Month: November 2022

ఇంగ్లీష్ మందులు మంచిదా ఆయుర్వేదం మంచిదా

ఇంగ్లీష్ మందులు మంచిదా ఆయుర్వేదం మంచిదా ఇంగ్లీష్ మందులు మంచిదా ఆయుర్వేదం మంచిదా అంటే మనం పూర్వకాలంలోకి వెళ్ళాలి. ఇంగ్లీష్ మందులు అనేవి లేవు. రాజుల కాలంలో యుద్ధాలు చేసి గాయాలపాలైన వారికి అక్కడి వైద్యులు తెలిసిన మూలికా వైద్యం చేసేవారు. దాంతోపాటు ఆహార మార్పులు చేయడం వల్ల వారి గాయాలనేవి తగ్గేవి. ఇలా పూర్వకాలం నుంచి మనం మూలికల మీదే ఆధారపడ్డాము. అయితే బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చిన తర్వాత దేశాన్నంతా ఆక్రమించుకొని వైద్యం కూడా విలువైనదిగా భావించి వారి హస్తగతం చేసుకున్నారు. మన పూర్వీకులను బంధించి వారి ద్వారా మూలికల గురించి తెలుసుకుంటూ రకరకాల ఔషధాలను కనిపెట్టి వాటిని ప్రజల అందుబాటులో లేకుండా చేసి డబ్బులకు అమ్ముకున్నారు అదే ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు మనం ఒక చిన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. మన ఇళ్లల్లో గృహిణిలు ప్రతిరోజూ కూరగాయలు కోయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు…
Read More

ఆయుర్వేదం మరియు ఇంగ్లీష్ మందులు…

ఆయుర్వేదం మరియు ఇంగ్లీష్ మందులు... నన్ను అడిగితే ఇంగ్లీష్ మందుల కన్నా ఆయుర్వేదమే మిన్నా.... ఎందుకు అంటే ఇంగ్లీష్ మందులలో రకరకాల పదార్ధాలు వాడుతారు. వాటినీ వాడడం వల్ల అనారోగ్యం నుంచి తెరుకోవచ్చు ఏమో కానీ వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొత్త రోగాలకి మన శరీరం సిద్దంగా ఉంటుంది.. అదే ఆయుర్వేదం మందులు అయితే అందమైన, మన చుట్టూ ఉండే ప్రకృతి నుంచే తయారు చేస్తారు కాబట్టి మనకి మన శరీరానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు... అలాగే ఇంగ్లీష్ మందుల యొక్క తయారీ విధానం కూడా మనకి తెలియదు అదే ఆయుర్వేదం మందులు అయితే మన పూర్వీకుల కాలం నుంచి తాళపత్ర గ్రంధాల్లో మన కోసం లిఖించారు... అందుకే ఇంగ్లీష్ మందులు వాడండి కానీ కొంచం జాగ్రత్తలు పాటిస్తూ వాటికి అలవాటు పడకుండా ఉపయోగించండి... ఆయుర్వేదం మందులు మాత్రమే ఉపయోగిస్తే మంచిది అని నా అభిప్రాయం.…
Read More

అలుపెరుగని బాటసారి

అలుపెరుగని బాటసారి సరస్వతి కొత్తగా పెళ్లి అయ్యి అత్తారింటికి వెళ్ళింది. ఆమె పెళ్లి కాస్త వింతగానే జరిగింది.సరస్వతి పిన్ని నీ చూడడం కోసం వచ్చిన పెళ్లి కొడుకు సరస్వతి నీ ఇష్టపడడం తో ఇక తప్పక పెళ్లిచేశారు.పెళ్లికి నాలుగు వేల కట్నం, సారే పెట్టీ పంపారు. కానీ అక్కడికి అంటే అత్తారింటికి వెళ్ళాక తెలిసింది అతనికి ముందే పెళ్లి అయ్యిందని.ఆ విషయం తెలిసిన పెద్దలు వచ్చి మాట్లాడారు ముందే ఎందుకు చెప్పలేదు అని. ఆమె నే వదిలేసి వెళ్ళింది కాబట్టి చెప్పలేదు.ఆమె అంగీకార పత్రం రాసిందంటూ చూపించారు అత్తామామలు. దాంతో పెద్దలు మా అమ్మాయి జాగ్రత్త అంటూ చెప్పి సరస్వతికి అన్ని విధాలా నచ్చచెప్పి వెళ్లారు. పెద్దలు చెప్పినట్టు చేయడమే కానీ సరస్వతికి ఎదురు చెప్పే ధైర్యం లేదు.ఎందుకంటే తన తర్వాత ముగ్గురుచెల్లెళ్ళు ఉన్నారు మరి. నోరు మెదపకుండా ఉండిపోయింది సరస్వతి. మొదటి రాత్రి భర్త తాగి వచ్చి ముట్టుకున్నా ఏమీ…
Read More

అనుభూతుల వల

అనుభూతుల వల దోచుకునే జనాలున్నట్టే దాచుకునే దోస్తులుంటారు శ్లేష్మమై జీవితం మింగేస్తుంటే జీవన సౌరభం జారిపోతుంటుంది బాల్యపు మిత్రుడెప్పుడో చరమాంకంలో చరిత్ర పాఠంలా పలకరిస్తాడు వళ్లంతా చెవులు చేసుకుని జ్ఞాపకాల స్వరమాధురికి తలొగ్గుతాం తారతమ్యాలు లేని ఆకాలంలో అందరూ తారలే మధ్యలో వచ్చే హోదాల గోదాల్లో సిగపట్లతో అలిసిపోయాక సిగ్గే మిగులుతుంది మునిమాపువేళంతే మధుర జ్ఞాపకాలను చప్పరిస్తుంటుంది గతం వర్తమానాల మధ్య లోలకమై లోపలి దాహానికి చలివేంద్రమవుతుంది ఇక భవిష్యత్తు బెంగనిపించదు నడిచిన బాటలో చేసిన గాయాల చింతే ఉంటుంది అనుభూతుల వలేసి మిత్రులను గాలించటమే మిగిలింది - సి. యస్. రాంబాబు
Read More

పురుషులందు పుణ్య పురుషులు వేరయా

పురుషులందు పుణ్య పురుషులు వేరయా ప్రతి మగాడి విజయం వెనక స్త్రీ ఉన్నట్టే, ప్రతి మహిళా విజయం వెనక మగాడు కూడా ఉంటాడు. అయితే స్త్రీ తెలిసినంతగా పురుషుడు తెలలియడు. తెలియాల్సిన అవసరం లేదని అతను అనుకోవడమే అందుకు కారణం. అయినా మహిళలు ఊరుకోరు. నేను ఇది సాధించాను అంటే కారణం నా భర్త, పిల్లలు అంటూ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం కద్దు. మరి మహిళలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా, ప్రత్యేకంగా చూస్తారు. మహిళా ఏడిస్తే కరిగి నీరవుతారు. ఆమెకి ఏ ఆపద వచ్చినా ముందుంటారు. ఇంకో మగాడు ఎడిపిస్తున్నాడు అంటే వాడిని చంపడానికి వెనకాడరు. మరి మగాళ్లకు బాధలు లేవా? వారు ఎడవరా? వారికి ఫీలింగ్స్ లేవా? ఆనందాలు అక్కరలేదా అంటే మగాడికి బాధలు ఉంటాయి. కన్నీళ్ళు వస్తాయి. ఆనందం ఉంటుంది. ఫీలింగ్స్ ఉంటాయి. కాకపోతే అవన్నీ బయటకు చెప్పుకోలేడు. ఎందుకంటే దానికి కూడా మనమే కారణం. చిన్నప్పటి నుండి…
Read More

ఎదురీత

ఎదురీత దిన దిన గండంగా గడిచే మధ్యతరగతి జీవితాలు రోజు కూలితో దినం గడిపే నిరుపేదలు కూడూ గుడ్డా వంటి కనీసవసరాలైనా తీరక రోడ్డు పక్కనే నివాసనేర్పరచుకుని ఈసురో మని కాలం గడిపే ఎందరికో తప్పదు కాలానికి ఎదురీదుతూ పోరాడడం ర్యాంకుల కోసం పోటీలతో పరుగెడుతూ అమ్మానాన్నల కృత్రిమ హోదాల కోసమని పిల్లలపై రుద్దే చాదస్తంలో పులిని చూసి‌ నక్కవాత చందాన పోలికలతో చిన్ని మనసుని సతమతం చేస్తుంటే తప్పదు చదువుల వెంట పరిగెత్తే ఎదురీత ఆలు మగల ఉద్యోగాలలో క్షణమైనా తీరిక లేక మితిమీరిన ఒత్తిడికి గురి అవుతూనే ఆలు మగల సత్సంబంధం‌ చిద్రం చేసుకుంటూ మమతానురాగాలని మరచి చరిస్తూ అహాలతో కూడిన సంబంధాలు నిలవవంటూ విడివడి వేరైన నేటి తరాలకి తప్పదు ఎదురీత అడుగడుగునా జీవితమనే రహదారిలో ఎదురయ్యే ఎత్తు పల్లాల స్పీడుబ్రేకర్లు అలలు అలలుగా ఎగసి పడే మనో ఉద్విగ్నతలు అదిమి‌ పట్టి సర్దుకుపోతూ బంధాలను కాపాడుకుంటూ…
Read More

అలుపెరగని బాటసారి

అలుపెరగని బాటసారి ఓక ఇంటిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అందులో పెద్దవాడికి పెళ్లి అయింది. చిన్నవాడికి పెళ్లి కాలేదు. పెద్దవాడు కాస్త కష్టపడినా కొంచెం కుటిల బుద్ధి కలదు. చిన్నవాడు చాలా మంచివాడు. ఎక్కువగా కష్టపడి తన అన్న చేతిలో పెట్టేవాడు. తాను సంపాదించినా దాని కన్నా తమ్ముడి సంపాదనతో ఇల్లు గడిచేది. కాని తన అన్న భార్య తనను మంచిగా చూసేది కాదు. తన భర్తకు తెలియకుండా మరిదిని చిత్రహింసలు పెట్టేది. ఎంతో అవమానించేది. కాని భర్త ముందు మాత్రం మరిదిని పొగిడి, నీతి వాక్యాలు వల్లించేది. "నాయానా! కష్టాలు మానుషుల కాక మానులకు వస్తాయా చెప్పు... అంటూ భర్త ముందు నటించేది. అమ్మ లాంటి వదినమ్మ హింసిస్తుంది అని అన్నకు చెప్పలేక తనలో తాను కుమిలి పోయేవాడు. ఎప్పటికైనా నిజం దానంతట అదే తెలుస్తుంది అని ఊరుకునేవాడు. ఇంతలో ఒక రోజు తన నగ పోయిందంటూ మరిది తిసేసాడు…
Read More

బాటసారి

బాటసారి దప్పిక తీరని ఎడారిలా ఆకలి తీరని పులిలా బ్రమణం చేసే భూమిలా ఉవ్వెత్తున ఎగసే కెరటంలా భాద్యతలు మోసే నాన్నలా ప్రేమను పంచే అమ్మలా సాగిపో బాటసారి గుడిసెను కమ్మిన అమావాస్యను రైతులను పీడ్చే దళారులను అఘాయిత్యాలకు పాల్పడే హంతకులను ఓట్లను దొంగిలించే నాయకులను ప్రశ్నించడానికి సాగిపో బాటసారి అంతంలేని ప్రశ్నలకు అర్థంలేని ఆవేశాలకు ఆకలైన అన్నార్తులకు అనంతమైన దైవాన్ని ప్రశ్నించడానికి సాగిపో బాటసారి - హనుమంత
Read More

చిరునవ్వు

చిరునవ్వు అణువణువు అవమానం జరిగినా అడుగడగునా మాటలు బాకులై పొడుస్తున్న పంటి బిగువున బాధను అదుముతున్నా కష్టనష్టాలను భరిస్తున్నా, తన పెదవుల పై చిరునవ్వు చెరగలేదెందుకో... - భవ్య చారు
Read More

గులాబీ

ఆ గులాబీ రెక్కల పై ఉన్న నీటి బిందువులు వర్షానివో మంచువో, ఆమె ఎదలోతుల్లోని మాయాని గాయానివో, ఏవో అయినా ఆ గులాబీ అందంగానే ఉంది ఆమె విరిసిన పెదాల పై నవ్వులా... - భవ్య చారు
Read More