Month: November 2022

ధ్వంస రచన

ధ్వంస రచన పక్షి పాటలో ప్రజల పాట్లను దాద్దామనే ఓ వెర్రి ప్రయత్నమేదో చేస్తున్నాను! బాల భానుడి వెలుగులో భజంత్రీ చప్పుడొకటి చెప్పుడు మాటలా తొలిచేస్తోంది! తొలిమంచు స్పర్శలో తెగిపోతూ జీవితపు అంచు ఒకటి! మబ్బు చాటు చంద్రుడిలా మనసు మసకేసింది తుంపుకుంటూ జీవితాన్ని కష్టాల సరస్సులో ముంచుతోంది! నవ్వుకుంటూ చంద్రవంక కాస్త చూడవా నావంక అంటోంది! కరెన్సీ ఎలాగూ లేదు వెన్నెల కిరణమేదయినా అప్పిస్తాడేమో నెలవంక! వంక పెట్టలేమంటూ ఒకపక్క అంతా వంకరే అంటూ మరోపక్క! తలపోతల జీవితం పక్కదారి పట్టకుండా నిండుకుండలా నిండు సరస్సులా జీవితం సాగేనా! నాతో నేను చేసే యుద్ధం అద్దం పై మరకలా తొలిగేనా! ప్రశ్న శరమై దూసుకొస్తోంది ఆశే ఎండమావై ఎండిన మానులా వెలవెల బోతుంటే తెల్లబోతూ సమాధానం మృదంగ ధ్వానమై ధ్వంస రచన చేస్తోంది! - సి. యస్ రాంబాబు
Read More

గాలిలో దీపం

గాలిలో దీపం ఒక సారి.. మా ఊర్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చాటింపు వేయించారు.. అదే రోజు మా అమ్మ ఏదో ఎవరో చెప్పిన ప్రవచనాలు వింటు ఉంది... టీవీ లో... వారు అన్నారు, నీకు దేవుడి మీద భక్తి ఉంటే, నిన్ను దేవుడు కరుణిస్తాడు. నీలో నిజాయితీ ఉంటే.. ఏదైనా నిన్ను వదిలిపోదు.. నువ్వు నమ్మిన దైవం నిన్ను విడవడు అని.. కానీ దానికి మనం చేయాల్సింది మనం చేయాలి.. అంటే ఏదైనా మనం చేసే మంచిలో ఉంటుంది అని.. ఇది విన్న మా అమ్మ చెవిలో ఆ చాటింపు పడింది... అవును నిజంగా.. ఆయన చెప్పింది నిజమేనా అని ఆలోచిస్తూ... గదికి తాళం వేయకుండా, బయటికి వెళ్ళింది. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది అని అనుకుంటూ... తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న డబ్బు, నగలు మాయమయ్యాయి.. ఖాలీగా ఉన్న బీరువాని చూసిన అమ్మ షాక్.. ఎంటి…
Read More

ఖర్మ

ఖర్మ నేనంటే నీకెందుకంత కోపం? నేనేం చేశాను అని కొప్పడతావు? నిన్ను నేనేమన్నా అని తిడతావు? ప్రతి సారి తప్పు నాదే అన్నట్టుగా అందరి ముందు తిడతావు, ఎన్నెన్నో మాటలు అంటావు, అసలు ఏమైంది అని కూడా అడగవు. ఎవరేం చెప్పినా నమ్ముతావు కానీ నా మాట మాత్రం నమ్మవు. నువ్వన్న ఒక్కొక్క మాట నా గుండెల్లో మంటలు రేపుతుంటే, ఆందరి ముందు అవమానంగా అనిపిస్తున్నా, నిన్ను ఏమీ అనలేని స్థితిలో ఉన్నాను నేను. అందుకే కదు నీ గొంతు చించుకుని మరీ నన్ను అన్నన్ని మాటలంటావు. నేను మాట్లాడ లేననే కదా నీకు అంత పొగరు. ఏం పాపం చేశానని దేవుడు నాకిలా శిక్ష వేశాడో, అసలు ఇలాంటి బతుకు ఒక బతుకేనా? ఎన్ని సార్లు నాకు నేనే చావలని అనుకున్నా కూడా ధైర్యం చాల లేదు. అయినా నేనెందుకు చావాలి అనుకున్నా, నాకు బతికే అర్హత లేదా అని…
Read More

ప్రేమతో….

ప్రేమతో.... తనకోసం నేను రాసిన ప్రేమ లేఖలలో... నేను ఎప్పటికీ తనకి చెరవేయలేని.. మధురమైన లేఖ ఇది.... ఏవండోయ్.... మీ పేరేమిటో నాకు తెలియదు కానీ చూడగానే నాకు మీరు నచ్చేశారు... కానీ మిమ్మల్ని కలుద్దాం అని అనుకునెలోపే మా కాలేజ్ బస్ వచ్చేసింది... అందుకనే మిమ్మల్ని కలవలేకపోయా... కానీ ఆ రోజు నుండి మీకోసం చాలా చోట్ల వెతికాను. కానీ ఎక్కడా మీ ఆచూకీ లభ్యం కాలేదు.... కానీ కిందటి సారి నేను మిమ్మల్ని మా ఫ్రెండ్ పెళ్లి లో చూసా... ఆ రోజు నుంచి నేను మిమ్మల్ని గమనిస్తూ ఉండేదాన్ని... తరువాత మా నాన్న గారికి వేరే ఊరు బదిలీ అవ్వడం వలన మేము అక్కడకి వెళ్లిపోవడం జరిగింది... అక్కడకి వెళ్ళాను అన్నమాటే కానీ మనసంతా ఇక్కడే ఉండేది.... అప్పటి నుండి ఇప్పటి వరకు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటున్న.... ఎప్పటికైనా నా మనసులో మాటని మీకు చెప్పాలి…
Read More

మనసులో మాటలు

మనసులో మాటలు ఈరోజు (ఐదు సంవత్సరాల క్రితం) ఏంటో అసలు గడవట్లే అనిపించింది. అలా సరదాగా కాసేపు బయట తిరిగి వచ్చేద్దాం అన్ని వెళ్ళాను. ఏంటో జనం అంతా చాలా హడావిడిగా ఉన్నారు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. బయట కన్న ఇంట్లోనే బాగుంది అనిపించింది. అప్పుడే నన్ను ఒక ఆవిడ పిలిచింది ఆవిడ ఎవరో నాకు తెలీదు ఇంత ముందు కూడా నేను ఎప్పుడు చూడలేదు కానీ ఆవిడకి నేను బాగా తెలిసినట్టు పలకరించి, బాబు కొంచం నాకు ఓ గోలి సోడా తెచ్చి పెడతావా డబ్బులు ఇస్తా నడవలేకపోతునా అన్నారు. నేను సరే అన్ని వెళ్ళి తీసుకువచ్చాను ఆవిడ ముఖంలో ఓ చిన్న నవ్వు చూసాను. అప్పుడు ఆవిడని అడిగాను, ఇంత పెద్ద వయసులో కూడా ఇంత ఎండలో ఎక్కడకి వెళ్తున్నారు అని. అప్పుడు అవిడ, ఏం లేదు బాబు నా కొడుకు కూతురు గొడవ పడ్డారు,…
Read More

చేరని లేఖ

చేరని లేఖ చేరని లేఖ చెదిరిన కల కుశలప్రశ్నల కూపీలు కావు కుదురుగా కూర్చొని రాసే ఫిర్యాదుల వాక్యాలు కావు సంగతుల సారాంశం కాదు ఆ లేఖ మరేమిటి కథ... ఇంటికి చేరని ఉద్యోగ లేఖ ! ఊరట లేని ఉద్యోగాన్వేషణ నిరుద్యోగంలో నిండుగామునిగి సమయాన్ని సాగతీసి కాలాన్ని కఠోరంగా తిట్టి ఉపాధి హామీ అవకాశాలవేట ఎదురు చూపుల నేత్రాలు సమస్యలతో సతమతం పుస్తకాలతో కుస్తీ పట్టీ ఎదురుచూసే ఎండమావిగా ఆశచావని గందరగోళం నిరాశను నిట్టూర్పు విడిచి గెలిచి నిలవాలని సంకల్పం అధికారికంగా అందుతుందని ఆశాభావం లక్ష కారణాల చదరంగం విజయానికి ఒక్కటే మెట్టు అని దశ దిశ మారుతుందని వేచిచూసే ఉద్యోగ నిరుద్యోగ పర్వంలో ఎత్తు పల్లాల పయనంలో ఎదురీతల సాగరంలో మలుపులు తిరిగిన జీవితానికి మారిన చిరునామా సాక్ష్యంగా జరిగేదంతా మన మంచికే అని మారిన లక్ష్యంతో ముందుకు సాగినా ఇంటికి చేరని ఉద్యోగ లేఖ సంగతుల చిత్ర…
Read More

లేఖ

లేఖ చినుకులు కురవని నేలలా వరదే పొంగని వాగులా.... నీప్రేమకై వేచిచూస్తూన్న నిను చేరని లేఖనై... దేవుని చెంతకు చేరని పువ్వులా మట్టినే చేరని నినిగినై పూజించే అర్చకుడికే వరమివ్వని దేవతకు రాసుకున్న చేరని లేఖ... నీకోసమే ఆరాటపడే గుండె నిరంతరం నీరూపాన్నే కలగంటూ గుండెలో గుడికట్టి దేవతలా ఆరాధిస్తూ గుడిబయట బిచ్చగాడిలా నిను చేరని లేఖ నైతిని - హనుమంత
Read More

ముసుగు

ముసుగు మనుషుల్లో మంచితనం ముసుగు వేసుకున్న రాబంధువులు ఎన్నో వెకిలిగా నవ్వుతూ వెంట పడే వాడొకడు ప్రేమ నటిస్తూ ముంచే వాడొకడు సీటు కింద నుండి కాళ్ళు రాసే వాడొకడు రద్దియైన బస్సులో భుజాలు రాసే వాడొకడు కాలేజీ లో వెంట పడే వాడొకడు బాగున్నావామ్మ అంటూ కన్ను గిటే వాడొకడు ఆటో అద్దం లోంచి చూస్తూ వస్తావా అని అడిగే వాడొకడు, అన్నా అని పిలిచినా చున్ని లాగే వాడొకడు మీ అమ్మాయి బాగా చదువుతుంది అంటూ బుగ్గలు పిండే వాడొకడు, ఆరేళ్ల పసి పాపను ఆడిస్తున్నా అంటూ మీద కి వచ్చే వాడొకడు తాతయ్య నంటూ శరీరాన్ని నలిపే వాడొకడు మీ పాప చాలా తెలివి గలది అంటూ భుజాలు నొక్కే వాడొకడు. ప్రమోషన్ కావాలా అంటూ పళ్ళు ఈకిలించే వాడొకడు జీతం పెంచాలంటే ఇంకేదో ఇవ్వాలనే వాడొకడు ఉద్యోగం కావాలని వస్తె అన్ని పనులూ చేయాలనే వాడొకడు…
Read More

అనుమానం పెనుభూతం

అనుమానం పెనుభూతం అమ్మ ఇల్లు బాగుందా అన్నాడు పెద్దోడు, బాగుందిరా. మనం ఇంతకు ముందున్న ఇల్లు కన్న చాలా బాగుంది. ఇది మనందరికీ సరిపోతుంది అంది అమ్మ సంతోషంగా... నీకు నచ్చింది నాకు అదే చాలు. మూడు నెలల నుండి వెతుకుతుంటే ఇప్పటికీ నేను అనుకున్న రీతిలో ఇల్లు దొరికింది. అమ్మ నీకు చెప్పలేదు కానీ నేను మూడు నెలల నుంచి చాలా ఇల్లు చూశాను ఒక్కో దగ్గర ఒక్కోలా ఉన్నాయి. బాత్రూం ఉండదు నీళ్లు ఉంటే బాత్రూంలో ఉండవు బాత్రూంలో మంచిగా ఉంటే నీళ్లు ఉండవు మనం ఐదుగురం అనేసరికి కొందరు ఇవ్వము అంటూ మొహం మీదే చెప్పేశారు అలాగే గదులు కూడా చిన్నచిన్నగా ఉండేవి నేను ఈ మూడు నెలలు ఎంతగా తిరిగానో నాకే తెలుసు అంటూ వాపోయాడు పెద్దోడు. పర్లేదులే ఇన్ని రోజులు నువ్వు తిరిగినందుకు మనకు మంచి ఇల్లే దొరికింది నీ కష్టం ఊరికే పోలేదులే…
Read More

నిను చేరని నా లేఖ.!

నిను చేరని నా లేఖ.!   నీ చూపు చాలు నాకదే వందేళ్ల‌ వరమనుకున్నా.! నీ మాట‌ వింటూ నేను ఇన్నేళ్లుగా బతికేస్తున్నా.! నీ తోడు లేక ప్రతిరోజూ..ప్రతిక్షణం మరణిస్తున్నా.! నీ ప్రేమకి..నీ మనసుకి..నే బానిసనవుతున్నా.! నీ మదిలో నా స్థానాన్ని తిరిగి పొందాలని తపిస్తున్నా.! నీ గుండెల్లో నా స్థానం కోసం మళ్లీ కొత్తగా ప్రేమిస్తున్నా! నీ నుంచి ఇక జీవితంలో దూరం కానని మాటిస్తున్నా.! నీ ఎదురుపడలేక నిను చేరని ఈ లేఖను నే రాస్తున్నా‌.! - ది పెన్
Read More