మృత్యు దేవత ఒడిలో బంధీనై

అక్షర కొరకు
అంశం : చిత్ర కవిత
శీర్షిక :మృత్యు దేవత ఒడిలో బంధీనై,,,,,,!!

మృత్యు దేవత కౌగిలిలో బంధీనై
కాలం వేసిన చిత్రం విచిత్రం
నా నగ్న దేహాన్ని కమ్ముకుని
నీలి నీలి మృతదేహం
నిప్పుల కార్చిచ్చులలో కాలిపోతూ
నా దేహం నిండుగా కప్పేస్తూ
మృత్యు దేవత తన ఎదను వత్తుతూ బిగికౌగిలిలో
ఉక్కిరిబిక్కిరి అవుతూ జన్మ అంతం
ఎంతో ఘోరంగా ముద్దులలో ముంచెత్తుతూ
నా దేహం మొత్తం నిమురుతూ
నీలి నింగిలో నీలి మేఘాల చాటున
మృత్యు దేవత బలమైన బాహువుల్లో బంధీనై
రతీ సంగమంలో స్తబ్దుగా నేను నన్ను ముద్దులతో ముంచెత్తుతూ,,,,,,,
భువిపై చితి మంటల చిటపటల్లో నా దేహం దగ్దమవుతూ
నేను ఇప్పుడు ఎక్కడ ?
ఈ దివిలో మృత్యు దేవత కోరలు తెరిచి
మృగంలా నన్ను ఆవహించిన బిగిలో
వినీలాకాశం బిత్తరబోతూ కనుల నీరిడుతూ
సుందర శ్యాముడా నిన్ను అనుభవించేది
నీ జన్మజన్మల దుఃఖాన్ని నేను దిగమింగుతూ
మరుజన్మ అంటూ లేని స్వర్గం నాలోనే
చిత్రవిచిత్రాలుగా నిన్ను పీడించిన
కామం నిండిన కళ్ళ లోకాన్ని పట్టించుకోక
బ్రతుకు దైనందినం గుడ్డి దీపం కింద కావ్యఖండికలు లిఖిస్తూ
సామాజిక చైతన్య జ్యోతులు వెలిగిస్తూ
నీ దేహం కోరికలను సమాధి చేసుకున్న అక్షరాల అంబులపొదివి,,,,,
నిన్ను నీవు మరిచిపోయిన ప్రియ సఖుడా
నేటితో నీ జన్మ తరియించినది
అమరత్వంలో ఆనందాల వెల్లువలు ఇవి
ఈ నీలం వెన్నెల ముసుగు తొలగిస్తున్నా
భువిపై నీ శరీరం కాలి బూడిదయ్యింది
కాలంలో కలిసిపోయేలా నా బిగికౌగిలిని వీడుతున్నా
నీవు జన్మ అంటూ లేని అమరత్వంలో
నీవు లేవు అంటే శరీరం,,,,,,!!

అపరాజిత్
సూర్యాపేట
హామీ పత్రం :ఈ కవిత నా కలం సేతయని నా హామీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *