aksharalipi

3275 Posts

వేయి పడగలు పుస్తకం రివ్యూ

వేయి పడగలు పుస్తకం రివ్యూ వేయిపడగలు నవల గురించి రివ్యూ రాయడమంటే సాహసమే అని చెప్పాలి. దీనికి రివ్యూ రాయడమంటే ఒక చిన్నపాటి పుస్తకం రాయడం వంటిది. దీనిని చాలామంది ఇరవయ్యో శతాబ్దపు ఆధునిక ఇతిహాసం అని పిలుస్తారు. చదివిన తర్వాత ఆ విధంగా పిలవడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదనిపిస్తోంది. విశ్వనాథసత్యనారాయణ గారు స్పృశించని అంశం లేదు ఇందులో. జేబుదొంగ మనోగతం నుంచి రాజు గారి (కృష్ణమనాయుడు) ఔదార్యం నుంచి, పరమేశ్వర శాస్త్రి స్నేహం దగ్గర నుంచి ఒక్కటేమిటి సమాజంలో కనిపించే అన్నిరకాల మనస్తత్వాలు ఇందులో కనిపిస్తాయి. ఒక నవలగా చదవడం ప్రారంభించి మనముందే జరుగుతుంది అన్నట్టుగా,దానికి మనము సాక్ష్యులుగా నిలుస్తున్నాం అన్న భావన చదివే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇందులో ప్రధానమైన సుబ్బన్నపేట అనే గ్రామం కావచ్చు మరియు అందులో ఆయన లిఖించిన పాత్రల తీరు కావచ్చు, వాళ్ళంతా మన ముందు తిరగాడుతున్నట్లు  ప్రత్యక్ష ప్రసారం చేసారనడంలో ఎటువంటి అతిశయోక్తి…
Read More

రథ సప్తమి రోజు ఏమి చేయాలి?

రథ సప్తమి రోజు ఏమి చేయాలి? మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు. ఆరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం వల్ల మహాఫలం లభిస్తుంది. ఆ నెల అంతా నియమం ప్రకారంగా అందరూ స్నానం చేయాలి. ఈ మాసంలో ఈ శ్లోకాన్ని చదువుతూ సంకల్పం చేయాలి. దు:ఖదారిద్ర్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయచ ప్రత:స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం దు:ఖాన్ని, దారిద్యాన్ని పోగొట్టేది, విష్ణు ప్రీతికొరకు, పాపాన్ని పోగొట్టుకోవడం కోసం మాఘమాసంలో స్నానం చేస్తున్నాము. స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం చదవాలి మకరస్థే రవౌ మఘే గోవిందాచ్యుత మాధవ స్నానేన అనేన మేదేవ యథోక్త ఫలదో భవ ఓగోవింద, అచ్యుత, మాధవ, మకరరాశిలో సూర్యుడుండగా ఈ స్నానానికి తగిన ఫలం ఇప్పించు అనే ప్రార్థన ఉంటుంది. స్నానం చేసిన తర్వాత దోసిలినిండా నీళ్ళు తీసుకొని ఈ శ్లోకం చెబుతూ సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. సవితే ప్రసవిత్రే చ ప్రంధామ జలేమమ త్వత్తేజపా…
Read More

నిరీక్షణ

నిరీక్షణ ఎదురు చూస్తున్న మనసైన వాడికి మమతలు పండిస్తావని.. సిగ్గులొలుకు చెలి చెక్కిళ్ళ పై చిలిపి సంతకమేదో చేస్తావని ఏది నీ జాడ? ఎంత కాలం ఈ నిరీక్షణ.. నేపమేదో చెప్పక నేడే వచ్చేస్తావో.. కౌగిలింతల నడుమ బంధిస్తావో.. ఎంతకాలం ఈ నిరీక్షణ... - మల్లి ఎస్ చౌదరి 
Read More

నిరీక్షణ

నిరీక్షణ చుట్టూ నిరాశా నిస్పృహలు ఆనందపడాల్సిన ఒక్క విషయం అంటూ లేదు ఎక్కడో దాగిన వైరాగ్యం మనసుని నన్ను తనవశంలోకి తీసుకెళ్తుందేమో అనే అనుమానము ఉప్పెనలాంటి ఈ కన్నీళ్ళని తుడిచేవారికోసమే నా నిరీక్షణ నా నిరీక్షణలు సఫలమై నువ్వు నన్ను నీ ప్రపంచంలోకి ఆహ్వానించి నాపై కురిపించిన ఈ ఆనందపు ఝల్లులతో తడిసి నీ రక్షణలో ఇలా నిండు నూరేళ్లు ఉంటే - హిమ
Read More

నిరీక్షణ

నిరీక్షణ ఎన్ని జన్మల నిరీక్షణ ఈ క్షణం? మన కనుల కలయిక లిఖిస్తున్న ప్రేమ కావ్యానిది ఏ లిపి? రెప్ప మూసి తెరిచే లోపు అనుభవించే విరహాన్ని కూడా తాళలేని ఈ ప్రేమావేశం ఇన్ని జన్మల ఎడబాటుకు ఎలా ఓర్చుకుంది? ఎన్ని యుగాల నిరీక్షణల తపస్సు ఫలమిది? కంటి నిండా నిన్ను పొదువుకుందామంటే రెండే కళ్ళను ఇచ్చాడే దేవుడు ఎంత పిసినారి ఆ పైవాడు? - సుస్మిత
Read More

నిరీక్షణ

నిరీక్షణ నా మనసుకు పరిచయమేలేని భావన, "నిరీక్షణ".  నీవు పరిచయమైన క్షణంలో నువ్వు పరిచయం చేసిన భావన. ఆనందం, ఆందోళన కలిసిన ఈ భావన నీకోసమేనని తెలుపుతుంది. కనుల ముందు నిలిచిన క్షణం నిరీక్షణకు తెరపడుతుంది.  వీడ్కోలు చెప్పిన క్షణం నుంచి మొదలవుతుంది. ఎక్కడవున్నా, యదలో తలచుకున్నా, నా నిరీక్షణ సాగుతూనే వుంటుంది. నీ లోనే వున్నాను, వుంటున్నాను అనుకున్న క్షణంలో నిరీక్షణ ఫలిస్తుంది. లేననుకున్న క్షణం నా జీవనానికి నిరీక్షణ ముగుస్తుంది. - బి రాధిక
Read More

నిరీక్షణలో

నిరీక్షణలో తొలకరి చినుకు కోసం నోరుతెరిచే ఎండిన బీడుకి. వసంతపు మావిచిగురు కోసం వేచిచూసే కోయిలమ్మకి. గోమాత పొదుగు కోసం అర్రులుచాచే లేగదూడకి గోపాలుని వేణుగానం కోసం  ఎదురుచూసే గోకులానికి. మాధవుని ఆలింగనం కోసం విరహించే రాధమ్మకి నారాయణుని ప్రత్యక్షం కోసం పరి తపించే నరుడికి. నిరీక్షణలో క్షణం కూడా యుగమే ఆపై యుగం కూడా క్షణమే. - శివ.KKR 
Read More

ప్రణయాగ్ని

ప్రణయాగ్ని నీ మది తలుపులు తెరుచుకునే శుభోదయం..! ఎద ఎపుడంటూ అడుగుతుంది.. ఆ ఉషోదయం..! సాగే ఈ ప్రణయాగ్నికి కట్టుబడి.. ప్రతి ఉదయం..! ఓ ప్రళయాన్నే మోస్తుంది.. నిరీక్షిస్తూ నా హృదయం..!! - భాను శ్రీమేఘన
Read More

చిగురాశ

చిగురాశ నిరాశల నిలయమైన నా జీవితంలో చిగురాశ లా చేరావు మురిపించావు మైమరిపించావు మధ్యలో నా ఆశల అల్లికను తుంచేసి జీవితాన్ని ఎడారిలో మోడులా చేసి చేజారిపోయావు.. - మహిధర్
Read More

పంచాంగము 07.02.2022

పంచాంగము 07.02.2022   విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: శుక్ల-శుద్ద తిథి: షష్ఠి ఉ‌.07:55 వరకు తదుపరి సప్తమి వారం: సోమవారం-ఇందువాసరే నక్షత్రం: అశ్విని రా.09:55 వరకు తదుపరి భరణి యోగం: శుభ రా.07:23 వరకు తదుపరి శుక్ల కరణం: తైతుల ఉ‌‌.07:55 వరకు తదుపరి గరజ రా.08:26 వరకు తదుపరి వణిజ వర్జ్యం: సా.05:40 - 07:22 వరకు దుర్ముహూర్తం: ప‌.12:53 - 01:39 మరియు ప‌.03:10 - 03:57 రాహు కాలం: ఉ.08:12 - 09:38 గుళిక కాలం: ప‌.01:56 - 03:22 యమ గండం: ఉ.11:04 - 12:30 అభిజిత్: 12:08 - 12:52 సూర్యోదయం: 06:46 సూర్యాస్తమయం: 06:14 చంద్రోదయం: ఉ.11:01 చంద్రాస్తమయం: రా.11:53 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: మేషం దిశ శూల: తూర్పు…
Read More