Month: February 2022

మధుర క్షణాలు

మధుర క్షణాలు మధుర క్షణాలు మదిలో ఉండగా.. మమతల కోవెల తలుపులు మూసిన... మన్మధుడై ... మన్నించగా.. మదినిండిన తలపులలో.... - మల్లి ఎస్ చౌదరి
Read More

మధ్య తరగతి మనిషి

మధ్య తరగతి మనిషి ఎన్నో ఆశలతో రోజును మొదలెట్టి చివరికి అదే రోజు నిద్ర సమయానికి నిరాశతో ముగిస్తూ మరలా ఓ చిన్న ఆశతో పోగుచేసుకుంటు రోజులను సాగదీస్తూ ముందుకు వెళుతుంటాడు... ఎన్ని సమస్యలు చుట్టుముట్టిన అన్నింటా మొక్కవోని పట్టుదలతో ఆ సమస్యలను ఒక్కోసారి పరిష్కరించుకుంటు మరో ప్రయత్నంలో వాటిలో కూరుకుపోతు జీవితాన్ని వెల్లదిస్తుంటాడు... సమాజపు వెక్కిరింపులను... బంధువుల చీత్కారాలను... అన్నింటినీ భరిస్తూ ఓ నాటికి తన విజయానికి ఉపయోగించుకుంటు తనని తాను నిలబెట్టుకుంటు ఓ ప్రక్క కుటుంబాన్ని నిలబెడుతూ... తన ప్రయాణాన్ని తాను కొనసాగిస్తాడు... - ఇట్లు ఓ మధ్య తరగతి మనిషి (గోగుల నారాయణ)
Read More

ఈ చీకటి రాత్రులు

ఈ చీకటి రాత్రులు కష్టాల కడలిలో... కన్నీటి అలల మధ్య.... కాలంలో కలిసి పోని కొన్ని గుర్తులు ఈ చీకటి రాత్రులు .. - మల్లి ఎస్ చౌదరి 
Read More

మధ్యతరగతి మనిషి

మధ్యతరగతి మనిషి మధ్యతరగతి మనిషికి అది ఒక మైలురాయి. అది దాటడానికి శతవిధాల ప్రయత్నిస్తూనే వుంటాడు. కానీ సమాజంలో మధ్యతరగతి మనిషికి వున్న కష్టాలు అన్ని ఇన్నీ కావు అటు తేలలేక మునిగినట్టు వుంటుంది. ఏదో సాధించాలని ఏదో చేస్తూ ఉయ్యాల లూగే ఒక ఉయ్యాల లాంటిది. మధ్యతరగతి మనిషి సామాజిక పరిస్థితులు సంసార జీవనం రెండింటిని భుజాల మీద మోస్తూ బతుకు బండిని లాగుతూ వుండే వాడు. కోరికలను చంపుకోలేక బాధ్యతలను విస్మరించలేడు. విధి లేని వింత జీవి మథ్యతగతి మనిషి. వుట్టిని పట్టలేనివాడు స్వర్గానికి నిచ్చెను వేసినట్టు ఊహించుకుంటూ సారూప్యత లేని ఆదాయాలతో సతమతమయ్యే ఆలోచనలతో తోకలేని పిట్ట వలె పరువూ మర్యాదలు, లాభ నష్టాలు, బాదరా బందీలు, కష్ట సుఖాలతో రైలు పట్టాలపై నడుస్తున్న రైలు ప్రయాణం లాంటిది మధ్యతరగతి మనిషి జీవితం ఆశతో ముగుస్తుంది. - జి. జయ
Read More

కాలం నేర్పే పాఠాలు

కాలం నేర్పే పాఠాలు ఆకాశాన్నంటే ఆశలు, భూమిని దాటని బ్రతుకులు. చాలీ చాలని జీతాలు, అటూ ఇటూ కాని జీవితాలు.   అడుగడుగునా సమస్యలు, బయట పడని భావోద్వేగాలు. కట్టిపడేసే బాధ్యతలు, వదిలిపోని ఆత్మాభిమానాలు.   నెల నెలా వేసే చిట్టీలు, నెల చివర్లో అప్పులు   దడపుట్టించే ధరాఘాతాలు, సర్దుకుపోయే మనస్తత్వాలు. తన వారికోసం త్యాగాలు, దొరికిన దాంట్లో సర్దుబాట్లు. తాను చేరలేని గమ్యాలు, తన పిల్లలు చేరాలని ఆరాటాలు.   ఆప్యాయతలు, అనుబంధాలు, మరపుకు రాని మనోగతాలు.  రేపటి గురించి భయాలు, మనుగడ కోసం పోరాటాలు.  కాలం నేర్పే పాఠాలు, అంతే లేని ఆలోచనలు. ఎడారిలో ఎండమావులు,  ఇవే  మధ్యతరగతి మనిషి లక్షణాలు. - రవి పీసపాటి
Read More

పంచాంగము 09.02.2022

పంచాంగము 09.02.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *మాఘ మాసం - శుక్ల పక్షం* తిధి : *అష్టమి* ఉ10.08వరకు వారం : *బుధవారం* (సౌమ్యవాసరే) నక్షత్రం: *కృత్తిక* రా1.13 వరకు యోగం: *బ్రహ్మం* రా7.16 వరకు కరణం: *బవ* ఉ10.08 & *బాలువ* రా11.00 వర్జ్యం: *మ12.22 - 2.05* దుర్ముహూర్తం : *ఉ11.51 - 12.36* అమృతకాలం: *రా10.38 - 12.21* రాహుకాలం : *మ12.00 - 1.30* యమగండ/కేతుకాలం: *ఉ7.30 - 9.00* సూర్యరాశి: *మకరం* చంద్రరాశి: *వృషభం* సూర్యోదయం: *6.34* సూర్యాస్తమయం: *5.54* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

కరోనా..(ఆటవెలదులు)

కరోనా..(ఆటవెలదులు) 01)లాకుడౌను వల్ల లాసైన దేశము రెండవ అలవల్ల రెంటజెడెను గుర్తు పట్టనంత గుట్టుగా వ్యాపించి కాటికంపు చుండెగా కరోన 02) చాపకింద నీటిచందాన దరిజేరి ఆనవాలు లేక అంటుకొనును సబ్బుతో కరములను శుభ్రంగ కడగాలి కాదు కూడదంటె కలుగు ముప్పు 03) చేతులెత్తి మొక్కు షేకుహాండివ్వకు దరికిబోయి దాన్ని తగులుకోకు మరల తిరిగి వచ్చె మాయదారి కరోన మాస్కు బెట్టి దాన్ని మట్టుబెట్టు 04) భౌతికముగ ఎడము పాటించి తీరాలి ఒరుసుకుంటు తిరుగ ఒంటికంటు ఎడము ఉండవలెను ఏ జనమెదురైన లెక్క జేయకుంటె ప్రక్క జేరు... - కోట పెంటయ్య
Read More

విప్లవ మార్పు

విప్లవ మార్పు పరిష్కారం కానీ ఎన్నో సమస్యలు అలా నిరాధారంగా ముగిసిపోతాయి సమతుల్యంగా లేని జీవనాధారాలు నవకొత్త శకానికి సంకేతాలిస్తాయి ఆ శుభపరిణామాలే ఎన్నో మార్పులకు పునాదులు ఎన్నో ఆశలకు నవనాడులు ఎన్నో తరాలకు బాటలు మార్పు నీలో నాలో మనలో విశ్వంలో ఒక పెనువిప్లవంగా మొదలయితే న్యాయం అన్యాయంపై గెలిచే రోజు ఎంతో దూరంలో లేదు మిత్రమా - హిమ
Read More

బంగారం….

బంగారం.... బంగారం, నా ప్రేమ గురించి ఏమి చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే.. ఎందుకంటే నా ప్రేమ ఎంతలా చూపించాలనుకున్నా నీ పలకరింపు ముంగిట అది చిన్నదై పోతుంది. నువ్వు మాట్లాడే ఒక్క మాట చాలు నా మీద ఎంత ప్రేమ ఉందని తెలుసుకోవడానికి. మన మధ్య ఎవరు వచ్చిన శరీరాలను, జీవితాలను పంచుకోవడానికి వస్తారేమో కానీ మనసును పంచుకోవడానికి కాదు. ఎందుకంటే నీ మనసు నా మనసుతో ఎప్పుడో ముడిపడిపోయింది. వాటిని విడతీయడం ఆ దేవుడివల్లే సాధ్యం అది నా చావుతో... బంగారం నేను అప్పుడప్పుడు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాను.. భరించు కానీ వదలకు... తట్టుకోలేను హ్యాపీ ప్రఫోజ్ డే బంగారం - కళావతి
Read More