Month: September 2022

వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు నలుగు పిండి శరీరమంట అమ్మవారి మనమందు పుట్టెనంట ద్వారమందు నిలిపెనంట ప్రాణ ప్రతిష్ట చేసెనంట అయ్యగారితో ఆబాలుడు తగాదా పడెనంట అయ్యగారు తలనరక అశువులుబాసెనంట అమ్మవారు దుఃఖముతో అయ్యగారిపై కోపించెనంట అయ్యగారు గజాసురుని శిరం పెట్టెనంట తిరిగి ప్రాణం పోసె నంట మూషికాసురునిపై ప్రయాణమంట విఘ్నేశ్వరునిగా వెలుగు చుండె నంట ఈరోజు భాద్రపద శుద్ధ చవితి నాడు శుద్ధ పరచ వచ్చెనంట మనల భద్రముగ చూడ వెంచేసెనంట మనయింటికి జై!బోలో గణేష్ మహరాజ్ కీ జై! - రమణ బొమ్మకంటి 
Read More

నిశిరాత్రి

నిశిరాత్రి పూలు దొర్లుకు పోతుంటే సప్పుడొస్తదా నిశి రాత్రి లో మూగ వేదన ఎవరికీ తెలుసు దూరంగా ఉన్నా దేవుడికి దెగ్గర గా ఉంటాం ప్రార్ధన చేయాలి కన్నీళ్లు వరదలై పారగా ఎరుగా మానవత్వం నే మనసులో క్రొవత్తి గా వెలిగించి నిశిరాత్రి అనే శాంతి కొలనులో పాల పొంతల సాక్షి గా సేద తీర్చుకొని సూర్యోదయం సృష్టిద్దామా!!! - అల్లావుద్దీన్
Read More

అలజడుల స్మృతి గీతాలు

అలజడుల స్మృతి గీతాలు గజల్ గాయనిగా జ్యోతిర్మయి మళ్ల మనకు సుపరిచితులు. కవితాత్మక కథనంతో బాల్య స్మృతులుగా కొద్ది కాలం కితం ఆవిష్కరించిన వారు ఇటీవలే కథల పుస్తకాన్ని వెలువరించారు. మొత్తం పదిహేను కథలుంటే వాటిలో ఎనిమిది కథలు రోజుకూలీల జీవితాల కష్టాలను, కడగండ్లను చూపుతాయి. భావం, శైలిలకు సమన్వయం కుదిరితే ఆ కథ మంచి కథవుతుందంటారు విమర్శకులు. ఆ సమన్వయం చాలా కథలలో కనిపిస్తుంది. చెమటచుక్కలను సిరా చేసి రాసినట్టనిపించే కథలివి. ఎక్కువ కథల్లో వృద్ధుల వెతలు కనిపిస్తాయి. అందుకు కారణం నిరాశ్రయులయిన ఎందరో పెద్దవారిని తమ తల్లి ఆశ్రయమిచ్చిందని, వారి వెతలే కథలుగా ప్రాణం పోసుకున్నాయంటారు రచయిత్రి. శ్రీకాకుళం యాస తీయగా పలకరిస్తుందీ కథలలో. మోతాదుకు మించిన నాటకీయత, సినిమాటిక్ మలుపులు లేకుండా సహజంగా కథలివి.కథల్లోని పాత్రలతో మనమూ ట్రావెల్ చేస్తాం. మొక్కజొన్న పొత్తులు కొంటామేమోనని ఎదురు చూసే మనుషులు రైల్వే క్రాసింగ్ ల వద్ద, బస్టాండ్ల్లోను తారసపడుతుంటారు.…
Read More

సీనియర్ సిటిజన్

సీనియర్ సిటిజన్ రిటైర్మెంట్ పెద్దరికమిస్తుందని ఈ మధ్యే తెలుసుకున్నాడు సీతారాముడు. మనుషులందు రకరకములు కలరు అని తెలుసుకున్నాడు. ఓహో రిటైరయ్యారా అని అడిగేవాళ్ళు, జాలిగా చూసేవారు, జెలసీతో చూసేవారు (వీళ్లు ఆఫీసు బాపతు) ఇలాంటి నానాజాతి సమితి చూపులు అలవాటయిపోయాయి. అయితే మనవాడు. టంఛనుగా తలకు రంగేస్తాడు. నలగని బట్టల నిగనిగలతో టకాపీతో మెరిసిపోతుంటాడు. "మీరు సీనియర్ సిటిజన్ అయారు మర్చిపోకండి " భార్యామణి చురక చురుక్కుమంటుంటే చిరచరలాడుతుంటాడు సీతారాముడు. ఈమధ్యే ఇల్లు మారాడు మనవాడు. ఎక్కడికి వెళ్లాలన్నా మెట్రో లో వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. హైదరాబాద్ అందాలను ఆస్వాదించటం నేర్చుకున్నాడు. సీనియర్ సిటిజన్ కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించారని తెలిశాక మహదానందపడి వెతుక్కుంటూ వెళ్ళాడు మెట్రో ప్రయాణంలో. ఆ సీట్లన్నీ నిండిపోయిన్నాయి. చెరువులో పద్మాల్లా ఒకరిద్దరు సీనియర్ సిటిజన్లు ఉన్నారు. ముగ్గురు, నలుగురు స్టూడెంట్స్ ఆ సీట్లలో కూచోటంతో కోపం నషాళానికంటుకుంది తన ముందున్న మరో సీనియర్ సిటిజన్ ని…
Read More

వెన్నెల దారి

వెన్నెల దారి వెన్నెల దారిలో నడవాలంటే అందరికీ ఇష్టమే పున్నమి వెన్నెల తోడుగా హాయిగా కదులుతుంటే తెలియని ఆనందంలో తేలుతున్న ఊహాలోకంలో చుక్కల దారిలో వెలుగుల నీడలో తలపుల గుర్తులో జ్ఞాపకాల తన్మయత్వం దాగిన కావ్యమైన తరంగం చల్లనికలువలనందనవనం కలలవూసులహృదయంలో నడయాడే అమృతమంత్రం వెన్నెల దారిలో వెలుగు దివ్వెల ప్రయాణం ఆహా అంతరిక్షపు అద్భుతమా చవిచూచే అదృష్టమా......? - జి జయ
Read More

మేలుకొలుపు

మేలుకొలుపు   నేటి సమాజ పరిస్థితులలో సర్వం కలుషితం సకలం కల్తీ మయం సర్వం స్వార్థమయం సకలం సంకుచితమయం సర్వం అశాంతి మయం సకలం అనిశ్చిత మయం సర్వం అసంపూర్ణ మయం సకలం అసందర్భ మయం సర్వం సంగ్రామ మయం సకలం సంక్లిష్ట మయం సర్వం పరిణామ మయం సకలం అసమతులమయం సర్వం అపనమ్మక భయం సకలంసత్సంకల్పమయం మానవ జాతికావాలంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా జ్ఞాన జ్యోతులను ప్రజ్వలింప చేయాలి భగవంతునికి మేల్కొలుపు సుప్రభాతం లా మది మదిలో చైతన్యం మేలుకొలుపాలి మరి అందరు అప్పుడే భావి తరాలకు ఉషోదయం వెలుగులు ? - జి జయ
Read More

తను నవ్వింది

తను నవ్వింది హైదరాబాద్:   పాతబస్తీ ...ఎప్పటిలాగే రద్దీగా ఉంది.....వచ్చిపోయే జనాలతో.... ఏ ఒక్కరైనా రాకపోరు ...అని చూస్తున్నాడు అతను.... చిన్న చెక్కపెట్టే....నీడనిచ్చే చిల్లుల గొడుగు అతని వారసత్వపు ఆస్తి..... భయ్యా ...ఈ బ్యాగ్ కాస్త కుట్టిపెట్టు ...మేం షాపింగ్ చేసి వస్తాం అన్నది...వచ్చిన ఇద్దరిలో ఒక అమ్మాయి.... అలాగేనమ్మ ...మీరెళ్ళిరండి...నేనిక్కడే ఉంటా....అన్నాడు సైదులు 26 ఏళ్ల వయస్సు ...బలిష్టంగా ఉన్న శరీరం చూస్తే...ఒక్కమాటు పోలీస్ లాగా కనిపిస్తాడు ....ఏపుగా పెరిగిన  గడ్డం.... పిచ్చుక గూడు లాంటి  జుట్టు....వెనక్కి తోస్తూ...ఒక గొడుగు కింద కూచొని చెప్పులు కొట్టుకుంటూ బతుకుతున్నాడు.... ఉండేది మురికివాడలో ....తనని చేరదీసిన అవ్వ తాత లతో..వారి రేకుల షెడ్డులోనే ఉంటున్నాడు.... తన పుట్టుకకి కారణం ఆడ మగ అని మాత్రమే తెలుసు....పుట్టి బుద్ధేరిగాక....తను పడుకునేది రోడ్డు పైన ...తినేది పెంటకుప్పలలో ...దొరికిందే విందుభోజనం...తన లాంటి వాళ్ళు ఎంత మందో....అక్కడ.... పెళ్లిళ్లు ...ఫంక్షన్లు...చివరికి చావు భోజనాలకు పిలవని అతిథులుగా వెళ్ళి దొరికింది…
Read More