Trending Now

సైనికుడు 💂

సైనికుడు దేశం కోసం  ప్రాణాలు అర్పించడానికి సిద్దపడి, దేశం పై ఉన్న అభిమానంతో దేశం నాకేమిచ్చిందని కాకుండా దేశానికి నేనేమిచ్చాను అనుకుని, తమ సుఖాలు, సంతోషాలు అన్ని మరిచిపోయి, కుటుంబాన్ని, కోరికలను  కూడా వదిలేసి, దేశ సేవనే తమ లక్ష్యంగా, దేశ సేవనే తమ ఆశయంగా చేసుకుని, ఎన్నో కష్ట నష్టాలను భరించి, కఠినమైన శిక్షణను పూర్తిచేసుకుని భరతమాతకు సేవ చేస్తూ భారత దేశాన్ని కాపాడడానికి తమని తాము త్యాగం చేసుకుంటూ, దేశ సరిహద్దుల్లో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ కాపలా కాస్తున్న సైనికుల వల్లనే మనం ఈ రోజు నిశ్చింతగా నిద్ర పోగలుగుతున్నాము. అలాంటి సైనికులకు మనం ఏం ఇవ్వగలం, ఎలా ఋణం తీర్చుకోగలం, తల్లి ఋణం ఎలా తీర్చుకోలేమో అలాగే సైనికుల ఋణం కూడా తీర్చుకోలేము. కాని మనం వారి పట్ల అభిమానం చూపించగలం, ప్రేమ, ఆప్యాయత పంచగలం. మన కృతజ్ఞ్యతలను కాసిన్ని అక్షరాలుగా మార్చి,…
Read More

వెన్నెలతో నా అనుభవాలు – శీర్షిక

వెన్నెలతో నా అనుభవాలు - శీర్షిక వెన్నెలతో నా అనుభవాలు అనే శీర్షికకు చాలా మంచి ఆదరణ వచ్చింది. అందువల్ల మేము ఆ శీర్షికను అలాగే కొనసాగించాలని అనుకుంటున్నాం. కాబట్టి ప్రతిరోజూ వెన్నెలతో నా అనుభవాలు అనే శీర్షికకు మీ రచనలు పంపవలసినదిగా కోరుతున్నాము.
Read More

జరగాలి జరిగి తీరాలి

జరగాలి జరిగి తీరాలి ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా సంతోషంగా మొదలయ్యేది డిసెంబర్ ముప్పై ఒకటి. తర్వాతి రోజు కూడా ఎంతో ఆనందంగా జరుపుకునే వాళ్ళం. కేకే కట్ చేయక పోయినా, రాత్రంతా పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ టీవీ చూస్తూ ఎప్పుడెప్పుడు పన్నెండు అవుతుందా అని గడియారం వంక చూస్తూ గడిపేవాళ్ళం. ఏమేం ముగ్గులు వేయాలి కలర్స్ ఎలా వేయాలి అని ఆలోచిస్తూ వాటిని ప్రాక్టీస్ చేస్తూ, పన్నెండు వరకు నిద్ర పోకుండా ఉండి, తర్వాత అందరికీ శుభా కాంక్షలు చెప్పి, వచ్చిన ఫోన్ లకు సమాధానము ఇస్తూ, ఒంటి గంట తర్వాత అందరం నిద్ర పోయేవాళ్ళం. మళ్లీ పొద్దున్నే లేచి వాకిలి ఉడ్చి, ముగ్గులు వేస్తూ, అందులో అందమైన కలర్ లు నింపుతూ ఫోన్ లో ఫోటోలు తీసుకుంటూ ఉండే వాళ్ళం. తర్వాత స్నానాలు చేసి కొత్తవి కాకపోయినా ఉతికిన బట్టలు వేసుకుని దేవుడి దగ్గర దీపం వెలిగించి…
Read More

31st రాత్రి

31st రాత్రి 31st కి మీరేం చేస్తారు? బీరు, బిర్యానీ, కేకు, క్యాండిల్స్ అన్ని తెచ్చేసుకుని, తింటూ తాగుతూ, ఊగుతూ, పబ్బుల్లో చిందులు వేస్తూ, తిన్నంత తిని, పారేసినంత పారేసి, తాగినంత తాగి, ఊగినంత ఊగేసేసి, బండి పై జూమ్ అని వెళ్తూ ఫైన్ లు కట్టేసి వాళ్లకు నజరానా ఇచ్చమ్రోయా అంటూ నవ్వుకుంటూ వెళ్తారా? అవును రోయి నిజమే ఇవ్వన్నీ చేసేస్తాం.. హా అంతేగా మరి అయ్య కొనిచ్చిన బైక్ ఉంది. అవ్వ దగ్గర నుండి లాక్కున్న డబ్బుంది. తల్లిదండ్రులను పిక్కొని తినే దమ్ముంది. ఏదన్నా అంటే చస్తాం అనే బెదిరింపులు ఉండనే ఉన్నాయి. ఇంకేం కావాలిరా ఎంజాయ్ కి ఇగ తాగుడే ఊగుడే... అరెరే అక్కడెంటి రా ఆ చిన్న చిన్న గుడిసెల్లో ఉన్న వాళ్ళు అదిగో చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఏ కాలం అయినా పిడికెడు మెతుకులు కోసం రోజంతా కష్టపడే జీవులురా... కప్పుకోవడానికి…
Read More

తొందర పాటు

తొందర పాటు మనిషి తన దైనందిన కృత్యాల్లోను, వివిధ కార్యక్రమ ప్రణాళికా రచనలోను రెండు సూత్రాలను ప్రధానంగా గుర్తుకు తెచ్చుకుంటాడు. ‘ఆలస్యం అమృతం విషం’ అని, ‘నిదానమే ప్రధానం’ అని... నిజానికి ఈ రెండు సూత్రాలూ కార్యసాఫల్యానికి అవసరమైనవే. ఆయా సందర్భాలు, సన్నివేశాలు, పరిస్థితులను బట్టి ఈ సూత్రాలను ఆచరణలోకి తేవాల్సి ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తన బుద్ధితోనే గాక, తన హితం కోరేవారు, ఆత్మీయుల బుద్ధిని కూడా ఉపయోగించుకోవడం పురోగతి కోరుకునేవాడి లక్షణం. తనకు తోచిందే సరైనదని వెనకా ముందూ ఆలోచించకుండా అనుకున్న వెంటనే పని మొదలెట్టడం వైఫల్యానికి, అవమానానికి కారణభూతమవుతుంది. విపరీత ఫలితాలు ఎదుర్కొన్నాక పశ్చాత్తాపం చెందడం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది. ఈ తొందరపాటు ప్రతి మనిషి జీవితంలోనూ కనిపిస్తుంది. అదే శోక కారణమవుతుంది. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను విని విశ్లేషించుకుని అహంకరించక, వివేకంతో ముందడుగేసేవాడు కచ్చితంగా కార్యసాధకుడు కాగలడు. తొందరపాటు వల్ల జీవితంలో…
Read More

గతం

గతం గతమంతా ఒక పిడ కలగా గడిచిన రోజులు ఒక అనుభవంగా గడిపిన గడ్డు కాలం ఒక గుణ పాఠంగా గడిచిన జ్ఞ్యాపకాలు విషాదాలుగా గతం ఒక మారుతున్న కాలానికి గుర్తుగా అనుభవాల పాఠాలుగా బాధల మయంగా బ్రతుకుతున్నప్పుడు గుర్తుకు తెచ్చుకోలేని గురుతులుగా మారి భవిష్యత్తును భయపెడుతున్నప్పుడు రాబోయే కాలంలో అయినా ... గతం పడగ నీడ పడకూడదు అని గత పీడ కలలన్నీ మర్చిపోయి మారుతున్న కాలంతో పాటు కాస్తయినా సంతోషాన్ని వెతుక్కోవాలి అని ఉరుకులు పరుగులు పెడుతూ, ఉవ్విళ్లూరుతున్న కోరికలతో...... కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలని కోరుకోని దేవ్వరు. భవిష్యత్తు అయినా బంగారు మయం అవ్వాలని అన్ని బాధలు పోయి, పీడ కలలన్నీ కలలే అని కొత్త కలలతో కొత్త జీవితాన్ని కోరుకుందాం... కొత్తగా ఉందాం.... - భవ్యచారు
Read More

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు అక్షరలిపి  పాఠకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అక్షరలిపి యాజమాన్యం తరపున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు... ఈ సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో విలసిల్లాలని మీ లక్ష్యాలు, కోరికలు, ఆశలు, ఆశయాలు నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది మీ అక్షరలిపి టీం...
Read More

అరుణారుణ వర్ణం

అరుణారుణ వర్ణం అరుణారుణ వర్ణం తో ఉదయించింది అందంగా కనిపించింది. అందరాను అన్నది అందరినీ అన్నది. అందరికీ కావాలనింది అందరితో కలిసి ఉంటానన్నది. అహం లేదన్నది. అంతు లేనిది. అందరికీ అర్ధం అయ్యేది. అందితే కాలేది. అంబరాన ఉన్నది. అలుపులేని చిన్నది. అదే అదే అదే అదిగో అదిగదిగో అగ్ని గోళం అరుణారుణ వర్ణంలో అంబరాన ఉన్నది అదే నా చిన్నది. అందమైన చిన్నది.
Read More

నూతనం

నూతనం నూతన వత్సరం లో వినూత్న నిర్ణయాలతో గడిచిన విషాద రోజులను మరిచిపోతూ, రాబోయే రోజులైనా సుఖ సంతోషాలను కలిగించాలని, గత జ్ఞ్యాపకాల తిరిగి రానివ్వకుండా, గత చరిత్ర పునరావృతం కాకుండా, అంతా సంతోషంగా ఉండాలని, ఆనందంగా గడపాలని, నూతనంలో నూతనంగా  అందరి జీవితాలలో ఆనందాలు వెల్లి విరియాలని, ప్రజలంతా పచ్చగా కళకళ లాడుతూ ఉండాలని, అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ... ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం
Read More

అనుకున్న కానీ జరగలేదు

అనుకున్న కానీ జరగలేదు   నేను నా వాళ్ల అందరినీ బాగా చూసుకోవాలి అని నా కోరిక.. నేను నా ఫ్రెండ్స్ టూర్ కి వెళ్ళలని అనుకున్నాము.. మా అమ్మ గారికి ఆరోగ్యం బాగాలేదు. తరవాత మా చెల్లికి పెళ్లి కుదిరింది. అందులో నాకు జాబ్ వచ్చింది.. కొన్ని రోజులు తరువాత మా ఫ్రెండ్ పెళ్ళికి పిలిచింది.. పెళ్ళిలో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము.. మా చెల్లి పెళ్లి షాపింగ్ చేసాము.. తరువాత శుభలేఖలు బంధువులకు పంచాము.. తిరుపతి కి అందరితో కలిసి వెళ్ళాము. అమ్మ ఆరోగ్యం బాగుంది... -మాధవి కాళ్ల  
Read More