నా వెంటే వస్తుంటే చెప్పొద్దూ కాస్త ఇబ్బంది అనిపించింది. ఫోన్ పే పని చేయకపోవటంతో టికెట్ కౌంటర్ వైపే వెళుతుంటే నా వెంటే వచ్చాడాయన. కౌంటర్ లో  మియాపూర్ కు టికెట్ అడిగాను. ఆ పెద్దాయన అలాగే నిలబడ్డాడు. కౌంటర్ కుర్రాడు అడుగుతున్నాడు టికెట్ ఎక్కడికి ఇమ్మంటారని. తెలుగు అర్థం కాలేదని ఈసారి హిందీలో అడిగాడు. "ఎల్. బి. నగర్" అని అలాగే…
Read More

రక్షాబంధన్

రక్షాబంధన్ అన్నదమ్ముల అక్కాచెల్లెళ్ళు అనుబంధం- రక్షాబంధన్ ప్రేమను పంచే పేగు బంధం ఆప్యాయతల అంతరంగం భాదను పంచుకునే భాగ్యం బరోసాల సంప్రదాయాలు కష్ట సుఖాల కంకణాలు బలమైన అండ దండలు వెన్నంటి వుండే తలంపు అపురూప అనుబంధాలు తీపి చెలిమిల గొప్పతనం అమరిన రక్తసంబంధం కలిసి పెరిగిన ఇంటికి మధురమైనమనసు తోరణాలు కమ్మని మమతల పుట్టినిల్లు ప్రాణంలాంటితోబుట్టువులు ఒకే చెట్టు కొమ్మలు అందాల ఇంటి దీపాలు అంతులేని అభిమానం చెరగని బంధాలకు రక్ష అదే అందరికీ శ్రీ రామ రక్ష! - జి జయ
Read More

ముసిరిన చీకట్లు

ముసిరిన చీకట్లు ఖాళీ అయిన సభావేదికలా చిక్కని చీకటి అంతుచిక్కని తత్వవేత్త అంతేలేని ఆకాశంలో పొడిచే చుక్కలు ఆకుదాచిన వానచినుకులై మురిపిస్తుంటాయి వంటరితనానికి జ్ఞాపకాల దుస్తులేసి చీకటి ముద్దు చేస్తుంటుంది కాలం జారిపోతుంటుంది ఆలోచనలన్నింటిని దండచేసి మనసును దండించే ప్రియ శత్రువు చీకటి స్పర్శ చల్లగా తాకుతుంటే వెళ్లిపోయిన అమ్మ వళ్ళంతా తడిమినట్టుంటుంది - సి. యస్. రాంబాబు
Read More

వందనం

వందనం మాతృ భూమి విముక్తి కొరకు.... స్వేచ్ఛా వాయువుల కొరకు..... ఎందరో మహానుభావులు మరెందరో సమరయోధులు కుల మతాలకతీతంగా... ఆకలి దప్పులు మరచి... నిద్రాహారాలు మాని.... దేశ భక్తిని నింపుకుని అలుపెరుగని పోరాట ఫలితం... నా స్వాతంత్ర్యం ఎన్నో విషాదాలు... ఎన్నో కన్నీళ్ళు... సంకెళ్లు వేసి.... చెరసాలల్లో బంధించి... లాఠీ దెబ్బలతో.... బూట్ల పదఘట్టనలతో.. మేను రక్త సిక్తమైనా.. ఎత్తిన పిడికిలి దించని ధీరుల ఫలితం నా స్వాతంత్ర్యం ధన మాన ప్రాణాలకు వెరవక..... స్వాతంత్ర్యం నా జన్మ హక్కంటూ.... సింహాల్లా గర్జిస్తూ... నేలకొరిగిన అమరుల త్యాగం... నా స్వాతంత్ర్యం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలకులను గజ గజ వణికించిన ఎందరో త్యాగధనుల పోరాట ఫలితం నా స్వాతంత్ర్యం నేడు నా దేశ ఔన్నత్యం నా దేశ ధీరత్వం నా దేశ శాంతి తత్వం ప్రపంచమంతా కనిపించేలా... వినిపించేలా.... విను వీధుల్లో త్రివర్ణ పతాకం రెప రెప లాడింపజేసి... చరితలో…
Read More

కలల కన్నీరు

కలల కన్నీరు కష్టం ఎక్కువైతే కన్నీరోస్తుంది కాలంజరిగితేకష్టంపోతుంది అంటారుపెద్దలు! మూగ భాషల లోతులు ఉద్వేగాల ఊయలలు మది నిండిన మమతలు కనికట్టు మాటలు ఉప్పొంగిన ఊసులు కటిక నిజాల కారుణ్యం గుండె లోతుల్లోన గుర్తులు జ్ఞాపకాల వరదలు అర్దం కాని ఆవేదన భాష లేని భావన అంతరంగపు రోదన మాట వినని మనసు మనసువిప్పిన పుస్తకం గుబులు మిగిల్చిన భారం స్థితిని దాచిన వైనం రేయి దాటిన పగలు ఎదురు చూసినప్రతిబింబం కలలు కంటున్న ప్రతి రోజు హాయిగొలిపే అవకాశం వుండనే ఉండదుకదామరి అదే మనిషికి తెలియని మర్మము సుమా.......? - జి జయ
Read More