ప్రకృతి అందాలు
ప్రకృతి అందాలు నా పేరు అంజలి.. నేను హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నా... ఇక్కడ ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా... ఎప్పుడూ ఉరుకుల పరుగుల తోనే కాలం గడిచిపోయేది... ఈ హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కి ఏమాత్రం లోటు లేదు... ఈ కాలుష్యం, ఆ వెహికల్స్ నుండి వచ్చిన శబ్దాలు కర్ణబేరిని చెడగొట్టేస్తున్నాయి.. నా జీవితం కూడా అలాంటిదే పొద్దున్నే లేచి, ఫ్రెష్ అయ్యి, ఆ ట్రాఫిక్ లో ఆఫీస్ కి వెళ్లి... మళ్ళీ సాయంత్రం తిరిగి రావడం... వచ్చేసరికి ఎలా అయ్యేదానిని అంటే నలిగిపోయిన గులాబీలా నా మొహం వాడిపోయేది. పోనీ జాబ్ మానేద్దాం అనుకుంటే..." ఈ లోకంలో మనీకి ఉన్న విలువ మనిషికి" ఉండదు... అలా అలా రోజులు గడుస్తండగా... ఒకరోజు మా ఫ్రెండ్ కి పెళ్లి కుదిరింది అని చెప్పింది.... మొదటగా అంతగా ఆసక్తి చూపించలేదు వెళ్ళడానికి... కానీ మా ఫ్రెండ్ అప్పుడప్పుడు వాళ్ల ఊరు గురుంచి…