Month: January 2023

వాస్తవం …..?

వాస్తవం .....? నా పేరు అరుణ్. నేను అందరితో సులభంగా కలిసిపోతాను. నా ప్రవర్తన వల్ల నేనంటే మా పాఠశాలలో చాలా మందికి ఇష్టం. ప్రతీ ఒక్క ఉపాధ్యాయడు, ఉపాధ్యాయురాలు నన్ను సొంత కొడుకులా చూసుకునేవాళ్ళు. నేను 9వ తరగతి చదివేటప్పుడు ఉపాధ్యాయుల బదిలీ జరిగింది. కొంత మంది కొత్త ఉపాధ్యాయులు వచ్చారు. మాకు ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా శ్రీమతి భవానీ మేడమ్ గారిని ని నియమించారు. తనకు పిల్లలంటే చాలా ఇష్టం, ఆవిడకి పిల్లలంటే అమితమైనా ప్రేమ. తన విద్యార్థులు ఎక్కడున్నా బాగుండాలి అని కోరుకొనేది. నాకు 2 సంవత్సరాలు విద్య నేర్పింది. మేము ఎన్ని తప్పులు చేసినా క్షమించేది. ఎంత అల్లరి చేసినా కోప్పడకుండా చదువు చెప్పేది. తను మాకు చాలా దగ్గరైపోయింది ఎంతలా అంటే నేనైతే అమ్మలా అని చెప్తాను అంత దగ్గరైంది. విద్యార్ధులకి ఎటువంటి సమస్య వచ్చినా తను పరిష్కరించేది. 10వ తరగతి పూర్తయిన తరువాత 4…
Read More

పుస్తక జ్ఞానం – లోక జ్ఞానం

పుస్తక జ్ఞానం - లోక జ్ఞానం తరుణ్ వరుణ్ ఇద్దరూ ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు. ఇద్దరివి పక్కపక్క ఇళ్ళే, ఇద్దరూ చాలా తెలివిమంతులు. తరుణ్ వాళ్ళ నాన్నగారు బ్యాంకు మేనేజర్ అవడంతో తరుణ్ని తనలాగే బ్యాంకు మేనేజర్ గా చేయించాలని ఎప్పుడూ చదువుకోమంటూ ప్రొద్దున ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రకరకాల ట్యూషన్స్ పెట్టించేవారు. తరుణ్ కి ఆడుకోవడానికి అసలు సమయం ఉండేదే కాదు. ఇక వరుణ్ విషయానికి వస్తే వరుణ్ వాళ్ళ నాన్నగారు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా వరుణ్ ని ఎప్పుడు చదువుకోమని అనగా చూడలేదు ఈ విషయం తరుణ్ వాళ్ళ నాన్నగారికి ఏమాత్రం నచ్చేది కాదు. అప్పుడప్పుడు వరుణ్ వాళ్ళ నాన్నగారిని మండలిస్తూ ఉండేవాడు పిల్లలకి చదువు చాలా ముఖ్యం. మీరు మీ వాడిని సరిగ్గా పెంచడం లేదు వాడికి ట్యూషన్స్ పెట్టించండి 24 గంటలు గ్రౌండ్ లోనే ఆడుకుంటూ ఉంటాడు…
Read More

నిలకడ లేని మనిషి, నిలకడగా నిలబడితే

నిలకడ లేని మనిషి, నిలకడగా నిలబడితే ఉదయం 8 గంటలు అవుతుంది రంగయ్య 60 ఏళ్లు పైబడ్డ పెద్దాయన కుర్చీలో కూర్చొని భార్య ఇచ్చిన రాగి జావ తాగుతూ టీవీలోని వార్తలు చూస్తున్నాడు ఈ సారి పంటలు బాగానే పండడంతో రైతన్నలు సంబరాలు చేసుకుంటారు అనే వార్త చూసి చాలా మురిసి పోయాడు, ఇంతలో కరెంట్ పోయింది ఛా ఎదవ కరెంట్ ప్రతి అడ్డమైన ప్రోగ్రామ్లు సినిమాలు నాటికలు చూసేప్పుడు ఉంటది కానీ, మా రైతన్నల గురించి కూసింత వార్త సుద్ధమా అంటే ఉండకపాయా దిక్కుమాలిన కరెంట్ దిక్కుమాలిన కరెంట్ అని అనుకుంటూ బయటకి వచ్చాడు. అది కర్నూల్ దగ్గర మామిధాలపాడు అనే ఓ మారుమూల పల్లెటూరు, ఇక్కడ ప్రతి ఇంటి బయట అరుగులు కచ్చితంగా ఉంటాయి, అయితే ఆ అరుగు మీద కూర్చొని చుట్టూ చూడసాగాడు, మన ఊర్లో పంటలు కూడా ఈసారి బాగానే పండాయి, రాష్ట్రం లో ఇలానే…
Read More

భిన్నంగా ఆలోచించు

భిన్నంగా ఆలోచించు "అహంకారానికి, ఆత్మన్యూనత భావానికి తేడా లేదు!" "అహంకారం" అంటే "నేను ఇతరుల కంటే ఎక్కువ" అని బయటకు చెప్పకపోయినా లోలోపల అనుకుంటూ దానికి తగిన విధంగా తెలియకుండానే జీవించడం, మాట్లాడడం. "ఆత్మన్యూనతా భావం" అంటే "నేను ఇతరుల కంటే తక్కువగా ఉన్నాను, అందరూ నాకంటే గొప్పగా ఉన్నారు" అని, బయటకు చెప్పకపోయినా లోలోపల మదన పడుతూ ఉండడం. అంటే ఇక్కడ అహంకారం కలిగిన వారు ఆత్మన్యూనతా భావం కలిగిన వారు ఇద్దరు, ఇతరులతో పోల్చుకొని ఎక్కువ లేదా తక్కువ అనుకునేవారే. ఎక్కువ అయితే ఆనందపడటం, తక్కువ అయితే బాధపడటం. ఎక్కువ కాలేక తక్కువ అయితే ఆత్మన్యూనతా భావం. అంటే ఇద్దరికీ పెద్ద తేడా ఏమీ లేదు. ఆత్మన్యూనత భావం కలిగిన వాడు నాకు అహం లేదు అనవచ్చు గాక కానీ లోపల ఉన్న ఆత్మ న్యూనత భావం ఏర్పడుతుంది. అహం సంతృప్తి చెందలేదు కాబట్టి ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది.…
Read More

నిలకడ లేని మనసు

నిలకడ లేని మనసు నిన్ను చూసిన మరో క్షణం నుంచి నాలో ఎదో తెలియని అనుభూతి లోనవుతుంది... నా మనసులో ఆలోచనలు ఆగడం లేదు ఏ పని మీద అయిన శ్రద్ధ చూపలేకపోతున్నా... ఎందుకు నీ మీద నా మనసు నిలకడగా ఉండడం లేదు... నీ గురించి ఎన్నో ప్రశ్నలు నా మదిలో మెదులుతున్నాయి... వాటికి జవాబులు తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది... నీ ఆలోచనల్లో నేను నిలకడ లేని మనిషిగా ఉండలేకపోతున్నా... నీ ప్రశ్నలతో నేను నిలకడ లేని మనసుగా మిగిలిపోతున్నాను.. ⁠- మాధవి కాళ్ల
Read More

అన్వేషణ ఎపిసోడ్ 3

అన్వేషణ ఎపిసోడ్ 3 అలా తను ఆ పుస్తకం మొదటి పేజీ తీస్తుంటెనే తనకి అర్థమైంది అదొక డైరీ అని. ఆ డైరీ లో ఇలా రాసి ఉంది... "నా పేరు సత్య కుమార్, సత్య కిరణ్, సత్య కృష్ణ, సత్య కాంత్ అనే ముగ్గురు నా స్నేహితులు. ప్రాణ మిత్రులు కూడా... యాదృచ్చికమో ఏమో, అనాధలైన మా జీవితాలని ఆ బ్రహ్మ దేవుడు ఒకే పేజీలో రాసాడేమో అన్నట్టు మేమందరం ఒకే చోట (ఆ అనాధశ్రమంలోనే) పడ్డాం. మా పేర్లు కూడా ఇంచుమించు ఒకేలా ఉండేవి. ఏ తోడు లేని మాకు ఒకరికొకరని తోడునందించింది ఆ అనాధశ్రమమే. ఊహ తెలిసిన దగ్గర నుండి, అందరం అక్కడే పెరిగాము. మా స్నేహ బంధం చూసి అన్నదమ్ముల బంధం కూడా దిగదుడుపే అన్నట్టనిపించేది అక్కడున్నవాళ్ళకి. తల్లిదండ్రులు, బంధువులు లేకపోయినా చదువుల్లోనే కాదు ఆటపాటల్లోనూ, సంస్కారోల్లోనూ మేము అందరికన్నా ముందు ఉండేవాళ్ళం. ఇక మా మధ్య మాత్రం ఎప్పుడూ…
Read More

నిలకడ లేని మనుషులు

నిలకడ లేని మనుషులు ఈ మధ్యన స్నేహితుడు బిటెక్ పాస్ అయ్యాడు. వాడిని మంచి కంపెనీ ఆఫర్ ఇచ్చి మరీ తీసుకుంటాను అంటూ ముందుకు వచ్చింది కానీ వాడు మాత్రం నేను వ్యాపారం చేస్తాను అంటూ వ్యాపారంలోకి దిగాడు. కానీ అక్కడ కూడా కొన్ని రోజులు నిలబడలేకపోయాడు. వ్యాపారానికి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఆరు నెలల వ్యాపారం చేసి ఆ తర్వాత తన వల్ల కాదని చేతులెత్తేశాడు.. ఈలోపు మళ్లీ అదే కంపెనీ మేము మీకు ఆఫర్ ఇస్తాం అంటూ మళ్ళీ వాడిని పిలిచింది అప్పుడు కూడా వీడు వెళ్లకుండా నేను వేరే కోర్సులు నేర్చుకుంటాను లేదా అమెరికా వెళ్తాను అంటూ హంగామా చేసి అమెరికా వెళ్లడానికి ప్రయత్నం చేశాడు వీసా లో ఏదో పొరపాటు వచ్చింది వెళ్ళకుండానే వెనక్కి వచ్చాడు. ఆ తర్వాత నాకు వ్యవసాయం అంటే ఇష్టం అంటూ వాళ్ళ నాన్నగారి చేత బలవంతంగా పొలం కొనిపించి…
Read More

అన్వేషణ ఎపిసోడ్ 2

అన్వేషణ ఎపిసోడ్ 2 ఒకపక్క మొదటి జరిగిన హత్య కేసు కోర్టులో విచారణలో వుండగానే, వరుసగా జరుగుతున్న ఈ హత్యలు నివారించడం పోలీసు వారి వల్ల కాకపోవడం, ప్రజా వ్యతిరేకత కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈ హత్య కేసులన్నీ చేధించడానికి కోర్టు, చివరికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని నియమించింది. ఆరుగురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ బృందానికి సారథ్యం వహిస్తున్నాయన పేరు ఏసిపి రంజిత్ కుమార్. కేసుని టేక్అప్ తీసుకున్న అతి కొద్ది సమయంలోనే ఏసిపి రంజిత్ కుమార్ సారథ్యంలో గల ఆ సీఐడీ టీమ్ ముమ్మరైన దర్యాప్తు చేపట్టింది. కేసులను మరింత లోతుగా విశ్లేషిస్తూ ఆ హంతకుడిని పట్టుకోవడానికి ప్రణాలికలు రచించడంలో నిమగ్నమైంది ఆ బృందం. మరొక ప్రక్క ఆ మూడు హత్య కేసులలో దొరికిన ఒకే ఒక్క క్లూ (సత్య అని రాసున్న కాగితం)ని కూడా ఆ సీఐడీ వాళ్ళు నమ్మలేక పోయారు. కారణం, హంతకుడు ఆ…
Read More

ఆశల తిమిరాలు..

ఆశల తిమిరాలు.. రవిచంద్రులకే నిలకడలేని... అశాశ్వతమైన అవనిలో... పగటి వెలుగుల ఉజ్వల కాంతులు శాశ్వతం అనే భ్రమలో.. క్షణిక ఆనందాల పందేరంలో.. నిలకడ లేకుండా.. నిదురను మరిచి.. ఆశల తిమిరాల వెంట.. ఆత్రుతగా పరుగులు తీశాను.. కానీ ఇప్పుడు రాత్రి పొద్దు పోయాక... చిరు చీకట్లు అలుముకుంటున్న.. ఈ సవ్వడి లేని సాయంకాలాన... నెమ్మదిగా ఎరుకలోకి వస్తోంది.. నా చిరు ఉనికిని చిరస్మరణీయంగా మలుచుకోవడమే మరిచానని.. ఇప్పుడు వగచి ఏం ప్రయోజనం..? ఈ సార్వజనీన సత్యం అవగతమయ్యేసరికి.. సర్వశక్తులు ఉడిగిపోయి.. శాశ్వతత్వానికి చేరువలో ఉన్నాను.. - మామిడాల శైలజ అసిస్టెంట్ ప్రొఫెసర్
Read More

ఓ నాన్న

ఓ నాన్న భారమంతా మోస్తావు, పైకి మాత్రం నవ్వుతూ ఉంటావు , నలుగురిలో ఒకరిగా కలుస్తావు అందరికీ ప్రేమను పంచుతావు అందరితో బాగుంటేనే మంచిదని అంటావు అందరూ నా వాళ్ళే అనుకుంటావు కానీ సొంతవారే మోసం చేశారని తెలిస్తే ఓ నవ్వు నవ్వి నా వారే కదా, తెలియక చేసారంటావు, బాధ్యతలన్నీ మోసి కనపడకుండా వెళ్లావు కన్నీళ్ళను గుండెల్లో దాచవు కారు మబ్బులు కమ్ముతున్న గుండె ధైర్యం తో బతికావు ఇలాగే బ్రతకాలంటూ దారి చూపుతూ, దాటి వెళ్ళావు... ఓ నాన్న నీ జ్ఞాపకాలను నిన్నూ మరవగలమా..   - భవ్యచారు
Read More