నీ చెలిమి
నీ చెలిమి నీ స్నేహం కుదిరి క్షణం నుంచి నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పటికి వమ్ము చేయకుండా నీ చెలిమిగా ఉండాలని ప్రతిజన్మ కోరుకుంటాను... నీ పెళ్లి సంబరంలో నేను నీ పక్కనే ఉండి నీ ప్రతి సంతోషాన్ని పంచుకోవాలని నేను ఎన్నో సార్లు అనుకున్నా... నా పరిస్థితిని నువ్వు అర్దం చేసుకొని నేను నీకు ఏం చేశాను అని నువ్వు నాకు అడిగిన ప్రతిసారి చిన్న చిరునవ్వు సమాధానం ఇచ్చేదాన్ని... నాకు నీ చెలిమినే కావాలి అని చెప్పాను.. - మాధవి కాళ్ల