Kid’s Stories

తల్లిదండ్రులు చాలా నేర్చుకోవాలి.

తల్లిదండ్రులు చాలా నేర్చుకోవాలి.

తల్లిదండ్రులు చాలా నేర్చుకోవాలి. నేటి సమాజంలో పిల్లలపరివర్తనలో చాలా మార్పులు వచ్చాయి.తమ చుట్టూ ఉన్నపరిస్థితుల వల్లనేవారి ప్రవర్తనలోమార్పులు వచ్చాయి.ప్రతీ విషయానికీపంతాలకు పోయితల్లిదండ్రుల మాటవినటం మానేసారు.ఇందులో తల్లిదండ్రులతప్పు కూడా ఉంది.పిల్లలను అతి గారాబంగాపెంచుతున్నారు. పిల్లలుఅడిగితే కొండమీద కోతినికూడా తెచ్చి ఇస్తున్నారు.దీనివలన పిల్లలకు వస్తువులవిలువ తెలియటం లేదు.ఏది అడిగినా సరే తల్లిదండ్రులు తమకుతెచ్చి ఇస్తారు అనిభావిస్తూ ఉంటారు.అలా తెచ్చి ఇవ్వక పోతేఅలుగుతూ ఉంటారు.తల్లిదండ్రులతో గొడవపెట్టుకుంటూ ఉంటారు.పెద్దలను గౌరవించటంమన సాంప్రదాయం. అయితే నేటి పిల్లలు తమ పెద్దలను గౌరవించటం మానేసారు.దీనికి ప్రధాన కారణంతల్లిదండ్రులే. పిల్లల మనసుల్లో పెద్దలకుసరైన గౌరవం ఇవ్వాలిఅనే భావన కలిగించేవిషయంలో వారువిఫలం అవుతున్నారు.ఈ విషయంలో పిల్లలతప్పు కూడా ఏమీ లేదు.సహజంగా పిల్లలు తమతల్లిదండ్రులను అనుకరిస్తూ ఉంటారు. వారు తమ పెద్దలను గౌరవించకపోతేపిల్లలు కూడా పెద్దలనుగౌరవించరు. ఇంకొకముఖ్యమైన విషయంఏమిటంటే పిల్లలు తమఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు. గెలుపుఓటములు దైవాధీనాలు.ఓడిపోయామని, పరీక్షల్లోతప్పామని ఆత్మహత్యలకుపాల్పడే పిల్లలు ఎందరో.ఈ విషయంలో తల్లిదండ్రులేతమ పిల్లలకు ధైర్యం చెప్పేప్రయత్నం చెయ్యాలి. ఓటమిని తట్టుకుని…
Read More

పుస్తక జ్ఞానం – లోక జ్ఞానం

పుస్తక జ్ఞానం - లోక జ్ఞానం తరుణ్ వరుణ్ ఇద్దరూ ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు. ఇద్దరివి పక్కపక్క ఇళ్ళే, ఇద్దరూ చాలా తెలివిమంతులు. తరుణ్ వాళ్ళ నాన్నగారు బ్యాంకు మేనేజర్ అవడంతో తరుణ్ని తనలాగే బ్యాంకు మేనేజర్ గా చేయించాలని ఎప్పుడూ చదువుకోమంటూ ప్రొద్దున ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రకరకాల ట్యూషన్స్ పెట్టించేవారు. తరుణ్ కి ఆడుకోవడానికి అసలు సమయం ఉండేదే కాదు. ఇక వరుణ్ విషయానికి వస్తే వరుణ్ వాళ్ళ నాన్నగారు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా వరుణ్ ని ఎప్పుడు చదువుకోమని అనగా చూడలేదు ఈ విషయం తరుణ్ వాళ్ళ నాన్నగారికి ఏమాత్రం నచ్చేది కాదు. అప్పుడప్పుడు వరుణ్ వాళ్ళ నాన్నగారిని మండలిస్తూ ఉండేవాడు పిల్లలకి చదువు చాలా ముఖ్యం. మీరు మీ వాడిని సరిగ్గా పెంచడం లేదు వాడికి ట్యూషన్స్ పెట్టించండి 24 గంటలు గ్రౌండ్ లోనే ఆడుకుంటూ ఉంటాడు…
Read More

అక్షర నీరాజనం

అక్షర నీరాజనం తేనెలా మా మనసుల్లో చేరావు కన్నే మనసుతో కన్నెల హృదయాలను కొల్లగొట్టి గూడచారిలా గుండెల్లో నిలిచావు ఇద్దరు మొనగాళ్లు అంటూ అందర్నీ ఆశ్చర్య పరిచావు మీకు సాక్షి నేనేనంటూ అలరించావు మరపురాని కథలెన్నో చెప్పావు స్త్రీ జన్మ గొప్పదని చాటావు ఉపాయంతో అపాయాన్ని దటవచ్చని తెలిపారు ప్రైవేట్ మాస్టారుగా పాఠాలే నేర్పావు అవే కళ్ళతో లోకాన్ని చూడమంటూ చెప్పావు అసాధ్యము కాదేది అంటూ మార్గం చూపావు నిలువు దోపిడి కి దేవుడైన కరగాల్సిందే అన్నావు మంచి కుటుంబాన్ని మించిన సంపద లేదన్నావు సర్కారు ఎక్స్ప్రెస్ లో అమాయకుడిలా ప్రయనించావు అత్త గారు కొత్త కోడళ్ళు ఎలా ఉండాలో చూపావు అల్లూరి ని నేనే అంటూ గుండె ధైర్యం చూపావు ఈనాడుతో సమాజంలో కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయని చూపావు లక్ష్మి నివాసం లో లక్ష్మి కొలువై ఉందన్నావు నేనంటే నేనే నాకెవరూ సాటి లేరు అన్నావు ఉందమ్మా బొట్టు పెడతా…
Read More

చిలిపి పనులు

చిలిపి పనులు ఏంటి నిద్ర రావడం లేదా అడిగింది అమ్మ. లేదమ్మా రావడం లేదు. నిద్ర రాకున్నా కళ్ళు మూసుకో అదే వస్తుంది. లేకపోతే రేపు అక్కడ నిద్ర పోతావు. నీ ఇష్టం ఇక అంటూ బెదిరించింది ప్రేమగా, అవును పడుకోవాలి లేదంటే తెల్లారి సంతోషంగా ఉండలేను అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నా అయినా నిద్ర రాదే, రేపెలా వెళ్తానో, ఎలా మాట్లాడాలో, ఎలా గుర్తు పట్టాలో, అసలు నన్ను గుర్తు పడతారా లేదా అనే లక్ష ప్రశ్నల మధ్య నిద్ర అనే చిన్న విషయం మరుగున పడింది. అంతకు ముందు ఏం బట్టలు వేసుకోవాలి, ఏం చెప్పులు వేసుకోవాలి అంటూ హడావుడి పడుతూ అన్నీ సిద్దం చేసుకునే సరికి పదకొండు, అయ్యింది. ఆ తర్వాత మొదలైంది అసలు ఆలోచన ఎలా మాట్లాడాలి అనుకుంటూ గుండెల్లో ఉన్న సంతోషం కళ్ళలో కనిపిస్తుంటే కళ్ళు మూతలు పడకుండా ఆలోచనలు గతం వైపు పరుగులు…
Read More

నీతి కథలు (మోరల్ స్టోరీస్) రాయడం ఎలా?

నీతి కథలు (మోరల్ స్టోరీస్) రాయడం ఎలా? కథలు రాయడం చాలా సులువు కానీ మోరల్ స్టోరీస్ అంటే నీతి కథలు రాయడం చాలా తేలిక అది ఎలా అంటారా నేను ఇప్పుడు చెప్పబోయే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మీరు నీతి కథలు (మోరల్ స్టోరీస్) రాయవచ్చు నీతి కథలల్లో ప్రధానంగా మనం చూసుకోవాల్సిందే జీవితంలో కష్టపడుతూ పైకెదిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతకడం. ముందుగా అందులో మనకు గుర్తుకు వచ్చేది మనం రోజూ చూసే మన కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, బంధువులు, చుట్టాలు ఇలా ఎవరినైనా మనం చూడొచ్చు. మన చుట్టుపక్కల చాలా మంది జీవితంలో కష్టపడి పైకి ఎదిగిన వాళ్ళు కనిపిస్తారు. ఆ విషయాన్ని మనం గ్రహించగలగాలి అంటే ఇందుకోసం మనం మన సమాజాన్ని రెండు కళ్ళతో కాకుండా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడడం అలవాటు చేసుకోవాలి. రవి గాంచని చోటును…
Read More

జోక్ – దోమ – లీగల్ పాయింట్

జోక్ - దోమ - లీగల్ పాయింట్   మొదటి దోమ: ఈ భూమిమీద పుట్టిన ప్రతీ జీవికి బ్రతికే హక్కుంది గదా! రెండవదోమ: అవును. మొదటి దోమ: మరి మనకెందుకు లేదు! గుడ్డుకూడా వుండకూడదని నాశనంచేయటానికి పరిశోధనలు చేస్తున్నారు! రెండవడోమ: మనం వీళ్ళని పీక్కుతింటాం అందుకని. మొదటి దోమ: మరి మేన్ ఈటర్స్ అయిన సింహాలు, పులులు ఇవి కూడా పీక్కు తింటాయి గదా మరి అవి హాయిగా బ్రతకటానికి అడవులకు అడవులే వదిలేస్తున్నారు! రెండవదోమ: ఏమో! నాకు తెలియదు. - రమణ బొమ్మకంటి
Read More

సిరి బాల్యం

సిరి బాల్యం బాల్యంలో మనం విన్న పెద్దల మాటలు* నిన్న మధ్యాహ్నం భోజనం చేస్తుంటే పొలమారింది. నెత్తి మీద కొట్టుకుని మంచినీళ్లు తాగుతుంటే "ఎవరో తలుచుకుంటున్నట్లున్నారు. బహుశా పెద్ద మనవడేమో?" అంది మా ఆవిడ. "అయ్యుండొచ్చు" అన్నాను నేను కాస్త నిమ్మళించాక. అన్నం తిని సోఫాలో కూచోగానే, చిన్నప్పటి మా ఇంటి భోజనాల సీను జ్ఞాపకం వచ్చింది. 'ఇప్పటిలా టేబుల్స్ లేవు గదా, ఇంట్లో ఉన్నవాళ్ళం అందరం బావి దగ్గిరకు వెళ్లి కాళ్ళూచేతులు శుభ్రంగా కడుక్కున్నాకే, నేల పీటల మీద బాసింపట్టు వేసుకుని కూచుని భోంచేసేవాళ్ళం'. వంటకన్నీ ఇత్తడి గిన్నెలే ఉండేవి ఎక్కువగా. కంచాలు, గ్లాసులు మాత్రం స్టీలువి ఉండేవి. మంచినీళ్ళు తాగే చెంబులు కంచువి కూడా ఉండేవి. చాలా పాత్రల మీద ఎంతో గుండ్రంగా తెలుగు అక్షరాలతో పేర్లు చెక్కి ఉండేవి. కట్టె పొయ్యల మీదే వంటంతా... అమ్మ పక్కనే కూచుని వడ్డిస్తూ ఉండేది. "ఇంకొంచెం కలుపుకో, నెయ్యి వేసుకున్నావా"…
Read More

అభిలాష

అభిలాష నేను పదో తరగతి పాస్ అయ్యాక ఏ కాలేజీలో చేరాలి అనే సమస్య మొదలైంది. దగ్గరలో ఏ కాలేజీ లేదు. కాలేజికి వెళ్ళాలంటే పక్క ఊరికి వెళ్లాలి. అందువల్ల నాన్న గారు పక్క ఊర్లో ఏదైనా మంచి కాలేజీ ఉందేమో అని వెతకడానికి వెళ్ళారు ఒక రోజు. అయితే అక్కడ రెండు కాలేజికి ఉన్నాయి. అందులో నాన్నగారికి తెలిసిన ఒకరి కాలేజీ బాగా అనిపించింది. దాంతో అప్లికేషన్ ఫామ్ తెచ్చారు. తెల్లారి అది నింపేసి నన్ను తీసుకుని అక్కడికి వెళ్ళాం ఇద్దరం. అప్పటి వరకూ పక్క ఊరికి ఎప్పుడు వేళ్ళని నేను అదే మొదటి సారి వెళ్ళడం కావటం చేత అన్ని వింతగా చూస్తూ ఉన్నాను. అది కొంచం పెద్ద ఊరు కాబట్టి అన్ని కార్యాలయాలు అక్కడే ఉన్నాయి. ఇక నన్ను నాన్న గారు ప్రిన్సిపల్ కి చూపించి మా అమ్మాయి బాగా చదువుతుంది అంటూ చెప్పారు. ఫీజు కూడా…
Read More

వగరు

వగరు కచ్చి జామకాయలు, కచ్చి రేగుపళ్ళు ఇంకా పిందెలుగా ఉన్న ఉసిరికాయలు వాటితో పాటు అప్పుడే చిన్నగా కాసిన మామిడి పిందెలు, లేత ఓమన కాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... అయితే మా చిన్నప్పుడు మా ఊర్లోనే ఇంట్లో జామ చెట్టు ఉండేది. జామ చెట్టుకు తెల్లని పువ్వు పూసింది అంటే మాకు చాలా సంతోషం వేసేది ఎందుకంటే నువ్వే కదా చిన్న పిల్ల గా మారి జామకాయ గా రూపాంతరం చెందింది. అది ఎప్పుడెప్పుడు కాయ అవుతుందా అని వేచి చూసే వాళ్ళం అది కాయగా అవ్వగానే వెంటనే తెంపుకొని తలో ముక్క కొరికే వాళ్ళం. మా అమ్మ మాత్రం అలా పిల్లల్ని తినకూడదు అంటూ మమ్మల్ని కాపాడేది అయినా మేము పిల్లలు రావడం ఆలస్యం తెంపుకుని తినేయడమే. ఇక సంతోషి మాత గుడి దగ్గర పెద్ద రేగు పండ్ల చెట్టు ఉండేది ఆ చెట్టు దగ్గరికి ఎవరు…
Read More

దోమ (జోక్ )

దోమ (జోక్ ) చిన్న దోమ : ఈమనుషులు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకొని పైనేక్కడో ఉంటూ వుంటారు అంత పైకి ఎగరాలంటే మన రెక్కలు పడిపోతాయ్! వామ్మో! పెద్ద దోమ : ఎందుకూ! లిఫ్ట్ లో పోదాం!   - రమణ బొమ్మకంటి 
Read More