Trending Now

ఈరోజు అంశం:- కొత్త జీవితం

ఈరోజు అంశం:- కొత్త జీవితం రాబోయేది నూతన సంవత్సరం మన జీవితంలో పాత సంవత్సరంలో ఎన్నో అనుభూతులు అనుభవాలు ఉంటాయి. పాత అనుభవాలను మరిచిపోయి, కొత్త సంవత్సరంలో కొత్తగా జీవితాన్ని అందంగా మలుచుకోవడం కోసం మనం పాత విషయాలను అన్నిటినీ మర్చిపోయి కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి. అందమైన జీవితం లో మధురమైన వాటిని గుర్తు పెట్టుకుని, చేదు అనుభవాలు మరచి పోయి, చేసిన పొరపాట్లను మళ్లీ చేయకుండా, గతం ఒక జ్ఞ్యాపకంగా కాకుండా ఒక పాఠంగా గుర్తు పెట్టుకుని అవి మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. మరి కొత్త జీవితానికి మీరు పాటించాలి అని అనుకుంటున్న పది సూత్రాల గురించి వ్రాయండి. 
Read More

ఈరోజు అంశం:- పేద కుటుంబం

ఈరోజు అంశం:- పేద కుటుంబం పేద కుటుంబం అనగానే కటిక దరిద్రంతో ఉన్న వాళ్ళు గుర్తుకు వస్తారు చాలా మందికి. కానీ కటిక దరిద్రంతో ఉన్నా కలిసి మెలిసి ఉంటూ, కలతలు లేకుండా, ఉన్న రోజు తింటూ, లేని రోజు పస్తులు ఉంటూ అందులోనే ఆనందం వెతుకుతూ, ఉన్నన్ని రోజులూ నవ్వుతూ బతుకుతూ కష్టపడి పని చేసుకుంటూ, ఎలాంటి స్వార్థం లేకుండా, ఒకరి కోసం ఒకరు బతుకుతూ, డబ్బంటే వ్యామోహం లేకుండా, పొద్దంతా కష్టం చేసి, రాత్రి కాగానే నాలుగు మెతుకులు తిని, ఆద మరచి, ఎలాంటి చికూ చింత లేకుండా కంటి నిండా నిదుర పోయే వాళ్ళు ఎంతో ధనవంతులు... ఎంత డబ్బు సంపాదించినా ఇంకా ఇంకా కావాలని ఆత్ర పడుతూ, స్వార్ధ చింతనతో, ఒకే ఇంట్లో ఉన్నా ఒకరి పై ఒకరు కుట్రలు చేస్తూ, ఒకరిని మోసం చేస్తూ, పది మందిలో గొప్ప అనిపించుకోవాలి అని డబ్బులు ఖర్చు…
Read More

ఈరోజు అంశం:- అమ్మ చేతి ముద్ద

ఈరోజు అంశం:- అమ్మ చేతి ముద్ద చిన్నప్పుడు అమ్మ చేతి ముద్దను తినేవాళ్ళం. ఆ తర్వాత కూడా బడికో కాలేజీకి ఆలస్యంగా వెళ్తున్నప్పుడు అమ్మ మన హడావుడి చూసి అన్నం కలిపి ముద్దలుగా తినిపించేది. అమ్మ ఏం చేసినా ఎంతో బాగుండేది. అమ్మ చేతిలో ఏదో మాయ ఉండేది. అమ్మ అలా ఎంత పెట్టినా కూడా తింటూనే ఉండేవాళ్ళం. అది అమ్మ చేతి ముద్ద గొప్పతనం. అమ్మ అన్నం పెడుతూ ఎన్నెన్నో కథలు, కబుర్లు చెప్పేది. బూచాడు వస్తాడని భయపెట్టినా, ఇంకెన్ని కథలు చెప్పినా అదంతా కేవలం బిడ్డ కడుపు నింపడం కోసమే చేసేది. బొజ్జ నిండిన తర్వాత చివరి ముద్దను మన చుట్టూ తిప్పి బయట పారేసేది. దిష్టి కొట్టకుండా.. ఎవరన్నా మీ బాబు, పాప ముద్దుగా ఉన్నారని అంటే వాళ్ళు వెళ్ళాక బాగా తిట్టుకునేది.. అమ్మ చేతి ముద్ద అమృతం. అమ్మ చిరునవ్వు ఒక శక్తిని ఇస్తుంది. ఎంతో…
Read More

కుక్క బతుకు

కుక్క బతుకు అబ్బా ఎంత బాగుందో, ఇంత అందమైన దాన్ని చూసి ఎన్ని రోజులు అయ్యింది. ఇలాంటి వాళ్ళు మనకు ఎందుకు తారస పడరో, ఇలాంటి అందగత్తెలు అవారా గాళ్ళకే పడతారు కాబోలు, అబ్బబ్బా ఎన్నెన్ని అందాలు, ఎంతో శ్రద్ధగా పెంచినట్టు, ఎంతో ముద్దుగా పెంచినట్టు ఉన్నాయి. ఇంత శ్రద్ద తీసుకొని పెంచిన అందాలను ఎవడికి ఇస్తారో కానీ ఎంత ముద్దుగా ఉన్నారో, అరే ఇదొక్కటే అనుకుంటే అదేంటి ఎన్నో సీతాకోక చిలుకలు గుంపులుగా వస్తున్నాయి. ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నాయో, ఎక్కడ ఉన్నాయో అహ నా జన్మ ధన్యం అయ్యింది. ఇన్నాళ్లు ఆ మిడిల్ క్లాస్ కాలనీ లో అంతా కప్పుకుని ఉన్న అందాలను ఆ కప్పుకున్న చాటు యెత్తులెంత ఉన్నాయో ఊహిస్తూ బ్రతికేసాను. కానీ ఇప్పుడు ఇలా సగం సగం బట్టల్లో కనిపిస్తున్న ఇన్ని అందాలను చూస్తుంటే తట్టుకోలేక పోతున్నాను. ఇన్ని అందాలు అహ నా రెండు కళ్ళూ ఎంత…
Read More

ఈరోజు అంశం:- సోషల్ మీడియాలో లేకపోతే?

ఈరోజు అంశం:- సోషల్ మీడియాలో లేకపోతే?   సోషల్ మీడియాలో లేకపోతే జనావాసాలకు దూరంగా ఉన్నట్టా లేనట్టా? నా అభిప్రాయం. అవును చాలా మంది సోషల్ మీడియానే తమ లోకంగా బతుకుతూ లైక్ ల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం వాటన్నిటికీ దూరంగా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు అలాంటి వారిని చూస్తూ మిగిలిన వాళ్ళు మీరు లోకానికి దూరంగా ఉంటున్నారని ఎద్దేవా చేయడం ఎంత వరకు సమంజసం చెప్పండి? లోకం లో సోషల్ మీడియా కన్న చాలా విషయాలు తెలుసుకో దగినవి చాలా ఉన్నాయి అని మిగిలిన వారు తెలుసుకోలేకపోతున్నారు. లైక్ షేర్ ల కోసం కాకుండా ప్రశాంతమైన జీవితం గడపాలి అంటే ఇవ్వన్నీ వాడకుండా ఉండటమే ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి.     
Read More

ఒక చీకటి రాత్రి పార్ట్ 4

ఒక చీకటి రాత్రి పార్ట్ 4 చేతన్ బిటెక్ చదివే అబ్బాయి. చదువుకోడానికి స్నేహితుల రూమ్ లోకి వెళ్ళిన అతనికి ఒక ఆత్మ కనిపిస్తుంది. దాంతో అతను చాలా భయపడతాడు కానీ స్నేహితులు మాత్రం ఆత్మ ఏమీ చేయదు చాలా మంచిది అని చెప్తారు. స్నేహితుల ద్వారా ఆత్మ గురించి కొన్ని నిజాలు తెలుసుకొని అతను ఆత్మ తో మాట్లాడాలి అనుకుంటాడు కానీ ఇంతలోనే అతని స్నేహితులు ఆ గదిని ఖాళీ చేస్తారు. ఆ విషయం తెలియని చేతన్ ఆ గది దగ్గరికి వస్తాడు వాళ్లు ఖాళీ చేశారు అని తెలుస్తోంది. చేతన్ బాధపడుతున్న సమయంలో అక్కడికి ఆత్మ వచ్చి మాట్లాడుతుంది. తన కథ మొత్తం అతనికి చెప్తుంది ఆ తర్వాత ఆత్మ కోరిక ప్రకారం గా చేతన్ పుస్తకాలను వేస్తాడు అప్పుడు ఆత్మ చాలా సంతోషిస్తుంది. అయితే చేతన్ ఇంకా తన గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు అప్పుడు ఆత్మ తన…
Read More

ప్రతీ ఉపాధ్యాయుడూ చదవాల్సిన బడి అనుభవాలివి

ప్రతీ ఉపాధ్యాయుడూ చదవాల్సిన బడి అనుభవాలివి ప్రభుత్వ పాఠశాల లలొ కొంతమంది విద్యార్థులు అడిగే ప్రశ్నలు గొప్ప గొప్ప శాస్త్ర వేత్తలని* *తలపిస్తాయి*. *అలా ఒక ఉపాధ్యాయుడి సర్వీసు లొ ఏదురైన సంఘటనల సమూహరమే ఈ కధ* ప్రశ్న ఈ కథ చదివే ముందు ఈ వార్త చదవండి... చంద్రునిపై కాలుమోపడం నిజమే ధృవీకరించిన చంద్రయాన్ ఫోటోలు అపోలో మిషన్ పై అనుమానాలకు నాసా సమాధానం (వాషింగ్టన్ న్యూస్) చదివారు కదా... మీరు నమ్మారా... నేను నమ్మాను. అయిదో తరగతిలో ఈ వార్త చదివి విన్పిస్తే... పిల్లలంతా ఆశ్చర్యంగా నమ్మారు. ఒక్క.. సతీష్ గాడు తప్ప... వాడు నమ్మలేదనడానికి... వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది. నమ్మిన మిగతా పిల్లలందర్నీ జాలిగా చూసాడు కొంచెం సేపు వాడి చూపులు నన్ను కలవర పెట్టాయి. వాడు వేసే ప్రశ్న కోసం కుతూహలం పెరిగినా... సరైన సమాధానం నా దగ్గర వుందా అనే అనుమానం పెరిగింది.…
Read More

*భగవద్గీత అంటే ఏమిటి?

*భగవద్గీత అంటే ఏమిటి? *అసలు భగవద్గీత ఏం చెబుతుంది?* 👉-ధర్మాధర్మాల గురించి చెబుతుంది. 👉-కర్తవ్యం గురించి చెబుతుంది. 👉-నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. 👉 ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. 👉సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది. 👉ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. 👉ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. 👉-జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. 👉-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. 👉-ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. 👉-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. 👉పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. 👉కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని…
Read More

యజ్ఞోపవీత మహిమ

యజ్ఞోపవీత మహిమ వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. దీనినే తెలుగులో ‘జ్యంద్యం’ అంటాం. ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు. ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతోనూ, కొందరు ఆచారం మీద మక్కువతోనూ, కొందరు ఇతరుల ముందు ప్రదర్శన కోసం, మరికొందరు అవసరార్థం ఉపయోగించేవారుగా కనపడతారు. యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి. ’సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్ తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి స్మృతమ్’!! బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం. యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’ అనే మంత్రం చెబుతోంది. యజ్ఞోపవీతాన్ని…
Read More

ఒక చీకటి రాత్రి పార్ట్ ౩

కానీ ఇంతలో దుప్పటి లాగసాగింది ఆకారం. ఇంకా గట్టిగా బిగించాడు. అయినా గట్టిగా లాగుతుంది ఏదో శబ్దం చేస్తోంది. ఇంకా గట్టిగా బిగించాడు. లే.... లే... లే... అంటున్న శబ్దం వినిపించింది చేతనకి. వామ్మో ఇది, ఇది నన్ను లేవమని అంటుంది ఏంటి అని భయపడ్డాడు చేతన్. లే..... లే..... లే.... అన్న శబ్దం ఇంకా గట్టిగా వినిపించ సాగింది. వామ్మో ఇది నన్ను ఏదో చేసేలా ఉంది ఎలా భగవంతుడా... వద్దు నేను లేవను, నేను లేవను. అంటూ ఇంకా దుప్పటి ముసుగు పెట్టాడు చేతన్. ఓరి నీ యబ్బ లేరా అంటే ఏంట్రా ఇంకా పడుకున్నావ్...? ఏంట్రా పరీక్షకు టైం అవుతుంది సిగ్గు లేదు? ఇంకా ఎంతసేపు పడుకుంటావు అంటూ ఇద్దరు స్నేహితులు కలిసి దుప్పటిని లాగేశారు. గబుక్కున కళ్ళు తెరిచి చూసిన చేతన్ కి ఎదురుగా ఇద్దరు స్నేహితులు కనిపించేసరికి సంతోషంగా అనిపించింది. చుట్టూ చూస్తూ, దయ్యం…
Read More