c s rambabu

తిరుమల గీతావళి-2

తిరుమల గీతావళి-2 *పల్లవి* శ్రీనివాసుని నమ్మితిమంటే భయమే ఉండదు అండే ఉండును శ్రీనివాసుని కొలిచితిమంటే కోరినవన్నీ తీర్చును తాను *చరణం* ఏడుకొండలు ఎక్కితిమంటే మనసంతా సంతోషము కాదా రేపటి చింతే అసలే ఉండదు కడపటివరకు తన ధ్యాసేగా *చరణం* క్షణభంగురమే జీవితమన్నది దైవచింతనే దారిచూపుగా శ్రీనివాసుని తలచితిమంటే ధైర్యముతోటి సాగుదువయ్యా *చరణం* తన తలపేగా మనకో పిలుపు తన స్మరణేగా చివరకు మిగులు తన దర్శనమే మనకో వేడుక తన చిరునవ్వే మనకో పండుగ - సి.యస్.రాంబాబు
Read More

లిఫ్ట్ -కథానిక

లిఫ్ట్ -కథానిక బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2 వాహనాల రొదతో చిటపటలాడుతోంది. ఉబర్ లో క్యాబ్ రేట్ కు తలతిరిగిపోతుంటే ఆటో కోసం వెతకసాగాను. "సికింద్రాబాదా..ఏమిస్తర్ సర్" అంటూ ఆగకుండానే వెళ్ళిపోతున్నారు ఆటో సోదరులు. ఆలోచనలతో బుర్ర పాడయిందేమో,చెప్పలేని కోపంతో ఉన్నాను. "Excuse me sir ఎక్కడికి వెళ్ళాలి" అన్న అతని మాటలతో ఈలోకంలోకి వచ్చాను. ఎవరా అని చూస్తే ఆటో డ్రైవర్ సీట్లోంచి తొంగిచూస్తున్నాడు. "సికింద్రాబాద్.. వస్తారా" అనుకోకుండా మర్యాద తొంగిచూసింది నాగొంతులో "ష్యూర్.. కెన్ యూ గైడ్ మీ?" (can you guide me) నేనెక్కింది ఆటోయేనా అనుకుంటూ సెటిల్ అయ్యాను. "సారీ అంకుల్.. నేను కొత్తగా ఆటో తీసుకున్నాను. అందుకని అడిగాను. ఇంకా రూట్స్ తెలీవు" కాస్త అపాలజెటిక్ గా అన్నాడు. "ఫరవాలేదు.. ఆటో డ్రైవింగ్ కొత్త అని తెలుస్తోంది" అతన్ని పరిశీలనగా చూశాను. ముప్ఫై ఏళ్ళుంటాయేమో అతనికి.. "అవునంకుల్ ఇంతకుముందు బిజినెస్ చేసేవాడిని. అందరిలానే…
Read More

ఓదార్పు వాక్యం

ఓదార్పు వాక్యం బడిబాట లేదు వారికి తలపై బరువు మాత్రం ఉంది బాల్యం అనుభూతులు లేవు భయపెట్టే ఆకలి భూతం మాత్రమే ఉంది బాలల హక్కులు తెలీవు వారికి చాకిరీ రక్కసి మాత్రమే తెలుసు మద్యానికి బానిసయిన నాన్న వేధింపులతో అనారోగ్యం అమ్మ భుజాలెక్కగా బువ్వపెట్టే దిక్కులేదు వారికి అక్షరాలు దిద్దించాల్సిన వేళ్ళే బొచ్చెను పట్టుకోవడం నేర్పాయి రక్షణ ఇవ్వలేక 'బేటీ పడావో బేటీ బచావో' నినాదం సిగ్గుతో తలవంచుకుంది మారని బతుకులు మారని రాతల కుటుంబాలెన్నో ఈ భాగ్యసీమలో ఓటమి అంచునున్న జీవితాలకు సాయపడని ఓదార్పు వాక్యమై మనసు క్షోభిస్తోంది - సి.యస్.రాంబాబు
Read More

నైజం-నిజం

నైజం-నిజం చెట్టు దీవెన ఎంత కమ్మన పెనవేసే కొమ్మలతో పలకరింపు గీతం పాడుతుంది మట్టిరేణువు ఎంత చల్లన మోసే బరువును దించుకోవాలని ఏనాడూ అనుకోదు గాయాలవుతున్నా చిరునవ్వు మానదు నీటి ఊటదెంత చలువ దాహంతీర్చే జీవవాహిని నాగరికతకు నడకలు నేర్పినది కనిపించని గాలిదెంత ఓపిక ప్రాణం నిలుపుతుంది చల్లటి పిల్లతెమ్మెరగా పలకరించే చెలిమి తోరణం జీవాధారమైన జగతిలో గతితప్పేది మనిషొక్కడే మొట్టికాయలు తింటున్నా మనిషి కదా నైజం మార్చుకోడు - సి.యస్.రాంబాబు
Read More

ఉప్పొంగద జీవితం

ఉప్పొంగద జీవితం ఎడారిలా శిశిరం ఎదగాయాల శిబిరం చెరిపిస్తే సత్వరం వదిలేయవ కలవరం గానమై మిగిలావో గేయమై మెరుస్తావు వసంతాల వాకిలిలో ఆశలే చిగురించును అనుభవాల పూలతోటి అనుభూతుల అభిషేకం ఆలకించు మనసేమో సంబరమై ఎగసిపడును కలలన్నీ కాంతులవ్వ కలతలన్ని ముక్కలవ్వ ముక్కంటి ప్రేమగా ఉప్పొంగొద జీవితం పలకరిస్తె ప్రకృతిని పులకించును పుడమితల్లి నడిచిచూడు శాంతిబాట నటనలన్ని మూటగట్టి గతమెంతో గొప్పదే రేపెంతో తీయనే నేటినే మరచితివా చీకటిగా మిగిలేవు - సి.యస్.రాంబాబు
Read More

పునరుత్థానం

పునరుత్థానం మదిలో నీరసాల నది పోటెత్తుతూ పోస్ట్ రిటైర్మెంట్ నావను కుదిపేస్తుంటే ఆలోచనల తెరచాపనెత్తాను! ఖవ్వాలీలు,గజల్స్ పాడిన కాలం ఎటుపోయింది ఒంటరి పక్షి విరహవేదనందుకుని నిర్లిప్తపు రహదారిగ మారిందా కాలం! కలల నక్షత్రాల కాంతులతో మనోకాశమెంత మధురంగుండేది ఆనందపు గుండెగదినెప్పుడు ఖాళీచేశావయ్యా దూరంనుంచి బైరాగి తత్వమై నీ తత్వాన్ని అడుగుతున్నాడు అది భ్రమా?భ్రమరమా? నువ్వే తేల్చుకో దారంతా పగుళ్ళే మనసంతా దిగులే మనిషాగటంలేదు..దూసుకుపోతున్నాడు మనసెందుకు ఆగాలి!మౌనగీతమెందుకవ్వాలి! మొలకెత్తినగింజలు మంచివైనట్టు ప్రశ్నలని మొలకెత్తనివ్వలేమో "అవి నీరసాల నదిని ప్రక్షాళిస్తాయా? సమాధానాల వనమై నను సముదాయించగలవా?" సందేహాల మబ్బులను తొలగించే అంతర్వాణికి అవకాశమివ్వు భ్రమణకాంక్షను తట్టిలేపి సంచరించే కోరికలను మనసు సంచిలో వేస్తే మెజీషియన్ లా జారిపోయిన కాలాన్ని వెలికితీసి జ్ఞాపకాల జెండాను చుట్టు! పడిలేచే కెరటాలన్నీ తీరమంటే పడిచచ్చేవే పదిమందికి పనికొచ్చే పాటలా కావాలని కాలాన్ని శ్రుతిచేయి దుఃఖాన్ని కనురెప్పల వెనక దాచేయి నిర్జీవనదిలో కలల నీళ్ళు నింపు నీ స్పష్టత అస్పష్టంగా…
Read More

పగలు, ప్రతీకారాల విస్ఫోటనం

పగలు, ప్రతీకారాల విస్ఫోటనం కొందరి పుస్తకాలు సమీక్షించాలంటే స్థాయి సరిపోదు. శక్తి చాలదు. అలాంటి రచయితల్లో యండమూరి వీరేంద్రనాథ్ ముఖ్యులు. టాక్ తో సంబంధం లేకుండా మాస్ సినిమాకు కలెక్షన్లొచ్చినట్టు ఆయన పుస్తకమేదైనా హాట్ కేకులా అమ్ముడుపోవాల్సిందే. ఈమధ్య ఎక్కువ నాన్ ఫిక్షన్ రచనలపై దృష్టిపెట్టిన ఆయన ఓ నవలను ఈమధ్యే పాఠకులకు కానుక చేశారు. ఆ నవల *నిశ్శబ్ద విస్ఫోటనం*. అప్పుడే రెండో ఎడిషన్ కూడా వచ్చేసింది. విమర్శకులెప్పుడూ యండమూరిని సీరియస్ గా తీసుకోలేదు. ఆయనా వీరిని పట్టించుకోలేదు. పాఠకుల అభిప్రాయాలే గీటురాయిగా ఆయన భావిస్తారు. ఆశ్చర్యంగా *నిశ్శబ్ద విస్ఫోటనం* నవలపై పాఠకుల నుంచి మిశ్రమ స్పందనలొచ్చాయి. అవేమీ రెండో ఎడిషన్ ని ఆపలేకపోయానుకోండి. అది వేరే విషయం. ఆయన నవలలు వెండితెరపై చూడటానికన్నా చదువుకోవడానికి హాయిగా ఉంటాయి. ఈ నవల కూడా ఆ కోవకు చెందిందే. యండమూరి నవలల్లో హీరోయిన్ 'ఐక్యూ' ఎక్కువ. ఇక్కడ కూడా హీరోయిన్ ఎత్తులకు…
Read More

వీడుకోలు

వీడుకోలు ఎలుగెత్తిన గళమై నీవు ఎరుపెక్కిన తేజము నీవు వెలుగంతా నీ దారంతా ధన్యులమే ఇక మేమంతా నిదురించే జగతిని నీవు మెలమెల్లగ లేపుతావు వేకువ జాడను తెస్తావు  వెచ్చని కిరణం నింపేవు పయనించే తేజము నీవై వార్తాహరుడిగ నీవు లోకాన్నే చుట్టేస్తావు కోపాన్నే చూపిస్తావు  సంధ్యాక్రాంతులతోటి  సత్యాలను గ్రోలావేమో ముసిముసినవ్వులతోడ పడమటకై సాగుతావు - సి.యస్.రాంబాబు
Read More

చిక్కదనాల చిలిపితనం

చిక్కదనాల చిలిపితనం బాల్యంలో చిలిపిదనం బహుముచ్చట అందరికీ చిరునవ్వు కళ్ళతో అడుగేసే బుడతడు ఎవరికీ చిక్కడు..ఎంతకీ అందడు.. చిలిపి గోపయ్య వేణుగానమై కౌమారం పిలుపుతో సిగ్గుపడే యువత ఇంటికే అందం పలుకే మకరందం చిలిపి ఊహల ఊయలలో ఊగేను ప్రాయం నడివయసు గాంభీర్యం దాచేను చిలిపిదనం ఏకాంతాల చిలిపిదనం పూచిన గోరింటలా గోరువంకల జంట గ్రోల అనుభూతుల గోరుముద్దలు మునిమాపువేళలో చిలిపి జ్ఞాపకాల జ్వరం అది మనసుకేమొ వరం అమ్మమ్మ తాతయ్యల ముసిముసి నవ్వులు తెరిచునుగా చిలిపి వలపు తలుపులు - సి.యస్.రాంబాబు
Read More

అన్వేష్ – కథానిక

అన్వేష్ - కథానిక నేనో ఫ్యాన్సీ షాపులో మొదలుపెట్టి దానికి అటాచ్డ్ గా కాఫీషాపు తెరిచి కొత్త ఆలోచనకు పునాదివేశాను. నా ప్రయోగంఫలించి మరికొంతమందికి ఆ ఆలోచన వచ్చింది.. నా భుజం నేను తట్టుకున్నాను. నిజం చెప్పాలంటే నా భార్య ఐడియా అది. కానీ తను నా అంత చదువుకోలేదు కాబట్టి అది నాదిగా చెలామణి అయింది. కాదు చేశాను. ఆలోచన వేరు, దాని అమలు వేరు అని సమాధాన పరుచుకున్నాను. నేను క్రెడిట్ ఇవ్వలేదని తనూ అడగదని తెలుసు. అలా నా అంత బాగా వ్యాపారం మరొకరు చేయలేరని విర్రవీగుతున్న సమయంలో కొవిడ్ వచ్చి అందరిలాగే నన్నూ అతలాకుతలం చేసేసింది. లాక్ డౌన్ లో వర్కర్స్ వెళ్ళిపోయారు. మొదట్లో భయం వల్ల బిజినెస్ గురించి ఎక్కువ ఆలోచించలేదు. నెమ్మదిగా దాచుకున్న డబ్బంతా కరిగిపోవటం మొదలయ్యాక ఏంచేయాలో అర్థం కాలేదు. నా భార్యేమయినా చెప్పబోయినా విసుక్కునేవాడిని. పిల్లల గురించి బెంగా మొదలయింది.…
Read More