Month: November 2022

ప్రతిక్షణం

ప్రతిక్షణం   నా ప్రారంభానికిమునుపే నా కోసం వేచివున్న నేస్తమా... ప్రతిక్షణం నీకోసమే ఆరాటం ప్రతిక్షణం నీతోనే మమేకం... పక్షులతో కుహు కుహులు సూర్యుడితో దాగుడుమూతలు..... వసంతాన చిరుగాలులు శిశిరాన చనుగాలులు తాకిన మేనంత పులకరింతలు..... నానంతరము వేచిఉండే నేస్తమా.... నాతోపాటు వచ్చే నేస్తమా... - హనుమంతు  
Read More

సంస్కార విద్యా వర్థతే.!

సంస్కార విద్యా వర్థతే.! రేయనగా..పగలనకా..ఏ కష్టాన్ని లెక్కచేయక.. రెక్కలు ముక్కలు చేసుకుని..కాసిన్ని డబ్బులు పోగేసి.. తాము పస్తులుండి..బిడ్డల ఆకలితీర్చే తల్లిదండ్రులు.. తమకు లేని చదువును..పిల్లలకు అందించే ఆరాటంలో కొత్త బట్టలు కొడుక్కి కొనిచ్చి..తాము చిరిగిన దుస్తులేసి మోటారు సైకిల్ వాడికిచ్చి వారు కాలినడకన పనులకేగి లోపల మంచం వాడికేసి..వారు ఆరుబయట పరుండి సుఖ నిద్రను పుత్రునికిచ్చి దోమలతో చేసే సావాసంలో పిల్లాడి చదువు కోసం..పచ్చని పొలాన్ని తాకట్టుపెట్టి పరీక్ష ఫీజుల కోసం..పుస్తెలతాడును తెగనమ్ముకుని జల్సాల కోసం ఇంకా వేధిస్తున్నా మారతాడని‌ నమ్మి వాడి భవిష్యత్తు కోసం సమిధలై చేస్తున్న యజ్ఞంలో అలసిపోయిన అమాయక అమ్మానాన్నలకేం మిగిలింది రెక్కలొచ్చిన పిల్లలు తల్లిదండ్రులను బరువనుకుంటే చదువిచ్చిన సంస్కారాన్ని మరిచి కన్నవారినే కాలదన్ని ఎండకన్నెరగకుండా పెంచిన వాళ్లనే నడివీధిలోకి‌‌ నెట్టేస్తే ఇది‌ కాదు చదువంటే..ఇది కాదు సంస్కారమంటే.. జన్మనిచ్చిన వారికి జీవితాన్నర్పించాలనుకున్నప్పుడు చదువు చెప్పిన గురువుల పాదాలను కడిగినప్పుడు.. సంస్కారంతో నిండిన‌ విద్య సార్థకమై ప్రకాశిస్తుంది.!…
Read More

చదువు – సంస్కారం

చదువు - సంస్కారం చదువుతో పాటు సంస్కారం అబ్బాలని నియమమేమి లేదు చదువు సంస్కారం నేర్పుతుంది అంటారు కానీ........ సంస్కారం మనిషికి వన్నె తెచ్చే ఆభరణం లాంటిది ప్రతి వ్యక్తికీ వ్యక్తికి మధ్య సమయాన్నిబట్టి నడుచుకునేదే మనిషి సంస్కారం వింతపోకడల వినూత్న ప్రపంచంలో సవాలుగామారింది సంస్కారం అనేది మనిషి మనిషిగా దిద్దు కొనేది మంచి నడవడిక మాత్రమే సంస్కారం వివేకంతో మాట్లాడినా విజ్ఞానంలో మునిగి తేలినా సంస్కారం మన కర్తవ్యం విశ్వ విద్యాలయాలు పాఠాలు నేర్పి పట్టాలు ఇచ్చినా స్పందించే హృదయంలోనుండి వస్తుంది సంస్కారం పరిస్థితులను బట్టి పాటించే నడవడికే సంస్కారం పాటించకుండా రాదు అది సమాజంలోని మనిషికి చదువు ఒక్కటే సరిపోదు జీవితానికి అనే సత్యాన్ని గ్రహించి సంస్కారం లేని చీడపురుగులు గా కాకుండా సమాజానికి మనమిచ్చే కానుక సంస్కారము ....? - జి జయ
Read More

సంస్కారం

సంస్కారం చదువుకోవడం వల్ల సంస్కారం అబ్బుతుందని మన తల్లిదండ్రులు మనల్ని చదివిస్తారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి వాళ్ళు తిన్నా, తినకపోయినా తాము చదువుకోలేదని తమ పిల్లలైనా చదువుకోవాలని ఆశపడి కష్టపడుతూ రెక్కలు ముక్కలు చేసుకొని చదివిస్తారు. ఉద్యోగం చేస్తాడని, తమను ఉద్ధరిస్తాడని కాకుండా తన బ్రతుకు తాను బ్రతుకుతాడని సంస్కారవంతంగా అందరితో మెలుగుతాడని భావించి చదివిస్తారు. అయితే చదివిన అందరూ సంస్కారవంతులు కాకపోవచ్చు. చదువు లేని వారంతా సంస్కారులు అవ్వచ్చు. ఇక్కడ చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం అనేది జన్మతా రావాలి లేదా పరిస్థితులను బట్టి తమ కుటుంబ సభ్యులను బట్టి రావాలి అయితే కుటుంబమైన వ్యవస్థ అయిన కొందరి మనుషుల మీద విపరీత ప్రభావం చూపిస్తుంది. అయితే చదువుకున్నా కూడా సంస్కారహీనులుగా ప్రవర్తించే కొందరి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ మధ్య సోషల్ మీడియా అనేది చాలా మంది కి చాలా కామన్ అయిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉంటే…
Read More

చదువు – సంస్కారం

చదువు - సంస్కారం 1. ఆ.వె. చదువు వల్ల కలుగు సంస్కార భాగ్యంబు చదువు వల్ల చట్ట సభలు నడుపు చదువు వల్ల నబ్బు జనహిత మార్గమ్ము చదువు ఎల్లవేళ శాంతి గూర్చు 2. ఆ.వె. విద్య నేర్చుకున్న వినయంబు పెరుగాలి ఒదిగి యుండు టెల్ల కొదువ గాదు గర్వ మెప్పుడైన కష్టాల పాల్జేయు అణకువ సుగుణాల కాటపట్టు 3. ఆ.వె. నేర్చుకున్న చదువు నీలోనె దాయకు నిరుపయోగమగును నీకు కూడ పంచుకున్న కొలది ఫలమధికమ్మగు తోట బావి జలము తోడినట్లు 4. ఆ.వె. శాస్త్రవేత్తవయ్యి శాషించు విశ్వాన్ని మానవతను చాటు మార్పు తెచ్చి అక్షరాస్యులైతె అన్నియూ సాధ్యము దేశమాత మురిసి తేజరిల్లు 5. ఆ.వె. అక్షరాస్యుడవయి అవనిని కాపాడు విజ్ఞతలను పంచు విశ్వమంత పంచ భూతములను పాలించు సమముగా విస్మరించ వలదు విశ్వ శాంతి - కోట
Read More

వేకువై విచ్చుకో

వేకువై విచ్చుకో నిశ్శబ్దాల నిశీధిలో స్వప్నమై అడుగేయ్ స్వేచ్ఛా దీపాలను వెలిగించి వెలివేసిన ఆలోచనలను వేకువగీతం చేయ్ వేధించే శత్రువుల్లా కోపతాపాలు కోరికలు దాడి చేస్తుంటే సందిగ్ధాల నదిలో నిర్భయవీరుడిలా తెడ్డేయ్ మాటను గురిపెట్టే విలుకాండ్రను మౌనంతో కాచుకుంటూ చిరునవ్వు అస్త్రాన్ని వాడాలి వడలిపోయి వెడలటం కాదు వెతలే ఊతంగా గమ్యంవైపు సాగు అసత్యం నీడలా వెంటాడుతుంటే నీడనిచ్చే నిజాల చెట్టెక్కడో ఉండే ఉంటుంది సత్యాల తోటలో అడుగుపెట్టావా సందేహాల మదిలో అరుణకాంతులు తొలి వేకువై విచ్చుకుంటాయి - సి. యస్. రాంబాబు
Read More

అంత వరకూ మంచిదే.!

అంత వరకూ మంచిదే.! అనగనగా ఒక ఊరిలో స్వామి మాల‌ వేసుకున్న ఒక భక్తుడు‌.. ఇరుముడి ధరించి అలా‌ అడవి మార్గాన‌ వెళుతున్నాడు.. దారిలో జంతువుల కోసం‌ వేసిన‌ ఉచ్చులో తెలియకుండా కాలుపెట్టాడు.. ఆ బాధకు గావుకేకపెట్టాడు.. ఆ అరుపులు విని అడవిలో కట్టెలు ఏరుకోవడానికి వచ్చిన ఓ గిరిజన మహిళ పరిగెత్తుకుంటూ వచ్చింది.. అతని బాధ చూసి కంగారుపడింది.. విలవిల్లాడిపోతున్న అతనిని కాపాడాలనుకుంది.. కానీ అడుగు ముందుకు పడటం లేదు.. కారణం.. ఆమె నెలసరిలో ఉంది.. అతనేమో స్వామి మాల‌లో ఉన్నాడు.. ముట్టుకుంటే అపచారమంటాడేమో.. మాల‌ అపవిత్రం అయిపోయిందంటాడేమో.. అలాగని వదిలేస్తే రక్తం‌ కారి ప్రాణాలు పోతాయేమో.. ఇప్పుడేం చేయాలి దొరా.! అనుకుంటూ పరిపరి విధాలా మదనపడుతోంది. ఈ కథలో ఆ మహిళ ఏం చేస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారు? మనిషి ప్రాణమా? తరతరాల నుంచీ ఉన్న కట్టుబాటా? మైలా లేక మాలా? దేనికి ప్రాధాన్యతనివ్వాలంటారు? నేనైతే ఆపదలో ఉన్నవారిని‌ కాపాడటమే…
Read More

నాగరికత

నాగరికత పెడకల్లు పురుగు పుట్రా రానివ్వకుండా చేస్తాయి. బియ్యపు పిండి ముగ్గు క్రిమి కీటకాలకు ఆహారం అవుతాయి. ముగ్గిట మామిడి తోరణాలు స్వఛ్చమైన గాలినిస్తాయి. జాజు అలుకుడు చెడు దృష్టిని తిప్పి కొడుతుంది. కుండలో నీరు ఆరోగ్యాన్ని పెంచుతుంది. మట్టి పాత్రలో వండిన వంటకాలు గుండెను కాపాడతాయి. అల్లం, వెల్లుల్లి హుద్రోగాలు రాకుండా చేస్తాయి. దగ్గు, జలుబుకు శొంఠి కషాయం విరుగుడే, పెరుగు చల్లదనాన్ని ఇస్తే, వెన్న వెన్నెముక ను కాపాడుతుంది. ధనియాలు జీలకర్ర మిరియాలు రోగాలని దరి చేరకుండా చేస్తాయి. కాళ్లకు పెట్టుకునే పసుపు రక్తాన్ని గడ్డ కట్టేలా చేస్తుంది. కారం ఒంటికి శక్తిని అందిస్తుంది. వేపాకు కు మించిన ఔషధం లేదు. పారిజాత వాసనలు, జాజి మల్లెల సుగంధాలకు ఎలాంటి సెంటు అయినా దిగదుడుపే. ఛాయా పసుపు తో అందం ద్విగుణీృతం అవుతుంది. దానికి ఎలాంటి ఫెయిర్ అండ్ లవ్లీ లు పనికి రావు. గంధం సువాసనలు వెదజల్లుతూ…
Read More

విజ్ఞాన భాండాగారం

విజ్ఞాన భాండాగారం అసలు మనం పురోగమిస్తున్నామా? తిరోగమిస్తున్నామా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే! అభివృద్ధి పేరుతో ఆచారాలను అటకెక్కిస్తున్నాం విజ్ఞానం అంటూ విర్రవీగి వివేచనను కోల్పోతున్నాం ఆచారాలకు మూఢనమ్మకాల ముసుగు వేసి మూలన కూర్చోబెట్టాం చాణక్యుని శాస్త్ర సారానికి చరమగీతం పాడేసాం నీతి శాస్త్రాల నియమాలకు ఎప్పుడో నీళ్లొదిలేసాం మన విజ్ఞాన సంపదకు విదేశీయులు సైతం ముక్కున వేలేసుకుని మరీ ముచ్చట పడిన ముడుపును మురికి కాలువలో కలిపేశాం. మన ఋషి శాస్త్రవేత్తలు నింపిన విజ్ఞాన బాండాగారం నిలువునా పాతి పెట్టేసాం ఆధ్యాత్మికతకు విజ్ఞానాన్ని విడదీసి ఎప్పుడో విడాకులు ఇప్పించేసాం సారమంతా పారబోసి వట్టి పిప్పి తిన్నట్టు వి'గ్రహాల' చుట్టూ కట్టకట్టుకు తిరుగుతున్నాం తోరణాలను తుంగలో తొక్కేసాం గడపలకు రంగు ముడుపు కట్టేసాం ఆయురారోగ్యాలను ఇచ్చే ఆయుర్వేదాలను అమ్మమ్మలకంటగట్టి పాత చింతకాయ పచ్చడి ముద్రతో పాతి పెట్టేసాం ఆగస్త్య సంహితను గాలిలో విసిరేసాం భరద్వాజ బుద్ధిని బూడిదలో కలిపేసాం విజ్ఞానం…
Read More

సైన్స్ & సమాజం

సైన్స్ & సమాజం మనిషి మేధస్సుకు నిదర్శనం సైన్స్: నిత్య జీవితంలో అనుసంధానమై రోజు గడవడం లేదు విషయాలను విడమరిచి చెప్పే సైన్సు సమాజాభివృద్దికి ఎంతగానో దోహదం చేస్తూ విజ్ఞాన ఫలాలను అందిస్తున్నది ఎందరో మహానుభావుల కృషి వలన వికసించిన విజ్ఞానం మన ముంగిట వాలుతుంది సైన్స్ ని సక్రమమైన విధానంలో వాడితే అభివృద్ధి జరిగి పురోభి వృద్ది గా ముందుకెలుతుంది అజ్ఞానాన్ని వీడి మూడాచారాలను అవగాహన లేకుండా అమలుపరిస్తేజరిగేదిసమాజంలో మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. సైన్స్ మార్పుకు సంకేతం సైన్స్ వలన సౌకర్యం సైన్స్ వలన సౌలభ్యం సైన్స్ వలన అభివృద్ధి సైన్స్ వలన సంచలం సైన్స్ వలన ఆధునికత సైన్స్ వలన అనుసంధానం సైన్స్ తోనే పరిణామాలు శాస్త్ర సాంకేతికల వలన ఎంత విజ్ఞాభివృద్ది చెందినా వాటి పర్యవసానాలు ఎంతో కొంత ప్రభావం చూపుతాయి కాబట్టి అరచేతిలో విజ్ఞానం ఉన్నా మనిషి " సైన్సు ని సమాజాన్ని…
Read More