Month: December 2022

బ్రిటన్ ప్రధాని రిషి సునక్

బ్రిటన్ ప్రధాని రిషి సునక్ భారత సంతతి ప్రధాని సృష్టించిన చరిత్ర అమోఘం అద్భుతం !!!! ఎల్లలు దాటిన స్వప్నం ఆశల శ్వాసల అందలం అనుకున్నది సాధిస్తే అదే తిరిగొచ్చిన వసంతాల సంబరం వొడిసి పట్టిన ఫలితం పట్టువదలని ప్రయత్నాలు అనుభవాల పాఠాలు సంకల్పాల పుటలు కృషితో కట్టిన అంతస్తులు పట్టుదలతో కలల సాకారం సంతసించిన భారత హృదయ విహంగం కళ్ళ ముందు సాక్షాత్కరించిన తిరిగొచ్చిన వసంత కాల ఆనందమే మరి.......? - జి జయ
Read More

మంచు దుప్పటి

మంచు దుప్పటి ఋతువులు మారితేనే ప్రకృతి అందం మారుతుంది మారిన అందాలు అందులోనూ కప్పుకున్న మంచు దుప్పటి భానుడి రాకకు వేచి చూడగా మరికొంతసేపు సరికొత్త అందాలు చవిచూడమన్నది హిమాలయాల అందచందాలు వర్ణించలేని కాశ్మీర్ సరికొత్త సోయగాలు వైవిధ్యభరిత రంగుల వనాలు రుచిచూసే అనుభూతుల క్షణాలు పర్వత శిఖరాల పలు వరుసలు ఉద్యన వనాల ఊసులు ఆశ్చర్యకరమైన దారులు ఆహ్లాదకరమైన తెల్లని మంచు పొరలు మనసు పరవశమయ్యేను చూడగా దూదిపింజలదూరాలు చలిమంటల కుంపటిలతో వేడి వేడి టీ ల ఆస్వాదనతో అందరి మనసుకొల్లగొడుతుంది వణికే చలిలోనైనా కదా ప్రకృతి మనకిచ్చిన వరం మరి...? - జి జయ
Read More

తిరిగొచ్చిన వసంతం

తిరిగొచ్చిన వసంతం చల్లగా, మెల్లిగా, సంతోషంగా సాగిపోతున్న నా జీవన స్రవంతి లోకి మెరుపులా వచ్చిందొక ఎర్ర గులాబీ తానే నా లోకమయ్యి,నేనే తానంటూ నను మైమరపించేది ప్రతి రోజూ ప్రతి క్షణక్షణం తన ఊసులే నా మధినిండా తోలోచేవి, యుగలన్ని క్షాణాలుగా క్షణాలు అన్ని నిమిషాలే అయిపోయాయి ఇక తాను నాకే సొంతం అనుకున్న క్షణం లో అప్పుడే పేల్చిందొక పెల్చిందొక విస్పోటనం తన కోసం ఓ రోజు ఎదురుచూస్తున్న క్షణం లో గాలివారుగా ఓ లేఖ నాకు చేరింది నను మన్నింపు అంటూ ఆ లేఖతో నేను చచ్చిన శవాన్ని అయ్యాను క్షానాలు రోజులుగా రోజులన్నీ యుగాలుగా గడిచాయి, నా ప్రేమ నిజం కాదా నేను మోసపోయాను అనే వేదనలో మునిగిపోయాను అందరూ చెప్పిందే నిజమని తేలింది ప్రేమలో చావు తప్పదు అన్నారంతా  నేను కావాలనుకున్నా కానీ ఎవరో మోసం చేసి వెళితే నా తల్లిదండ్రులకు ఎందుకు శిక్ష…
Read More

మంచు

మంచు ఎదుటి మనిషి కానరాకుండా కప్పుకొనేరా మంచుదుప్పట్లు... అనంత ఎడారిలో కూడా దట్టమైన పొరల్లా మంచుదుప్పట్లు.. ముసలి ముతక కప్పుకునేరా ఖరీదైన నూలు దుప్పట్లు... పొడుచుకొచ్చేనురా సూర్యకిరణాలు కరిగేనుర దట్టమైన మంచుదుప్పట్లు... భానుడి వేడికి సొమ్మసిల్లినా హిమము కరిగి కప్పెనుర దుప్పట్లు... భోగిమంటలై వెలిగేనుర నిప్పురవ్వలు మరింతగా కాచుకోగా చలిమంటలు.. హాయినిచ్చేనురా పొగలు కక్కే కాఫీలు మంచుదుప్పట్లను చీల్చే ప్రయానికులకు.. - హనుమంత
Read More

ప్రకృతి కాంత

ప్రకృతి కాంత పచ్చని పరువాలను చుట్టుకున్న ప్రకృతి కాంత మార్గశిరం రాకతో వణుకుతూ గజగజల చలిగాలి చల్లని మలయమారుతంలా విసరుతూ ప్రజని ఉలిక్కిపడేలా చేస్తుంది గడగడలతో... ఆ పచ్చని పరువాలకి అలంకారంలా రేయంతా మంచుబిందువులు అల్లుకుంటే చూసే కనుదోయికి తెలియని ఆనందం నింపుతూ వెన్నెల కాంతిలో తళుకులీనుతుంది నిశీధి రేయిలో తాకగా ఝల్లున మదిని తడుతుంది ఉషోదయాన నునువెచ్చని కిరణాలు ప్రసిస్తూ భానుడు ఉదయిస్తుంటే ఆ కిరణాల తాకిడికి మరింత ప్రకాశింపచేస్తూ ఆనందం పంచుతాయి వేడెక్కిన సూర్యకిరణాలు తాకగానే జర్రున జారిపోతుంది తామరాకుపై బిందువులా మంచు దుప్పటిని తొలగించుకున్న ప్రకృతికాంత‌ - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

మంచు దుప్పటి

మంచు దుప్పటి మంచు కురిసే వేళలో, నీ తలపుల నావలో నా మనసక్కడే ఆగిపోయింది. కదలనంటూ మోరాయిస్తోంది... నీ చిరునవ్వులో మది చిక్కుకు పోయింది. నిన్నూ నన్నూ ఈ మంచు దుప్పటి కమ్మేసిందా అనే విస్మయాన్ని కలిగిస్తుంది. నీతో మమేకమవమంటూ కాలం తొందర చేస్తుంది. కలలు అన్నీ తీర్చుకోవాలని నా మనసు, సొగసు ఉవ్విల్లూరుతుంది. నీ వెచ్చని కిరణాల తాకిడికి నా మేనంతా పులకరిస్తుంది. కాసేపైనా నిన్ను కౌగిలించుకుని ఉండాలని ఉంది కానీ నువ్వేమో ఆ కాసేపటికే నిప్పులు చిమ్ముతూ నా ఒళ్ళంతా పగుళ్లు వచ్చేలా చేసావు నా శరీరమంతా బీటలు వారెలా చేసావు అందుకే నువ్వెంత ఇష్టమైనా నీకు దూరంగా వెళ్తున్నా నిన్ను చూడకుండా నా దుప్పట్లో కి జారుతున్న నీ నీడ పడకుండా నా తలుపులు ముస్తున్నా ... - భవ్య చారు
Read More

మంచు దుప్పటి

మంచు దుప్పటి ప్రచండమైన కిరణశరాలతో.... మంచు దుప్పటి మరుగున... మత్తుగా మునగదీసుకున్న... మర్త్యలోకాన్ని... మేల్కొలిపిన ఆదిత్యుడు... క్రమక్రమంగా... పగలుకు వీడ్కోలు పలికి.. సంజె సోయగాల.. అరుణిమ లోంచి... నిశ్శబ్ద నీరవంలోకి మారుతూ... సవ్వడి లేకుండా సన్నగిల్లిపోతున్న.. ఉన్న ప్రతి సాయంకాలం... ఆశ నిరాశల నిరంతర వలయంలో.. నలిగి విసిగివేసారిన నా మది... ఆత్మవలోకనం చేసుకుంటుంది. మంచు దుప్పటిని... ఛేదించుకొని వచ్చే.. రేపటి మనోజ్ఞమైన... తుహిన కిరణాల కాంతులను.. మళ్లీ చూడగలనో లేనో అని... - మామిడాల శైలజ
Read More

మది

మది నీ మదిలో చోటిచ్చావు నీ హృదయంలో పదిలపరిచావు నేను నీ దాన్నంటూ మాటలెన్నో చెప్పావు ఎన్నో కథలను కళ్ళ ముందు చూపావు జీవితం నందనవనం అన్నావు మన ప్రేమ అంతం లేనిదంటూ పూల నావలో నడిపించావు కథలెన్నో అల్లావు కదిలి వదిలి వెళ్లావు కాని రానిలోకానికి అదే పూల వానలో కనబడకుండా పోయావు నిశీధిలో నన్ను ఒంటరిగా చేసి నీ దోవన నువ్వెల్లావు నా గురించి ఆలోచించకుండా నా ఆశలు తీరకుండా మన నందనవనం చూడకుండా నీ దోవ నువ్వు చూసుకుంటే ఆ బడబాగ్నిని మోయలేక, మోసే ఓపిక లేక జీవితాన కోరింది రాదని వచ్చింది వెంట ఉండదని అర్థమయ్యే లోపు అంతమయ్యింది జీవితం.... - అర్చన
Read More

పూలవాన

పూలవాన నీరు తుంపరల కురియ జల్లువాన కలుగునెంతో హాయి పడగ తలమీద చూపుల బాణములు తగల పూలవాన అయి గుండె ఝల్లుమను జడివాన పడినట్లు - రమణ బొమ్మకంటి
Read More

కలలు కనే కళ్ళు

కలలు కనే కళ్ళు మాటలతో చేతలతో చెప్పలేని భావాలను కళ్ళు ప్రదర్శిస్తాయి  కలలకు సాక్ష్యం కళ్ళే కదామరి! గుండెలోని తీపి కలల గుర్తులు వికసించేను ఆలోచనలకు పదును పట్టినప్పుడు కమ్మని కలలు వస్తూంటాయి అందరికీ ముంగిట నిలుచును కొందరికి నిజమై అలసిన కనులకు ఇంపుగా కరిగిపోయే కాలంలో కలసివచ్చే పనులతో శక్తి వంచన లేకుండా ఆశించని ఫలితంతో రేపటి రోజుకు అద్భుతం మనసూ చెప్పే మౌన గీతం ఊహల్లో తేలకుండా ఆశల స్వప్నం అందుకుని కన్నవారికలలునిజమవ్వాలంటే కనులే దారులై వెతకాలి మరి రంగులమయ జీవనంలోకలలు పండిన రోజున కాంతులై వెలుగుతుంది భవిష్యత్తు.......? - జి జయ
Read More