c s rambabu

ప్రశ్న

ప్రశ్న రోడ్లు క్రిక్కిరిసి పోయాయి సరే మనసో ద్వేషపు గేట్ వే ని చేశానని ఆలోచించావా దేశం ఉన్నతంగా సరే మనిషిగా ఉన్నతుడవెప్పుడవుతావని అడుగుతున్న అంతరాత్మకు సమాధానం చెప్పావా ఎపుడైనా - సి. యస్. రాంబాబు
Read More

వేకప్ కాల్ 

వేకప్ కాల్  పున్నమి వెన్నెల సావాసం చేసినట్టు పురివిప్పింది వేకువ నిద్ర కన్నుల నీకూ నాకూ లోకువేమో కానీ లోకానికది మెళకువ కువకువలాడే పిట్టలకది పనిగంట మోగినట్టు వర్షం మంగళస్నానంతో పరవశించే పచ్చదనం వికసించిన పూలను అలంకరణ చేసి హాయిగా నవ్వుకుంటుంది చదును చేసినట్లు రాత్రి జ్ఞాపకాలన్నీ తనలోకి ఇంకిపోతుంటే మనిషి దురాశను మోయడానికి మళ్లీ సిద్దపడే నేలను జాలిగా చూస్తున్న భానుమూర్తి గంట మోగినట్టు చుర్రుమంటూ చిరుబురులాడుతూ ఎగబాకుతున్నాడు స్వార్థం గుర్రాన్నెక్కి ప్రపంచాన్ని స్వారీచేయాలని కలల కనే కార్పొరేట్ ప్రపంచమింకా నిద్ర కళ్ళు తెరవలేదు తన్నేం చేస్తారో అని భానుడు కూడా అప్పుడప్పుడు మాయమవుతుంటే నిద్ర కన్నుల నువ్వు, నేనూ మధ్య తరగతి మందహాసమై ఉలిక్కిపడి సిగ్గుపడుతుంటాం చూడు అదే wake-up call - సి. యస్. రాంబాబు
Read More

తేల్చుకోమంటుంది

తేల్చుకోమంటుంది లాలసలో జీవితం కొట్టుకుపోతోంది చిరునవ్వుల పెదవులు కనుల రాయబారాలకు బేరాల్లేవిప్పుడు జీవితసారం వంటి పెద్దమాటలన్నీ పుస్తకాల్లో చేరి ముసుగుతన్నాయి ఒకప్పుడు ఇల్లు వాణిీ నిలయం ఇప్పుడు వినిమయ విలయంలో మోహతిమిరం మాటల గలగలలన్నీ మౌనరాగాలై చరవాణి ఖైదులో బందీలుగా ఉన్నాయి ప్రపంచమిప్పుడు కుగ్రామమే కానీ ఇళ్ళన్నీ ఒంటరి ద్వీపాలు ఎవరింట్లో వారే కాందిశీకులు కలలు, కలతల రాగాలకు సామాజిక మాధ్యమాలే పక్క వాయిద్యాలు లైకులు, షేర్స్, కామెంట్లే కన్నీటిని తుడిచే ఆత్మీయ స్పర్శలు నువ్వు నీ నాస్టాల్జియా చాపల్యమని విసుక్కున్నా సరే మంచికో చెడుకో విశ్రాంతి జీవితాలే ఇప్పుడు విరమణ లేని వాక్యాలై వెలుగుతున్నాయి వృద్ధాప్యం కావ్యం వెలవెలబోతోంది ఒంటరితనం, ఒంటరి ద్వీపాల మధ్య నిరర్థకమై మనసు పరిభ్రమిస్తోంది కాలమంతే కుటుంబ బంధాలకు అడ్డుగోడ కడుతూనే ఎల్లలు లేని సంబంధాలకు సోషల్ మీడియాతో తాపడం చేస్తుంది మెరిసేదంతా బంగారమో కాదో నిన్నే తేల్చుకోమంటుంది - సి. యస్.రాంబాబు
Read More

(ఆ) కలియుగపు మాట

(ఆ) కలియుగపు మాట మౌనాన్ని కప్పుకున్న నేలలా ఒకడు బాధను కప్పుకుంటాడు రగిలే ఆకలి అగ్నిని తనలోనే దాచుకుంటాడు మనుషులంతా ఒక్కటే మనసులే వేరయా! మనుషులు పచ్చగానే ఉంటారు మనసులే ఎండిన బావులు నిర్జీవన వనంలో వర్షపుచుక్క పచ్చదనానికో శ్వాస మనసును తడిపే మానవత్వపు జల్లే జాడే లేకుండా ఉంది హోదాల గోదాలో ఎడతెగని పోరులో ఆఖరి వరకు తకరారు ఇక సాటి మనిషిపై ప్రేమా దోమా జాన్తానై ఇక్కడ దోస్తీ కన్నా దుష్మనీకే విలువెక్కువ ఎవడాకలికి వాడే బాధ్యుడు ఇక్కడ ఎవడాకలి మంటను వాడే ఆర్పుకోవాలి ఇదే 'కలిపురుషుడి' చాటు పద్యం చాటే సత్యం కూడా - సి. యస్. రాంబాబు
Read More

జీవితం

జీవితం చిదాకాశం నీడలో చిరునవ్వుల గొడుగుతో అనుభవాల బాటలో పున్నమి చంద్రుడిలా సాగిపోవటమే జీవితం ఎదురుదెబ్బలు ఆటుపోట్లు లోటుపాట్లు పలకరింపుల పన్నీరు అన్నీ చూడాల్సిందే మోదఖేదాలను మోయటమే జీవితం కాలం యవనికపై ఎవరి పాత్రను వారు పోషించాల్సిందే కుప్పలు తెప్పలుగా పొట్టతిప్పలు మనసు దొన్నెలో జ్ఞాపకాలు కలిపితేనే తేనె మాధుర్యమై జీవితం అతిథవోలె అవనికి వచ్చినవారం వారాలు, నెలలు కరిగిపోతుంటే కొట్లాటలను కొట్టేసి మాటల కెరటాలుగ మారమనేదే జీవితం - సి. యస్ .రాంబాబు
Read More

దిగులు కావిళ్ళు

దిగులు కావిళ్ళు అంబర సంబరం మనసుకు చుట్టిన పీతాంబరం శూన్యమైతేనేం దిగులు శూలాలకు విష్ణుచక్రం దిగులు కావిళ్ళను దింపి భయం గుప్పిళ్ళను తెరచి అభయ జలాన్ని వంపి నిరాశల శిశిరాన్ని వసంతంగ మార్చు మేరు పర్వతంలాంటి ధైర్యాన్ని నేరుగా గుండెలో దింపావా నీ నుంచి నిన్ను వేరు చేసేవారెవరు నీ నీడే నీకు రక్ష కావొచ్చు కలిసిరాని కాలానికి దయకలగాలంటే పోరాటం సాగాల్సిందే వెలుగు తోటగా నువు మారాల్సిందే జీవిత పాఠాలు హుషారుగా సాగవు నేర్చుకునే దారులు సాఫీగా ఉండవు సంకల్పాన్ని దాచుకున్నావో ఆశను దోచుకోరెవ్వరు - సి. యస్. రాంబాబు
Read More

ఉచ్చు

ఉచ్చు గగనసీమల్లో కదిలే మేఘాల్లా ఆలోచనల శకలాలు అందని తాయిలాలకు వలవేస్తుంటాయి కదలని శరీరం కాంక్షల కొలువై అర్రులు చాస్తుంటుంది వదలని గతంలా స్వగతం మొడుతూ ఉంటుంది మాయల ఉచ్చు మెడకు బిగుస్తూ ఉంటుంది మాటల గారడీలాంటి లెక్కేదో మనసు చేస్తుంటుంది చివరకు మిగిలేది నీ ఒంటరితనమే అని తేల్చేస్తుంది గగనం శూన్యమయితేనేమి గమకాలు పలికించటం మాననట్టే ఆలోచనల శకలాలు ఆవేదనల హలమై అక్షరసాగు చేస్తే గాడి తప్పిన మనసును ఏ గారడీ ఉచ్చు ఏమీ చేయలేదు - సి. యస్. రాంబాబు
Read More

భయం – అభయం

భయం - అభయం బతుకును శ్వాసిస్తుంటాను బంధాల బాటను బాగుచేయమని భయాన్ని ద్వేషిస్తుంటాను నిరాశను సాగుచేస్తుంటావని ఆశను ప్రేమిస్తుంటాను రేపటి దారి చూపకపోదా అని పేరాశను గమనిస్తుంటాను చొరబడితే జ్వరపడతానని కాలం ఇంద్రజాలాన్ని ప్రేమిస్తుంటాను చిక్కుముడులను చూలాగ్గా విప్పుతుందని మనసుకు ఎంతో నప్పుతుందని మారే మనిషి భయపెడుతుంటాడు వంటరి ద్వీపమై వెలుగుతు స్వార్థానికి సమిధై ద్వేషయజ్ఞం చేస్తున్నాడని విద్వేషాల వీధుల్లో మనిషే కాలిపోతుంటే మనసు వాలిపోతోంది ఏ భయం భయపెడుతుందిక ఏ అభయం కనపడుతుందిక - సి. యస్.రాంబాబు
Read More

గాలిపాటొకటి

గాలిపాటొకటి నాన్న తెచ్చిన తాయిలంలా వర్షంతో వచ్చే గాలి అపురూపం అల్లరి మేఘాలను అమ్మలా జోకొడుతుంది ఎండదెబ్బకు శోషొచ్చిన నేలను తడిమే తల్లిదీవెనై చుట్టేస్తుంది వేడిగాలులన్నీ వేయించేయగా ఏసీ గూళ్ళలో దాక్కున్న ప్రాణాలకు ప్రాణనాధుడిలా వేంచేస్తుంది ప్రభాతం భూపాలం కలిసిపోయినట్టు వర్షం, వర్షపు గాలి శ్రుతిలయల్లా కలిసిపోయింటాయి చెక్కుల సంతకాలే కాదు చెట్లపై గాలిసంతకాలనూ వెతుకుతూ ఉండాలి గాలిపాటొకటి నా వెంటే వస్తుంటే వెనక్కి తిరిగాను అమ్మ జ్ఞాపకాలన్నీ నాముందు కుప్పపోసింది - సి. యస్. రాంబాబు
Read More

వేగుచుక్క

వేగుచుక్క వేసారిన మనసుకు నీవేనోయ్ తోడు వెలుగిచ్చే వేకువను కళ్ళ కద్దుకుందాము కలతలు నలతలు కన్నీళ్లు కష్టాలు ఇవి కావోయ్ బతుకంటే మనుషులను గెలిచేటి వానచుక్క నీవయితే తొలగును ఇక వేదనలు కురియునుగా దీవెనలు స్వప్నాలను నేలదింపు ఆనందమునవి ఒంపును నైరాశ్యము తెంపినావ తెప్పరిల్లు బతుకు నావ రేపనే రోజు కన్న నేడులోన సుఖముందోయ్ ఆకలితో అలమటించు జనులెందరొ కనుల ఎదుట ఎదకరిగిన కొంచెమయిన స్పందించవ క్షణమయిన జీవన వనమిక చూడు విరబూయును మానవతను గమ్యాలు గమనాలు గోరింకల గానాలు గతితప్పిన మనసుకవి మౌనభాష్యమై పలుకు అజ్ఞానపు తలుపుతీయ వేగుచుక్క నీవేనయ్యా - సి. యస్. రాంబాబు
Read More