Month: February 2022

మనిషి-మార్పు

మనిషి-మార్పు మార్పు అనగా కాలచక్రంలో ఒక అంతర్భాగం మార్పు మనిషి జీవితంలో ప్రతిక్షణం అనుభవించే సహజమైన ప్రక్రియ. అదెలా అంటే నిత్యనూతనంగా వుంటుంది. మార్పు సహజంగానే ఉద్భవిస్తుంది అసహజంగా కూడా వస్తుంది ఇంకా విజ్ఞానం, వినోదం, జీవన విధానం ఇవన్నీ వర్తమానం నుండి భవిష్యత్ కి వారధి గా అనుకోవచ్చు. మార్పు వచ్చిన ప్రతి అంశం మనిషి అందిపుచ్చుకుని ముందుకు సాగిపోవాలి. సహజమైన మార్పు కాలం అధీనంలో వుంటుంది. కొన్ని పరిణామాల కారణంగా వచ్చేది అసహజమైనరీతిలో వుంటుంది. అది మలుపులను ఇస్తుంది. మార్పు అనే విషయం మనము స్వీకరించే దృష్టి పై ఆధారపడివుంటుంది. మార్పు సానుకూలంగా తీసుకుంటే జీవిత గమనముగా తీరుస్తుంది. అనుభూతి చెందుతూ వుంటే ప్రతిదీ అమోఘం అయి తీరుతుంది. - జి.జయ
Read More

మార్పు

మార్పు మార్పు నేనున్నానని కాలం రూపంలో చెబుతుంది. మార్పు సహజం అనుకుంటే ముందుంటుంది. మార్పు  ఆస్వాదిస్తూ వుంటే అనుభమవుతుంది. మార్పు అనుకరిస్తూ వుంటే అభివృద్ధి అవుతుంది. మార్పును వ్యతిరేకిస్తూ వుంటే ఫలితం తక్కువగా  వుంటుంది. మార్పు నిషేధిస్తే ప్రతిఫలం శూన్యం. మార్పు అతిక్రమిస్తే శాసిస్తుంది. మార్పును అభినందిస్తూ వుంటే నిన్నే చూస్తుంది మార్పు అధికం ఇస్తుంటే విజయం నీదే అవుతుంది. మార్పుని కూర్పు చేస్తే ఆధారమవుతుంది మార్పు చెరుపు చేస్తే వక్రీకరిస్తుందని అంటారు. మార్పు వదిలేస్తే తీర్పు అవుతుంది. మార్పు అనుభవిస్తే అమితానందాన్ని ఇస్తుంది ఇదే ఇదే మార్పు తీర్పు. - జి.జయ
Read More

మార్పు తెలుసుకో

 మార్పు తెలుసుకో తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండలేని అమ్మాయి సౌమ్య. పేరులాగానే చాలా సౌమ్యంగా, నెమ్మదస్తురాలు. సౌమ్య చాలా ముందు చూపున్న అమ్మాయి. తను చదువుకోసం పక్క ఊరిలో ఉన్న కాలేజికి పంపించాలని, అక్కడ హాస్టల్ లో వుంచి, చదివించాలని తన తల్లిదండ్రుల నిర్ణయం. తను ససేమిరా వెళ్ళను, ఇంటి దగ్గర నుంచి, అదీ ఊర్లో వున్న ప్రభుత్వ కాలేజీకి వెళ్తానని చెప్పేసింది. ఇంక చేసేది లేక, ప్రభుత్వ కాలేజీకి పంపించారు. మూడు సంవత్సరాలు చదువు పూర్తి చేసుకుంది. ఇంకా చదువమని ప్రోత్సహించారు. ఎందుకంటే, సౌమ్యకు, చదువు ఆరో ప్రాణం. కానీ, తల్లిదండ్రులంటే పంచప్రాణాలు. అమ్మానాన్నకు దూరంగా వెళ్ళి చదువుకోవడం సౌమ్యకు అసలు ఇష్టం లేదు. తన చదువుకు తగ్గ ఉద్యోగం చేస్తూ, అమ్మానాన్నతో కలిసి సంతోషంగా ఉంది. ఉద్యోగం చేసుకుంటూ ఎంతకాలం ఒంటరిగా ఉంటుందని సౌమ్యకు పెళ్ళి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి చదువుకోకూడదు అనుకున్న సౌమ్య,…
Read More

పంచాంగము 08.02.2022

పంచాంగము 08.02.2022   విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: శుక్ల-శుద్ద తిథి: సప్తమి ఉ‌.08:23 వరకు తదుపరి అష్టమి వారం: మంగళవారం-భౌమవాసరే నక్షత్రం: భరణి రా.11:46 వరకు తదుపరి కృత్తిక యోగం: శుక్ల రా.07:05 వరకు తదుపరి బ్రహ్మ కరణం: వణిజ ఉ‌.08:23 వరకు తదుపరి భద్ర రా.09:01 వరకు తదుపరి బవ వర్జ్యం: ఉ‌.08:16 - 09:59 వరకు దుర్ముహూర్తం: ఉ.09:03 - 09:49 మరియు రా.11:10 - 12:00 వరకు రాహు కాలం: ప‌.03:22 - 04:49 గుళిక కాలం: ప.12:30 - 01:56 యమ గండం: ఉ.09:38 - 11:04 అభిజిత్: 12:08 - 12:52 సూర్యోదయం: 06:45 సూర్యాస్తమయం: 06:14 చంద్రోదయం: ఉ.11:38 చంద్రాస్తమయం: రా.12:44 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: మేషం దిశ శూల:…
Read More

మళ్ళీ రైలు తప్పిపోయింది బుక్ రివ్యూ

మళ్ళీ రైలు తప్పిపోయింది బుక్ రివ్యూ గొల్లపూడి గారి రచన ఎంత అద్భుతంగా ఉందంటే ఇంత గొప్ప పుస్తకాన్ని ఎందుకు ఇంత ఆలస్యంగా చదివానా అనిపించింది నా మీద నాకు కోపం వచ్చింది... ఒక్కసారి చదివితే మర్చిపోలేని ఈ పుస్తకం గురించి నా అభిప్రాయాలు... ఇందులో పాత్రలు చంద్రుడు, తులసి, వలజ అలాగే నరసయ్య, రుక్మిణి, రంగరాజ్ ఎంతగా మనల్ని ఆకట్టుకుంటాయంటే పుస్తకం చదివిన చాల సేపటి వరకు మన కళ్ళ ముందే ఆ పాత్రలు కనిపిస్తూనే ఉంటాయి అసలు మన మెదడులోంచి వెళ్ళవు... ఒక్కో పాత్రను మారుతీ రావు గారు మలచిన తీరు అద్భుతం. ఇక ఇందులో లైఫ్ ఫిలాసఫీ చెపుతున్నట్టుగా గొల్లపూడి గారు రాసిన కొన్ని వాక్యాలయితే జీవితంలో ఎప్పటికీ గుర్తుపెట్టుకుని ఆచరించే విధంగా ఉన్నాయి.కేవలం ఒక్క రాత్రిలో జరిగే కథని ఇంత అద్భుతంగా రాయడం అన్నది ఆయనకే సాధ్యమైంది అనిపించింది. ఒక నటుడిగా ఆయన్ని ఎంత అభిమానించానో…
Read More

వేయి పడగలు పుస్తకం రివ్యూ

వేయి పడగలు పుస్తకం రివ్యూ వేయిపడగలు నవల గురించి రివ్యూ రాయడమంటే సాహసమే అని చెప్పాలి. దీనికి రివ్యూ రాయడమంటే ఒక చిన్నపాటి పుస్తకం రాయడం వంటిది. దీనిని చాలామంది ఇరవయ్యో శతాబ్దపు ఆధునిక ఇతిహాసం అని పిలుస్తారు. చదివిన తర్వాత ఆ విధంగా పిలవడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదనిపిస్తోంది. విశ్వనాథసత్యనారాయణ గారు స్పృశించని అంశం లేదు ఇందులో. జేబుదొంగ మనోగతం నుంచి రాజు గారి (కృష్ణమనాయుడు) ఔదార్యం నుంచి, పరమేశ్వర శాస్త్రి స్నేహం దగ్గర నుంచి ఒక్కటేమిటి సమాజంలో కనిపించే అన్నిరకాల మనస్తత్వాలు ఇందులో కనిపిస్తాయి. ఒక నవలగా చదవడం ప్రారంభించి మనముందే జరుగుతుంది అన్నట్టుగా,దానికి మనము సాక్ష్యులుగా నిలుస్తున్నాం అన్న భావన చదివే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇందులో ప్రధానమైన సుబ్బన్నపేట అనే గ్రామం కావచ్చు మరియు అందులో ఆయన లిఖించిన పాత్రల తీరు కావచ్చు, వాళ్ళంతా మన ముందు తిరగాడుతున్నట్లు  ప్రత్యక్ష ప్రసారం చేసారనడంలో ఎటువంటి అతిశయోక్తి…
Read More

రథ సప్తమి రోజు ఏమి చేయాలి?

రథ సప్తమి రోజు ఏమి చేయాలి? మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు. ఆరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం వల్ల మహాఫలం లభిస్తుంది. ఆ నెల అంతా నియమం ప్రకారంగా అందరూ స్నానం చేయాలి. ఈ మాసంలో ఈ శ్లోకాన్ని చదువుతూ సంకల్పం చేయాలి. దు:ఖదారిద్ర్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయచ ప్రత:స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం దు:ఖాన్ని, దారిద్యాన్ని పోగొట్టేది, విష్ణు ప్రీతికొరకు, పాపాన్ని పోగొట్టుకోవడం కోసం మాఘమాసంలో స్నానం చేస్తున్నాము. స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం చదవాలి మకరస్థే రవౌ మఘే గోవిందాచ్యుత మాధవ స్నానేన అనేన మేదేవ యథోక్త ఫలదో భవ ఓగోవింద, అచ్యుత, మాధవ, మకరరాశిలో సూర్యుడుండగా ఈ స్నానానికి తగిన ఫలం ఇప్పించు అనే ప్రార్థన ఉంటుంది. స్నానం చేసిన తర్వాత దోసిలినిండా నీళ్ళు తీసుకొని ఈ శ్లోకం చెబుతూ సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. సవితే ప్రసవిత్రే చ ప్రంధామ జలేమమ త్వత్తేజపా…
Read More

నిరీక్షణ

నిరీక్షణ ఎదురు చూస్తున్న మనసైన వాడికి మమతలు పండిస్తావని.. సిగ్గులొలుకు చెలి చెక్కిళ్ళ పై చిలిపి సంతకమేదో చేస్తావని ఏది నీ జాడ? ఎంత కాలం ఈ నిరీక్షణ.. నేపమేదో చెప్పక నేడే వచ్చేస్తావో.. కౌగిలింతల నడుమ బంధిస్తావో.. ఎంతకాలం ఈ నిరీక్షణ... - మల్లి ఎస్ చౌదరి 
Read More

నిరీక్షణ

నిరీక్షణ చుట్టూ నిరాశా నిస్పృహలు ఆనందపడాల్సిన ఒక్క విషయం అంటూ లేదు ఎక్కడో దాగిన వైరాగ్యం మనసుని నన్ను తనవశంలోకి తీసుకెళ్తుందేమో అనే అనుమానము ఉప్పెనలాంటి ఈ కన్నీళ్ళని తుడిచేవారికోసమే నా నిరీక్షణ నా నిరీక్షణలు సఫలమై నువ్వు నన్ను నీ ప్రపంచంలోకి ఆహ్వానించి నాపై కురిపించిన ఈ ఆనందపు ఝల్లులతో తడిసి నీ రక్షణలో ఇలా నిండు నూరేళ్లు ఉంటే - హిమ
Read More